earning
-
నాడు నాలుగు రూపాయల జీతం.. నేడు 22 రెస్టారెంట్లకు యజమాని!
ఎవరైనా సరే జీవితంలో ఎదగాలని గట్టిగా నిర్ణయించుకుని, అందుకు అనుగుణంగా పనిలోకి దిగితే వారి విజయాన్ని ఎవరూ ఆపలేరని అంటుంటారు. అటువంటి వారిని ఆర్ధిక ఇబ్బందులు కూడా ఏమీ చేయలేవని చెబుతుంటారు. కర్ణాటకలోని ఓ కుగ్రామానికి చెందిన సురేష్ పూజారి తాను ఏదో ఒకరోజు 22 రెస్టారెంట్లకు యజమానిని అవుతానని ఎన్నడూ అనుకోలేదు. సురేష్‌ను బాల్యంలోనే కష్టాలు చుట్టుముట్టాయి. చదువు కొనసాగించేందుకు కుటుంబ పరిస్థితులు సహకరించలేదు. అవి 1950 నాటి రోజులు.. పదేళ్ల వయసులోనే సురేష్ పూజారి కూలీగా మారాడు. ఊరిలో పెద్దగా పనులు దొరకకపోవడంతో ముంబైకి తరలివచ్చాడు. అప్పట్లో సురేష్‌కు ముంబై గురించి ఏమీ తెలియదు. ఎలాగోలా ఓ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న చిన్న దాబాలో ఉద్యోగం సంపాదించాడు. రోజంతా అక్కడ పనిచేసినందుకు సురేష్‌కు నెలకు నాలుగు రూపాయలు అందేది.. అక్కడ రెండేళ్లు పనిచేశాడు. తర్వాత అతనికి తెలిసిన వ్యక్తి జ్యూస్ షాపులో ఉద్యోగం ఇప్పించాడు. జీతం పెద్దగా పెరగలేదు. కానీ అక్కడ పనిలో నైపుణ్యాలను నేర్చుకున్నాడు. కొద్ది రోజుల్లోనే సురేష్‌కు ఓ క్యాంటీన్లో ఉద్యోగం వచ్చింది. జీతం ఆరు రూపాయలకు పెరిగింది. చదువు లేకుండా ముందుకు సాగడం కష్టమని అర్థం చేసుకున్నాడు. దీంతో రాత్రిపూట పాఠశాలకు వెళుతూ 9వ తరగతి వరకు చదువుకున్నాడు. తన దగ్గరున్న కొద్దిపాటి సొమ్ముతో గిర్గామ్ చౌపటీ సమీపంలో సురేష్ ఒక చిన్న పావ్ భాజీ దుకాణాన్ని తెరిచాడు. నాటి ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు జార్జ్ ఫెర్నాండెజ్ ఒకసారి తన సురేష్ దుకాణంలో పావ్ భాజీ రుచి చూశారు. ఆ రుచి అతనికి బాగా నచ్చడంతో మళ్లీ మళ్లీ అక్కడికి రావడం మొదలుపెట్టారు. జార్జ్ ఫెర్నాండెజ్, సురేష్ పూజారి స్నేహితులు అయ్యారు. తదనంతర కాలంలో సురేష్ తయారు చేసే పావ్ భాజీకి జనం నుంచి అమితమైన ఆదరణ లభించింది. దీంతో ఆయన క్రమంగా తన వ్యాపారాన్ని విస్తరించారు. కొద్ది కాలంలోనే అతని దుకాణాలు దేశంలోని అనేక ప్రాంతాలకు విస్తరించాయి. నేడు సురేష్ పూజారి నెలకొల్పిన ‘సుఖ్ సాగర్’ రెస్టారెంట్ల గురించి తెలియనివారుండరు. దేశంలో 22కు మించిన సుఖ్ సాగర్ రెస్టారెంట్ బ్రాంచీలు ఉన్నాయి. సుఖ్ సాగర్ రెస్టారెంట్ దక్షిణ భారత ఆహారాలకు తోడు పావ్ భాజీ, పంజాబీ ఆహారాలకు ప్రసిద్ధి చెందింది. ఐస్‌క్రీమ్ పార్లర్, షాపింగ్ మాల్, త్రీస్టార్ హోటల్ యజమానిగా సురేష్ పూజారి మారారు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ సహా పలువురు స్టార్స్ సుఖ్ సాగర్ రెస్టారెంట్ రుచులను మెచ్చుకున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని దాటుకుంటూ, వ్యాపారంలో విజయం సాధించిన సురేష్ పూజారి యువతకు స్ఫూర్తిదాయకుడనడంలో ఏమాత్రం సందేహం లేదు. -
రూ. 450తో వ్యాపారం.. నెలల వ్యవధిలో రోజుకు రెండు వేల ఆదాయం!
దేశంలోని చాలామంది రైతులు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు వివిధ రకాల వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు రైతులు ఆవులు, గేదెల పెంపకాన్ని వదిలి కోళ్ల పెంపకంవైపు దృష్టి సారిస్తున్నారు. ఇది వారికి లాభదాయకమైన వ్యాపారంగా మారుతోంది. ప్రస్తుతం దేశీ కోడి మాంసానికి మార్కెట్లో డిమాండ్ పెరగడంతో చిన్న, సన్నకారు పశుపోషకులు కోళ్ల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లా భగవాన్‌పూర్ బ్లాక్‌కు చెందిన ముఖేష్ పాశ్వాన్ భార్య సంగీతా దేవి గతంలో గేదెలను పోషిస్తూ ఆదాయాన్ని ఆర్జించేవారు. దీనిలో అంతగా లాభాలు లేకపోవడంతో ఆమె దేశవాళీ కోళ్లను వాణిజ్యపరంగా పెంచడం ప్రారంభించారు. బీహార్ ప్రభుత్వం అందించే జీవిక ఐపీడీఎస్ థర్డ్ ఫేజ్ పథకం కింద రూ.450 వెచ్చించి, 25 దేశీకోళ్లను కొనుగోలు చేసి వాటి పెంపకాన్ని చేపట్టినట్లు సంగీత మీడియాకు తెలిపారు. ఆమె దేశవాళీ కోళ్లతో పాటు కడక్‌నాథ్, సోనాలి, ఎఫ్‌ఎఫ్‌జీ జాతుల కోళ్లను కూడా పెంచసాగారు. కోడి మాంసంతో పాటు గుడ్లు, కోడిపిల్లలను సిద్ధం చేయడం ద్వారా ఆమె వ్యాపారాన్ని మరింత వృద్ధి చేశారు. ఇప్పుడు గ్రామానికి చెందిన పలువురు మహిళలు సంగీత దగ్గర దేశీ కోళ్ల పెంపకంలో మెళకువలు నేర్చుకునేందుకు వస్తున్నారు. 25 కోళ్లతో వ్యాపారం ప్రారంభించిన ఆమె దగ్గర ప్రస్తుతం 100 కోళ్లు ఉన్నాయి. స్థానికంగా కోడి గుడ్డు ధర మార్కెట్లో రూ.20 వరకూ ఉంది. ప్రస్తుతం ఆమె పెంచుతున్న కోళ్ల నుంచి ప్రతిరోజూ రూ. 200 విలువైన గుడ్లు వస్తున్నాయి. అలాగే రోజుకు నాలుగు నుంచి ఐదు కిలోల కోడి మాంసం సిద్ధమవుతోంది. వీటిని విక్రయిస్తూ ఆమె రోజుకు రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు ఆదాయాన్ని అందుకుంటోంది. -
YouTube: ఇక్కడ సంపాదించుకున్నోడికి సంపాదించుకున్నంత!
ఆధునిక టెక్నాలజీ యుగంలో సామాజిక మాధ్యమాలు విస్తృతమయ్యాయి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఎక్స్ ఇలా ఎన్నో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. నేటి రోజుల్లో బ్యాంక్ అకౌంట్ అయినా లేనివారు ఉంటారేమో గానీ ఏదో ఒక సోషల్‌మీడియా అకౌంట్ లేనివారు మాత్రం ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఎన్ని సోషల్‌మీడియా వేదికలు ఉన్నా యూట్యూబ్‌కు ఉన్న ప్రత్యేకత, ఆదరణ వేరు. అత్యధికమంది ఉపయోగించే సోషల్ మీడియా యాప్ ఇది. ఇందుకు కారణం పెద్దగా చదువుకోని సమాన్యులు సైతం ఉపయోగించేందుకు వీలుగా ఉండటం, కంటెంట్ వీడియోల రూపంలో ఉండటం. యూట్యూబ్ యూజర్లు ఏ స్థాయిలో ఉన్నారో అంతే స్థాయిలో కంటెంట్ క్రియేటర్లు అంటే యూట్యూబర్లు కూడా ఉన్నారు. అభిరుచిని తీర్చుకోవడంతోపాటు ఆదాయాన్ని పొందే అవకాశం ఉందిక్కడ. యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేటర్ల సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్, ట్రావెలింగ్, కుకింగ్, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, ఫైనాన్స్, న్యూస్.. ఇలా రకరకాల కంటెంట్‌ను యూట్యూబర్లు క్రియేట్ చేసి వీక్షకుల ముందుకు తెస్తున్నారు. యూట్యూబర్లు అంత సంపాదిస్తున్నారు.. ఇంత సంపాదిస్తున్నారు.. అంటూ మాట్లాడుకోవడమే గానీ వారికి డబ్బు ఎలా వస్తుంది.. ఎంత మంది చూస్తే ఎంత డబ్బు వస్తుంది.. అన్న లెక్కలు చాలా మందికి తెలియవు. ఈ లెక్కల్ని అర్థం చేసుకుని, ఒక యూట్యూబర్ ఎంత సంపాదించగలరు అన్నది అంచనా వేయాలని ఆసక్తి ఉన్న వారి కోసం ఇక్కడ కొంత సమాచారం ఇస్తున్నాం.. డబ్బు ఎలా వస్తుంది? స్పాన్సర్‌షిప్‌ల నుంచి మొదలు పెట్టి ఉత్పత్తుల ప్రమోషన్ వరకూ పలు రకాల మార్గాల్లో యూట్యూబర్లు డబ్బు సంపాదించవచ్చు. కానీ గూగుల్ ప్రకటనలు (Google Ads) నుంచే వచ్చే ఆదాయమే అత్యధికం. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్‌లో చేరిన సోషల్ మీడియా క్రియేటర్లు తమ వీడియోల ద్వారా గూగుల్ ప్లేస్డ్ యాడ్స్‌తో (Google-placed ads) డబ్బు సంపాదించవచ్చు. ఈ అర్హతలుండాలి యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేయడానికి, క్రియేటర్లు తప్పనిసరిగా కనీసం 500 మంది సబ్స్క్రైబర్లను కలిగి ఉండాలి. అలాగే గత 90 రోజుల్లో కనీసం మూడు పబ్లిక్ అప్లోడ్లు చేసి ఉండాలి. సంవత్సర కాలంలో 3,000 వాచింగ్ అవర్స్ లేదా గత 90 రోజుల్లో 3 మిలియన్ల యూట్యూబ్ షార్ట్‌ల వీక్షణలను కలిగి ఉండాలి. ఈ అర్హతలన్నీ ఉండి ఒకసారి అప్రూవల్ పొందిన తర్వాత, అర్హత కలిగిన క్రియేటర్లు ఛానెల్ మెంబర్‌షిప్‌లు, సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్లు, సూపర్ థాంక్, యూట్యూబ్ షాపింగ్‌తో తమ సొంత ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునే సామర్థ్యం వంటి ఫీచర్ల ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఇక యూట్యూబ్ యాడ్సెన్స్ (YouTube AdSense) నుంచి డబ్బు సంపాదన ప్రారంభించడానికి, ప్రోగ్రామ్‌లోని క్రియేటర్లు తప్పనిసరిగా 1,000 మంది సబ్స్క్రైబర్లను కలిగి ఉండాలి. సంవత్సర కాలంలో 4,000 వాచింగ్ అవర్స్‌ను కలిగి ఉండాలి. ఎంత మంది చూస్తే ఎంత డబ్బులు? తమతో యూట్యూబర్లు పంచుకున్న రెవెన్యూ పర్ మిల్లీ (RPM) రేట్ల ఆధారంగా బిజినెస్ ఇన్సైడర్ ఓ అధ్యయనం చేసింది. దాని ప్రకారం.. ప్రతి 1,000 వీక్షణలకు 1.61 నుంచి 29.30 డాలర్లు (రూ.130 నుంచి రూ.2,400) యూట్యూబర్లు సంపాదిస్తున్నారు. యూట్యూబ్ ప్లాట్‌ఫామ్ నుంచి యూట్యూబర్లు నెలకు ఎంత డబ్బు సంపాదిస్తారు అనేది వీక్షణల మొత్తం, ఆడియన్స్ లొకేషన్, కంటెంట్ కేటగిరి వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. బిజినెస్ ఇన్సైడర్ అధ్యయనం చేసిన ఓ 28 మంది యూట్యూబర్ల నెలవారీ ఆదాయాలు 82 నుంచి 83,000 డాలర్ల వరకూ (రూ.6,800 నుంచి సుమారు రూ.70 లక్షలు) ఉన్నాయి. ఈ ఆదాయాలు నెలవారీగా మారవచ్చు. ఉదాహరణకు సుమారు లక్ష మంది సబ్స్క్రైబర్లు ఉన్న ఓ యూట్యూబర్ ఒక నెలలో 1,000 డాలర్లు (రూ.83,000) సంపాదిస్తే మరొక నెలలో 6,000 డాలర్లు (సుమారు రూ.5 లక్షలు) వరకు సంపాదించినట్లు బిజినెస్ ఇన్సైడర్ పేర్కొంది. ఇక ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్లను కలిగి ఉన్న వ్యక్తిగత ఫైనాన్స్ గురించి వీడియోలను రూపొందించే మరో యూట్యూబర్ ఒకే నెలలో 50,000 డాలర్లు (సుమారు రూ.41 లక్షలు) కంటే ఎక్కువ సంపాదించారు . గమనిక: ఇది కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. -
సల్మాన్ ఖాన్@ 220 కోట్లు..
సల్మాన్ ఖాన్ నటనా నైపుణ్యంతో ప్రేక్షకులను ఆకర్షించడమే కాకుండా, తన సంపదను వివిధ వ్యాపారాల్లో పెట్టుబడిపెట్టి కోట్లు ఆర్జిస్తున్నారు. సినిమాల ద్వారా వచ్చే డబ్బును విభిన్న మార్గాల్లో మదుపు చేసి ఏటా దాదాపు రూ.220 కోట్లు సంపాదిస్తున్నట్లు జీక్యూ ఇండియా సర్వే తెలిపింది. సల్మాన్ ఖాన్ కలిగి ఉన్న తొమ్మిది ఆదాయ మార్గాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. 1. బాక్సాఫీస్: అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్ వంటి అనేక ఇతర బాలీవుడ్ నటుల మాదిరిగానే సినిమా ప్రారంభించడానికి ముందే సల్మాన్‌ఖాన్ రెమ్మునరేషన్ తీసుకుంటారు. కొన్ని సినిమాలకు ప్రాఫిట్-షేరింగ్ ఒప్పందాల ప్రకారం వాటికి వచ్చే ఆదాయంలో దాదాపు 50శాతం వాటాను తనకు ఇవ్వాల్సి ఉంటుంది. 2. ప్రొడక్షన్ హౌస్: 2011లో సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ అనే ప్రొడక్షన్ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. దాని ఆధ్వర్యంలో చిల్లర్ పార్టీ జాతీయ అవార్డు చిత్రంతోపాటు బజరంగీ భాయిజాన్ వంటి విజయవంతమైన సినిమాలు నిర్మించారు. ఇతర సినిమాలు సైతం ఈ బ్యానర్ ఆధ్వర్యంలో రూపొందిస్తున్నారు. 3. స్టార్టప్‌లలో పెట్టుబడి: యాత్రా.కామ్ అనే ట్రావెల్ కంపెనీలో సల్మాన్‌ఖాన్‌కు దాదాపు 5శాతం వాటా ఉన్నట్లు కొన్ని మీడియా సంస్థల నివేదిక ప్రకారం తెలిసింది. ఆన్‌మొబైల్ గ్లోబల్ లిమిటెడ్ కంపెనీ నేతృత్వంలోని చిన్న వీడియో ప్లాట్‌ఫారమ్ అయిన ‘చింగారి’లో ఆయన పెట్టుబడి పెట్టారు. ఈ స్టార్టప్‌లో బ్రాండ్ అంబాసిడర్‌గా చేరారు. 4. క్లాతింగ్ కంపెనీ: 2012లో స్థాపించిన బీయింగ్ హ్యూమన్ క్లాతింగ్ కంపెనీ ద్వారా సల్మాన్ ఖాన్ ఫౌండేషన్ సేవలందిస్తోంది. దీని ద్వారా పేదలకు ఆరోగ్య సంరక్షణ, విద్యను అందిస్తున్నారు. ఈ కంపెనీ యూరప్, మిడిల్ఈస్ట్ దేశాల్లోనూ దాని కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ దేశంలో 90 కంటే ఎక్కువ స్టోర్లను కలిగి ఉంది. 5. ఫిట్నెస్ పరికరాలు, జిమ్: సినీ పరిశ్రమలోని ఫిట్నెస్ నటుల్లో ఒకరిగా ప్రశంసలు అందుకున్న సల్మాన్ ఖాన్ 2019లో బీయింగ్ స్ట్రాంగ్ కంపెనీను ప్రారంభించారు. ఫిట్నెస్ పట్ల తనకున్న అభిరుచిని లాభదాయకమైన వ్యాపార సంస్థగా మార్చుకున్నారు. ముంబై , నోయిడా, ఇందోర్, కోల్‌కతా, బెంగుళూరు వంటి ప్రధాన నగరాల్లో జిమ్‌లను ప్రారంభించారు. 6. రియల్ ఎస్టేట్: సల్మాన్ ఖాన్ ముంబయిలో ఇళ్లు, వాణిజ్య స్థలాలను కొనుగోలు చేశారు. ముంబయి శాంటాక్రూజ్‌లోని తన నాలుగు అంతస్తుల భవనాన్ని అద్దెకు ఇచ్చి నెలకు దాదాపు రూ.1 కోటి సంపాదిస్తున్నట్లు అంచనా. 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలాన్ని ఖాన్ 2012లో రూ.120 కోట్లకు కొనుగోలు చేశారు. గతంలో ఈ స్థలాన్ని ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన ఫుడ్హాల్కు నెలకు రూ.90లక్షల చొప్పున అద్దెకు ఇచ్చారు. ఇదీ చదవండి: వందల ఉద్యోగులను తొలగించిన అమెజాన్ అలెక్సా 7. టీవీ షోలు: 2010-11 సీజన్ నుంచి ప్రముఖ రియాలిటీ షో అయిన బిగ్ బాస్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అందుకోసం వారానికి రూ.12 కోట్లు వసూలు చేస్తున్నారని కొన్ని మీడియా కథనాల్లో ప్రచురించారు. బిగ్ బాస్ సీజన్ 17 ముగిసే సమయానికి దాదాపు రూ.200 కోట్లను సంపాదించవచ్చని అంచనా. బిగ్ బాస్ కంటే ముందు ఆయన 10కా దమ్ అనే రియాలిటీ గేమ్ షోకు వ్యాఖ్యాతగా పనిచేశారు. 8. బ్రాండ్ యాడ్లు: హీరో హోండా, బ్రిటానియా టైగర్ బిస్కెట్, రియల్మీ, రిలాక్సో, డిక్సీ స్కాట్ వంటి ప్రముఖ బ్రాండ్లకు సల్మాన్ ఖాన్ ప్రచారకర్తగా ఉన్నారు. ఇందుకోసం ఒక్కో కంపెనీ ద్వారా ఏటా దాదాపు రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు వసూలు చేస్తారని అంచనా. 9. ఎన్ఎఫ్టీ: 2021లో సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్, రజనీకాంత్, సన్నీ లియోన్‌తోపాటు ఇతర నటులు నాన్-ఫంగిబుల్ టోకెన్లలో పెట్టుబడి పెట్టారు. దానివల్ల వారి అభిమానులు నటుడికి సంబంధించిన ప్రత్యేకమైన ఆర్ట్‌లు, మ్యూజిక్, వీడియోలు, ఫొటోలు వంటివి డిజిటల్ రూపంలో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: క్రికెట్ మ్యాచ్‌తో డబ్బు సంపాదన! ఎలాగంటే.. పైన తెలిపిన అన్ని మార్గాల ద్వారా సల్మాన్ ఖాన్ వార్షిక ఆదాయం రూ.220 కోట్లుగా తేలింది. అంటే నెలకు దాదాపు రూ.16 కోట్లు. దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరైన ఖాన్ ఆస్తుల నికర విలువ సుమారు 350 యూఎస్ మిలియన్ డాలర్లు (సుమారు రూ.2,907 కోట్లు)గా ఉన్నట్లు కొన్ని కథనాలు వల్ల తెలుస్తుంది. -
యూట్యూబ్ కింగ్ గౌరవ్ తనేజా గుర్తున్నాడా? మళ్లీ ట్రెండింగ్లోకొచ్చేశాడు!
YouTuber Gaurav Taneja మలేషియాకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థకు మాజీ పైలట్ గౌరవ్ తనేజా మరోసారి వార్తల్లో నిలిచాడు. మెట్రో రైల్లో పుట్టిన రోజు వేడుకలు జరిపిన బుక్కైన యూట్యూబర్ గౌరవ్ తనేజా గుర్తున్నాడా? యూట్యూబ్‌లో ఫ్లైయింగ్ బీస్ట్‌గా ఫిట్నెస్ పాఠాలు చెప్పే యూ ట్యూబర్ గౌరవ్ తన సంపాదన ఎంతో ఫ్యాన్స్‌కి చెప్పేశాడు. అంతేకాదు తన పాత సీఈవోతోపోలిస్తే సంపాదనలో కింగ్‌ని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒకపుడు తనను తొలగించిన ఏయిర్ ఏసియా సీఈవో కంటే ఇపుడు తన సంపాదేన ఎక్కువ అంటూ ఇటీవల ఇన్ఫ్లుయెన్సర్ రాజ్ షమానీ హోస్ట్ చేసిన పోడ్కాస్ట్ సందర్భంగా వెల్లడించారు. బ్రాండ్ డీల్స్, యాడ్స్ ఆదాయం గురించి చెప్పమని అడిగినపుడు ఈ వ్యాఖ్యలు చేశాడు. గౌరవ్ మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చాడు. నిర్దిష్టంగా ఇంత అనీ సంపాదన వివరాలు బహిరంగంగా వెల్లడించలేదు. కానీ ఎయిర్ ఏసియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్ మిలియన్ డాలర్ల ఆస్తులను గుర్తుచేసుకుని తనేజా ఫ్యాన్స్ మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. అదీ సీఈవో టోనీ లింక్డ్ఇన్ పోస్ట్‌తో విమర్శల పాలైన తరువాత కంపెనీ మాజీ పైలట్ వ్యాఖ్యలు వెలుగులోకి రావడంతో మరింత వైరల్‌గా మారాయి. ఇంతకీ ఎవరీ గౌరవ్ తనేజా ♦ 2008లో ఐఐటీ ఖరగ్‌పూర్ పట్టభద్రుడైన గౌరవ్ తనేజా "సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్, ప్రొఫెషనల్ బాడీబిల్డర్ , ఏవియేటర్ కూడా. ♦ ఇపుడు ఢిల్లీ యూనివర్శిటీనుంచి ఎల్ఎల్బీ చేస్తున్నాడు. ♦ మరో పైలట్ రీతూ రథీతో వివాహం. వీరికి ఇద్దరు కుమార్తెలు . ♦ భద్రతా సమస్యల్ని గురించిన మాట్లాడినందుకే తనను ఎయిర్ ఏసియానుంచి తొలగించారనేది గౌరవ్ వాదన. ♦ ఫ్లైయింగ్ బీస్ట్ కంటే ముందే 2016లో FitMuscle TVని లాంచ్ చేశాడు. దీనికి దాదాపు 30 లక్షల సబ్ స్క్రైబర్లున్నారు. ఇక 2020లో లాంచ్ చేసిన రాస్బరీ కే పాపాకి 12 లక్షలకు పైగా సబ్ స్క్రైబర్లున్నారు I was terminated from airasia for raising safety issues! Now, the same issues are raised by #DGCA to @AirAsiaIndian. Justice will prevail! #Sabkeliye — Gaurav Taneja (@flyingbeast320) June 28, 2020 కాగా 2020జూన్‌లో AirAsia ఇండియా గౌరవ్‌ను పైలట్‌గా విధులనుంచి తొలగించింది. అప్పటికే ప్రముఖ వ్లాగర్‌గా తనేజా ఫుట్ టైం కంటెంట్ క్రియేటర్‌గా, యూట్యూబర్‌గా కరియర్ స్టార్ట్ చేశాడు.ఫ్లైయింగ్ బీస్ట్, ఫిట్ మజిల్ టీవీ, రాస్బరీకే పాపా పేర్లతో యూట్యూబ్ ఖాతాలను నిర్వహిస్తున్నాడు. అలా సోషల్‌మీడియాలో పాపులర్ స్టార్‌గా మారిపోయాడు.ప్రస్తుతం, యూట్యూబ్‌లో 80 లక్షలకుపైగా సబ్స్క్రైబర్లు, ట్విటర్లో దాదాపు 900k, ఇన్‌స్టాలో 40 లక్షల ఫాలోవర్స్ ఉన్నారంటే అతని క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. -
ఈ మొక్కలతో కోట్లు సంపాదించవచ్చు! అయితే ఈ రూల్స్ పాటించాల్సిందే..
ఆధునిక భారతదేశం అభివృద్ధివైపు పరుగులు పెడుతున్న సమయంలో కేవలం ఉద్యోగం చేసి మాత్రమే డబ్బు సంపాదించాలంటే కొంత అసాధ్యమైన పనే. అయితే కొంతమంది ఉద్యోగాలు చేస్తూ సొంతంగా వ్యాపారాలు చేస్తుంటారు. మరికొందరు వ్యవసాయం ద్వారా కూడా అధిక లాభాలను పొందుతున్నారు. మనం ఈ కథనంలో 'శ్రీగంధం' (Sandalwood) ద్వారా ఎలా సంపాదించవచ్చు? వీటి పెంపకానికి ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందా? అనేవి వివరంగా తెలుసుకుందాం. సౌందర్య లేపనాలు, క్రీములు వంటి వాటి తయారీలో చందనం ఎక్కువగా వినియోగిస్తారు. కావున చందనం (శ్రీగంధం) చెట్లు పెంచి మంచి లాభాలను ఆర్జించవచ్చు. ఈ చెట్లను రెండు ప్రాథమిక పద్ధతుల ద్వారా పెంచవచ్చు. ఒకటి సేంద్రీయ వ్యవసాయం, మరొకటి సాంప్రదాయ పద్ధతి. సేంద్రీయ విధానం ద్వారా సాగు చేస్తే 10 నుంచి 15 సంవత్సరాలలో చెట్లు పక్వానికి వస్తాయి. అయితే సాంప్రదాయ పద్దతిలో వ్యవసాయం చేస్తే 20 నుంచి 25 సంవత్సరాల సమయం పడుతుంది. అయితే ఈ చెట్ల పెంపకం సమయంలో కనీస రక్షణ కల్పించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: ఒక్కసారి ఈ పంట పండించారంటే ప్రతి ఏటా రూ.60 లక్షల ఆదాయం! బ్లూబెర్రీ సాగుతో లాభాలే.. లాభాలు! చెట్టు పక్వానికి వస్తుందనే సమయంలో సువాసనలు వెదజల్లడం ప్రారంభిస్తుంది. ఆ సమయంలో కొన్ని జంతువులు భారీ నుంచి మాత్రమే కాకుండా స్మగ్లర్ల భారీ నుంచి కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి దాదాపు సమశీతోష్ణ పరిసరాల్లో ఏపుగా పెరుగుతాయి. ఒక చందనం చెట్టు ద్వారా రూ. 3 నుంచి రూ. 5 లక్షల వరకు ఆదాయాన్ని పొందవచ్చు. ఈ లెక్కన 10 చెట్లను పెంచితే రూ. 50 లక్షలు, 100 చెట్లు సాగు చేస్తే రూ. 5 కోట్లు వరకు ఆర్జించవచ్చు. ఇదీ చదవండి: వాడిన పూలతో కోట్ల బిజినెస్ - ఎలాగో తెలిస్తే షాకవుతారు! ప్రభుత్వ నిబంధనలు: శ్రీగంధం మొక్కలు పెంచాలనుకునేవారు తప్పకుండా కొన్ని రూల్స్ తెలుసుకుని ఉండాలి. ఇందులో ప్రధానంగా 2017లో ఇండియన్ గవర్నమెంట్ గంధపు చెక్కలను ప్రైవేట్‌గా కొనుగోలు చేయడం, విక్రయించడాన్ని నిషేధించింది. కావున చట్టం పరిధిలో చెట్లను పెంచవచ్చు, కానీ వాటిని ప్రభుత్వానికి విక్రయించాలి. అంతే కాకుండా వీటి పెంపకం ప్రారంభం సమయంలోనే అటవీ శాఖ అధికారులను తెలియజేయాలి. వారు వీటిని ఎప్పటికప్పుడు నావిగేట్ చేస్తూ ఉంటారు. (Disclaimer: ఎక్కువ లాభాలు వస్తాయని శ్రీగంధం చెట్ల పెంపకం చేయాలనే వారు ముందుగా అన్ని విషయాలు తెలుసుకోవాలి. సంబంధిత ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇందులో లాభాలు మాత్రమే కాదు, నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కావున ఇలాంటివన్నీ బేరీజు వేసుకోవాలి.) -
కార్పొరేట్ ఇంజినీర్ కన్నా క్యాబ్ డ్రైవరే నయం! సోషల్ మీడియా పోస్ట్ వైరల్..
ఈరోజుల్లో చాలా మంది తమ చదువుకు తగిన ఉద్యోగం చేయడం లేదు. ఒక వేళ చేసినా అందులో సంతృప్తి లేక కొన్ని రోజులకే మానేసి వేరే పని చేసుకుంటున్నారు. కొంతమంది విధి లేక ఇలా చేస్తుంటే మరికొంత మంది మాత్రం పెద్ద చదువులు చదువుకున్నా కూడా ఇష్టపూర్వకంగానే చిన్న చిన్న పనులు చేస్తున్నారు. ఇలా చిన్న పనులు చేసుకునేవారిని చిన్నచూపు చూస్తుంటారు. వారు పెద్దగా సంపాదించలేరు అనుకుంటుంటారు. కానీ కార్పొరేట్ కంపెనీల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారి కంటే ఎక్కువగానే సంపాదిస్తున్నారు. అలాంటి దానికి ఉదాహరణే ఈ సంఘటన. రద్దీగా ఉండే రోడ్డుపై క్యాబ్ నడిపే వ్యక్తి కూడా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చునే ఇంజనీర్ కంటే ఎక్కువే సంపాదిస్తున్నాడంటే మీరు నమ్మకపోవచ్చు. అయితే ఇది నిజం. ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఓ క్యాబ్ డ్రైవర్ ఉద్యోగం, సంపాదన గురించి సోషల్ మీడియాలో శ్వేతా కుక్రేజా అనే యూజర్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఇటీవల తాను ఓ క్యాబ్‌లో ప్రయాణించానని, ఆ క్యాబ్ డ్రైవర్ ఇంజనీర్ అని పేర్కొన్నారు. తాను ఇంతకుముందు క్వాల్కామ్ కంపెనీలో పనిచేసేవాడినని చెప్పిన అతను, ఆ ఉద్యోగంతో కంటే క్యాబ్ డ్రైవింగ్‌తోనే ఎక్కువగా సంపాదిస్తున్నానని చెప్పినట్లు శ్వేత ట్వీట్ చేశారు. శ్వేత ఆగస్ట్ 6న ఈ ట్వీట్ చేయగా ఇప్పటి వరకు 7.7 లక్షల మంది వీక్షించారు. 6,700లకు పైగా లైక్‌లు వచ్చాయి. క్యాబ్ డ్రైవర్ సంపాదనపై యూజర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెట్టారు. కార్పొరేట్ జాబ్‌లు చేసినంత మాత్రాన ఎవరూ గొప్పవారు కాదని, క్యాబ్ డ్రైవర్లు ఎంత మాత్రం తక్కువ కాదని శ్వేత పేర్కొన్నారు. I was in a cab yesterday and that driver was an engineer. He said he earns more from the cab driving than his corporate job at Qualcomm. 🥲 — Shweta Kukreja (@ShwetaKukreja_) August 6, 2023 -
చిన్న మార్పు.. ఆ రైల్వేకు అధిక ఆదాయం తెచ్చిపెడుతోంది..
సెంట్రల్ రైల్వే పరిధిలోని ఓ రైల్వే డివిజన్ చేసిన మార్పు అధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. వివిధ మార్గాల్లో ఆదాయ పెంపుపై దృష్టి పెట్టిన సెంట్రల్ రైల్వే పరిధిలోని ముంబై డివిజన్ తమ పరిధిలోని ప్రకటన హోర్డింగ్‌లను డిజిటల్ బిల్బోర్డ్లుగా మార్చడం ప్రారంభించింది. మొత్తం ఏడు హోర్డింగ్‌లను ఎల్ఈడీ డిస్ప్లే, డిజిటల్ బిల్బోర్డ్లుగా మార్చింది. దీంతో వార్షిక లైసెన్సు ఫీజులు గణనీయంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. డిజిటల్ బిల్బోర్డ్లుగా మార్చిన ఈ హోర్డింగ్‌ల ద్వారా సంవత్సరానికి రూ.1.53 కోట్ల అదనపు ఆదాయం ముంబై రైల్వే డివిజన్‌కు వచ్చింది. కుర్లా రోడ్ ఓవర్ బ్రిడ్జ్ తూర్పు వైపు, సియోన్ ఆర్ఓబీ (రెండు బోర్డులు), కంజుర్మార్గ్ రోడ్ ఆర్ఓబీ, తిలక్ నగర్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్, సుమన్ నగర్ ఆర్యూబీ గాంట్రీ సైట్ సీ, థానే-కోప్రి ఆర్ఓబీ వద్ద ఈ డిజిటల్ ప్రకటన బోర్డులు ఉన్నాయి. ప్రకటనదారులు సాధారణ లైసెన్స్ రుసుము కంటే 1.5 రెట్లు అధికంగా చెల్లించి ఇప్పటికే ఉన్న స్టాటిక్ హోర్డింగ్‌లను ఆకర్షణీయమైన డిజిటల్ డిస్ప్లే బోర్డులుగా మార్చుకోవచ్చు. కాగా మరో నాలుగు హోర్డింగ్‌లను డిజిటల్ బిల్బోర్డ్లుగా మార్చే ప్రక్రియలో ముంబై రైల్వే డివిజన్ ఉంది. -
17కు వ్యాపారం.. 19కి సెటిల్.. 22కు రిటైర్మెంట్.. అమెరికా కుర్రాడి సక్సెస్ స్టోరీ!
ఆ కుర్రాడికి చిన్నప్పటి నుంచే ఎన్నో కలలు. మరెన్నో ఆశలు. అయితే అతని ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో అవేవీ నెరవేరే అవకాశమే లేదు. అయితే పరిస్థితులను అతను ఎలా మార్చుకున్నాడో తెలిస్తే ఎవరైనా సరే ఒకపట్టాన నమ్మలేరు. ఈ కథ 22 ఏళ్ల యువకుడిది. అతను తన విధిరాతను తానే సమూలంగా మార్చుకున్నాడు. చిన్నవయసులోనే కోట్లకు పడగలెత్తాడు. విద్యార్థిగా చదువు పూర్తయ్యే వయసు వచ్చేనాటికల్లా రిటైర్ అయ్యాడు. అమెరికాకు చెందిన హెడెన్ వాల్ష్ స్కూలు చదువును మధ్యలోనే విడిచిపెట్టాడు. ఈ కామర్స్‌లో తన ప్రతిభ చూపాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నాడు. డెయిలీ మెయిల్ నివేదిక ప్రకారం హెడెన్ తన జీవితానుభవాలను టిక్‌టాక్, యూట్యూబ్‌లో షేర్ చేస్తుంటాడు. తాను ఎంత చిన్నవయసులో వ్యాపారం మొదలుపెట్టిందీ, దాని నుంచి ఎలా ఆదాయం సంపాదించినదనే వివరాలు తెలియజేస్తుంటాడు. హెడెన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌కు 14 వేలకు మించిన ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్ విషయానికొస్తే 3 లక్షలకు మించిన చందాదారులు ఉన్నారు. హెడెన్‌ను ఇంత చిన్నవయసులోనే ఎందుకు స్కూలు చదువు వదిలేసి, సంపాదన ప్రారంభించారని ప్రశ్నించినప్పుడు ఆయన తనకు ఎదురైన ఒక అనుభవాన్ని, అది తన జీవితాన్ని ఎలా మార్చివేసిందో తెలియజేశారు. బాల్యంలో ఎదురైన అనుభవం నుంచి.. హెడెన్ తన అనుభవాన్ని వివరిస్తూ..‘నాకు బాగా గుర్తుంది.. నాకు 10-11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఏది కొనుక్కుందామన్నా నా దగ్గర డబ్బు ఉండేది కాదు. మా అమ్మానాన్న కూడా వాటిని కొనిచ్చేవారు కాదు. అప్పుడే నాకు నా సొంత సంపాదన అవసరమని అనిపించింది. నేను 17 ఏళ్ల వయసులోనే వ్యాపారం ప్రారంభించాను. సంపాదించడం కూడా మొదలుపెట్టాను. ఈ- కామర్స్ రంగంలో సత్తా చాటాను. ఇప్పటికీ అదే పనిచేస్తున్నాను. ఈ పని చేయడం అంటే నాకు ఎంతో సరదా. అయితే నేను టెక్నికల్‌గా రిటైర్ అయ్యాను. రియల్ ఎస్టేట్ నుంచి అందిన సొమ్ములోని కొంత మొత్తాన్ని వేరుగా ఉంచాను. దీని నుంచి వచ్చే ఆదాయంతో నా ఖర్చులు నెరవేరుతుంటాయి’ అని అన్నారు. 17 ఏళ్ల వయసులో వ్యాపారంలోకి.. సుమారు 17 ఏళ్ల వయసురాగానే హెడెన్ ‘ఈ కామ్ సీజన్’ను స్థాపించారు. దీనిలో ఆన్లైన్ కోర్సు నిర్వహిస్తుంటాడు. ఫీజు 575 డాలర్లు. హెడెన్‌కు 18 ఏళ్లు వచ్చేసరికి సొంతంగా లంబోర్గినీ(కారు) సమకూర్చుకున్నాడు. 19 ఏళ్ల నాటికి కోటీశ్వరునిగా మారాడు. 2022 నాటికి అతని ఆదాయం 15 మిలియన్ డాలర్లు. దీనిలో 3 మిలియన్ డాలర్లు లాభం ఉంది. తన ఈ- కామర్స్ ప్లాట్ఫారం ద్వారా హెడెన్ లెక్కలేనంతగా సంపాదిస్తున్నాడు. 22 ఏళ్ల వయసులో అతను రియల్ ఎస్టేట్ పోర్టుఫోలియా తీర్చిదిద్దాడు. కోటీశ్వరునిగా మారాలంటే.. మనిషికి అత్యంత అవసరమైన రెండు అంశాల గురించి హెడెన్ తెలియజేశారు. కోటీశ్వరులుగా మారాలనుకుంటున్నవారు.. మీకు వచ్చే సంపాదనలోని 20 శాతం మొత్తాన్ని మాత్రమే ఖర్చు చేయండి. అప్పుడే మీరు అత్యధిక మొత్తంలో సేవింగ్స్ చేసేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఇక రెండవది.. జీవితంలోని అన్ని వ్యాపకాల కన్నా సంపాదించడానికే అధిక ప్రాముఖ్యతనివ్వాలని సూచించారు. ఇది కూడా చదవండి: స్కూల్ పిల్లల బ్యాగుల్లో డైపర్లు.. వయసేమో 11..షాకైన టీచర్లు! -
పేరుకే కుక్క కానీ కోట్ల లో సంపాదన .
-
ర్యాపిడో బైక్ కెప్టెన్లకు గుడ్ న్యూస్.. ఇకపై మరింత ఆదాయం
హైదరాబాద్: బైక్ ట్యాక్సీ కెప్టెన్లకు మరింత ఆదాయం సమకూర్చడంపై దృష్టి పెట్టినట్లు ఆటో–టెక్ అగ్రిగేటర్ సంస్థ ర్యాపిడో తెలిపింది. ఇందులో భాగంగా రేట్ కార్డును సవరించినట్లు వివరించింది. 8 కిలో మీటర్ల వరకు కిలో మీటర్‌కు రూ.8 చొప్పున, ఆపైన రూ. 11 చొప్పున రేట్లను నిర్ణయించింది. దీనితో ఇతర ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో పోలిస్తే మరింత ఎక్కువగా ట్యాక్సీ కెప్టెన్లకు ఒక్కో ఆర్డరుకు కనీసం రూ. 60 ఆదాయం లభించగలదని సంస్థ సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి వివరించారు. మిగతా ప్లాట్‌ఫామ్‌లలో ఇది రూ. 40–45గా ఉన్నట్లు పేర్కొన్నారు. కెప్టెన్లకు ట్రిప్పులపై మరింత నియంత్రణ ఉండేలా కొత్త ఫీచర్‌ను కూడా జోడించినట్లు తెలిపారు. అంటే రైడర్లు బుక్ చేసే గమ్యస్థానాల గురించి బైక్ కెప్టెన్లకు తెలుస్తుంది. ఇంతకు ముందు ఇలాంటి అవకాశం ఉండేది కాదు. బుకింగ్ క్యాన్సిలేషన్లను తగ్గించడంతో పాటు రైడర్లు, కెప్టెన్లకు ఇద్దరికీ ప్రయోజనం చేకూర్చేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఇదీ చదవండి: Ameera Shah: కూతురొచ్చింది! చిన్న ల్యాబ్‌ను రూ.వేల కోట్ల సంస్థగా మార్చింది.. -
రూ. 9 కోట్ల సంపాదనకు సగటు భారతీయుడికి ఎన్నేళ్లు పడుతుందంటే..
ఒక మిలియన్ యూరోలు సంపాదించడానికి భారత్‌లోని సగటు జీతగాడికి ఎంత సమయం పడుతుంది? ఇంతకీ మిలియన్ యూరోలు అంటే ఎంతో చెప్పలేదు కదూ.. రూ. 9.09 కోట్లు.. ఈ లెక్కన భారతీయులకు 158 ఏళ్లు పడుతుందట! 30 ఏళ్లు సర్వీసు వేసుకున్నా.. ఐదు జీవితకాలాలు అన్నమాట. మన పరిస్థితి ఇలా ఉంటే.. పాకిస్తాన్ పరిస్థితి మరీ ఘోరం.. అక్కడైతే.. ఏకంగా 664 ఏళ్లు పడుతుందట. ప్రపంచంలో అత్యంత తక్కువగా స్విట్జర్లాండ్ వాసులకు ఇందు కోసం కేవలం 15 ఏళ్లే పడుతోంది. మన దేశవాసుల సగటు జీతం రూ.48 వేలు కాగా.. స్విట్జర్లాండ్‌లో అది రూ.5 లక్షలు. ఆయా దేశాల్లోని ఉద్యోగుల కనిష్ట వేతనం, గరిష్ట వేతనాన్ని పరిగణనలోకి తీసుకుని.. ఈ సగటు వేతనాన్ని నిర్ధారించారు. మరి ఓసారి ఇందులో టాప్–5.. లీస్ట్ 5 జాబితాన్ని చూసేద్దామా.. చదవండి: 18 ఏళ్లుగా జీన్స్ ప్యాంట్లను ఉతకని మహిళ.. ఒక్క మరక కూడా లేదట..! -
బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు..
బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు ఓ ఐఐటీయన్. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఆహార బ్రాండ్లలో ఒకటైన ‘బిర్యానీ బై కిలో’ అనే సంస్థను 2015లో విశాల్ జిందాల్ స్థాపించారు. అప్పటి నుంచి కంపెనీ వార్షిక ఆదాయం పెరుగుతూ వస్తోంది. అయితే దీంతోనే అతను సంతృప్తి చెందలేదు. వచ్చే రెండు మూడేళ్లలో రూ.1000 కోట్ల టర్నోవర్ సాధించబోతున్నాడు. బిర్యానీ బిజినెస్‌తో సక్సెస్ అయిన ఐఐటీయన్ కథ ఇది.. అనేక వ్యాపారాలు ఉన్న విశాల్ జిందాల్ స్వయంగా ఆహార ప్రియుడు. అందుకే ఆయనకు ఎన్ని వ్యాపారాలు ఉన్నా బిర్యానీ వ్యాపారమంటేనే ఆయనకు మక్కువ. ఈ బిరియానీ వ్యాపారం వెనుక ఉన్న ప్రధాన ఆలోచన భారతదేశంలోని ఖాన్సామా సంప్రదాయాన్ని పునరుద్ధరించడం. అంటే ఇక్కడ ప్రతి ఆర్డర్‌ను విడివిడి వండుతారు. వండిన బిర్యానీని మట్టి పాత్రల్లో కాల్చిన పిండి సహాయంతో ప్యాక్ చేస్తారు. ఇదీ చదవండి: అపరిచితుడికి కిడ్నీ దానం.. అపర దాన కర్ణుడు ఈ బిలియనీర్.. ఐఐటీ నుంచి ఇంజినీరింగ్ చేసిన విశాల్ జిందాల్ ఆ తర్వాత న్యూయార్క్‌లోని సిరక్యూస్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఫైనాన్స్ చదివారు. సింగపూర్‌కు చెందిన ఎకోసిస్టమ్ అడ్వైజరీ బోర్డులో జిందాల్ కూడా ఉన్నారు. ఇది అతని మొదటి కంపెనీ కాదు. గుర్గావ్లో కార్పెడియం క్యాపిటల్ పార్టనర్స్ అనే ప్రైవేట్ ఈక్విటీ ఫండ్‌ను స్థాపించారు. ఫిడిలిటీ వెంచర్స్ వ్యవస్థాపకుడు అలాగే ఆ సంస్థకు ఎండీగా, అక్షయం క్యాపిటల్ సీఈవోగా ఉన్నారు. (layoffs: షాకిచ్చిన ఇండియన్ ట్విటర్, 30 శాతం మందికి గుడ్ బై?) భారతీయ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థను ఆయనే స్థాపించి మిలియన్ డాలర్ల కంపెనీగా మార్చారు. ఇది అన్ని మెట్రో నగరాల్లో 100 మంది ఉద్యోగులు, కార్యాలయాలను కలిగి ఉంది. విశాల్ జిందాల్ అమెరికాలో 1994లో అమనో సిన్సినాటి అనే కంపెనీకి మార్కెటింగ్ అసోసియేట్‌గా పనిచేశారు. ‘బిర్యానీ బై కిలో’ సంస్థ 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 300 కోట్ల ఆదాయం వస్తుందని ఆశించారు. అయితే ప్రస్తుతం కంపెనీ నష్టాల్లో ఉంది. అయినప్పటికీ జూన్ నాటికి పుంజుకుంటుందని ఆశిస్తున్నారు. కంపెనీకి రూ. 700-750 టిక్కెట్ సైజుతో రోజుకు 10,000 కంటే ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయి. ఈ కంపెనీకి అన్ని మెట్రో నగరాలతో సహా 45 కంటే పైగా నగరాల్లో 100కి పైగా అవుట్లెట్లు ఉన్నాయి. (కండోమ్స్ బిజినెస్: 50లక్షలనుంచి రూ. 43వేల కోట్లతో దడ పుట్టించిన బ్రదర్స్) 2022 ఆర్థిక సంవత్సరంలో వారు రూ. 135 కోట్లు, అంతకుముందు 2021 సంవత్సరంలో రూ. 65.6 కోట్లు ఆర్జించారు విశాల్ జిందాల్. వచ్చే రెండు మూడు ఏళ్లలో రూ.1000 కోట్ల టర్నోవర్‌ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందు కోసం మార్కెటింగ్ వ్యయాన్ని కూడా పెంచాలనుకుంటున్నట్లు, మెక్‌డొనాల్డ్స్, స్టార్‌బక్స్ కంటే పెద్ద వ్యాపారాన్ని నిర్మించాలనుకుంటున్నట్లు విశాల్ జిందాల్ టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా సంస్థతో పేర్కన్నారు. ఇదీ చదవండి: Mukesh Ambani Birthday: వ్యాపారంలోకి రాకముందు ముఖేష్ అంబానీ ఏమవ్వాలనుకున్నారో తెలుసా? -
ఆదాయాలను సమకూరుస్తున్న శాఖలపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: ఆదాయాలను సమకూరుస్తున్న శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు గాడిలో ఉన్నాయని అధికారులు వివరించారు. ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఆదాయాల ప్రగతి ఆశాజనకంగా ఉందన్నారు. జీఎస్టీ వసూళ్లు సహా.. ఇతర ఆదాయాలు నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరువలో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. పారదర్శక విధానాలు, నిబంధనలు కచ్చితంగా అమలు చేయడం వల్ల ఆదాయాలు గాడిలో ఉన్నాయని తెలిపారు. సెప్టెంబరు 2022 వరకూ లక్ష్యం రూ.27,445 కోట్లు కాగా, రూ. 25,928 కోట్లు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. 94.47శాతం లక్ష్యం చేరుకున్నామని చెప్పారు. ఈ కాలంలో దేశ జీఎస్టీ వసూళ్ల సగటు 27.8 శాతం కాగా, ఏపీలో 28.79శాతంగా ఉందని పేర్కొన్నారు. లీకేజీలను అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, ఇన్వెస్టిమెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను అభివృద్ధి పరిచామన్నారు. హెచ్ఓడీ కార్యాలయంలో డేటా అనలిటిక్స్ సెంటర్ ఏర్పాటు చేశామని, దీనికి సంబంధించిన సిబ్బందిని కూడా నియమించామని తెలిపారు. చదవండి: ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తాం: సజ్జల ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే...: ► పన్ను చెల్లింపు దారులకు సులభతర, పారదర్శక విధానాలను అందుబాటులో ఉంచాలి. ►పన్ను వసూళ్లలో లీకేజీలను అరికట్టడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ►రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శక, సులభతర విధానాలపై కమిటీని ఏర్పాటు ►గ్రామాల్లో మహిళా పోలీసుల నుంచి తప్పనిసరిగా ప్రతిరోజూ నివేదికలు తీసుకోవాలి. ► బెల్టుషాపుల నిర్వహణ, అక్రమ మద్యం ఘటనలపై నిరంతరం నివేదికలు తెప్పించుకోవాలి. ► ఈ నివేదికలు ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలి. ► నాటుసారా తయారీ వృత్తిగా కొనసాగిస్తున్న వారి జీవితాలను మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ► ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను వారికి అందుబాటులో తీసుకు రావాలి. ► దీనికోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధంచేయాలి. ► అక్రమ మద్యం తయారీ, నిరోధంపై గట్టి చర్యలు తీసుకోవాలి. ► రిజిస్ట్రేషన్ ఆదాయాలపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలి. ► ఈ కమిటీలో ఐఏఎస్అధికారులు కృష్ణబాబు, రజత్ భార్గవ, నీరబ్ కుమార్ ప్రసాద్, గుల్జార్‌లను సభ్యులుగా పెట్టాలి. రెండు వారాల్లోగా ఈ కమిటీ నివేదిక ఇవ్వాలి ► రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన సేవలు ఏంటి? వాటివల్ల ఎలాంటి హక్కులు దఖలు పడతాయి? అది ప్రజలకు ఎలా ఉపయోగం అన్నదానిపై అవగాహన కల్పించాలి. ► అలాగే రిజిస్ట్రేషన్ చేయించుకునేవారికి సులభతర, పారదర్శక విధానాలను అందుబాటులోకి తీసుకురావాలి. ► నాన్ రిజిస్ట్రేషన్ పరిస్థితులను పూర్తిగా తొలగించాలి ► ఇందులో ప్రొఫెసనల్ ఏజెన్సీల సహాయాన్ని తీసుకోవాలి. ► ఆస్తుల విలువ మదింపు, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయి? తదితర అంశాలపై హేతుబద్ధత ఉండేలా చూడాలి. ► రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రజలకు సులభతరం చేసేందుకు, అందుకు తగిన చర్యలు తీసుకునేందుకు ప్రొఫెషనల్ ఏజెన్సీల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలి. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో సంపూర్ణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నడిచేందుకు తగిన మార్గదర్శకాలను కూడా రూపొందించాలి. ► భూములు, ఆస్తులే కాకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోదగిన సేవల వివరాలను పోస్టర్ల రూపంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు, గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలి. ► సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ ఫిర్యాదు నంబరు ఉంచాలన్న సీఎం. ఈ పోస్టర్లను అన్ని కార్యాలయాల్లో ఉంచాలి. ► గనులు, ఖనిజాల నుంచి గతేడాది సెప్టెంబరు వరకూ రూ.1,174 కోట్ల ఆదాయం కాగా, ఈ ఏడాది సెప్టెంబరు వరకూ రూ.1400 కోట్లు ఆదాయం. ► మొత్తం ఆర్ధిక సంవత్సరం ముగిసేనాటికి 43శాతం పెరుగుదల ఉంటుందని అంచనాగా అధికారులు తెలిపారు. ► మైనింగ్ కోసం ఇప్పటికే అనుమతులు పొందిన వారు, లీజు లైసెన్సులు పొందినవారు మైనింగ్ ఆపరేషన్ కొనసాగించేలా చూడాలి. దీనివల్ల ఆదాయాలు పెరుగుతాయి. ► ఆపరేషన్‌లో లేనివాటిపై దృష్టిపెట్టి, లీజుదారులకున్న ఇబ్బందులను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. ► మైనింగ్ ఆపరేషన్ చేయకపోవడానికి కారణం ఏంటి? వారికున్న ఇబ్బందులు ఏంటి? వారికి చేదోడుగా ఎలా నిలవాలి? తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఒక మార్గదర్శక ప్రణాళిక రూపొందించుకోవాలి. ► ప్రతినెలా కూడా సమగ్ర సమీక్ష జరిపి, ఆదాయాలు వృద్ధి చెందేలా తగిన చర్యలు తీసుకోవాలి. ► లక్ష్యాలను చేరుకుంటున్నామా? లేదా? అన్నదానిపై నిరంతరం సమీక్ష చేయాలి. ► ఇతర రాష్ట్రాలతో పోల్చితే సానుకూల పరిస్థితులను సృష్టించుకోవడం ద్వారా... రవాణా శాఖలో ఆదాయం పెంచుకునేలా చర్యలు తీసుకోవాలి. ► కేవలం పన్నులు పెంచడమే దీనికి పరిష్కారం కాదని, వినూత్న ఆలోచనలు చేయాలి. ► పక్కరాష్ట్రాలతో పోలిస్తే.. వాహనాల కొనుగోలుకు తగిన సానుకూల పరిస్థితులు రాష్ట్రంలో ఉండేలా ఆలోచనలు చేయాలి. ► ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకుని డీలర్లు వాహనాలు ఇవ్వని ఘటనలు వెలుగు చూశాయి. ► దీనిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి (ఎక్సైజ్ శాఖ ) కె నారాయణస్వామి, విద్యుత్, అటవీ పర్యావరణ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, అటవీపర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషల్ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, ఎక్సైజ్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ వై మధుసూధన్‌రెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, కమర్షియల్ టాక్స్ చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: తిరుపతి అభివృద్ధికి మరో కీలక అడుగు -
తగ్గదేలే: పురుషులకు సమానంగా,రూ.100లో రూ.85 మహిళలే సంపాదిస్తున్నారు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ (ఐఐఎం-ఏ) నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ అధ్యయనం ప్రకారం మనదేశంలోని మహిళా ఎగ్జిక్యూటివ్‌లు వారి పురుష సహచరులు సంపాదించే ప్రతి రూ.100కి సగటున రూ.85 సంపాదిస్తున్నట్లు తేలింది. ఇంటికే పరిమితం.. భర్త, పిల్లలు, కుటుంబ పోషణ మాత్రమే ఆమె విధి...అంటూ కొన్నేళ్ల క్రితం మహిళలకు సంబంధించి పరిచయ వాక్యాలు ఉండేవి. కానీ ఇప్పుడు..ఇంటా మేమే,బయటా మేమే అన్నట్లుగా అన్ని రంగాల్లోనూ మహిళలు ప్రతిభ కనబరుస్తున్నారు. శాస్త్ర, సాంకేతిక, ఉద్యోగ రంగాల్లోనే కాదు..వృత్తి, వ్యాపారాల్లోనూ మహిళలు సాధిస్తున్న విజయాలు అన్నీ ఇన్నీ కావు. అంతెందుకు ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో మనదేశంలో మహిళా ఎగ్జిక్యూటివ్‌లు వారి పురుష సహచరులు సంపాదించే ప్రతి రూ.100కి సగటున రూ.85 సంపాదిస్తున్నట్లు తేలింది. ►ఇక్రా చైర్పర్సన్ అరుణ్ దుగ్గల్ ఆధ్వర్యంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ (ఐఐఎం-ఏ) హెచ్ ఆర్ అసోసియేట్ప్రొఫెసర్ ప్రొమిలా అగర్వాల్ 'ది గ్లాస్ సీలింగ్- లీడర్షిప్ జెండర్ బ్యాలెన్స్ ఇన్ ఎన్ఎస్ఈ 200 కంపెనీస్ పేరిట సర్వే నిర్వహించారు. ►గతేడాది నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్‌లో నమోదు చేసుకున్న 200 కంపెనీల్లోని 109కంపెనీలకు చెందిన సుమారు 4వేల కంటే ఎక్కువ మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల అభిప్రాయం ఆధారంగా నివేదికను తయారు చేశారు. ఆ నివేదికలో దేశంలోని కంపెనీల టాప్, సీనియర్ మేనేజ్మెంట్లో మహిళల ప్రాతినిధ్యం డైరెక్టర్ల బోర్డులలో ఉండాల్సిన మహిళల శాతం కంటే గణనీయంగా తక్కువగా ఉందని తేలింది. ►సంస్థల సీనియర్ మేనేజ్మెంట్లో మహిళల ప్రాతినిధ్యం కేవలం 7 శాతం మాత్రమేనని, ఇది టాప్ మేనేజ్మెంట్ స్థాయిలో కేవలం 5 శాతానికి దిగజారింది. అయితే, సర్వే ప్రకారం.. నియంత్రణ అవసరాల కారణంగా ఎన్ఎస్ఈలో నమోదైన 500 కంపెనీల్లో ఉన్నత స్థాయిలో ఉన్న మహిళా డైరెక్టర్ల సంఖ్య 2014లో 4.5 శాతం నుండి 2022 నాటికి 16 శాతానికి పెరిగింది. ►200 సంస్థలలో 21 సంస్థల్లో టాప్ మేనేజ్మెంట్లో ఒక మహిళ మాత్రమే ఉండగా, 76 సంస్థల్లో టాప్ మేనేజ్మెంట్లో ఒక్క మహిళ కూడా లేరని కూడా ఇది హైలైట్ చేసింది. ►మహిళా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల సంఖ్య అత్యధికంగా ఉన్న పరిశ్రమలు వినియోగదారుల సేవలు, వినియోగ వస్తువులు, ఆర్థిక సేవలు, ఔషధాలు, సమాచార సాంకేతికత విభాగాలు ఉన్నాయని సర్వేలో తేలింది. ►నివేదికలో మహిళా ఎగ్జిక్యూటివ్‌లకు తీసుకునే జీతాలు రూ.1.91 కోట్లుగా ఉండగా.. అదే స్థాయి హోదాలో ఉన్న వారి పురుష సహచరులు ఆర్జిస్తున్న జీతం రూ. 2.24 కోట్లుగా ఉంది. -
పుట్టుకతోనే మూగ, చెవుడు.. అవేవి అతన్ని ఆపలేకపోయాయి
సాక్షి,అర్వపల్లి(నల్గొండ): ఆ యువకుడికి పుట్టుకతోనే మూగ , చెవుడు.. దీనికి తోడు పోలియోతో రెండు కాళ్లు వంకర్లు తిరిగి పనిచేయవు. అయితేనేం ఆత్మవిశ్వాసం ఉంటే ఏ పని అయినా చేయవచ్చని నిరూపిస్తున్నాడు. జాజిరెడ్డిగూడేనికి చెందిన సయ్యద్ హైదర్ అలీ కుమారుడు వాహిద్ అలీ. కుటుంబ పరిస్థితుల కారణంగా పదోతరగతితో చదువు మానేశాడు. తండ్రి వద్ద ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు, సైకిళ్లు తదితర వాహనాల టైర్లు పంక్చర్లు చేయడం నేర్చుకుని నాలుగేళ్లుగా పనిచేస్తూ కుటుంబానికి బాసటగా నిలుస్తున్నాడు. రుణం మంజూరు చేస్తే దుకాణాన్ని అభివృద్ధి చేసుకుంటానని చెబుతున్నాడు. మరో ఘటనలో.. రైతుల శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం నార్కట్‌పల్లి: రైతుల శ్రేయస్సే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. యాసంగిలో రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయం పంటలు సాగుచేయాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ నాయకులు చేస్తున్న ప్రకటనలు రైతులను తికమక పెడుతున్నాయన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి రైతుల పట్ల నిజమైన ప్రేమ ఉంటే ఢిల్లీకి వెళ్లి వానాకాలం ఎంత ధాన్యం కొంటారో కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన చేయించాలని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టిందని ఎద్దేవా చేశారు. సమావేశంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్‌రెడ్డి, వైస్ చైర్మన్ కోండురు శంకర్, మండల పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చదవండి: వివాహేతర సంబంధం అంటూ కోడలిపై అసత్య ప్రచారం.. తట్టుకోలేక రాత్రి.. -
ఒక సెకండ్‌కు సుమారు 6 లక్షల 48 వేల సంపాదన..!
ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు వారి నికర ఆదాయాలను, నష్టాలను, ప్రతి ఆర్థిక సంవత్సరం ఆయా త్రైమాసికాల్లో ప్రకటిస్తాయి. క్యూ1, క్యూ 2, క్యూ 3, క్యూ 4 ఫలితాల పేరిట కంపెనీలు ఆయా ఆర్థిక సంవత్సరంలో ఏంతమేర లాభనష్టాలను ప్రదర్శించాయనే విషయాన్ని బహిరంగంగానే విడుదల చేస్తాయి. కంపెనీల సంపాదన డేటా ఖచ్చితంగా రహస్యం కానప్పటికీ, దాదాపు అన్ని కంపెనీలు తమ విక్రయాలు , ఆదాయ గణాంకాలను కనీసం ప్రతి త్రైమాసికంలో, నెలవారీగా ప్రకటిస్తారు. కాగా ఆయా కంపెనీలు 3 నెలలకొకసారి మాత్రమే ఆదాయ గణంకాలను రిలీజ్ చేస్తాయి. కానీ ఏ ఒక్క కంపెనీ కూడా సెకనుకు లేదా నిమిషానికి లేదా గంటకు వచ్చే సంపాదన గురించి మాత్రం చెప్పవు. ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ కంపెనీలు గణనీయంగానే ఆర్జిస్తున్నాయి. ప్రపంచంలోని రెండో అతి పెద్ద ఆటోమొబైల్ దిగ్గజం టయోటా ఒక సెకనుకు ఎంతమేర ఆర్జిస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం...! చదవండి: నెలకు లక్షల్లో జీతాలు.. నెలాఖరుకు జేబులు ఖాళీ! టెస్లా కంటే..టయోటానే నంబర్ వన్..! టయోటా ఒక సెకనుకు సంపాదన విషయంలో తొలిస్థానంలో నిలుస్తోంది. జపాన్ ఆటోమేకర్ టయోటా ప్రతి సెకనుకు సుమారు 8,731 డాలర్లు(రూ. 6,48,490) మేర ఆర్జిస్తుంది. టయోటా నిమిషానికి 523,889 డాలర్లను , గంటకు 31.4 మిలియన్ డాలర్లను, ఏడాదిగాను 275 బిలియన్ డాలర్లను ఆర్జిస్తోంది. ప్రపంచంలో అతి పెద్ద కార్ల బ్రాండ్‌గా నిలుస్తోన్న ఫోక్స్‌వ్యాగన్ కంటే టయోటా ఎక్కువగా సంపాదిస్తోంది. ఫోక్స్‌వ్యాగన్ ప్రతి సెకనుకు 8,073 డాలర్లను సంపాదిస్తుంది. మూడో స్ధానంలో మెర్సిడిజ్ బెంజ్ నిలుస్తోంది. మెర్సిడెజ్ బెంజ్ కంపెనీ ఒక సెకనుకు 5,589 డాలర్లను వెనకేసుకుంటుంది. తరువాతి స్థానాల్లో హోండా, మిత్సుబిషి , ఫోర్డ్, జనరల్ మోటార్స్, బీఎమ్‌డబ్ల్యూ, స్టెల్లాంటిస్ సంస్థలు నిలుస్తున్నాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే...ప్రపంచంలోని అతిపెద్ద ఆటోమేకర్లలో ఒకటిగా సుజుకీ ఉన్నప్పటికీ టాప్ టెన్‌లో స్థానంలో లేదు. దాంతోపాటుగా ఈవీ రంగంలో తరచుగా హెడ్లైన్ మేకర్‌గా నిలిచే టెస్లా కూడా టాప్ టెన్ లిస్ట్‌లో లేదు. నివేదిక ప్రకారం.. టాప్ టెన్ ఆటోమొబైల్ బ్రాండ్లలో భారతీయ వాహన తయారీదారులు ఎవరూ లేరు. చదవండి: Demand For Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాలపై క్రేజ్ మరి ఇంతగా ఉందా...! -
ఒక్క నిమిషానికి ఈ కంపెనీలు ఎంత సంపాదిస్తున్నాయో తెలుసా?!
నీ నెల జీతం.. నా ఒక్క గంట సంపాదనరా.. ఇలాంటి డైలాగులు సినిమాల్లో చాలా విన్నాం.. కానీ మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? అసలు మన భారతీయ కంపెనీలు ఒక్క నిమిషానికి లేదా ఒక్క గంటకు ఎంత సంపాదిస్తున్నాయి అని.. స్క్రీనర్.ఇన్ వెబ్సైట్ వాడికి వచ్చింది. దాంతో 2021 ఆర్థిక సంవత్సరంలో నేషనల్ స్టాక్ ఎక్చేంజ్లోని టాప్–20 కంపెనీలు(నిమిషానికి సంపాదిస్తున్న లాభం ఆధారంగా) వివరాలు తీసుకుని.. ఈ లెక్కలేసింది. అందరూ ఊహించినట్లే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇందులో మొదటి స్థానంలో నిలిచింది. ఆ వివరాలు ఇవిగో.. చదవండి: వారెన్ బఫెట్ తరువాత మనోడే, ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ -
అమెరికాలో ఇండియన్స్ హవా.. సంపాదనలో సూపర్
అగ్రరాజ్యం అమెరికాలో భారతీయుల హవా కొనసాగుతోంది. ఉన్నత చదువులు, ఉద్యోగాల్లోనే కాదు సంపాదనలోనూ మనోళ్లు దూసుకుపోతున్నారు. న్యూయార్క్ టైమ్స్ తాజా అధ్యయనం ప్రకారం సంపాదనలో అమెరికన్ల కంటే భారతీయులే ముందున్నారు. ఎన్నారైల సగటు వార్షిక ఆదాయం అమెరికన్ల కంటే దాదాపు రెట్టింపు ఉందని తేలింది. అటు జనాభా కూడా పరంగా కూడా భారతీయులు అగ్రరాజ్యంలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నారని తాజాగా వెల్లడైంది. మరిన్ని వివరాలకు ఈ వీడియో చూడండి. -
అమెరికాలో ఆర్జనలో మన వారే టాప్
వాషింగ్టన్: అమెరికాలో భారతీయులు ధనవంతులుగా అవతరించారని అక్కడి తాజా జనాభా గణాంకాల్లో వెల్లడైంది. అక్కడి భారతీయులు సగటున ఏడాదికి దాదాపు రూ.91.76 లక్షలు (1,23,700 డాలర్లు) సంపాదిస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ తన విశ్లేషణలో పేర్కొంది. ఈ మొత్తం అక్కడి అమెరికా జాతీయ సగటు వార్షిక ఆదాయం దాదాపు రూ.47.42లక్షల(63,922 డాలర్ల) కంటే రెట్టింపు ఉండటం విశేషం. మధ్యతరగతి కుటుంబాల ఆర్జనలో అక్కడి ఇతర ఆసియా దేశాల వారితో పోల్చినా భారతీయుల వార్షిక ఆర్జన అధికంగానే ఉంది. తైవాన్ దేశస్తులు దాదాపు రూ.72 లక్షలు(97,129 డాలర్లు), ఫిలిప్పీన్ దేశస్తులు రూ.70.40 లక్షలు(95,000 డాలర్లు) సంపాదిస్తున్నారు. అమెరికన్ కుటుంబాల్లో దాదాపు రూ.29.67లక్షల(40వేల డాలర్ల)లోపు వార్షిక సంపాదన ఉన్న కుటుంబాలు 33 శాతం ఉండగా, కేవలం 14 శాతం భారతీయ కుటుంబాలే అంత తక్కువగా సంపాదిస్తున్నాయి. గత మూడు దశాబ్దాల కాలంలో అమెరికాలో ఆసియన్ల జనాభా ఏకంగా మూడు రెట్లు పెరిగింది. అత్యంత వేగంగా వృద్ధిచెందుతున్న జనాభా ఆసియన్లదే. ప్రస్తుతం అమెరికాలో దాదాపు 40 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో 16 లక్షల మంది వీసాదారులున్నారు. 14 లక్షల మంది గ్రీన్‌కార్డు సంపాదించి శాశ్వత స్థిరనివాస హోదా పొందారు. 40 లక్షల మందిలో దాదాపు 10 లక్షల మంది అక్కడ జన్మించిన వారే ఉండటం గమనార్హం. అమెరికా జనాభాలో సగటున 34 శాతం మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా, అక్కడి భారతీయుల్లో ఏకంగా 79 శాతం మంది పట్టభద్రులు ఉండటం విశేషం. అమెరికాలోనే జన్మించిన ఆసియన్ అమెరికన్ల జనాభాలో యువత సంఖ్య ఎక్కువ. ముఖ్యంగా సగం మంది చిన్నారులే. -
దాస్యభక్తితో తరించిన ధన్యులు
ఎర్రని ఎండ. వయసు అరవై యేళ్లుండొచ్చు. మరాఠా దేశపు స్త్రీల వస్త్రధారణతో నిదానంగా వస్తోందామె. కుడి చేత్తో తన తల మీద బుట్టని పట్టుకుని కనిపిస్తోంది. ఆ బుట్ట పడిపోకుండా తల మీద ఒక తుండుతో (తువ్వాలు) చుట్టచుట్టిన చుట్టకుదురు ఆ బుట్ట కింద ఉంది. ఆ వెదురు బుట్టలో ఒక మంచి నీళ్ల లోటా (కూజా లాంటి రాగి పాత్ర) ఆ పక్కనే కాయగూరలతో వండిన ఓ కూర, దానిపక్కన భాకరీలు(రొట్టెలు, ఈ రోజుల్లో బేకరీ అని పిలుస్తున్నది ఇదే). ఇన్నిటినీ ఎంత కప్పుదామని ప్రయత్నించినా గాలికి ఎగిరిపోతూ ఉన్న తెల్లని వస్త్రం.తల నుండి వస్తున్న స్వేదంతో అటు ఇటు చెంపలు రెండూ దాదాపుగా తడిసిపోయాయి. నుదుటి నుండి కారుతున్న స్వేదానికి పెద్దగా గుండ్రంగా పెట్టిన కుంకుమ జారిపోతూ ఎర్రటి నీళ్లని ముక్కు మీదుగా విడుస్తోంది. గడ్డం మీద త్రిభుజాకారంలో మూడు చుక్కల పచ్చబొట్టుతో ఆమె అలా వస్తోంది. ఆమె ఎంత దూరం నడిచిందో.. ఎలాంటి మార్గంలో నడిచి వస్తోందో తెలియజేస్తూ కంపలతో, పొదలతో, ఎగుడుదిగుడులతో, చూపు సాగినంత దూరపు పొడుగుతో సన్నని పుంత మార్గం కనిపిస్తోంది. ‘ఉష్’మని ఓ మారు నిట్టూర్పు విడుస్తూ ఆమె తన నడకని ఆపి చెట్టు కింద ఉన్న చిన్న రాతి మీద అలా కూర్చుంటూ.. బుట్టని కిందికి దింపి ఆ తలగుడ్డతో ముఖాన్ని తుడుచుకుంటోంది. కానీ.. చూపుని మాత్రం ఎడమవైపుకీ, ముందువైపుకీ, కుడివైపుకీ ప్రసరింపజేస్తూ నిశితంగా చూస్తోంది. ఎవరో తనకి కనిపించవలసి ఉన్నారన్నట్టుగా. నెమలి తాననుకున్న గోడనో చెట్టునో ఎక్కి మధురకంఠ ధ్వనితో క్రీంకారాన్ని చేసినట్టుగా.. తల్లి పక్షి తన పిల్లలకి ఆహారాన్ని తేగలిగాననే ఆనందంతో పిల్లలకి తన రాకని సూచిస్తూ ఆనందంతో అరిచినట్టుగా.. ‘సాయినాథా!’ అని పెద్దగా రెండుమార్లు ఎలుగెత్తి పిలిచింది.అదంతా ఓ అడవి. ఎవరు పలుకుతారు? ఎందుకు పలుకుతారు? నిస్పృహతో మళ్లీ శక్తినంతా కూడగట్టుకుని మళ్లీ పిలిచింది. ‘సాయినాథ్!’ అని. ఏ ప్రతిధ్వనీ లేదు. కొద్దిపాటి నిరుత్సాహంతో ముందు వైపు రెండుపక్కలనీ చూసి ఒక్కమారు వెనుకవైపు కూడా చూద్దామనే ఉద్దేశంతో లేచి నిలబడి వెనుదిరిగింది. అంతే! కొద్ది దూరంలో ఓ పెద్ద గంగరావి చెట్టు. దట్టంగా నీడనిచ్చే చెట్టు అది. దానికింద చదరంగా ఉన్న పరిశుభ్రమైన నేల. అక్కడ కూర్చుని కళ్లు మూసుకుని తపోధ్యానముద్రలో సాయినాథుడు ఆమెకి కనిపించాడు. ‘మూడు మార్లు పిలిచినా, తన పిలుపు వినిపించేంత దూరంలోనే సాయి ఉన్నా పలకడేమిటి?’ అనే వ్యతిరేక భావమే ఆమెకి లేదు.తల్లి ఆవు కనిపిస్తే లేగదూడ ఎలా చెంగుచెంగున దూక్కుంటూ తల్లి వద్దకి వెళ్లిపోతుందో, మండు వేసవిలో అల్లంత దూరంలో చెరువు కనిపిస్తే ఎలా పాంథుడు వేగంగా అక్కడికి వెళ్లిపోతాడో.. అలా ఆమె వెంటనే ఆ తల చుట్టని నెత్తి మీద పెట్టుకుని వెదురుచుట్టని, ఆ పైన పెట్టుకుని, సాయినాథుని దగ్గరికి వెళ్లిపోయింది చరచరా అడుగులేసుకుంటూవెళ్లీ వెళ్లడంతోటే ఆమె బుట్టని దింపి, ఆయన పాదాల మీద తన తలనుంచి భక్తిపూర్వకంగా నమస్కరించింది. సాయినాథుడు తపస్సుని వీడి, కళ్లు తెరిచి ఆమెని చూశాడు. ఈమె కూడా ఆయనని భక్తి పారవశ్యంతో దర్శించింది. మౌన సంభాషణం ఆ ఇద్దరూ మౌనంగా కళ్లతోనే మాట్లాడుకోసాగారు. సాయి ఆమెని చూస్తూ! ‘అమ్మా! నేనా ఓ ఫకీరుని. ఎవరూ నావాళ్లంటూ లేనివాడ్ని. ఏ రోజు ఈ అడవిలో ఎక్కడుంటానో, ఎంతసేపుంటానో నాకే తెలియదు.ఆ ఊరి నుండి ఇన్ని కోసుల దూరం నడిచి ఎందుకమ్మా ఇంత శ్రమ నీకు? పోనీ ఒక రోజా రెండ్రోజులా? ఎంతో కాలం నుండి ఎందుకమ్మా ఈ శారీరక శ్రమ? అయినా ఏ సాయంత్రానికో పోనీ నీ దగ్గరకే రమ్మంటే నా జోలెతో, డబ్బాతో రాకపోయానా?’ అని ఆయన కళ్లతో పలకరించాడు.ఆమె కూడా ఆనందబాష్పాలని విడుస్తూ! ‘సాయినాథా! నువ్వే మాకు (మా కుటుంబానికి) తల్లివి. తండ్రివి. గురువువి. దైవానివీ! నీకు నైవేద్యం పెట్టకుండా మేం ఎలా తినేది? అయినా నువ్వు కనిపిస్తే చాలు ఆ శారీరకశ్రమ, మార్గాయాసం మొత్తం అలా గాలికి మేఘం చెదిరిపోయినట్టుగా అయిపోతుంది. ఇన్నాళ్ల నుండీ వస్తున్నాను కదా! ఎండైనా, వానైనా, చలైనా, మంచైనా నువ్వు నాకు కనిపిస్తూనే ఉన్నావు గాని కనిపించని ఒక్క రోజుందా? భక్తితో మేం ప్రార్థిస్తే అనుగ్రహిస్తావు కాబట్టే ఈ తపనంతా!’ అన్నట్టు చూసింది.ఆ చదరపునేల మీద చక్కగా విస్తరిని వేసింది. 3 భాకరీలని పెట్టింది. పాత్రలోని కూరని వడ్డించింది. పక్కనే మంచినీటి లోటాని పెట్టింది. ఆయన రెండు మాత్రమే తిని లేవబోతూ ఉంటే కొసరికొసరి తినిపించింది. ఇది ఈ రోజునే కాదు. ఏ రోజూ ఇదే సాగుతుంది ఆ ఇద్దరి మధ్యా. సాయి లేచి వెళ్తూ ఉంటే ఆమె మౌనంగా ఆయన్ని అనుసరించింది. ఎంతో దూరం నడిచాక ఊరొచ్చింది. సాయి ఉండే మసీదొచ్చింది. ఆయన లోపలికి వెళ్లిపోయాక ఆమె తన ఇంటికొచ్చింది. ఆమె పేరు బాయిజాబాయ్. ఆమెకి ఎప్పుడైనా చిన్న శారీరకమైన నలతగాని వస్తే ఆమె భర్త వచ్చి సాయిని వెదికి, రొట్టెల్ని తినిపించి మరీ ఇంటికి వెళ్లడమే తప్ప, ఏనాడూ సాయికి నైవేద్యాన్ని సమర్పించని రోజు లేనే లేదు ఆ ఇద్దరికీ.ఓ రోజు సాయి నోరు తెరిచి అడగనే అడిగాడు ఆమెని– ‘అమ్మా! నేను నీకు ఏం చేయగలననీ.. ఏం చేస్తాననీ.. ఈ శ్రమని ఇంతగా పడుతున్నావు? నా బుద్ధికి ఎటు తోస్తే అటుపోయే ఫకీరుని కదా! ఫలాని చోటున నేనుంటానని చెప్తే నువ్వు రావడంలో అర్థముంది గానీ, ఈ అగమ్య, అనూహ్య గమనం (వెళ్లరాని వెళ్లలేని ఊహకి అందని చోటుకి పోవడం) కల నాకు ఈ ఆహారాన్ని తేవడాన్ని ఎవరు చూసినా, విన్నా ఎంత అపహాస్యంగా ఉంటుంది? నేను చక్రవర్తితో సమాన భోగాలు కలవాడ్ని. మహా ఐశ్వర్యవంతుడ్ని. నన్ను ఈ లోకానికి పంపిన నా అల్లా నాకు తిండి లేకుండా చేస్తాడా? వద్దమ్మా! నా తిండి నేను చూసుకుంటాను. ఎందుకు రావడం?’ అని. ఆమె దుఃఖబాష్పాలని విడుస్తూ ‘సాయీశ్వరా! నువ్వు తిననిదే నేనెలా తినేది?’ అంది హృదయపూర్వకంగా. ఇక ఒప్పుకోక తప్పలేదు సాయికి.ఆ రోజు రాత్రి మసీదులో పడుకుని తీవ్రంగా ఆలోచించి ‘ఆ తపస్సునేదో ఈ మసీదులోనే చేసుకుంటూ ఉంటే ఆమెకీ, కుటుంబానికీ శ్రమ లేకుండా చేయగలుగుతాను’ అనుకుంటూ గ్రామంలోనే ఉండసాగాడు. బాయిజాబాయ్ అక్కడికే భాకరీలని తీసుకెళ్తూ, తినిపిస్తూ ఉండేది. సాయినాథుడు అన్నాడు గదా! –‘అమ్మా! రుణగ్రస్తుడ్ని కావడం ఇష్టంలేదమ్మా! నీ పుత్రుడైన తాత్యా యోగక్షేమాలని నిరంతరం నేనే చూసుకుంటూ ఉంటాను’ అని. దాంతో ఆమెకి చెప్పలేని సంతోషం కలిగింది. ఆమెకీ ఆమె కుటుంబం మొత్తానికీ దైవమంటూ మరొకడు లేడు. అంతా సాయినాథుడే! అంతటి తాదాత్మ్య స్థితిలో ఆమె దాస్యాన్ని చేస్తూ ఉండేది. లోకంలో దాస్యమనగానే – గురువులకి కాళ్లు పట్టడం, మడమలు నొక్కడం, నూనెని ఒంటికి పట్టించి మర్దన చేయడం, నలుగు పెట్టి, కుంకుడు పులుసుతో తలస్నానాన్ని చేయించడం.. వంటి ఇవన్నీ గుర్తుకొస్తుంటాయి సాధారణంగా. నిజానికి దాస్యమంటే అది కానేకాదు. దాస్యమంటే...?‘దాసస్య భావః దాస్యమ్’ అంటుంది సంస్కృత వ్యాకరణం. కొద్దిగా దీన్ని వివరించుకోవాలి. ‘దాస్యాన్ని చేసేవాడు’ అనే అర్థంలో ‘సేవకుడు భృత్యుడు దాసుడు దూత కార్మికుడు’ అని ఇన్ని పదాలున్నాయి గానీ వేటి అర్థం వాటిదే.సేవకుడు అంటే ఏ పనికోసం (సేవ) మనం అతడ్ని నియమించుకున్నామో ఆ పనిని మాత్రమే నిత్యం చేసే లక్షణమున్నవాడని అర్థం. తోటపనికి నియమించుకుంటే ‘ఉద్యానవన సేవకుడు’.... ఇలా అన్నమాట.ఇక భృత్యుడంటే మరో అర్థముంది. ‘నెలసరి జీతాన్ని (భృతి) తీసుకుంటూ పని చేసేలక్షణమున్నవాడు’ అని అర్థం. ‘భృpŠ‡ఛరణ్’ అనే ధాతువు మీద ఏర్పడిన పదం అది కాబట్టి భృత్యుడంటే తన కుటుంబాన్ని పోషించుకునేందుకు జీతాన్ని తీసుకుని పని చేసే వాడవుతాడన్నమాట.పైన చెప్పుకున్న సేవకుడు కూడా జీతాన్ని తీసుకుంటూనే పని చేస్తున్నాడు కాబట్టి ఈ భృత్యుడూ సేవకుడూ ఒకరే అవుతారు కదా! అనుకోకూడదు. సేవకుడు అంటే తనకి ఏ పనిలో నైపుణ్యముందో ఉదాహరణకి పూలతో మాలల్ని కట్టడం, మట్టితో కుండల్ని చేయడం, వాటికి రంగులని అద్ది అందమైన అరివాణపు కుండలుగా అందించడం, పందిళ్లని నిర్మించడం, తాటాకులని విసనకర్రలుగాచేయడం... వంటివి – ఆ సేవని (పనిని) భగవంతుని విషయంలో కృతజ్ఞతని ఘటిస్తూ చేసేవాడన్నమాట. అందుకే ఇప్పటికీ ‘ఆ సేవ మాది, ఈ సేవ వాళ్లది’ అనే మాటలు వినబడుతూఉంటాయి. ఆ తనకి నైపుణ్యమున్న సేవ(కర్మ–పని)ని మాత్రమే చేసేవాడు సేవకుడు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో గుడిని శుభ్రం చేయడం, ప్రతి రెండేళ్లకీ గుడికి రంగులు వేయడం, రథాన్ని లాగేవ్యయాన్ని భరించడం వంటివాటిని సేవలుగానే భావిస్తూ, ఉచితంగా, వంశవంశపారంపర్యంగా చేస్తున్నవాళ్లెందరో ఉన్నారు. సరే! ఆ మీదటి వాడు ‘దూత’ ‘స్యాత్సందేశహరో దూతః’ దైవానికి ఫలాన రోజు నుండి ఫలాన రోజు వరకూ ఉత్సవాలు సాగుతాయంటూ ఈ ఊరూ పొరుగూళ్లలో కూడా ఆ వార్తని చాటింపువేసే పనిని చేసేవాడు.అతనికి కొత్తమాటని చేర్చి చెప్పే హక్కు లేదు. ఇతడూ భృత్యుడే. కొంత పారితోషికాన్ని తీసుకుని ఆ పనిని చేసేవాడే.కార్మికుడనేది చివరిమాట. ‘కర్మ కరోతీతి కార్మికః’ ఏ పని బడితే ఆ పనిని చేయడానికి సిద్ధంగా ఉండేవాడని దానర్థం ఇతడూ భృత్యుడే.ఇదంతా ఎందుకంటే ‘దాసుడు’ అనే మాటకున్న గట్టి దనాన్నీ లోతునీ అర్థం చేసుకునేందుకు అర్థం చేసేందుకున్నూ. ఏం అపేక్షించకుండా ఆ చెప్పబడిన పనిని నిస్వార్థంగా తనంత తాను ప్రాణాలకి తెగించి కూడా చేయడానికి సిద్ధమయ్యేవాడు దానుడు. ఆంజనేయుడు దాసలక్షణం కలవాడు. సీతమ్మ గానీ రాముడు గానీ తనకి బంధువులు మిత్రులు ఆప్తులు కానేకాదు. అయితే ఎక్కడెక్కడో ఆ దంపతులు వేర్వేరు స్థలాల్లో ఉంటూ ఒకరినొకరు నిరంతరం స్మరించుకుంటూ ఎప్పటికైనా కలుసుకుంటామనే మనో ధైర్యంతో జీవిస్తున్నారనే బుద్ధితో ఆ ఇద్దరినీ ఒకచోటికి నిస్వార్థంగా చేరాలనే పవిత్రాశతో కార్యానికి నడుం బిగించిన ఆంజనేయుడు ‘దాసుడు’. అంతేకాదు. 24 వేల శ్లోకాల శ్రీమద్రామాయణంలో రావణవధ అయ్యాక పట్టాభిషేకం జరిగే వేళ కూడా నేనే ఆ ఇద్దరినీ కలిపినవాడినంటూ ఒక్క మాటని ఎవరితోనూ అని ఉండలేదు. అంత గుప్తంగా నిస్వార్థంగా సేవ చేసేవాడ్ని దాసుడనాలంది శాస్త్రం. బాయిజాబాయ్ సాయికథలో కూడా బాయిజాబాయ్ ఏనాడూ తానిలా చేస్తున్నానని గానీ, ఇంత దూరం అడవిలో సాయి ఎక్కడుంటాడో తెలియని చోటుకి వెళ్తున్నానని గాని, రోజూ భాకరీనీ కూరనీ తానే తీసుకెళ్తున్నానని గాని ఎప్పుడూ ఎక్కడా ప్రకటించనూ లేదు. ప్రతిఫలంగా సాయినాథుని నుండి దేన్నీ ఆశించి ఉండనూ లేదు... తీసుకోనూ లేదు. అదీ దాస్యలక్షణమంటే.మరో విశేషం కూడా ఇక్కడుంది. ఏదో తనకున్న దాస్యభక్తితో తానొక్కతే ఆ నిత్యకృత్యాన్ని చేస్తూ ఉండటం కాకుండా సాయినాథుని గొప్పదనాన్ని తన భర్తకీ సంతానమైన తాత్యాకి కూడా చెప్పి తాను చేస్తున్న దాస్యానికి అడ్డుపడకుండానూ ప్రోత్సహించేలాగునా కూడా చేయడమనేది నిజమైన దాస్యభక్తికి ఉదాహరణం. ఆంజనేయుడు కూడా శ్రీమద్రామాయణంలో తనని మింగడానికి సిద్ధపడుతున్న సురమతో రాముని కథని సూక్ష్మంగా చెప్పి ఆ ఇద్దరినీ కలపడం చేస్తే నీకూ మంచి జరుగుతుందన్నాడు. అంతేకాదు. ఆ ఇద్దరూ కలిసిన పక్షంలో తానే స్వయంగా ఆ సురమకి ఆహారంగా కూడా అవుతానన్నాడు(సత్యం ప్రతి శృణోమి తే!) ఆ మాటని ఒట్టుగా భావించవలసిందన్నాడు కూడా. ఎవరో తెలియని ఆ ఇద్దరి ఏకత్వం కోసం తన ప్రాణాల్ని పణంగా పెట్టడమనేది నిజమైన దాస్యభక్తి కాదూ మరీ! ఇంత దాస్యాన్ని సాయిపట్ల చూపింది బాయిజాబాయ్ ప్రతిరోజూ అనేక క్రూరజంతువులుండ వీలైన అడవికి ఒంటరిగా వెళ్తూ.కాలం మారాక బుద్ధులు చెదిరాక ‘దాస్యం’ అంటే వెట్టి చాకిరీగా భావిస్తున్నారు. అది సరికాదు. తాత్యాబాజాయ్ ఆమె భర్తా ఇలా తాము చేయగలిగిన ఆ శక్తికి తగినట్లు సాయికి ఆహారాన్ని సమర్పించుకుంటూ ఒకరి వెనుక ఒకరు కన్ను మూస్తే సాయి పెద్దపెట్టున రోదిస్తూ తానొక్కడే మసీదులోకి వెళ్లిపోయి తననెవరూ చూడటానికి అనుమతించడం లేదన్నట్లు పరదాని (కర్టెన్) వేసేసుకున్నాడు.ఆ మరుసటి రోజునుండే తల్లిదండ్రుల బాటలో పయనిస్తూ తాత్యా ఆ ఆహార సమర్పణాన్ని చేస్తూ వచ్చాడు. ఇప్పటికి కూడా గ్రామాల్లో దైవానికి అటూ ఇటూ నిలబడి కాగడాలని ఉత్సవాలకాలంలో పట్టడమనేది ఒక వంశానికి మాత్రమే చెంది ఉండి కనిపిస్తూ ఉంటుంది. అయితే నేడు మాత్రం ఇది వంశపారం పర్య హక్కుకల ఉద్యోగంగా మారి ఆ దాస్యం దానిలో అర్థం మొత్తమంతా గాలికి కొట్టుకుపోయింది. సరే! దాస స్వీకారం బాయిజాబాయ్ ఇలా తనని సేవిస్తూ ఉండేది కాగా, భాగోజీ అనే భక్తుడు నిరంతరం సాయికి గొడుగుని పడుతూ ఉండేవాడు. ‘భాగోజీ! ఎంతదూరం నేను వెళ్తూ ఉంటే అంతదూరమూ ఇలా పట్టడం ఎందుకు? శ్రమని మానెయ్’ అన్నప్పటికీ విడిచేవాడు కాదు. ఇంతవరకూ సరే.దురదృష్టవశాత్తూ భాగోజీకి కుష్టు వ్యాధి సోకింది. చీముతో రక్తంతో తెల్లని అదో దుర్వాసన ద్రవంతో అతని కాళ్ల వేళ్లూ చేతి వేళ్లూ చూడ్డానికి జుగుప్సాకరంగా ఉండేవి. భాగోజీకి మాత్రం సాయికి దాస్యాన్ని చేయాలనే తపన గట్టిగా ఉండేది కాని ఈ వ్యాధి కారణంగా సాయి సమీపానికి వెళ్లే సాహసాన్ని చేయలేదు. వెంటనే సాయి కబురు చేసి భాగోజీని పిలిచి ‘ఏమయింది? నీ పని నువ్వు కానీ!’ అన్నట్లు చూశాడు. అంతే!సాయి లెండీ తోటకి రావడమేమిటి? సాయికి ఒకసారి ధునిలో ఎగసిపడుతున్న మంటకి చేయికాలితే (ఒక పాప రక్షణకోసం అలా జరిగింది. ఆ కథ మరోసారి) ఆ చేతి కట్లని విప్పి నూనె రాసి మర్దన చేసి ఆకు పసరు వేసి చేతిపై పూసి మళ్లీ కట్టుని కడుతూ ఉండేవాడు. ఇక్కడ భాగోజీ దాస్యభక్తి కంటే దారుణమైన కుష్టు వ్యాధి పీడితుడ్ని దాసునిగా పరిగణిస్తూ అతని దాస్యభక్తిని తాను స్వీకరించడం ఎంత గొప్ప! అలా సాయి దాస్య సేవలోనే తరించాడు భాగోజీ. అంతటి గొప్పది దాస్యభక్తి. అంత గొప్పవాళ్లు తరించిన ఆ ఇద్దరు భక్తులూను. పైవారం – సాయి చేసి వేదాంతబోధ! (సాయికి తెలిసిన హిందూ సంప్రదాయాలు) - డా. మైలవరపు శ్రీనివాసరావు -
ప్రియా ప్రకాశ్ ఒక్క పోస్ట్ సంపాదనెంతో తెలుసా?
ఒక్క సీన్‌తో కుర్రకారును ఫ్లాట్ చేసిన కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్ సోషల్ మీడియా వేదికగా ఎంత సంపాదిస్తుందో తెలిస్తే షాక్ అవుతారు. ఓవర్ నైట్ స్టార్‌గా మారిన ఈ మళయాల భామ.. ఒక్క పోస్టుకు ఏకంగా రూ.8 లక్షలు ఆర్జిస్తోంది. ఇక సోషల్‌మీడియాలో ఆమెను అనుసరించేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ఇంటర్నెట్లో నిత్యం బాలీవుడ్ భామలు సన్నీలియోన్ ,దీపికా పదుకునే అంటూ ఫన్నీ కలలుకనే నెటిజన్లు.. ఇప్పుడు ప్రియా ప్రకాశ్ జపం చేస్తున్నారు. ఈ క్రేజ్‌ను క్యాచ్ చేసుకోవాలని భావించిన ఈ అమ్మడు ఒక్క పోస్టుకు 8 లక్షలు డిమాండ్ చేస్తోందని ఓ జాతీయ చానెల్ పేర్కొంది. ఇక ప్రియా ఇన్‌స్టాగ్రామ్‌లో 24 గంటల వ్యవధిలోనే 6 లక్షల 6 వేల మంది ఫాలోవర్స్‌తో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో అమెరికన్ టీవీ స్టార్, మోడల్ కైలీ జెన్నర్ (8 లక్షల 6 వేలు), ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో (6 లక్షల 50 వేలు) తర్వాత ప్రియానే కావడం విశేషం. ఇక ఫొటో-వీడియో షేరింగ్ యాప్‌లో ప్రియాను అనుసరించే వారి సంఖ్య ఏకంగా యాబై లక్షలకు చేరింది. ఒరు ఆధార్ లవ్ చిత్రంలోని ‘మాణిక్య మలరయ పూవీ’ పాట ఎంతో పాపులర్ అయిందో తెలిసిన విషయమే. ఈ పాటకు సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఫిదా అయ్యారు. మార్చి5నే విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాలతో వాయిదా పడింది. ఇద్దరి స్కూల్ విద్యార్థుల మధ్య నడిచే ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్ర టీజర్ ఇప్పటికే విశేష స్పందన రాబట్టుకుంది. ఈ మూవీని తెలుగులోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
వర్మీ కంపోస్ట్ యూనిట్లతో పంచాయతీలకు ఆదాయం
కరప (కాకినాడ రూరల్) : గ్రామాల్లో వర్మీ కంపోస్ట్ (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్)యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే చెత్త సమస్య పరిష్కారమవ్వడమే కాకుండా పంచాయతీలకు ఆదాయం సమకూరుతుందని జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం రీసోర్స్ పర్స¯ŒS ఎ.రవిశంకర్ సూచించారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో బుధవారం ఆయన మండల గ్రామకార్యదర్శులతో సమావేశమై వర్మీ కంపోస్ట్ యూనిట్ల నిర్మాణంపై అవగాహన కల్పించారు. యూనిట్ నిర్మాణానికి ఉపాధి నిధులు రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షలు మంజూరు చేస్తామన్నారు. జిల్లాలోని వివిధ మండలాల్లో 100 వర్మీ కంపోస్ట్ యూనిట్లు నిర్మాణలో ఉన్నాయని ఆయన తెలిపారు. కరపలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రతి మండలానికి 5 యూనిట్లు నిర్మిస్తామన్నారు. 42 యూనిట్లు పూర్తికాగా 40 యూనిట్లు పనిచేస్తున్నాయన్నారు. ఇంతవరకు వర్మీకంపోస్ట్ యూనిట్ల ద్వారా 35 టన్నుల సేంద్రియ ఎరువు తయారైందన్నారు. ఒక టన్ను సేంద్రియ ఎరువు అమ్మితే రూ.8 వేలు వస్తుందన్నారు. గ్రామంలో చెత్త సేకరణకు హరిత రాయబారుల (ఉపాధి కూలీల)ను నియమిస్తామని చెప్పారు. వెయ్యి జనాభాకు ఒక హరిత రాయబారి ఉంటారన్నారు. ఇ¯ŒSచార్జ్ ఎంపీడీఓ గుత్తుల భీమశంకరరావు, ఈఓపీఆర్డీ సీహెచ్ వెంకటబాలాజీ, ఎఫ్డీసీ టి.రవికాంత్ పాల్గొన్నారు. -
లక్కు.. ట్రిక్కు!
కర్నూలులో జోరుగా లక్కీ డిప్ అనంతపురం నుంచి జిల్లాలోకి దుకాణం పైసా పెట్టుబడి లేకుండా కోటిన్నర సంపాదన పోలీసులు, స్థానిక నాయకుల అండదండలు నిలువునా మోసపోతున్న పేదలు ఖరీదైన వస్తువులతో కూడిన బ్రోచర్.. అరచేతిలో వైకుంఠం చూపించే ప్రచారం.. పేదలు, కూలీలు లక్ష్యంగా పైసా పెట్టుబడి లేని వ్యాపారం.. స్థానిక నేతలు, పోలీసుల అండదండలు.. జిల్లాలో లక్కీ డిప్ వ్యాపారం అడ్డూఅదుపు లేకుండా సాగిపోతోంది. అనుమతి లేకపోయినా.. అడ్డంగా దోచుకుంటున్నా.. అడిగే నాథుడే కరువు. ఒకరికో.. ఇద్దరికో తప్పిస్తే.. అధిక శాతం సభ్యులకు మిగిలేది డిన్నర్ సెట్లు, మంచాలు, బీరువాలే. ఈ మొత్తం వ్యవహారంలో నిర్వాహకులు వెనకేసుకుంటున్న మొత్తం ఏకంగా రూ.కోటిన్నర. లక్కంటే వీరిదే మరి. సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలో నిషేధిత లక్కీడీప్ మొదలయింది. అధికార పార్టీ నేతలు, స్థానిక పోలీసుల అండదండలతో ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ప్రజల అత్యాశను ఆసరా చేసుకుని రూ.6 వేలకే కారు, బైకు అని ఊరిస్తూ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. వాస్తవానికి అనంతపురం జిల్లాలో దుకాణం బంద్ కాగా.. జిల్లాలో ఈ లక్కీడీప్ దుకాణం తెరిచినట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో రూ.3 కోట్ల మేరకు వసూలు చేస్తున్న నిర్వాహకులు లక్కీ డీప్ బహుమతుల కోసం కేవలం కోటి రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. మిగిలిన రూ.2 కోట్లలో రూ.50 లక్షల వరకు మాముళ్ల కోసం ఖర్చు చేస్తుండగా.. మిగిలిన కోటిన్నర సొమ్మును జేబులో వేసుకుంటున్నారు. లక్కీడీప్ను పోలీసులు చూసీచూడనట్టు వదిలేస్తుండటంతో వీరి వ్యాపారానికి అడ్డేలేకుండా పోయింది. లక్కీ డిప్ ఎలా నిర్వహిస్తారంటే.. ఒక్కో లక్కీడిప్‌లో సుమారుగా 5 వేల మంది సభ్యులు ఉంటారు. ఒక్కో సభ్యుడు నెలకు రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది. అంటే నెలకు రూ.50 లక్షలు అవుతుందన్నమాట. ఈ విధంగాా ఆరు నెలల పాటు సభ్యుల నుంచి ఏకంగా రూ.3 కోట్లు వసూలవుతుంది. ప్రతి నెలా సభ్యులందరినీ సమావేశపరిచి.. లక్కీడీప్ తీస్తారు. ఇందులో మొదటి 50 మందికి బహుమతులను అందజేస్తారు. ఈ విధంగా 5 నెలల పాటు మొత్తం 250 మందికి బహుమతులను అందజేస్తారు. ఇందులోనూ సుమారు 10 మందికి ఖరీదైన కార్లు, బైకులు, టీవీలు వంటి బహుమతులను అందజేస్తారు. ఇక మిగిలిన సభ్యులకు కన్సొలేషన్ బహుమతుల కింద డిన్నర్ సెట్లు, మంచాలు, బీరువాలు కట్టబెడతారు. మొత్తంగా వీటన్నింటికీ కలిపి అయ్యే ఖర్చు కేవలం కోటిన్నర మాత్రమే. అంటే ఈ వ్యాపారంలో ఏకంగా పైసా పెట్టుబడి లేకుండా కోటిన్నర సంపాదిస్తున్నారన్నమాట. పోలీసులు, అధికారపార్టీ నేతల అండతోనే.. లక్కీడిప్ కేంద్రాలు పోలీసులు, అధికారపార్టీనేతల కనుసన్నల్లోనే సాగుతున్నాయి. జిల్లాలో ప్రధానంగా ఎమ్మిగనూరు, బనగానపల్లె, పత్తికొండ, డోన్ నియోజకవర్గాల్లో ఈ దందా జోరుగా సాగుతోంది. ఈ లక్కీడీప్ నిర్వాహకులకు అటు అధికార పార్టీ నేతలతో పాటు ఇటు పోలీసుల అండదండలు ఉంటున్నాయి. ఫలితంగా వీరు తమ వ్యాపారాన్ని దర్జాగా నిర్వ హిస్తున్నారు. ఈ నేపథ్యంలో కష్టపడి కూలీనాలీ చేసుకున్న డబ్బులు కాస్తా పేదలు ఆశకు లోనై లక్కీడీప్ వ్యాపారంలో కోల్పోతున్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో ఒక లక్కీడీప్ నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నా.. పూర్తి స్థాయిలో అడ్డుకట్ట పడకపోవడం గమనార్హం. ఇక మిగిలిన ప్రాంతాల్లో పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
కాలేజీ కుర్రకారుకు ‘ఆప్స్’ మిత్రులు!
ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే రకరకాల ‘సెట్’లలో మంచి ర్యాంకు సాధించి, కోరుకున్న కాలేజీలో అడుగుపెడుతుంటారు విద్యార్థులు. చేరిన కోర్సు ఏదైనా, క్యాంపస్‌లో అడుగుపెట్టిన విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలంటే సబ్జెక్టు పరిజ్ఞానంతో పాటు మరెన్నో నైపుణ్యాలను అలవరచుకోవాలి. వీటితో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ, రోజువారీ ఖర్చులపై నియంత్రణ వంటివీ అవసరమే! ఇంటికి దూరంగా హాస్టళ్లలో ఉండి చదువుకునే వారు ఇలాంటి విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు రకరకాల మొబైల్ అప్లికేషన్స్ (ఆప్స్) చేదోడువాదోడుగా నిలుస్తున్నాయి. ఆప్తమిత్రులుగా మారుతున్నాయి.. ఒకప్పుడు మొబైల్ అంటే మాట ముచ్చట్లకే! కానీ, ఇప్పుడది ‘స్మార్ట్ ఫోన్’గా ముస్తాబై భిన్న అవసరాలను తీరుస్తూ యువత మనసులో చోటుసంపాదిస్తోంది. మొబైల్ ఫోన్లతో మైత్రీ బంధం పెంచుకొని, కాలేజీ విద్యార్థులకు ఉపయోగపడే రకరకాల మొబైల్ ఆప్స్ అందుబాటులోకి వస్తున్నాయి.. మన పీఏ.. మన చేతిలో.. రోజులో ఏ సమయానికి ఏది చదవాలి? తరగతిలో ఏ రోజు ఏం చెప్పారు? ఏ రోజు ఎక్కడికెళ్లాలి? రికార్డు రూపకల్పనకు అవసరమైన సరంజామా ఏమిటి? అవి ఎక్కడ దొరుకుతాయి? ఇలా రకరకాల పనుల్లో సహకరించి, విద్యార్థి జీవితం సాఫీగా సాగిపోవడానికి ఉపకరించే ఆప్స్ మార్కెట్లో చాలానే అందుబాటులో ఉన్నాయి. ఇవి విద్యార్థికి వ్యక్తిగత సహాయకులుగా సేవలందిస్తున్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు, అవసరమైన సేవలు పొందేందుకు ఉపయోగపడుతున్నాయి. మచ్చుకు కొన్ని ఆప్స్: Everynote, Colornote, Fancy Hands, Springpad. నైపుణ్యాలు పెంచుకో! కాలేజీ నుంచి బయటికొచ్చిన తర్వాత కెరీర్లో సుస్థిర స్థానం సంపాదించడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం. అకడమిక్ స్కిల్స్ బాగున్నా.. సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే కెరీర్లో వెనక వరుసలో ఉండాల్సి వస్తుంది. ప్రస్తుతం కమ్యూనికేషన్లో ఆంగ్ల భాష కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో ఎప్పటికప్పుడు కొత్త ఆంగ్ల పదాలను నేర్చుకుంటూ, పద సంపదపై పట్టు సాధించేందుకు ఉపయోగపడే అనేక ఆప్స్ అందుబాటులో వచ్చాయి. వీటితో పాటు ఉద్యోగ నియామకాల పరీక్షల్లో కీలక విభాగమైన రీజనింగ్‌ను ఒంటబట్టించుకునేందుకు ఉపయోగపడే ఆప్స్ కూడా ఉన్నాయి. Ex: Vocab Pro, Logical Test, Easy Vocab, Reasoning Refresher. ఖర్చులకు కళ్లెం! పైసా సంపాదించడం కంటే దాన్ని ఎలా వినియోగిం చారన్న దానిపైనే ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. మనీ మేనేజ్మెంట్ సక్రమంగా లేకుంటే జీవితంలో పైకి ఎదగలేం! సంపాదన ఎంత? ఖర్చు చేస్తున్నది ఎంత? వీటి మధ్య సమన్వయం చాలా ముఖ్యం. సంపాదనకు, ఖర్చులకు పొంతన కుదిరేలా సరైన ప్రణాళికను రూపొందించుకునేందుకు ఉపయోగపడే ఆప్స్ చాలానే ఉన్నాయి. ఇవి అందుబాటులో ఉన్న డబ్బు; బట్టలు, ఆహారం, ప్రయాణం.. ఇలా రోజువారీ అవసరాలకు ఖర్చయ్యే మొత్తం, మిగి లిన మొత్తం.. తదితర వివరాలను సంగ్రహ పరి చేందుకు ఉపకరిస్తాయి. గ్రాఫ్స్ రూపంలో తేలి గ్గా అర్థమయ్యేలా చూపించి బడ్జెట్‌ను రూపొందించుకునేందుకు ఉపయోగపడతాయి. Ex: Track My Budget, My Budget Book, Pocket Budget సామాజిక అనుసంధానత విద్యార్థులకు ఉపయోగపడే సామాజిక అనుసంధాన అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. ఇవి బంధువులు, స్నేహితులతో టచ్‌లో ఉండటానికి ఉపయో గపడతాయి. వాయిస్ కాల్స్, వీడియో కాల్స్‌తో పాటు టెక్ట్స్ మెసేజ్‌లు, ఫొటోలు పంపించేందుకు ఉపయోగపడతాయి. ఉదాహరణకు హైదరాబాద్‌లో ఉన్న ఓ ఐటీ విద్యార్థి ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు సందే హం తలెత్తితే ఢిల్లీలోని తన స్నేహితుడితో చాటింగ్ చేస్తూ నివృత్తి చేసుకోవచ్చు. ఇలాంటి చాలా ఉపయోగాలుంటాయి. Ex: Viber, Whatsapp, Hike, Skype, Wechat ఆరోగ్యమే మహా భాగ్యం పుస్తకాల ముందు కూర్చొని, గంటల తరబడి పూర్తిగా వాటికే అతుక్కుపోవడం వల్ల లాభం లేదు. రాత్రీపగలూ కష్టపడి చదివిన ఓ విద్యార్థి తీరా పరీక్షల సమయానికి అనారోగ్యానికి గురైతే పరిస్థితి? అందుకే విద్యార్థులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఈ నేపథ్యంలో ఆరోగ్యంగా ఉండటానికి సహకరించే ఆప్స్ చాలానే ఉన్నాయి. ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషించేది పౌష్టికాహారం. తీసుకునే ఆహారంలో కేలరీలు, వ్యాయామం చేసిన సమయం, ఖర్చయిన కేలరీలు, నడిచిన దూరం.. ఇలాంటి విలువైన సమాచారాన్ని నిక్షిప్తం చేసుకొని, విశ్లేషించి చూపే ఆప్స్ ఉన్నాయి. Ex: Map My Fitness, Calorie Counter, Cardio Trainer, Slice it. మొబైలే.. విద్యార్థులకు హ్యాండ్‌బుక్! శ్రీప్రపంచీకరణ నేపథ్యంలో సెల్‌ఫోన్ లేని జీవితాన్ని ఊహించడం కష్టమే. గతంలో సంభాషణకు మాత్రమే వినియోగించే మొబైల్ ఇప్పుడు స్టూడెంట్ కరదీపికగా మారుతోంది. పాటలు, ఆటలతో ఆగిపోకుండా విద్యార్థులకూ హ్యాండ్‌బుక్‌గా పనిచేస్తోంది. ఎన్నో ఎడ్యుకేషన్ అప్లికేషన్లు నిక్షిప్తం చేసుకుని విద్యార్థి లోకానికి విశేష సేవలందిస్తోంది. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ ఆప్‌స్టోర్ తదితర ఆన్లైన్ స్టోర్లలో వివిధ రకాల ఆప్స్ కొలువుదీరాయి. క్విజ్ లు, మాక్‌టెస్ట్‌లు, డిక్షనరీలు, స్పోకెన్ ఇంగ్లిష్, గ్రామర్ లెర్నింగ్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్‌తోపాటు సాధారణ పోటీ పరీక్షల మెటీరియల్ నుంచి యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ వరకు స్టడీ మెటీరియల్స్ పొందుపర్చిన అప్లికేషన్ల్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. సీ, సీ++, జావా తదితర ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లెర్నింగ్‌కు కూడా ప్రత్యేక ఆప్‌లు వెలిశాయి. స్టడీ మెటీరియల్‌కు సంబంధించి ప్రధానంగా మూడు రకాల కంటెంట్ అందుబాటులో ఉంటుంది. అవి... టెక్ట్స్‌వల్, ఆడియో, వీడియో కంటెంట్. టెక్ట్స్‌వల్ మెటీరియల్ పొందుపర్చిన అప్లికేషన్ల ద్వారా పుస్తకాల్లో చూసినట్లుగా చదువుకోవచ్చు. ప్రొఫెసర్లు బోధించే పాఠాలను రికార్డ్ చేసి వాటిని ఆడియో రూపంలో అందించే ఆప్స్ కూడా ఉన్నాయి. అలాగే రికార్డెడ్ వీడియో లెక్చర్స్, ఆన్లైన్ లెక్చర్స్‌ను కూడా కొన్ని ఆప్స్ అందిస్తున్నాయి. ఎంసెట్ తదితర ప్రవేశ పరీక్షలకు సంబంధించిన మాక్ టెస్ట్‌లకు కూడా ప్రత్యేక అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. నిర్దిష్ట ప్రశ్నలతో పరీక్షలు రాస్తూ తప్పుగా సమాధానాలు రాసిన ప్రశ్నలకు అక్కడికక్కడే వివరణలు పొందొచ్చు. కొన్ని సంస్థలు మొబైల్ విధానంలోనూ ప్రాక్టీస్ కోసం ఆన్లైన్ పరీక్షలను నిర్వహిస్తున్నాయ్ణి - బి.వంశీకృష్ణారెడ్డి, సీఈఓ, బ్రేవ్మౌంట్ ఐటీ సొల్యూషన్స్, హైదరాబాద్