Gaurav
-
పూల సాగుతో నాలుగు నెలల్లో రూ. 8 లక్షలు!
ఇటీవలి కాలంలో యువత కేవలం ఉద్యోగాలపైనే ఆధారపడకుండా స్టార్టప్‌లతో పాటు వ్యవసాయరంగంలోనూ కాలుమోపి, విజయాలు సాధిస్తున్నారు. యూపీలోని లక్నోలో గల మలిహాబాద్ పరిధిలోని ధాక్వా గ్రామానికి చెందిన గౌరవ్ కుమార్ ఇలాంటి విజయాన్నే అందుకున్నాడు. ప్రస్తుతం 22 ఏళ్ల వయసు కలిగిన గౌరవ్ కుమార్ గ్లాడియోలస్ పూలు సాగు చేస్తున్నాడు. నాలుగు నెలల్లో రూ. ఎనిమిది లక్షలు సంపాదించి అందరినీ ఆశ్యర్యపరుస్తున్నాడు. గౌరవ్ మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి శివకుమార్ వరి, గోధుమలు పండించి చాలాసార్లు నష్టపోయాడని, ప్రతికూల వాతావరణం కారణంగా పంట పాడైపోయేదని తెలిపాడు. అటువంటి పరిస్థితిలో తాను సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సబ్ట్రాపికల్ హార్టికల్చర్‌లో చేరానన్నాడు. అక్కడ పూల పెంపకం గురించి తెలుసుకుని, పూల సాగుకు తండ్రిని ఒప్పించానని తెలిపాడు. సెప్టెంబరు నుంచి గ్లాడియోలస్ పూల సాగు ప్రారంభమవుతుందని, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి వరకు ఈ పూలు విరివిగా లభిస్తాయని తెలిపాడు. కేవలం నాలుగు నెలల్లోనే ఈ పూల విక్రయం ద్వారా నాలుగు నుంచి ఎనిమిది లక్షల రూపాయల ఆదాయం వస్తుందని గౌరవ్ తెలిపాడు. తాను ప్రస్తుతం డీ ఫార్మా చదువుతున్నానని, వైద్య విద్యతో పాటు వ్యవసాయంపై దృష్టి సారిస్తానని తెలిపారు. -
యూట్యూబ్ కింగ్ గౌరవ్ తనేజా గుర్తున్నాడా? మళ్లీ ట్రెండింగ్లోకొచ్చేశాడు!
YouTuber Gaurav Taneja మలేషియాకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థకు మాజీ పైలట్ గౌరవ్ తనేజా మరోసారి వార్తల్లో నిలిచాడు. మెట్రో రైల్లో పుట్టిన రోజు వేడుకలు జరిపిన బుక్కైన యూట్యూబర్ గౌరవ్ తనేజా గుర్తున్నాడా? యూట్యూబ్‌లో ఫ్లైయింగ్ బీస్ట్‌గా ఫిట్నెస్ పాఠాలు చెప్పే యూ ట్యూబర్ గౌరవ్ తన సంపాదన ఎంతో ఫ్యాన్స్‌కి చెప్పేశాడు. అంతేకాదు తన పాత సీఈవోతోపోలిస్తే సంపాదనలో కింగ్‌ని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒకపుడు తనను తొలగించిన ఏయిర్ ఏసియా సీఈవో కంటే ఇపుడు తన సంపాదేన ఎక్కువ అంటూ ఇటీవల ఇన్ఫ్లుయెన్సర్ రాజ్ షమానీ హోస్ట్ చేసిన పోడ్కాస్ట్ సందర్భంగా వెల్లడించారు. బ్రాండ్ డీల్స్, యాడ్స్ ఆదాయం గురించి చెప్పమని అడిగినపుడు ఈ వ్యాఖ్యలు చేశాడు. గౌరవ్ మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చాడు. నిర్దిష్టంగా ఇంత అనీ సంపాదన వివరాలు బహిరంగంగా వెల్లడించలేదు. కానీ ఎయిర్ ఏసియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్ మిలియన్ డాలర్ల ఆస్తులను గుర్తుచేసుకుని తనేజా ఫ్యాన్స్ మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. అదీ సీఈవో టోనీ లింక్డ్ఇన్ పోస్ట్‌తో విమర్శల పాలైన తరువాత కంపెనీ మాజీ పైలట్ వ్యాఖ్యలు వెలుగులోకి రావడంతో మరింత వైరల్‌గా మారాయి. ఇంతకీ ఎవరీ గౌరవ్ తనేజా ♦ 2008లో ఐఐటీ ఖరగ్‌పూర్ పట్టభద్రుడైన గౌరవ్ తనేజా "సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్, ప్రొఫెషనల్ బాడీబిల్డర్ , ఏవియేటర్ కూడా. ♦ ఇపుడు ఢిల్లీ యూనివర్శిటీనుంచి ఎల్ఎల్బీ చేస్తున్నాడు. ♦ మరో పైలట్ రీతూ రథీతో వివాహం. వీరికి ఇద్దరు కుమార్తెలు . ♦ భద్రతా సమస్యల్ని గురించిన మాట్లాడినందుకే తనను ఎయిర్ ఏసియానుంచి తొలగించారనేది గౌరవ్ వాదన. ♦ ఫ్లైయింగ్ బీస్ట్ కంటే ముందే 2016లో FitMuscle TVని లాంచ్ చేశాడు. దీనికి దాదాపు 30 లక్షల సబ్ స్క్రైబర్లున్నారు. ఇక 2020లో లాంచ్ చేసిన రాస్బరీ కే పాపాకి 12 లక్షలకు పైగా సబ్ స్క్రైబర్లున్నారు I was terminated from airasia for raising safety issues! Now, the same issues are raised by #DGCA to @AirAsiaIndian. Justice will prevail! #Sabkeliye — Gaurav Taneja (@flyingbeast320) June 28, 2020 కాగా 2020జూన్‌లో AirAsia ఇండియా గౌరవ్‌ను పైలట్‌గా విధులనుంచి తొలగించింది. అప్పటికే ప్రముఖ వ్లాగర్‌గా తనేజా ఫుట్ టైం కంటెంట్ క్రియేటర్‌గా, యూట్యూబర్‌గా కరియర్ స్టార్ట్ చేశాడు.ఫ్లైయింగ్ బీస్ట్, ఫిట్ మజిల్ టీవీ, రాస్బరీకే పాపా పేర్లతో యూట్యూబ్ ఖాతాలను నిర్వహిస్తున్నాడు. అలా సోషల్‌మీడియాలో పాపులర్ స్టార్‌గా మారిపోయాడు.ప్రస్తుతం, యూట్యూబ్‌లో 80 లక్షలకుపైగా సబ్స్క్రైబర్లు, ట్విటర్లో దాదాపు 900k, ఇన్‌స్టాలో 40 లక్షల ఫాలోవర్స్ ఉన్నారంటే అతని క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. -
భారత్ గౌరవ్ రైలు మూడో సర్క్యూట్ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు రైల్వే శాఖ ప్రారంభించిన భారత్ గౌరవ్ పర్యాటక రైలు మరో కొత్త సర్క్యూట్‌తో ముందుకొచ్చింది. దక్షిణ మధ్య రైల్వేకు ఇటీవలే ఇలాంటి రైలును కేటాయించి రెండు సర్క్యూట్ యాత్రలు ప్రారంభించిన ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) తాజాగా ‘జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర’ సదరన్ సర్క్యూట్‌ను శనివారం ప్రకటించింది. ఇది తమిళనాడు, కేరళల్లోని ప్రధాన పర్యాటక ప్రాంతాల సందర్శనకు అవకాశం కల్పించనుంది. ఏడు ప్రాంతాలు.. తొమ్మిది రోజులు.. ఈ కొత్త సర్క్యూట్లో మొత్తం ఏడు పర్యాటక ప్రాంతాలను చేర్చారు. అరుణాచలం, కన్యాకుమారి, మదురై, రామేశ్వరం, తంజావూరు, తిరుచిరాపల్లి (తిరుచ్చి), త్రివేండ్రమ్ ప్రాంతాలను ఈ టూర్లో చుట్టేయచ్చు. ఆయా ప్రాంతాల్లోని నిర్ధారిత పర్యాటక ప్రాంతాలను చూపుతారు. ఈ అన్ని ప్రాంతాలను చుట్టి వచ్చేందుకు తొమ్మిది (ఎనిమిది రాత్రులు) రోజుల సమయం పట్టనుంది. రైలు మార్గం ఉన్న ప్రాంతాలకు రైలు ద్వారా, మిగతా ప్రాంతాలకు రోడ్డు మార్గం ద్వారా పర్యాటకులను తీసుకెళ్తారు. ఇందుకు అవసరమయ్యే బస, టీ, అల్పాహారం, మధ్యాహ్న, రాత్రి భోజనం, వసతిని పూర్తిగా ఐఆర్‌సీటీసీనే కల్పిస్తుంది. ఖర్చులన్నీ ప్యాకేజీ చార్జీలోనే సర్దుబాటు చేస్తారు. ప్రయాణికులకు పూర్తి భద్రత కల్పిస్తామని, రైలులో నిరంతర పర్యవేక్షణకు సీసీటీవీలను ఏర్పాటు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. పబ్లిక్ అనౌన్స్మెంట్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని, ప్రయాణ బీమా ఉంటుందని పేర్కొన్నారు. చార్జీలు ఇలా ఎకానమీ (నాన్ ఏసీ)– పెద్దలకు రూ. 14,300, 5–11 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు రూ.13,300 స్టాండర్డ్ క్లాస్ (ఏసీ)– పెద్దలకు రూ. 21,900, పిల్లలకు రూ.20,800 కంఫర్ట్ క్లాస్ (సెకండ్ ఏసీ)– పెద్దలకు రూ.28,500, పిల్లలకు రూ.27,100 ఎకానమీ టికెట్ ఉన్న వారికి బస కోసం హోటళ్లలో నాన్ ఏసీ గది కేటాయిస్తారు. స్టాండర్డ్ టికెట్ వారికి ఏసీ షేరింగ్ రూమ్ ఇస్తారు. కంఫర్ట్ క్లాస్ వారికి ఏసీ వ్యక్తిగత గది కేటాయిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పది హాల్టులుంటాయి. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికులు రైలు ఎక్కేందుకు వెసులుబాటు ఉంటుంది. సికింద్రాబాద్‌లో బయలుదేరే రైలు కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటలో ఆగుతుంది. ఆయా స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కిదిగొచ్చు. తొలిరోజే 300 టికెట్ల అమ్మకం.. ఈ యాత్రకు సంబంధించి మూడు ట్రిప్పుల తేదీలను ఐఆర్సీటీసీ వెల్లడించింది. ఆగస్టు 9, 23, సెప్టెంబర్ 5 తేదీలకు సంబంధించి బుకింగ్స్ ప్రారంభించింది. తొలిరోజే 300 టికెట్లు అమ్ముడైనట్టు తెలిసింది. -
తృణధాన్యాల ప్రాధాన్యంపై పాట..
న్యూయార్క్: తృణధాన్యాల ప్రాధాన్యతను చాటిచెప్పేందుకు ప్రత్యేకంగా రాసిన పాటను గ్రామీ అవార్డు విజేత, భారతీయ అమెరికన్ ఫల్గుణి షాతో కలిసి ప్రధాని మోదీ పాడారు. ఈ పాటను‘అబండేన్స్ ఇన్ మిల్లెట్స్’అనే పేరుతో ఈ నెల 16న ఫల్గుణి, ఆమె భర్త గాయకుడు గౌరవ్ షా కలిసి ప్రపంచవ్యాప్తంగా అన్ని స్ట్రీమింగ్ వేదికలపైనా ఇంగ్లిష్, హిందీ భాషల్లో విడుదల చేశారు. ముంబైలో జన్మించిన గాయని, పాటల రచయిత ఫల్గుణి షాను ఫాలు అనే పేరుతో ప్రసిద్ధురాలయ్యారు. పిల్లల కోసం ఈమె రూపొందించిన ‘ఎ కలర్‌ఫుల్ వరల్డ్’ఆల్బమ్‌కు 2022లో ప్రసిద్ధ గ్రామీ అవార్డు దక్కింది. గ్రామీ అవార్డు గెలుచుకున్న అనంతరం గత ఏడాది ప్రధాని మోదీని ఆమె ఢిల్లీలో కలిశారు. ఆ సమయంలో ప్రపంచ ఆకలిని తీర్చే సామర్థ్యమున్న, మంచి పోషక విలువలు కలిగిన తృణధాన్యాల గొప్పదనంపై ప్రజలకు అవగాహన కల్పించేలా ఒక పాట రాయాలని ప్రధాని మోదీ సూచించారని చెప్పారు. ఇందుకు సహకారం అందించేందుకు కూడా ప్రధాని మోదీ అంగీకరించారని వివరించారు. ఒక వైపు పాట కొనసాగుతుండగానే తృణధాన్యాల గొప్పదనంపై స్వయంగా రాసిన మాటలను ప్రధాని మోదీ వినిపిస్తారని ఫాలు పీటీఐకి తెలిపారు. భారత్ ప్రతిపాదన మేరకు ఐక్యరాజ్యసమితి 2023ను అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన విషయం తెలిసిందే. -
అన్ఎకాడమీ ఫౌండర్స్ సంచలన నిర్ణయం
సాక్షి,ముంబై: ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్‌ల దగ్గర్నించి, దిగ్గజ కంపెనీలుగా దాకా ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగాల కోతకు నిర్ణయిస్తున్నాయి. ఇందులో ఎడ్యుటెక్ యూనికార్న్ అన్‌ఎకాడెమీ కూడా మినహాయింపేమీ కాదు. అయితే తాజాగా అన్‌ఎకాడెమీ ఫౌండర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది(2024) ఏప్రిల్ వరకూ తమ వేతానల్లో కోత విధించుకుంటున్నట్టు కంపెనీ సీఈవో గౌరవ్ ముంజాల్ ప్రకటించారు. తొలగింపులను ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం వెలుగులోకి వచ్చింది. (మళ్లీ ఉద్యోగాల కోత..12 నెలల్లో 1400మందిని తొలగించిన స్టార్టప్) వ్యవస్థాపకులతో సహా టాప్ లీడర్షిప్ జీతాల్లో ఈ కోత ఉండనుంది. తాల్లో కోత 25 శాతం వరకు ఉండవచ్చని అంచనా. ఈ తగ్గింపు వారి ప్రస్తుత జీతం, పరిధి , పనితీరుపై ఆధారపడి ఉంటుందని, తిరిగి ఏప్రిల్ 2024లో మాత్రమే సవరిస్తామని కంపెనీ వెల్లడించింది. కాగా వరుసగా నాలుగోసారి 12 శాతం ఉద్యోగులను తొలగిస్తున్నట్టు గురువారం ప్రకటించింది. (IPL 2023: ఆ క్రికెటర్‌కు లక్కీ చాన్స్, టియోగో ఈవీ ఓనర్లకు బంపర్ ఆఫర్లు) కాగా గత ఏడాది కాలంగా దాదాపు 1400 మందిఉద్యోగులకు ఉద్వాసన పలికింది. 2022లో పలు రౌండ్ల తొలగింపుల ద్వారా సిబ్బంది సంఖ్యను 1,350 తగ్గించకుంది. 2020-21ఆర్థిక సంవత్సరంలో సంస్థ నష్టాలు రూ. 1,537 కోట్ల నుండి సంవత్సరానికి (YoY) 85 శాతం పెరిగి రూ.2,848 కోట్లుగా ఉన్నాయి. ఆదాయం రూ.719 కోట్లుగా ఉంది. -
జీవితాన్ని మార్చేసిన బొమ్మల వ్యాపారం: గార్డు నుంచి బిజినెస్ మ్యాన్‌గా..
నీలో ఉన్న కృషి, పట్టుదలే నీ తలరాతను మారుస్తాయనటానికి నిలువెత్తు నిదర్శనం 'గౌరవ్ మిర్చందానీ' (Gaurav Mirchandani). జీవితంలో ఎదగటానికి సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేయడానికి కూడా వెనుకాడకుండా.. ఈ రోజు వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈ రోజు చిన్నపిల్లలు తినే చిప్స్ ప్యాకెట్స్ లేదా ఇతర చిన్న ప్యాకెట్స్‌లో 'టాయ్స్' (బొమ్మలు) గమనించే ఉంటారు. ఈ చిన్న బొమ్మలతోనే ఈ రోజు సంవత్సరానికి 150 కోట్లు సంపాదిస్తున్నాడు మన గౌరవ్. నిజానికి గౌరవ్ మిర్చందానీ తన స్కూల్ ఏజికేషన్ ఇండోర్‌లోని చోయిత్రమ్ స్కూల్లో పూర్తి చేసి, మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్‌లో గ్రాడ్యుయేషన్ చదవటానికి అమెరికా వెళ్ళాడు. 2009లో మార్కెటింగ్ & ఎకానమీలో MBA పూర్తి చేసాడు. అమెరికాలో చదువుకునే రోజుల్లో ఎన్నో కష్టాలను ఎదుర్కుంటూ హాస్టల్ ఫీజు చెల్లించడానికి అప్పుడప్పుడు కూలి పనులు, ఒక చర్చిలో గార్డుగా కూడా పనిచేశాడు. (ఇదీ చదవండి: Honda: ఏప్రిల్ నుంచి ఈ కార్ల ఉత్పత్తి బంద్) తరువాత కొన్ని పెద్ద మాల్స్‌లో మొబైల్స్ అమ్మడం ప్రారంభించాడు. ఆ సమయంలో హైదరాబాద్‌కు చెందిన ఓ పెర్ఫ్యూమ్ స్టోర్ యజమానితో ఏర్పడిన పరిచయంతో అక్కడే సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా చేరాడు. అయితే ఆ స్టోర్ ఓనర్ ఇండియాకి తిరిగి వచ్చేస్తున్న కారణంగా ఆ దుకాణం గౌరవ్‌కు విక్రయించాడు. 2013లో ఆన్లైన్ కొనుగోలుకు ఎక్కువ ప్రాధాన్యం లేకపోవడం వల్ల పెద్దగా వ్యాపారం ముందుకు సాగలేదు, కానీ వాలెంటైన్స్ డే, బ్లాక్ ఫ్రైడే, క్రిస్మస్ వంటి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వ్యాపారంలో కొంత పురోగతి ఉండేది. ఆన్లైన్ షాపింగ్ ప్రారంభమైన తరువాత కూడా బిజినెస్‌లో మార్పు రాకపోవడంతో 2015లో ఇండియాకి తిరిగి వచ్చేసాడు. (ఇదీ చదవండి: సన్‌రూఫ్ లీక్‌పై రచ్చ లేపి.. ఇప్పుడు హ్యాపీ అంటున్నాడు: వీడియో) గౌరవ్ మిర్చందానీ ఇండియాలో ఎల్లో డైమండ్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ దీపక్ బ్రాహ్మణేని కలిసిన తరువాత జీవితంలో గొప్ప మార్పు ఏర్పడింది. ఆ తరువాత చిన్న బొమ్మలతో వ్యాపారం చేయాలని నిర్చయించుకున్నాడు. ఇందులో భాగంగానే యితడు చైనా నుంచి బొమ్మలను దిగుమతి చేసుకుని చిన్న ప్యాకెట్లతో అందించడం మొదలుపెట్టాడు. మొదట్లో తన తండ్రి కంపెనీ అయిన ఎస్ఎం డైస్ ద్వారా రూ.10 లక్షలతో బొమ్మల వ్యాపారం ప్రారంభించాడు, దానికి అతడు ఎస్ఎం టాయ్స్ అని పేరు పెట్టుకున్నాడు. మొదట చైనా నుంచి బొమ్మలను దిగుమతి చేసుకున్నప్పటికీ.. క్రమంగా మన దేశంలోనే కొంతమంది నుంచి బొమ్మలు కొనుగోలు చేయడం ప్రారంభించాడు. ఇతడు రేసర్ పుల్ బ్యాక్ కార్స్, DIY టాయ్స్, LED టాయ్స్, మ్యూజికల్ టాయ్స్, ప్రాంక్ టాయ్స్, డైనోసార్ టాయ్స్ వంటి అనేక ఆసక్తికరమైన బొమ్మలను అందిస్తున్నాడు. (ఇదీ చదవండి: వంటగదిలో మొదలైన ఆలోచన.. కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా..) క్యాండీ టాయ్స్ కార్పొరేట్ ప్రైవేట్ పేరుతో ఇప్పుడు కంపెనీ రూ. 150 కోట్ల వార్షిక ఆదాయాన్ని పొందుతోంది. అంతే కాకుండా గౌరవ్ ఫ్యాషన్ డిజైనింగ్ గ్రాడ్యుయేట్ అయిన రీమాను వివాహం చేసుకున్నాడు. వ్యాపార రంగంలో మెళుకువలు తెలిసిన ఈమె కూడా టాయ్స్ వ్యాపారాభివృద్ధికి బాగా దోహదపడుతోంది. -
Gaurav Yatra: నెహ్రూ వల్లే కశ్మీర్ సమస్య
జంజార్కా/ఉనాయ్(గుజరాత్): కశ్మీర్ సమస్యకు దేశ ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూయే కారణమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. నెహ్రూ రాజ్యాంగంలో చేర్చిన ఆర్టికల్ 370ను రద్దు చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించిన ఘనత ప్రధాని మోదీకే దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసినప్పటికీ అయోధ్యలో రామమందిర నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్లో ఆయన గురువారం అహ్మదాబాద్ జిల్లా జంజర్కా, ఉనాయ్లలో బీజేపీ ‘గౌరవ్ యాత్ర’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా పైవ్యాఖ్యలు చేశారు. ‘కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్టికల్ 370ను రాజ్యాంగంలో చేర్చుతూ నెహ్రూ చేసిన తప్పిదం వల్లే కశ్మీర్ పెద్ద సమస్య అయి కూర్చుంది. ఆ ప్రాంతం దేశంతో సరిగ్గా విలీనం కాలేదు. దీంతో ప్రతి ఒక్కరూ ఆర్టికల్ 370ను తొలగించాలని కోరుకున్నారు. ప్రధాని మోదీ 2019లో ఒక్క వేటుతో 370ను రద్దు చేసి, కశ్మీర్‌ను దేశంతో విలీనం చేశారు’అని అమిత్ షా చెప్పారు. ‘అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామంటూ బీజేపీ చేసిన వాగ్దానాన్ని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. కానీ, మందిరం ఇప్పుడు వాస్తవ రూపం దాల్చుతోంది’అని అన్నారు. 2016 సర్జికల్ స్ట్రైక్స్, 2019 ఎయిర్ స్ట్రైక్స్‌ను ఆయన ప్రస్తావిస్తూ.. సీమాంతర ఉగ్రవాదంపై మోదీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందన్నారు. గతంలో యూపీఏ హయాంలో పాక్ ఆర్మీ మన సైనికుల తలలను నరికి, వెంట తీసుకెళ్లింది. 2014లో మన ప్రభుత్వం వచ్చాక కూడా అలాగే చేయాలని చూసింది. కానీ, ఇది మౌని బాబా (మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఉద్దేశిస్తూ) ప్రభుత్వం కాదన్న విషయం వాళ్లు మరిచారు. ఉగ్రదాడులకు సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా మోదీ ప్రభుత్వం గుణపాఠం చెప్పింది’అని అమిత్ షా అన్నారు. ‘గుజరాత్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఏడాదిలో 365 రోజులకు గాను 200 రోజులు కర్ఫ్యూయే అమలయ్యేది. కానీ, నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక గత 20 ఏళ్లలో అలాంటి పరిస్థితులు లేవు’అని చెప్పారు. దేశానికి భద్రత కల్పించడం, దేశాన్ని అభివృద్ధి చేసే సామర్థ్యం కాంగ్రెస్‌కు లేవని విమర్శించారు. ఇదీ చదవండి: ఉద్ధవ్ థాక్రే వర్గానికి భారీ ఊరట -
Gaurav Rai: ఆక్సిజన్ మ్యాన్
ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్.. మరో కోణంలో సమాజంలో అడుగంటిన మానవత్వాన్ని తట్టిలేపుతోంది. కరోనా కారణంగా ఎదురవుతోన్న సమస్యలకు ఒకరికొకరు సాయమందించుకోవడం రోజూ చూస్తూనే ఉన్నాం. పాట్నాకు చెందిన 52 ఏళ్ల గౌరవ్ రాయ్ కరోనా పేషంట్లకు ఆక్సిజన్ అందిస్తూ వందలమంది ప్రాణాలను రక్షిస్తున్నారు. ‘‘కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారిలో ఆక్సిజన్ లెవల్స్ పడిపోతాయి. దీంతో ఆక్సిజన్ సిలిండర్లు తప్పనిసరిగా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది’’. ఈ పరిస్థితిని స్వయంగా అనుభవించిన గౌరవ్.. తనలాగా ఎవరూ ఇబ్బంది పడకూడదు అని భావించి ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా అందిస్తూ ‘ఆక్సిజన్ మ్యాన్ ’గా అందరి మన్ననలను పొందుతున్నారు. గతేడాది కరోనా ఫస్ట్ వేవ్ కొనసాగుతున్న సమయంలో గౌరవ్ కరోనా బారిన పడ్డారు. అప్పుడు అతనికి ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వడానికి బెడ్ దొరకలేదు. దీంతో గౌవర్ కరోనా పేషంట్లు ఉన్న వార్డులో మెట్ల పక్కన పడుకున్నాడు. పడుకోవడానికి కాస్త స్థలం దొరికినప్పటికీ.. కరోనాతో అతని ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయి. వెంటనే ఆక్సిజన్ సిలిండర్ పెట్టాల్సిన పరిస్థితి. కానీ ఆ ఆసుపత్రిలో ఒక్క సిలిండర్ కూడా దొరకలేదు. ఓ ఐదుగంటల తర్వాత గౌరవ్ భార్య నానా తంటాలు పడి ఆక్సిజన్ సిలిండర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో గౌరవ్ నెమ్మదిగా కోలుకుని బయటపడ్డారు. సిలిండర్ దొరకక తాను పడిన ఇబ్బంది మరొకరు పడకూడదనుకున్న గౌరవ్ ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేయాలనుకున్నారు. ఆక్సిజన్ సిలిండర్లను అందిస్తున్న గౌరవ్ రాయ్ అనుకున్న వెంటనే గౌరవ్ దంపతులు తమ సొంత డబ్బులతో వాళ్ల ఇంటి బేస్ మెంట్ లో చిన్న ఆక్సిజన్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. రోజు ఆక్సిజన్ సిలిండర్లు అవసరమైన వారికి గౌరవ్ తన వ్యాగ్నర్ కారులో తీసుకెళ్లి ఇవ్వడం ప్రారంభించారు. ఫేస్బుక్, ట్విటర్లో ఉన్న గౌరవ్ స్నేహితులు ఆక్సిజన్ బ్యాంక్ గురించి ప్రచారం చేయడంతో అవసరమైన వారందరూ గౌరవ్‌కు కాల్ చేసేవారు. వారికి సిలిండర్లను ఉచితంగా ఇచ్చి, ఆ పేషెంట్ కోలుకున్నాక మళ్లీ వెళ్లి సిలిండర్‌ను వెనక్కు తీసుకొచ్చేవారు. ఈ మొత్తం ప్రక్రియలో గౌరవ్ ఒక్క రూపాయి కూడా తీసుకోక పోవడం విశేషం. ప్రారంభంలో ఆక్సిజన్ బ్యాంక్ పది సిలిండర్లతో ప్రారంభమై నేడు 200 సిలిండర్ల స్థాయికి చేరుకుంది. ఈ విషయం తెలిసిన కొందరు దాతలు విరాళాల రూపంలో గౌరవ్‌కు సాయం చేస్తున్నారు. తెల్లవారుజామున ఐదుగంటలకే లేచి.. ప్రారంభంలో గౌరవ్ తనుండే అపార్టుమెంటు లో అవసరమైన వారికి ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చేవారు. సిలిండర్ కావాలని కాల్స్ పెరగడంతో తెల్లవారుజామున ఐదుగంటల నుంచి అర్ధరాత్రి వరకు సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. హోం క్వారంటైన్లో ఉన్నవారికి ఇప్పటిదాక దాదాపు వేయ్యిమందికి సిలిండర్లను సరఫరా చేశారు. క్రమంగా సిలిండర్ల సంఖ్య పెంచుతూ బిహార్‌లోని 18 జిల్లాల్లోని కరోనా పేషంట్లకు సిలిండర్లను ఉచితంగా సరఫరా చేస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తున్నారు. -
ఈ ప్రేమకథ ప్రమాదం
రెండు ప్రేమ జంటలు తమ ప్రేమ ప్రమాదంలో పడిన ప్పుడు కాపాడుకునేందుకు ఎలా ముందుకు సాగారు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘డేంజర్ లవ్ స్టోరీ’. ఖయ్యూం (అలీ తమ్ముడు), మధులగ్నదాస్, గౌరవ్, అథియా హీరో హీరోయిన్లుగా శేఖర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కింది. లక్ష్మీకనక వర్షిణి క్రియేషన్స్ పతాకంపై అవధూత గోపాలరావు నిర్మించిన ఈ చిత్రం ఈనెల 26న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ప్రెస్మీట్లో సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ– ‘‘భిన్నమైన టైటిల్ ఇది. వైవిధ్యభరితమైన కథాంశంతో నేటి ప్రేక్షకులను అలరింపజేసేలా రూపొందించిన ఇలాంటి చిత్రాలు విజయవంతం కావాలి’’ అన్నారు. ‘‘ఇలాంటి చిన్న సినిమాలు బతికినపుడే పరిశ్రమ కళకళలాడుతూ ఉంటుంది’’ అన్నారు నటి కవిత. ‘‘హారర్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని నిర్మించాం. గోవా, కొల్హాపూర్, నిజామాబాద్ తదితర లొకేషన్లలో షూటింగ్ చేశాం’’ అని అవధూత గోపాలరావు అన్నారు. ‘‘ఊహించని మలుపులతో ఆసక్తికర కథాంశంతో సాగే చిత్రమిది. ఇప్పటి వరకు ఎన్నో ప్రేమకథలు వచ్చినప్పటికీ ఇది భిన్నంగా ఉంటుంది. సస్పెన్స్, హారర్‌తో పాటు మంచి వినోదం ఉంటుంది’’ అని శేఖర్ చంద్ర చెప్పారు. గౌరవ్, అథియా, నటుడు డా.సకారం, నైజాం డిస్ట్రిబ్యూటర్ రాజేందర్ పాల్గొన్నారు. -
చిన్న సినిమాలను ప్రోత్సహించాలి
‘‘సినిమా తీసే వరకే పెద్దది, చిన్నది అని నిర్మాత అనుకుంటాడు. హిట్ అయ్యాక ఏదైనా ఒకటే. చిన్న సినిమాలను ప్రోత్సహించాలనే ఈ వేడుకకు వచ్చా’’ అని నిర్మాత సి. కల్యాణ్ అన్నారు. ఖయ్యూం, గౌరవ్ హీరోలుగా, మధులగ్నదాస్, అధియ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘డేంజర్ లవ్ స్టోరీ’. శేఖర్ చంద్ర దర్శకత్వంలో అవధూత లక్ష్మీ సమర్పణలో లక్ష్మీ కనకవర్షిణి క్రియేషన్స్‌పై అవధూత గోపాల్‌రావు నిర్మించారు. భానుప్రసాద్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని సి.కల్యాణ్ విడుదల చేసి, ప్రతాని రామకృష్ణ గౌడ్, సాయివెంకట్లకు అందించారు. ‘‘20 ఏళ్లుగా పలు సినిమాల్లో నటించిన అనుభవంతో ఈ సినిమా నిర్మించా. మా అబ్బాయి గౌరవ్ ఈ చిత్రంలో ఓ హీరోగా నటించాడు. ఆగస్టులో సినిమా రిలీజ్ చేయనున్నాం’’ అన్నారు గోపాల్‌రావు. -
పతకానికి విజయం దూరంలో...
♦ క్వార్టర్ ఫైనల్లో అమిత్, గౌరవ్ ♦ వికాస్, సుమీత్‌లకు చుక్కెదురు హాంబర్గ్ (జర్మనీ): ప్రపంచ సీనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. అమిత్ ఫంగల్(49 కేజీలు), గౌరవ్ బిధురి(56 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... వికాస్ కృషన్(75 కేజీలు), సుమీత్ సాంగ్వాన్(91 కేజీలు), మనోజ్ కుమార్ (69 కేజీలు), శివ థాపా(60 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించారు. ఏడో సీడ్ కార్లోస్ కిపో (ఈక్వెడార్)తో జరిగిన బౌట్లో అమిత్ 5–0తో సంచలన విజయం సాధించగా... గౌరవ్ 4–1తో మికోలా బుత్సెంకో (ఉక్రెయిన్)ను ఓడించాడు. మరో విజయం సాధిస్తే అమిత్, గౌరవ్‌లకు కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి. మరోవైపు 2011 ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత వికాస్ 0–5తో విటేకర్ (ఇంగ్లండ్) చేతిలో, సుమీత్ 2–3తో జాసన్ వాటెలె (ఆస్ట్రేలియా) చేతిలో, మనోజ్ కుమార్ 1–4తో గాబ్రియెల్ పెరెజ్(వెనిజులా) చేతిలో ఓడిపోయారు. ఒటార్ ఎరానోసియాన్(జార్జియా)తో తలపడా ల్సిన శివ థాపా తీవ్ర జ్వరం కారణంగా బరిలోకి దిగకుండానే తన ప్రత్యర్థికి వాకోవర్ ఇచ్చాడు. -
ప్రిక్వార్టర్స్‌లో అమిత్, గౌరవ్
హంబర్గ్ (జర్మనీ): భారత బాక్సర్లు అమిత్ ఫంగల్, గౌరవ్ బిధురి సత్తా చాటారు. ప్రపంచ పురుషుల సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో వీరిద్దరూ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల 49 కేజీల కేటగిరీ తొలి రౌండ్లో అమిత్ 4–1తో ఫెడెరికొ సెర్రా (ఇటలీ)పై గెలుపొందాడు. 56 కేజీల విభాగంలో గౌరవ్ 5–0తో ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సామ్ గుడ్మాన్ (ఆస్ట్రేలియా)ను కంగుతినిపించాడు. ప్రిక్వార్టర్స్‌లో అమిత్... ఏడో సీడ్ కార్లస్ క్విపో (ఈక్వెడార్)తో, గౌరవ్... ఆఫ్రికా చాంపియన్ జీన్ జోర్డి వాడముటూ (మారిషస్)తో తలపడతారు. ఈ చాంపియన్‌షిప్‌లో 250 మంది అంతర్జాతీయ బాక్సర్లు తలపడుతుండగా... భారత్ తరఫున ఎనిమిది మంది పోటీపడుతున్నారు. -
క్వార్టర్స్‌లో వికాస్, గౌరవ్
తాష్కెంట్: ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ముగ్గురు భారత బాక్సర్లు వికాస్ కృషన్ (75 కేజీలు), గౌరవ్ బిధూరి (56 కేజీలు), అమిత్ ఫంగల్ (49 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పతోమసక్ కుటియా (థాయ్‌లాండ్)తో జరిగిన బౌట్లో వికాస్ రెండు నిమిషాల్లోపే విజయం సాధించాడు. గౌరవ్ బిధూరి పాయింట్ల ప్రాతిపదికన యుటపాంగ్ తాంగ్డీ (థాయ్‌లాండ్)పై గెలుపొందగా, అమిత్ ఫంగల్ సునాయాసంగా రమీష్ రహమాని (అఫ్ఘానిస్తాన్)ను చిత్తు చేశాడు. అయితే మరో భారత ఆటగాడు ఆశిష్ కుమార్ 64 కేజీల విభాగంలో ఇక్బొల్‌జొన్ ఖొల్‌దరొవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. -
మోనాల్ ప్రేమ తంటాలు
ప్రేమ సన్నివేశంలో నటించేందుకు నటి మోనాల్ గజ్జర్ 17 టేక్‌లు తీసుకున్నట్లు దర్శకుడు గౌరవ్ తెలిపారు. విక్రమ్ ప్రభు, మోనాల్ గజ్జర్, సత్యరాజ్, కోవై సరళతో సహా పలువురు నటిస్తున్న చిత్రం ‘శిఖరం తొడు’. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న గౌరవ్ మాట్లాడుతూ మనం ప్రతిసారీ ఏటీఎంలో నగదు డ్రా చేసే సమయంలో, మనకు తెలియకుండానే అనేక పొరపాట్లు జరుగుతాయన్నారు. మనకు తెలియకుండానే ఏమేరకు నగదు సంఘ విద్రోహుల వశమౌతోంది, దీన్ని నిరోధించేందుకు మార్గాలు ఏమిటనే విషయం ఆధారంగా ఈ చిత్రం నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇందులో సత్యరాజ్ విక్రమ్ ప్రభు తండ్రిగా నటిస్తున్నారని తెలిపారు. ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు పోలీసు పాత్రలో నటిస్తున్నందున దానికి తగిన విధంగా కష్టపడ్డారని తెలిపారు. విక్రమ్ ప్రభు, మోనాల్ గజ్జర్ మధ్య ప్రేమ సన్నివేశాలు ఎంతో హుందాగా వుంటాయని, ఒక ప్రేమ సన్నివేశంలో మోనాల్ గజ్జర్ సరిగా నటించలేక 17 టేకులు తీసుకుందన్నారు. సత్యరాజ్ బహుముఖ ప్రజ్ఞకు ఈ చిత్రం దీటుగా నిలుస్తుందని, తాను కూడా ఒక ముఖ్య పాత్రలో నటించానని అన్నారు, వచ్చేవారం ఈ చిత్రం తెరమీదికి వస్తుందన్నారు. -
సహజశ్రీ గేమ్ డ్రా
అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ గుర్గావ్: ఆంధ్రప్రదేశ్ అమ్మాయి చొల్లేటి సహజశ్రీ రెండో రౌండ్ గేమ్‌ను డ్రా చేసుకుంది. గురువారం ఇక్కడ ప్రారంభమైన గుర్గావ్ అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో ఆమె శుభారంభం చేసింది. తొలి రౌండ్లో ఆమె భారత్‌కే చెందిన నవ్య తాయల్పై గెలుపొందింది. రెండో రౌండ్ గేమ్‌లో అంతర్జాతీయ మాస్టర్ నారాయణన్ శ్రీనాథ్ (1.5)ను నిలువరించింది. చివరికి ఈ గేమ్ డ్రాగా ముగిసింది. 1.5 పాయింట్లతో సహజశ్రీ ఉమ్మడిగా రెండో స్థానంలో కొనసాగుతోంది. రెండో రౌండ్ పోటీల్లో మిగతా ఏపీ క్రీడాకారుల్లో ఎస్. రవితేజ(2) ... రామలింగం కార్తీక్ (1)పై గెలుపొందగా, సీఆర్జీ కృష్ణ (1)... కుర్సనోవా ఫరీదా (ఉజ్బెకిస్థాన్)ను ఓడించాడు. కార్తీక్ (1)... కునాల్ మోడి (0)పై నెగ్గగా, దీప్తాంశ్ రెడ్డి (1)... అభినవ్ గోలా (2) చేతిలో కంగుతిన్నాడు. తులసీ రామ్‌కుమార్ (1)... సిద్ధాంత్నాత్ (0)పై గెలుపొందగా, మట్ట వినయ్ కుమార్ (1.5)... కేశ్ని బాసిన్ (0.5)పై విజయం సాధించాడు.