sandwiches
-
చదువుకుందామని ఇండియా వచ్చాడు.. రూ.50 కోట్లు సంపాదిస్తున్నాడు
మనం ఏ దేశానికి వెళ్లినా.. అక్కడ తప్పకుండా ఇండియన్ రెస్టారెంట్స్, హోటల్స్ వంటివి ఉంటాయి. ఉపాధి అవకాశాల కోసం విదేశాల్లో ఉంటూ ఇలా రెస్టారెంట్స్ ప్రారంభించి బాగా సంపాదిస్తున్న భారతీయులు ప్రపంచ దేశాల్లో కోకొల్లలుగా ఉన్నారు. అయితే.. ఓ వ్యక్తి ఫ్రాన్స్ నుంచి చదువుకోవడానికి ఇండియాకు వచ్చి.. ఇప్పుడు ఏడాదికి రూ. 50 కోట్లు సంపాదిస్తూ వార్తల్లో నిలిచాడు.ఫ్రాన్స్‌కు చెందిన 'నికోలస్ గ్రాస్మీ' (Nicolas Grossemy) అనే వ్యక్తి 22 ఏళ్ల వయసులో మాస్టర్ డిగ్రీ చేయడానికి ఇండియాకు వచ్చాడు. అయితే ఇప్పుడు నెలకు రూ.4 కోట్ల కంటే ఎక్కువ సంపాదిస్తూ ఎంతో మంది యువతకు ఆదర్శమయ్యాడు.ఇండియాలో చదువు పూర్తయిన తరువాత 2015లో ఫుడ్ ట్రక్ ద్వారా బిజినెస్ ప్రారంభించాడు. తన తల్లికి వంట చేయడంలో చిన్నప్పుడు నికోలస్ సహాయపడేవాడు. ఆ విధంగా ఈ రంగంపై అతనికి మక్కువ పెరిగింది. ప్రస్తుతం బెంగళూరులో ఎనిమిది డైనింగ్ అవుట్లెట్లు, ఏడు క్లౌడ్ కిచెన్స్ ఉన్నాయి. ఫుడ్ ట్రక్ ద్వారా ప్రారంభమైన వ్యాపారం నేడు.. నగరం మొత్తం విస్తరించింది.ఇదీ చదవండి: 17ఏళ్ల యువకుడి కొత్త ఆలోచన.. నెలకు రూ.16 లక్షల సంపాదనఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నికోలస్‌కు చిన్నతనం నుంచే శాండ్‌విచ్‌లంటే చాలా ఇష్టం. దీంతో వీటిని తయారు చేయడం కూడా నేర్చుకున్నాడు. అదే ఈ రోజు కోట్లు సంపాదించేలా చేసింది. శాండ్విచ్ సేల్స్ దాదాపు 70 శాతం ఆన్లైన్లోనే జరుగుతాయని, మిగిలిన 30 శాతం మాత్రమే ఆఫ్‌లైన్‌లో జరుగుతాయని సమాచారం. -
ఈ క్రిస్మస్ వేళ..సరదాగ ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ట్రైం చేయండిలా!
ఐస్‌క్రీమ్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు ఐస్‌క్రీమ్ – ఒకటిన్నర కప్పు పైనే (నచ్చిన ఫ్లేవర్) మినీ చాక్లెట్ చిప్స్ లేదా కలర్ స్ప్రింకిల్స్ – 2 టేబుల్ స్పూన్ల పైనే బిస్కట్స్ – కొన్ని (మార్కెట్లో దొరికే బిస్కట్స్ లేదా ఇంట్లో చేసుకునే కుకీస్ తీసుకోవచ్చు) తయారీ విధానం: ముందుగా నచ్చిన షేప్‌లో రెండేసి బిస్కట్స్ లేదా కుకీస్ తీసుకుని.. వాటి మధ్యలో.. సేమ్ షేప్‌లో ఐస్‌క్రీమ్ బిట్ పెట్టుకుని శాండ్‌విచ్‌లా చేసుకోవచ్చు. అనంతరం వాటిని చాక్లెట్ చిప్స్‌లో లేదా కలర్ స్ప్రింకిల్స్లో దొర్లించి వెంటనే సర్వ్ చేసుకోవాలి. ఇలాంటి వెరైటీలను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. (చదవండి: -
బిల్ అడిగితే చిల్లర ఇచ్చాడు.. తీరా ఆర్డర్ చూసి షాక్ అయ్యాడు!
సోషల్‌మీడియాలో యూజర్ల సంఖ్య పెరిగినప్పటి నుంచి కాస్త డిఫెరెంట్‌గా ఎక్కడ ఏం జరిగినా అది వైరల్‌గా మారుతోంది. ఈ క్రమంలోనే పలు వీడియోలు, ఫోటోలతో కొందరు సెలబ్రిటీలుగా మారిన ఘటనలు కూడా ఉన్నాయి. సాధారణంగా మనం హోటల్‌కి వెళ్లడం, ఆర్డర్ ఇస్తే సర్వర్ పుడ్ తీసుకురావడం సహజమే. కానీ ఓ వ్యక్తి బిల్ వెరైటీగా కట్టడంతో అంతే వెరైటీగా ఆ హోటల్ సిబ్బంది ఆర్డర్ తెచ్చి ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తికి ఆకలి వేయడంతో అతనికి సమీపంలోని రెస్టారెంట్‌కు వెళ్లి సాండ్విచ్ ఆర్డర్ చేశాడు. అంతవరకు బాగానే ఉంది గానీ బిల్ దగ్గరకు వచ్చే సరికి.. అతని దగ్గర అన్నీ చిల్లర నాణేలే ఉన్నాయి. వాటిని ఇవ్వాలా వద్దా అనుకుంటూనే చివరికి బిల్గా చిల్లరనే ఇచ్చాడు. కాసేపటి తర్వాత సాండ్విచ్ ఆర్డర్ రానే వచ్చేసింది. దాన్ని ఓపెన్ చేసి చూసి ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ సాండ్విచ్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉన్నాయి. చిల్లర నాణేలను బిల్గా కట్టాడని ఆ రెస్టారెంట్ సిబ్బంది కూడా సాండ్విచ్ను చిన్న ముక్కలుగా కట్ చేసి ఆర్డర్‌ను డెలివరీ చేశాడు. ఆ ఫోటోను ఓ వ్యక్తి ట్విట్టర్లో షేర్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. Had a message off one of the lads this morning says “Some lad who works in Jag paid for his scran with all 10p’s this morning. This is how his butty was when he opened it” 🤣🤣🤣 pic.twitter.com/qfsdgW8jP9 Darren Turley (@DarrenTurley5) September 23, 2021 చదవండి: Viral Video: యుద్ధ విమానం విన్యాసం.. ఇంత ధైర్యమా..! -
పది కోట్ల జీతం...శాండ్విచ్లకు కక్కుర్తిపడి..
లండన్ : యూరప్‌లో బ్యాంకింగ్ లావాదేవీలతో అత్యధిక లాభాలు గడిస్తున్న ‘సిటీ గ్రూప్’ బ్యాంక్‌లో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్న పరాశ్ షా చిల్లర వేశాల కారణంగా బంగారం లాంటి తన ఉద్యోగాన్ని కోల్పోయారు. ఏటా దాదాపు తొమ్మిదన్నర కోట్ల రూపాయల జీతం అందుకుంటున్న ఆయన లండన్‌లోని కానరీ వార్ఫ్‌లో ఉన్న బ్యాంక్ ప్రధాన కార్యాలయం నుంచి తరచుగా ఆహారాన్ని దొంగలిస్తున్నారట. పలుసార్లు శాండ్విచ్లు దొంగలించారట. ఆయన అలా ఎంతకాలం నుంచి ఎన్ని శాండ్విచ్లు దొంగలించారో తెలియదుగానీ, ఈ విషయం తెల్సిన యాజమాన్యం ఆగ్రహించి ఆయన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసినట్లు ‘ఫైనాన్సియల్ టైమ్స్’ పత్రిక వెల్లడించింది. పరాశ్ షా సెలవుల్లో వివిధ దేశాల్లో పర్యటించే అలవాటు ఉందని ఆయన ఫేస్బుక్ పేజీలు చూస్తే అర్థం అవుతోంది. ఆయన పెరూలోని ‘మాచు పిచ్చూ’ పర్యాటక కేంద్రాన్ని సందర్శించినట్లు ఆయన ఫొటోలను చూస్తే అర్థం అవుతోంది. లండన్‌లోని ఎడ్మాంటన్‌లో గ్రామర్ స్కూల్లో చదవిన షా, బాత్ యూనివర్శిటీలో 2010లో ఎకనామిక్స్‌లో డిగ్రీ చేశారు. హెచ్ఎస్బీసీలో ఇన్కమ్ ట్రేడింగ్ బిజినెస్‌లో ఏడేళ్లు పనిచేసి 2017లో సిటీ గ్రూప్‌లో చేరారు. ప్రస్తుతం యూరప్‌తోపాటు మధ్యప్రాచ్యం, ఆఫ్రికా బ్యాంకింగ్ కార్యకలాపాలకు హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. అంత ఉన్నత స్థానంలో ఉన్న ఓ వ్యక్తి శాండ్విచ్ డబ్బుల కోసం కక్కుర్తి పడడం చూసే చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంది. అయితే ఇలాగే కక్కుర్తి పడిన పలువురు బ్యాంకర్లు సస్పెండయిన సంఘటనలు గతంలో ఉన్నాయి. ఓ ఫ్రెండ్ బైక్ నుంచి 500 రూపాయల విలువచేసే ఓ పార్ట్‌ను దొంగలించినందుకు ఓ లండన్ బ్యాంకర్‌ను 2016లో జపాన్‌కు చెందిన మిజువో బ్యాంక్ ఉద్యోగం నుంచి తొలగించింది. బ్లాక్‌రాక్ ఎగ్జిక్యూటివ్ జోనాథన్ బుర్రోస్ టిక్కెట్లు తీసుకోకుండా రైల్లో ప్రయాణించి దొరికి పోయారు. బ్రిటన్ ఆర్థిక రంగంలో ఆయన ఎక్కడా పనిచేయకుండా ‘ఫైనాన్సియల్ కండక్ట్ అథారిటీ’ ఆయనపై నిషేధం విధించింది. ఆయన బ్రిటన్ ఆగ్నేయ రైల్వేకు 39 లక్షల రూపాయలను చెల్లించడం ద్వారా కేసును సర్దుబాటు చేసుకున్నారు. -
శాండ్విచ్ కోసం శరీరాన్ని అమ్ముకుంటున్నారు..
లండన్: గ్రీక్ ఆర్థిక సంక్షోభం ఆ దేశానికి తీరని కష్టాలను మిగిల్చింది. చాలా మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. పరిస్థితులు ఎంత దారుణంగా తయారయ్యాయంటే.. కొందరు యువతులు తమ ఆకలి బాధను తీర్చుకునేందుకు ఓ శాండ్ విచ్ కోసం తమ శరీరాన్ని అమ్ముకుంటున్న వైనం వారి దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. గ్రీక్‌లో 17 వేల మందికిపైగా సెక్స్ వర్కర్లు ఉన్నట్టు ఓ సర్వేలో వెల్లడైంది. తూర్పు యూరప్‌లో వ్యభిచార వృత్తిలో గ్రీక్ మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. గ్రీక్‌లో ఆర్థిక సంక్షోభం రాకముందు సెక్స్ వర్కర్లు దాదాపు 4000 వేల వరకు డిమాండ్ చేసేవారు కాగా ఇప్పుడు 150 రూపాయలు ఇస్తే చాలన్నట్టుగా పరిస్థితి మారింది. 17-20 ఏళ్ల వయస్సులో ఈ వృత్తిలోకి వస్తున్నట్టు సర్వేలో తేలింది.