ఎంతోమంది చదువులో ముందుకు సాగలేకపోయినా జీవితంలో అనుకున్నది సాధించి సక్సెస్ అవుతారు. అలాంటి వారిలో ఒకరు 'ప్రియాంక్ సుఖిజా' (Priyank Sukhija). ఇంతకీ ఈయన సాధించిన సక్సెస్ ఏమిటి? ప్రస్తుతం ఎంత సంపాదిస్తున్నాడనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
కేవలం 19 సంవత్సరాల వయసులోనే చదువుకి స్వస్తి చెప్పి ఏదైనా సొంతంగా చేయాలని నిర్ణయించుకుని, తన తండ్రి నుంచి కొంత డబ్బుని తీసుకుని మొదట్లో రెస్టారెంట్ లాజీజ్ ఎఫైర్‌ను ప్రారంభించాడు. ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు భారతదేశంలో అత్యంత సంపన్నమైన, విజయవంతమైన రెస్టారెంట్ యజమానిగా నిలదొక్కుకోగలిగాడు.
ప్రస్తుతం భారతదేశం మొత్తం మీద 30 కంటే ఎక్కువ హై-ఎండ్ రెస్టారెంట్లు, కేఫ్‌లను కలిగి ఉన్నారు. డయాబ్లో, లార్డ్ ఆఫ్ ది డ్రింక్స్, వేర్‌హౌస్ కేఫ్, ఫ్లయింగ్ సాసర్, డ్రాగన్‌ఫ్లై ఎక్స్‌పీరియన్స్ వంటి పేర్లతో ఢిల్లీలో రెస్టారెంట్లు ఉన్నాయి. ఢిల్లీలో మాత్రమే కాకుండా దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా ఈయనకు బ్రాంచెస్ ఉన్నాయి.
ప్రియాంక్ సుఖిజా రెస్టారెంట్లు అనేక రకాల వంటకాలకు ప్రసిద్ధి చెంది ఢిల్లీలోని ఇతర రెస్టారెంట్లకు పోటీగా నిలుస్తోంది. F&B Pvt Ltd పేరుతో ప్రియాంక్ సుఖిజా కంపెనీ 2022లో ఏకంగా రూ. 275 కోట్లను ఆర్జించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం అతన్ని దేశంలోని అత్యంత సంపన్నుడైన వ్యక్తిగా పిలుస్తున్నారు. అయితే ప్రస్తుతం అతని నికర ఆస్తుల విలువ అందుబాటులో లేదు. కానీ చిన్న మొత్తంతో బిజినెస్ ప్రారభించి ఈ రోజు భారదేశంలో లెక్కకు మించిన బ్రాంచెస్ ప్రారభించి విజయానికి చిరునామాగా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment