YouTuber Gaurav Taneja మలేషియాకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థకు మాజీ పైలట్ గౌరవ్ తనేజా మరోసారి వార్తల్లో నిలిచాడు. మెట్రో రైల్లో పుట్టిన రోజు వేడుకలు జరిపిన బుక్కైన యూట్యూబర్ గౌరవ్ తనేజా గుర్తున్నాడా? యూట్యూబ్‌లో ఫ్లైయింగ్ బీస్ట్‌గా ఫిట్‌నెస్ పాఠాలు చెప్పే యూ ట్యూబర్ గౌరవ్ తన సంపాదన ఎంతో ఫ్యాన్స్‌కి చెప్పేశాడు. అంతేకాదు తన పాత సీఈవోతోపోలిస్తే సంపాదనలో కింగ్‌ని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఒకపుడు తనను తొలగించిన ఏయిర్ ఏసియా సీఈవో కంటే ఇపుడు తన సంపాదేన ఎక్కువ అంటూ ఇటీవల ఇన్‌ఫ్లుయెన్సర్ రాజ్ షమానీ హోస్ట్ చేసిన పోడ్‌కాస్ట్ సందర్భంగా వెల్లడించారు. బ్రాండ్ డీల్స్, యాడ్స్ ఆదాయం గురించి చెప్పమని అడిగినపుడు ఈ వ్యాఖ్యలు చేశాడు. గౌరవ్ మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చాడు. నిర్దిష్టంగా ఇంత అనీ సంపాదన వివరాలు బహిరంగంగా వెల్లడించలేదు. కానీ ఎయిర్ ఏసియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్ మిలియన్ డాలర్ల ఆస్తులను గుర్తుచేసుకుని తనేజా ఫ్యాన్స్ మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. అదీ సీఈవో టోనీ లింక్డ్‌ఇన్ పోస్ట్‌తో విమర్శల పాలైన తరువాత కంపెనీ మాజీ పైలట్ వ్యాఖ్యలు వెలుగులోకి రావడంతో మరింత వైరల్‌గా మారాయి.
ఇంతకీ ఎవరీ గౌరవ్ తనేజా
♦ 2008లో ఐఐటీ ఖరగ్‌పూర్ పట్టభద్రుడైన గౌరవ్ తనేజా "సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్, ప్రొఫెషనల్ బాడీబిల్డర్ , ఏవియేటర్ కూడా.
♦ ఇపుడు ఢిల్లీ యూనివర్శిటీనుంచి ఎల్‌ఎల్‌బీ చేస్తున్నాడు.
♦ మరో పైలట్ రీతూ రథీతో వివాహం. వీరికి ఇద్దరు కుమార్తెలు .
♦ భద్రతా సమస్యల్ని గురించిన మాట్లాడినందుకే తనను ఎయిర్ ఏసియానుంచి తొలగించారనేది గౌరవ్ వాదన.
♦ ఫ్లైయింగ్ బీస్ట్ కంటే ముందే 2016లో FitMuscle TVని లాంచ్ చేశాడు. దీనికి దాదాపు 30 లక్షల సబ్ స్క్రైబర్లున్నారు. ఇక 2020లో లాంచ్ చేసిన రాస్బరీ కే పాపాకి 12 లక్షలకు పైగా సబ్ స్క్రైబర్లున్నారు
I was terminated from airasia for raising safety issues!
— Gaurav Taneja (@flyingbeast320) June 28, 2020
Now, the same issues are raised by #DGCA to @AirAsiaIndian. Justice will prevail! #Sabkeliye
కాగా 2020జూన్‌లో AirAsia ఇండియా గౌరవ్‌ను పైలట్‌గా విధులనుంచి తొలగించింది. అప్పటికే ప్రముఖ వ్లాగర్‌గా తనేజా ఫుట్ టైం కంటెంట్ క్రియేటర్‌గా, యూట్యూబర్‌గా కరియర్ స్టార్ట్ చేశాడు.ఫ్లైయింగ్ బీస్ట్, ఫిట్ మజిల్ టీవీ, రాస్బరీకే పాపా పేర్లతో యూట్యూబ్ ఖాతాలను నిర్వహిస్తున్నాడు. అలా సోషల్‌మీడియాలో పాపులర్ స్టార్‌గా మారిపోయాడు.ప్రస్తుతం, యూట్యూబ్‌లో 80 లక్షలకుపైగా సబ్‌స్క్రైబర్లు, ట్విటర్‌లో దాదాపు 900k, ఇన్‌స్టాలో 40 లక్షల ఫాలోవర్స్ ఉన్నారంటే అతని క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment