నీలో ఉన్న కృషి, పట్టుదలే నీ తలరాతను మారుస్తాయనటానికి నిలువెత్తు నిదర్శనం 'గౌరవ్ మిర్చందానీ' (Gaurav Mirchandani). జీవితంలో ఎదగటానికి సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేయడానికి కూడా వెనుకాడకుండా.. ఈ రోజు వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
ఈ రోజు చిన్నపిల్లలు తినే చిప్స్ ప్యాకెట్స్ లేదా ఇతర చిన్న ప్యాకెట్స్‌లో 'టాయ్స్' (బొమ్మలు) గమనించే ఉంటారు. ఈ చిన్న బొమ్మలతోనే ఈ రోజు సంవత్సరానికి 150 కోట్లు సంపాదిస్తున్నాడు మన గౌరవ్.
నిజానికి గౌరవ్ మిర్చందానీ తన స్కూల్ ఏజికేషన్ ఇండోర్‌లోని చోయిత్రమ్ స్కూల్‌లో పూర్తి చేసి, మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్‌లో గ్రాడ్యుయేషన్ చదవటానికి అమెరికా వెళ్ళాడు. 2009లో మార్కెటింగ్ & ఎకానమీలో MBA పూర్తి చేసాడు. అమెరికాలో చదువుకునే రోజుల్లో ఎన్నో కష్టాలను ఎదుర్కుంటూ హాస్టల్ ఫీజు చెల్లించడానికి అప్పుడప్పుడు కూలి పనులు, ఒక చర్చిలో గార్డుగా కూడా పనిచేశాడు.
(ఇదీ చదవండి: Honda: ఏప్రిల్ నుంచి ఈ కార్ల ఉత్పత్తి బంద్)
తరువాత కొన్ని పెద్ద మాల్స్‌లో మొబైల్స్ అమ్మడం ప్రారంభించాడు. ఆ సమయంలో హైదరాబాద్‌కు చెందిన ఓ పెర్ఫ్యూమ్ స్టోర్ యజమానితో ఏర్పడిన పరిచయంతో అక్కడే సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా చేరాడు. అయితే ఆ స్టోర్ ఓనర్ ఇండియాకి తిరిగి వచ్చేస్తున్న కారణంగా ఆ దుకాణం గౌరవ్‌కు విక్రయించాడు.
2013లో ఆన్‌లైన్ కొనుగోలుకు ఎక్కువ ప్రాధాన్యం లేకపోవడం వల్ల పెద్దగా వ్యాపారం ముందుకు సాగలేదు, కానీ వాలెంటైన్స్ డే, బ్లాక్ ఫ్రైడే, క్రిస్మస్ వంటి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వ్యాపారంలో కొంత పురోగతి ఉండేది. ఆన్‌లైన్ షాపింగ్ ప్రారంభమైన తరువాత కూడా బిజినెస్‌లో మార్పు రాకపోవడంతో 2015లో ఇండియాకి తిరిగి వచ్చేసాడు.
(ఇదీ చదవండి: సన్‌రూఫ్ లీక్‌పై రచ్చ లేపి.. ఇప్పుడు హ్యాపీ అంటున్నాడు: వీడియో)
గౌరవ్ మిర్చందానీ ఇండియాలో ఎల్లో డైమండ్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ దీపక్ బ్రాహ్మణేని కలిసిన తరువాత జీవితంలో గొప్ప మార్పు ఏర్పడింది. ఆ తరువాత చిన్న బొమ్మలతో వ్యాపారం చేయాలని నిర్చయించుకున్నాడు. ఇందులో భాగంగానే యితడు చైనా నుంచి బొమ్మలను దిగుమతి చేసుకుని చిన్న ప్యాకెట్లతో అందించడం మొదలుపెట్టాడు.
మొదట్లో తన తండ్రి కంపెనీ అయిన ఎస్ఎం డైస్ ద్వారా రూ.10 లక్షలతో బొమ్మల వ్యాపారం ప్రారంభించాడు, దానికి అతడు ఎస్ఎం టాయ్స్ అని పేరు పెట్టుకున్నాడు. మొదట చైనా నుంచి బొమ్మలను దిగుమతి చేసుకున్నప్పటికీ.. క్రమంగా మన దేశంలోనే కొంతమంది నుంచి బొమ్మలు కొనుగోలు చేయడం ప్రారంభించాడు. ఇతడు రేసర్ పుల్ బ్యాక్ కార్స్, DIY టాయ్స్, LED టాయ్స్, మ్యూజికల్ టాయ్స్, ప్రాంక్ టాయ్స్, డైనోసార్ టాయ్స్ వంటి అనేక ఆసక్తికరమైన బొమ్మలను అందిస్తున్నాడు.
(ఇదీ చదవండి: వంటగదిలో మొదలైన ఆలోచన.. కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా..)
క్యాండీ టాయ్స్ కార్పొరేట్ ప్రైవేట్ పేరుతో ఇప్పుడు కంపెనీ రూ. 150 కోట్ల వార్షిక ఆదాయాన్ని పొందుతోంది. అంతే కాకుండా గౌరవ్ ఫ్యాషన్ డిజైనింగ్ గ్రాడ్యుయేట్ అయిన రీమాను వివాహం చేసుకున్నాడు. వ్యాపార రంగంలో మెళుకువలు తెలిసిన ఈమె కూడా టాయ్స్ వ్యాపారాభివృద్ధికి బాగా దోహదపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment