మనం ఏ దేశానికి వెళ్లినా.. అక్కడ తప్పకుండా ఇండియన్ రెస్టారెంట్స్, హోటల్స్ వంటివి ఉంటాయి. ఉపాధి అవకాశాల కోసం విదేశాల్లో ఉంటూ ఇలా రెస్టారెంట్స్ ప్రారంభించి బాగా సంపాదిస్తున్న భారతీయులు ప్రపంచ దేశాల్లో కోకొల్లలుగా ఉన్నారు. అయితే.. ఓ వ్యక్తి ఫ్రాన్స్ నుంచి చదువుకోవడానికి ఇండియాకు వచ్చి.. ఇప్పుడు ఏడాదికి రూ. 50 కోట్లు సంపాదిస్తూ వార్తల్లో నిలిచాడు.
ఫ్రాన్స్‌కు చెందిన 'నికోలస్ గ్రాస్మీ' (Nicolas Grossemy) అనే వ్యక్తి 22 ఏళ్ల వయసులో మాస్టర్ డిగ్రీ చేయడానికి ఇండియాకు వచ్చాడు. అయితే ఇప్పుడు నెలకు రూ.4 కోట్ల కంటే ఎక్కువ సంపాదిస్తూ ఎంతో మంది యువతకు ఆదర్శమయ్యాడు.
ఇండియాలో చదువు పూర్తయిన తరువాత 2015లో ఫుడ్ ట్రక్ ద్వారా బిజినెస్ ప్రారంభించాడు. తన తల్లికి వంట చేయడంలో చిన్నప్పుడు నికోలస్ సహాయపడేవాడు. ఆ విధంగా ఈ రంగంపై అతనికి మక్కువ పెరిగింది. ప్రస్తుతం బెంగళూరులో ఎనిమిది డైనింగ్ అవుట్‌లెట్‌లు, ఏడు క్లౌడ్ కిచెన్స్ ఉన్నాయి. ఫుడ్ ట్రక్ ద్వారా ప్రారంభమైన వ్యాపారం నేడు.. నగరం మొత్తం విస్తరించింది.
ఇదీ చదవండి: 17ఏళ్ల యువకుడి కొత్త ఆలోచన.. నెలకు రూ.16 లక్షల సంపాదన
ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నికోలస్‌కు చిన్నతనం నుంచే శాండ్‌విచ్‌లంటే చాలా ఇష్టం. దీంతో వీటిని తయారు చేయడం కూడా నేర్చుకున్నాడు. అదే ఈ రోజు కోట్లు సంపాదించేలా చేసింది. శాండ్‌విచ్ సేల్స్ దాదాపు 70 శాతం ఆన్‌లైన్‌లోనే జరుగుతాయని, మిగిలిన 30 శాతం మాత్రమే ఆఫ్‌లైన్‌లో జరుగుతాయని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment