business Legends
-
రూ.63 వేలకోట్లు ఆస్తి.. అద్దె ఇంట్లో నివాసం!: ఎవరో తెలుసా?
అనుకున్న పని సాధించాలంటే.. కృషి, పట్టుదల చాలా అవసరం. సంకల్పం బలంగా ఉండి.. లక్ష్యం వైపుగా అడుగులు వేస్తే తప్పకుండా సక్సెస్ నీ సొంతం అవుతుందని చెప్పడానికి నిదర్శనమే 'టట్యానా బకల్చుక్' (Tatyana Bakalchuk). బహుశా ఈ పేరు చాలామందికి తెలిసుండకపోవచ్చు. కానీ ఈమె రష్యాలో అత్యంత సంపన్న మహిళలలో ఒకరు. ఈమె గురించి, ఈమె సాధించిన సక్సెస్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.వైల్డ్బెర్రీస్బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, రష్యాలో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజంగా ఎదిగిన 'వైల్డ్‌బెర్రీస్' (Wildberries) నేడు ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం వ్యాపారవేత్త టట్యానా బకల్చుక్. ఈమె రష్యాలో అత్యంత సంపన్న మహిళ. ఈమె నికర విలువ 7.4 బిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 6,34,65,84,10,000.60వేల బ్రాండ్లుఅమెజాన్ కంపెనీలో పోలిస్తే.. వైల్డ్‌బెర్రీస్ రష్యాలోనే అతిపెద్ద ఆన్లైన్ రిటైలర్. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా దుస్తులు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు వంటి సుమారు 60వేల బ్రాండ్లను విక్రయిస్తున్నారు.రష్యాలోని అతిపెద్ద ఈ కామర్స్ దిగ్గజాన్ని స్థాపించిన టట్యానా బకల్చుక్ 2004లో నిరాడంబరమైన జీవితాన్ని గడిపిన ఓ ఇంగ్లీష్ టీచర్. ఈమె తన ప్రసూతి సెలవుల సమయంలో కుటుంబానికి మద్దతుగా నిలబడటానికి కేవలం రూ. 32వేలతో చిన్న వ్యాపారం ప్రారంభించింది. ఆ సమయంలో ఆమె భర్త వ్లాడిస్లావ్ బకల్చుక్, అతని స్నేహితుడి సహకారం కూడా తీసుకుంది.అపార్ట్మెంట్ నుంచి ఆన్లైన్ ప్లాట్ఫామ్మొదట వీరి వ్యాపారం చిన్న అపార్ట్మెంట్ నుంచి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌గా వృద్ధి చెందింది. ఆ సమయంలో ఆమె జర్మన్ రిటైలర్ ఒట్టో సహకారం పొందింది. ఆన్లైన్లో దుస్తులను ఫోటో తీయడం, జాబితా చేయడం, స్వయంగా లాజిస్టిక్స్ చేయడం, పంపడానికి ప్రజా రవాణాను ఉపయోగించడం వంటి వాటితో ఈమె బిజినెస్ ఎదిగింది.ప్రారంభంలో కొన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్నప్పటికీ.. పట్టు వదలకుండా, 2008 ఆర్థిక సంక్షోభాల సమయంలో కూడా ఈమె తన వ్యాపారాన్ని వదిలిపెట్టలేదు.2020లో మహమ్మారి సమయంలో సకాలంలో ఇంటి డెలివరీలను నిర్ధారించడానికి ఆమె 12,000 మంది అదనపు కార్మికులను నియమించింది. దీంతో కంపెనీ ఒక్కసారిగా గణనీయమైన వృద్ధి సాధించింది.99 శాతం వాటాకంపెనీలో టాట్యానా 99 శాతం వాటాను కలిగి ఉంది. మిగిలిన 1 శాతం వాటా ఆమె భర్తకు చెందినది. ఈ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు రష్యాలో మాత్రమే కాకుండా.. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ వంటి ప్రదేశాలలో కూడా సేవలు అందిస్తోంది. వేలకోట్లు సంపద ఉన్నప్పటికీ.. టాట్యానా అద్దె ఇంట్లోనే నివసిస్తున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: రూ. 10వేల అప్పుతో రూ.32000 కోట్ల సామ్రాజ్యం: ఎవరీ 'రవి మోదీ'?టట్యానా బకల్చుక్ వ్యాపార ఆవాహన.. రష్యా అధ్యక్షుడు 'వ్లాదిమిర్ పుతిన్' (Vladimir Putin)ను ఆకర్షించింది. దీంతో ఆయన అంతర్జాతీయ స్విఫ్ట్ చెల్లింపు నెట్‌వర్క్‌కు దేశీయ ప్రత్యామ్నాయాన్ని సృష్టించే పనిని ఆమెకు అప్పగించారు. ఓ టీచర్‌గా జీవితం ప్రారంభించి, కుటుంబానికండగా నిలబడాలనే ఉద్దేశ్యంతో చిన్న వ్యాపారాన్ని ప్రారంభించి.. నేడు ప్రపంచంలోని గొప్ప వ్యాపారవేత్తల సరసన నిలిచిన టట్యానా బకల్చుక్ ప్రశంసనీయం, ఎంతోమందికి ఆదర్శప్రాయం. -
అంబానీ అల్లుడితో సమానంగా బాధ్యతలు.. ఎవరీ నందిని?
భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ.. తన కుమార్తె 'ఇషా అంబానీ'కి వ్యాపార రంగానికి చెందిన అజయ్ పిరమల్ కుమారుడు 'ఆనంద్ పిరమిల్'తో వివాహం జరిపించారు. ఫార్మాస్యూటికల్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో దూసుకెళ్తున్న పిరమల్ వ్యాపార సామ్రాజ్యంలో 'నందిని పిరమల్' కీలకమైన వ్యక్తి. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె నెట్‌వర్త్ ఎంత? అనే మరిన్ని ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.ఎవరీ నందిని పిరమల్?నందిని పిరమల్ అజయ్ పిరమల్ కుమార్తె. ఈమె పిరమల్ గ్రూప్ డైరెక్టర్ల బోర్డులో సభ్యురాలు. నందిని తన తల్లిదండ్రులు అజయ్, డాక్టర్ స్వాతి పిరమల్.. సోదరుడు ఆనంద్ పిరమల్‌తో కలిసి కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ప్రస్తుతం పిరమల్ ఎంటర్ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, పిరమల్ ఫార్మా చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఓవర్-ది-కౌంటర్ (OTC) వ్యాపార విభాగాన్ని పర్యవేక్షించడం ఆమె ప్రధాన పాత్ర వహిస్తోంది.నందిని పిరమల్ నాయకత్వంలో ఓటీసీ విభాగం భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వాటిలో ఒకటిగా మారింది. దీని అనేక ఉత్పత్తులు వాటి సంబంధిత విభాగాలలో అగ్రస్థానంలో ఉన్నాయి. అంతే కాకుండా ఆమె పిరమల్ గ్రూప్‌లో హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అధిపతిగా ఉంది.2010లో నందిని కెరీర్లో ఒక ముఖ్యమైన మైలురాయి. ఆమె పిరమల్ గ్రూపుకు చెందిన దేశీయ ఫార్ములేషన్స్ వ్యాపారాన్ని అబాట్ లాబొరేటరీస్‌కు విక్రయించడంలో కీలక పాత్ర పోషించింది. 3.8 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 31,638 కోట్లు) విలువైన ఈ డీల్ ఆ సమయంలో భారతీయ ఔషధ రంగంలో అతిపెద్ద లావాదేవీలలో ఒకటిగా నిలిచింది.కుటుంబ వ్యాపారంలోకి అడుగునందిని పిరమల్ కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. ఇంగ్లాండ్‌లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పాలిటిక్స్, ఫిలాసఫీ, ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ పొందింది. చదువు పూర్తయిన తరువాత మెకిన్సే & కంపెనీలో బిజినెస్ అనలిస్ట్‌గా పనిచేసింది. ఆ తరువాత 2006లో కుటుంబ వ్యాపారంలో అడుగుపెట్టింది.ఇదీ చదవండి: దీపావళి ఆఫర్: రూ. 699కే జియో 4జీ ఫోన్2009 మార్చిలో నందిని.. పీటర్ డీ యంగ్‌ను వివాహం చేసుకుంది. పీటర్ పిరమల్ గ్లోబల్ ఫార్మా సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇతడు కూడా స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలోనే చదువుకున్నాడు. ఆ తరువాత మెకిన్సే & కంపెనీలో పనిచేసారు. నందిని పిరమల్ నెట్‌వర్త్ గురించి అధికారిక వివరాలు అందుబాటులో లేదు. కానీ ఈమె తండ్రి అజయ్ పిరమల్ నికర విలువ 2.8 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 23,307 కోట్లు). 2023 ఆర్ధిక సంవత్సరంలో పిరమల్ గ్రూప్ రూ. 9087 కోట్ల ఆదాయాన్ని గడించింది. -
ఇషా అంబానీ సరికొత్త రికార్డ్!.. జాబితాలో ఆకాష్ కూడా..
హురున్ ఇండియా అండర్ 35 జాబితా విడుదల చేసింది. ఇందులో దేశంలోని అత్యంత విజయవంతమైన యువ పారిశ్రామికవేత్తలను వెల్లడించింది. ఈ లిస్టులో అంబానీ పిల్లలు ఇషా, ఆకాష్ ఉన్నారు. ఈ జాబితాలో మొత్తం 150 మంది 35 ఏళ్లలోపు వయసున్న పారిశ్రామిక వేత్తలు ఉన్నారు.ఓ వైపు ఆసియాలోని అత్యంత ధనవంతుల జాబితాలో ముకేశ్ అంబానీ ఒకరుగా ఉన్నారు. ఇప్పుడు అంబానీ కుమార్తె ఇషా 2024 హురున్ ఇండియా అండర్ 35 జాబితాలో అతి పిన్న వయస్కురాలైన మహిళా పారిశ్రామికవేత్తగా నిలిచారు. ఈ జాబితాలో అంబానీ కుమారుడు ఆకాష్ కూడా ఉన్నారు.ముకేశ్ అంబానీ గారాల తనయ ఇషా అంబానీ 'రిలయన్స్ రిటైల్' మేనేజింగ్ డైరెక్టర్. ముంబైలో పుట్టి పెరిగిన ఇషా ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో తన ప్రాథమిక విద్యను పూర్తి చేసింది. ఆ తరువాత యునైటెడ్ స్టేట్స్‌లోని యేల్ విశ్వవిద్యాలయం నుంచి సైకాలజీ, కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందింది.ఇదీ చదవండి: ఇద్దరితో మొదలై.. విశ్వమంతా తానై - టెక్ చరిత్రలో గూగుల్ శకం.. అనన్య సామాన్యంహురున్ ఇండియా అండర్-35 జాబితాలో ఇతరులు2024 హురున్ ఇండియా అండర్-35 జాబితాలో అనెరి పటేల్, అనీషా తివారీ, అంజలి మర్చంట్‌తో సహా మరో ఏడుగురు మహిళా వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. వీరి వయసు 33, 34 మధ్య ఉంది. వీరందరూ కుటుంబ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. ఈ జాబితాలో షేర్‌చాట్ కో ఫౌండర్ అంకుష్ సచ్‌దేవా అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచారు. మామా ఎర్త్ సీఈఓ 35 సంవత్సరాల వయస్సు గల గజల్ అలగ్ కూడా ఉన్నారు. -
Rahul Gandhi: మోదీ నాతో చర్చకు రారు
న్యూఢిల్లీ: సన్నిహితులైన వ్యాపారవేత్తలతో ఉన్న లింకులపై ప్రశ్నలకు, ఎలక్టోరల్ బాండ్లను దురి్వనియోగం చేయడంపై సమాధానాలు చెప్పుకోలేరు కాబట్టే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనతో చర్చకు ముందుకు రావడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, ఆప్ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి దేశ రాజధానిలోని ఏడు లోక్‌సభ సీట్లలో కూటమిని గెలిపించాలని పిలుపిచ్చారు. ఆసక్తికరమైన విషయమేమింటే నేను ఆప్‌కు ఓటేస్తాను, కేజ్రీవాల్ కాంగ్రెస్‌కు ఓటేస్తారని రాహుల్ అన్నారు. ప్రధాని మోదీ తన అనుకూల పాత్రికేయులకు ఎడతెరపి లేకుండా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కానీ తనతో చర్చకు మాత్రం రారని, ఎందుకంటే తన ప్రశ్నలకు సమాధానమివ్వలేనని మోదీకి తెలుసన్నారు. అదానీ– అంబానీల నుంచి కాంగ్రెస్‌కు టెంపోల కొద్దీ డబ్బు ముట్టిందని ప్రధాని ఆరోపిస్తారు.. కానీ దీనిపై దర్యాప్తునకు ఆదేశించే ధైర్యం మాత్రం చేయరు అని ఎద్దేవా చేశారు. ‘ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రధాని మోదీతో చర్చకు నేను సిద్ధమే. ఆయన రారని నాకు తెలుసు. ఆయన్ను నేనడిగే తొలి ప్రశ్న.. అదానీతో మీకున్న బంధుత్వమేమిటి? రెండో ప్రశ్న... బీజేపీకి అందిన ఎలక్టోరల్ బాండ్ల గురించి’ అని రాహుల్ వివరించారు. మోదీ, రాహుల్‌లు చర్చ చేయాలని ఇద్దరు మాజీ జడ్జిలు, మాజీ సంపాదకుడు ఎన్.రామ్ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈడీæ అధికారులు అలసిపోయే దాకా 55 గంటల పాటు వారు నన్ను ఇంటరాగేట్ చేసేలా బీజేపీ చేసింది. నా ఇంటిని (ఎంపీ క్వార్టర్‌ను) లాగేసుకున్నారు. నాకు మీ క్వార్టర్ అవసరం లేదని.. మొత్తం దేశమే నా ఇల్లని వారికి చెప్పానని రాహుల్ బీజేపీపై ధ్వజమెత్తారు. బీజేపీలో చేరుతున్న వారిపై మాట్లాడుతూ.. తమకేమీ ఇబ్బంది లేదని, పిరికిపందలు తమకు అక్కర్లేదని చెప్పారు. సీబీఐ, ఈడీ దాడులను భయపడి లొంగిపోయే వారు తమకు అవసరం లేదన్నారు. -
ఈ దేశాల్లో డబ్బులన్నీ వ్యాపార కుటుంబాలవే..
ప్రతి దేశంలో ఎన్నో వ్యాపార సామ్రాజ్యాలు ఉంటాయి. కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు పలు కుటుంబాల ఆధ్వర్యంలోని కంపెనీలపై ఆధారపడి ఉంటుంటాయి. వాల్‌మార్ట్, ఫోర్డ్, రిలయన్స్ వంటి ‘కుటుంబ’ కంపెనీలు.. ఆయా దేశాల్లో ఆర్థిక అభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు ఊతంగా నిలుస్తుంటాయి. ఈ అంశంపై తాజాగా ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ పరిశీలన జరిపింది. దేశాలవారీగా జీడీపీలో అక్కడి ‘వ్యాపార’ కుటుంబాల సంస్థల భాగస్వామ్యం ఎంత అన్న అంచనాలు వేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రైవేటు క్యాపిటల్ మార్కెట్లలో కేవలం కుటుంబ కంపెనీల వాటానే 27 శాతం ఉంటుందని తేల్చింది. ఇది మరింతగా పెరుగుతూనే ఉందని పేర్కొంది. ‘వ్యాపార’ కుటుంబాల ఆదాయ శాతంలో ఇండియా ప్రపంచంలోనే టాప్‌లో ఉంది. ఏటా దేశ జీడీపీలో 79 శాతం వరకు పెద్దా, చిన్నా ‘కుటుంబ’ వ్యాపారాల నుంచే సమకూరుతున్నట్టు ఎర్నెస్ట్ అండ్ యంగ్ అంచనా వేసింది. ఈ విలువ 245 లక్షల కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. ఇదీ చదవండి: ఫిబ్రవరి 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం! విలువపరంగా ‘వ్యాపార’ కుటుంబాలు సమకూర్చుతున్న మొత్తాన్ని చూస్తే.. రూ.1,205 లక్షల కోట్లతో అమెరికా ప్రపంచంలో టాప్‌లో ఉంది. 821 లక్షల కోట్లతో చైనా రెండో స్థానంలో ఉంది. వీటి తర్వాత ఇండియా మూడో స్థానంలో ఉంది. -
మైక్రోసాఫ్ట్ జీడీసీ లీడర్‌గా అపర్ణ గుప్తా
Microsoft GDC Leader: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తాజాగా తన కొత్త గ్లోబల్ డెలివరీ సెంటర్ (జీడీసీ) లీడర్ని అధికారికంగా ప్రకటించింది. ఈమె ఎవరు? ప్రస్తుతం ఆమె చేపట్టే బాధ్యతలు ఏవి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మైక్రోసాఫ్ట్ కొత్త గ్లోబల్ డెలివరీ సెంటర్ (జిడిసి) లీడర్‌గా 'అపర్ణ గుప్తా' (Aparna Gupta) బాధ్యతలు స్వీకరించింది. ఈమె కస్టమర్ ఇన్నోవేషన్, డెలివరీ సామర్ధ్యాలను పర్యవేక్షిస్తుంది. 2005లో మైక్రోసాఫ్ట్ ఇండస్ట్రీ సొల్యూషన్స్ డెలివరీ విభాగంగా జీడీసీని హైదరాబాద్‌లో నెలకొల్పారు. ఆ తరువాత ఇది బెంగళూరు, నోయిడా వంటి ప్రాంతాలకు విస్తరించింది. అపర్ణ గుప్తా లీడర్షిప్ లక్షణాలు మాత్రమే కాకుండా మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ మీద కూడా మంచి పట్టుని కలిగి ఉంది, ఆమె సారథ్యంలో కంపెనీ పురోగతి చెందుతుందన్న విశ్వాసం తమకుందని మైక్రోసాఫ్ట్ ఇండస్ట్రీ సొల్యూషన్స్ డెలివరీ కార్పోరేట్ వైస్ ప్రెసిడెంట్ మౌరీన్ కాస్టెల్లో అన్నారు. ఆరు సంవత్సరాల క్రితం, అపర్ణ కమర్షియల్ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ (CSE)గా చేరి.. ఇప్పుడు గ్లోబల్ డెలివరీ సెంటర్ (జిడిసి) లీడర్‌గా ఎంపికైంది. ప్రారంభం నుంచి మంచి ప్రతిభను కనపరిచిన అపర్ణ ఇప్పుడు ఉన్నత స్థాయికి చేరింది, రానున్న రోజుల్లో మరింత గొప్ప స్థాయికి చేరే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
టీమిండియా ఓటమి - పారిశ్రామిక వేత్తల ట్వీట్స్ వైరల్
ఇండియా మూడవ ప్రపంచ కప్ టైటిల్ సొంతం చేసుకుంటుందని ప్రారంభం నుంచి ఎదురు చూసిన భారతీయుల ఆశలు ఫలించ లేదు. ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించి సంబరాలు చేసుకుంటుంటే.. యావత్ భారతం మిన్నకుండిపోయింది. టైటిల్ సొంతం చేసుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించి ఓటమి పాలవ్వడంతో టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఈ సన్నివేశం చూసిన ప్రజలంతా.. ఓటమిలో అయినా గెలుపులో అయినా మేము మీ తోడుంటాం అంటూ ధైర్యం నింపారు. కొంతమంది పారిశ్రామిక వేత్తలు కూడా తమదైన రీతిలో సానుభూతి తెలిపారు. రోహిత్ శర్మ బాధలో ఉన్న దృశ్యంపై ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ 'రాధికా గుప్తా' స్పందిస్తూ.. గొప్ప నాయకులకు కూడా కొన్ని సందర్భాల్లో ఓటమి తప్పదు. భావోద్వేగాలు బలహీనతకు సంకేతం కాదని ఆమె పోస్ట్ చేస్తూ.. ఎంతోమంది మీకు మద్దతుగా నిలుస్తూ ప్రేమను తెలియజేస్తున్నారని ట్వీట్ చేసింది. Great leaders also have bad days. And shedding a tear doesn’t make you weak. A billion hearts giving you ❤️ captain. pic.twitter.com/uMwxIlIuY5 — Radhika Gupta (@iRadhikaGupta) November 19, 2023 ఆనంద్ మహీంద్రా మండే మోటివేషన్ పేరుతో ట్వీట్ చేస్తూ.. ది మెన్ ఇన్ బ్లూ దేశం నలుమూలల నుంచి చాలా భిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చి చివరిదాకా పోరాడి మన హృదయాలను గెలుచుకున్నారు అంటూ వెల్లడించారు. ఇవి ప్రస్తుతం నెట్టింటో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు తమదైన రీతిలో సానుభూతి తెలుపుతున్నారు. This sums up why we didn’t lose. It’s easy for teams to celebrate together;harder to support & share each other’s pain.The Men in Blue came from around the country and from vastly different backgrounds but played as a family and won our hearts. They’re STILL my #MondayMotivation pic.twitter.com/BHatUZ7dKH — anand mahindra (@anandmahindra) November 20, 2023 -
ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం..
వారంలో 70 గంటలు పనిచేయాలంటూ చేసిన వ్యాఖ్యలు మరువక ముందే ఇన్ఫోసిస్ 'నారాయణ మూర్తి' (Narayana Murthy) సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా ఫైనాన్షియల్ అనలిస్ట్ కావడం సులభమే అంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గత కొంతకాలంలో సోషల్ మీడియాలో 70 గంటల పని గురించి చర్చలు వెల్లువెత్తాయి. అవన్నీ ఇప్పుడు కొంత సద్దుమణిగాయి అనేలోపే.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ లేదా ఫైనాన్సియల్ అనలిస్ట్ కావడం చాలా తేలిక, కంపెనీ నడపడం.. వ్యాపారవేత్తగా మారడం చాలా కష్టం అంటూ వ్యాఖ్యానించారు. బిజినెస్ చేయడానికి.. వ్యాపారవేత్తలుగా మారటానికి రిస్క్ తీసుకునే యువకులకు బాసటగా నిలిచేలా సమాజంలో మార్పులు రావాలని ఆయన వెల్లడించారు. 1981లో ఇన్ఫోసిస్‌లో కేవలం ఆరుమంది ఇంజినీర్లు మాత్రమే ఉన్నారని, ఆ తరువాత ఊహకందని రీతిలో వినూత్న ఆలోచనలతో పారిశ్రామికవేత్తలు పెరిగారని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఖాతాల్లోకి రూ.820 కోట్లు పడగానే ఆనందపడిన జనం - అంతలోనే.. దశాబ్దం క్రితం కంటే నేటి యువత గొప్ప ఆత్మవిశ్వాసంతో ఉన్నారని సంక్లిష్ట సమస్యలను సైతం పరిష్కరించే ఉత్సాహం వారిలో ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వ్యాపార రంగంలో అడుగుపెట్టే యువకులకు అందరూ అండగా ఉండాలని చెబుతూ.. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఫైనాన్షియల్ అనాలిసిస్ వంటి వాటి కంటే వ్యాపార రంగం భిన్నంగా ఉంటుందని, ఇందులో సక్సెస్ వస్తుందా? రాదా అనే గ్యారెంటీ ఉండదని.. మొత్తం రిస్క్‌తో కూడుకున్నపని అని నారాయణ మూర్తి పేర్కొన్నారు. -
ఒకప్పుడు రూ. 65 జీతానికి ఉద్యోగం.. ఇప్పుడు వేల కోట్ల కంపెనీకి బాస్! ఎలా అంటే?
ఒక మనిషి జీవితంలో సక్సెస్ సాధించాలంటే కసి, పట్టుదల, నిరంతర శ్రమ అవసరం. అయితే ఉన్నతమైన చదువులు, డాక్టరేట్లు మాత్రమే సక్సెస్ తీసుకువస్తాయనేది అపోహ మాత్రమే అంటున్నారు కొంతమంది నిపుణులు. మనం ఈ కథనంలో కాలేజ్ డ్రాపౌట్ అయిన ఒక వ్యక్తి దేశంలో అగ్రగామి వ్యాపారవేత్తగా ఎలా ఎదిగాడు? ఆయన సక్సెస్ సీక్రెట్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. 'RG చంద్రమోగన్' ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు.. కానీ భారతదేశంలోని బిలినీయర్ల జాబితాలో ఈయన ఒకరు. చంద్రమోగన్ బాల్యం మొత్తం తమిళనాడులోని చెన్నైలో గడిచిపోయింది. చిన్నప్పటి నుంచే లెక్కల మీద మంచి పట్టు ఉండటంతో అందరూ ఇతన్ని 'హ్యూమన్ కంప్యూటర్' అని పిలిచేవారు. గణితంలో ఎంత పట్టు ఉన్నా.. పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం వల్ల 21 సంవత్సరాల వయసులోనే చదువుకు దూరమయ్యాడు. తన తండ్రి చిన్న ప్రొవిజనల్ స్టోర్ నడిపేవాడు, కానీ చంద్రమోగన్ అదికాదని ఒక టింబర్ డిపోలో కేవలం రూ. 65 జీతానికి ఉద్యోగం ప్రారంభించాడు. ఒక సంవత్సరం తరువాత ఆ ఉద్యోగం మానేసి 250 చదరపు అడుగుల విస్తీర్ణంలో ముగ్గురు కార్మికులతో ఐస్ క్రీమ్ వ్యాపారం ప్రారంభించాడు. కేవలం రూ. 13,000తో ప్రారంభమైన ఐస్ క్రీమ్ బిజినెస్ ప్రారంభంలో కొంత నష్టాలను చవిచూసింది. అప్పట్లో 15 తోపుడు బండ్ల మీద వ్యాపారం ప్రారంభించి మొదటి ఏడాదిలో రూ. 1.5 లక్షలు రావడంతో చంద్రమోగన్కు వ్యాపారం మీద కొంత నమ్మకం కలిగింది. 1981లో చిన్న పట్టణాలలో వ్యాపారం విస్తరించడం ప్రారంభించాడు. ఇదే ఆయన పురోగతికి పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది. ఇదీ చదవండి: నెహ్రూ ఐడియా & జెఆర్‌డీ టాటా విజన్‌తో పుట్టిన కంపెనీ ఇదే! ఐస్ క్రీమ్ బిజినెస్ రోజురోజుకి వృద్ధి చెందుతూ 'అరుణ్' ఐస్ క్రీమ్ పేరుతో తమిళనాడులో మంచి ప్రజాదరణ పొందాడు. 1986లో హ్యాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్ పేరుతో వ్యాపారం చేయడం ప్రారంభించాడు. ఇది భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ డెయిరీ కంపెనీలలో ఒకటిగా ప్రతిరోజూ 10,000 గ్రామాలలో 4 లక్షల మంది రైతుల నుంచి పాలను సేకరిస్తుంది. ఇదీ చదవండి: అద్దె భవనంలో ప్రపంచ కుబేరుడు 'జెఫ్ బెజోస్' - రీజన్ తెలిస్తే షాక్ అవుతారు! ప్రస్తుతం హ్యాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్ మార్కెట్ క్యాప్ రూ.18,889 కోట్లుగా ఉంది. ఫోర్బ్స్ సంపన్నుల జాబితా ప్రకారం RG చంద్రమోగన్ నేడు రూ. 13,000 కోట్ల కంటే ఎక్కువ నికర విలువను కలిగి ఉన్నారు. అతని కంపెనీ పాల ఉత్పత్తులను 42 దేశాల్లో ఉపయోగిస్తున్నారు. చంద్రమోగన్ ఛైర్మన్‌గా ఉండగా, ఆయన కుమారుడు సి సత్యన్ ఇప్పుడు హ్యాట్సన్ను మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. -
నెహ్రూ ఐడియా & జెఆర్‌డీ టాటా విజన్‌తో పుట్టిన కంపెనీ ఇదే!
బ్యూటీమీద ఎక్కువ దృష్టిపెట్టేవారికి 'లాక్మే' (Lakme) బ్రాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని రకాల సౌందర్య సాధనాలు, అలంకరణలను సంబంధించిన వస్తువులు ఇక్కడ లభిస్తాయి. నేడు కాస్మొటిక్ రంగంలో దూసుకెళ్తున్న ఈ కంపెనీ నిర్మించడం వెనుక భారతదేశ మొదటి ప్రధాని 'జవహర్ లాల్ నెహ్రూ' ఉన్నట్లు చాలామందికి తెలియకపోవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. జెఆర్‌డీ టాటాతో చర్చ.. భారతదేశానికి స్వాతంత్య్రం రాక ముందు నుంచే మహిళలు సౌందర్య సాధనాలు ఉపయోగించేవారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మేడ్ ఇన్ ఇండియా కంపెనీ అవసరమని భావించిన నెహ్రూ ప్రముఖ పారిశ్రామిక వేత్త జెఆర్‌డీ టాటాతో చర్చించారు. దీనికి ఏకీభవించిన టాటా 1952లో లాక్మేను టాటా ఆయిల్ మిల్స్ అనుబంధ సంస్థగా స్థాపించారు. లాక్మే అనేది భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ కాస్మొటిక్ కంపెనీ. మహిళలు విదేశీ వస్తువులను అధికంగా వినియోగిస్తున్న కారణంగా జవహర్ లాల్ నెహ్రూ దీని ఏర్పాటుకి కారకుడయ్యాడు. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీయకుండా ఉండాలంటే స్వదేశీ కంపెనీ అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదీ చదవండి: ఇక ఆ జియో రీఛార్జ్ ప్లాన్ లేదు.. కొత్త ప్లాన్ ఏంటంటే? లాక్మే అంటే ఫ్రెంచ్ భాషలో.. నిజానికి జెఆర్‌డీ టాటా ఈ కంపెనీ ప్రారంభించిన సమయంలో సంస్థకు ఏ పేరు పెట్టాలని తీవ్రంగా ఆలోచించాడు. అప్పట్లో సామాన్యులకు కూడా నచ్చే విధంగా ఉండాలని కొంతమంది ప్రతినిధులతో చర్చించి 'లాక్మే' అని నామకరణం చేశారు. లాక్మే అంటే ఫ్రెంచ్ భాషలో 'లక్ష్మీదేవి' అని అర్థం. పురాణాల్లో లక్ష్మీదేవి అందానికి ప్రతిరూపంగా భావించేవారు కావున ఈ పేరునే స్థిరంగా ఉంచేశారు. ఇదీ చదవండి: చంద్రయాన్-3 బడ్జెట్ కంటే ఖరీదైన కారు.. ఇలాంటి మోడల్ ఇప్పటి వరకు చూసుండరు..! ప్రారంభంలో లాక్మే ముంబైలోని ఒక చిన్న అద్దె ఇంట్లో ప్రారంభమైంది. ఇది ప్రారంభమైన అతి తక్కువ సమయంలో మంచి ప్రజాదరణ పొందింది. ఈ కంపెనీ ప్రారంభించిన తరువాత దాదాపు విదేశీ వస్తువుల దిగుమతి భారతదేశంలో ఆగిపోయింది. 1961లో నావల్ టాటా భార్య సిమోన్ టాటా ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. సంస్థ అభివృద్ధికి ఈమె ఎంతగానో కృషి చేసింది. -
ఆరుపదుల వయసులో రూ. 23,000కోట్ల అధిపతిగా.. ఎవరీ లచ్మన్ దాస్ మిట్టల్
Sonalika Tractors Founder Success Story: జ్ఞానం పెంచుకోవడానికి వయసుతో సంబంధం లేనట్లుగానే.. ఒక వ్యక్తి సక్సెస్ సాధించడానికి కూడా వయసుతో పని లేదు. పిల్లాడి దగ్గరి నుంచి వయసుడిగిన వృద్దులు వరకు తమదైన ఆలోచనలతో ఎవరైనా విజయం సాధించవచ్చు. అలాంటి కోవకు చెందిన 'లచ్మన్ దాస్ మిట్టల్' (Lachhman Das Mittal) గురించి ఈ కథనంలో తెలుసుసుకుందాం. 60ఏళ్ల వయసులో కంపెనీ.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) నుంచి బయటకు వచ్చిన తరువాత ఓ కొత్త రంగానికి పునాది వేసాడు. అదే సోనాలిక (Sonalika) ట్రాక్టర్స్. 60ఏళ్ల వయసులో కంపెనీ ప్రారంభించి ఈ రోజు భారతదేశంలోని ప్రముఖ ట్రాక్టర్ తయారీదారులలో ఒకరుగా నిలబడ్డారు. దీన్ని బట్టి చూస్తే ఇందులో ఆయన కృషి, పట్టుదల మనకు స్పష్టంగా కనిపిస్తాయి. సోనాలికా ట్రాక్టర్.. నివేదికల ప్రకారం, 1990లో తన వ్యాపార వృత్తిని ప్రారంభించిన మిట్టల్ 1995లో పంజాబ్‌లో సోనాలికా ట్రాక్టర్లను మొదలెట్టాడు. ఇదే ప్రస్తుతం భారతదేశపు మూడవ అతిపెద్ద ట్రాక్టర్ ఉత్పత్తిదారుగా.. ఏడాది 3 లక్షల ట్రాక్టర్లను ఉత్పత్తి చేసినట్లు సమాచారం. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతిదారుల జాబితాలో అగ్రగామిగా నిలిచింది. దీని వాటా ఏకంగా 11.7శాతం కావడం గమనార్హం. పెద్ద ఎదురు దెబ్బ.. ఎల్ఐసీతో కలిసి పని చేయడం ద్వారా లక్మన్ దాస్ మిట్టల్ పొదుపు, పెట్టుబడి గురించి అవగాహన పొందాడు. దీంతో తన డబ్బును బ్యాంకు ఖాతాల్లో సేవ్ చేసుకోకుండా అనేక స్కీమ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాడు. ఆ తరువాత సైడ్ వెంచర్‌గా వ్యవసాయ పరికరాల కంపెనీ స్టపించాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో ఊహించని పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. పెట్టుబడులు అన్నీ పోయాయి. ఇదీ చదవండి: పాముల పెంపకం.. కోట్లలో ఆదాయం - ఎక్కడో తెలుసా? 74 దేశాలకు ఎగుమతి.. భారీ నష్టాలను చవి చూసినప్పటికీ మిట్టల్ పట్టువదలని విక్రమార్కుని మాదిరిగా ఒకసారి గోధుమ, ఎండుగడ్డిని వేరు చేసే యంత్రం గమనించాడు. దీంతో అతనికి కొత్త ఆలోచనలు పుట్టుకొచ్చాయి. ఇందులో భాగంగా నూర్పిడి యంత్రాలు నిర్మించడం ప్రారంభించాడు. ఇవి కేవలం ఎనిమిది సంవత్సరాల్లో ఊహకందని విజయం పొందింది. ఆ తరువాత ట్రాక్టర్లను నిర్మించడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ సోనాలిక ట్రాక్టర్లు 74 దేశాలకు ఎగుమతి అవుతున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: మానవాద్భుత సృష్టి.. వీడియో చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు! నికర విలువ.. సోనాలికా ట్రాక్టర్స్ ఫ్లాగ్షిప్ కంపెనీ, ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ బాధ్యతలు మిట్టల్ కుమారులు అమృత్ సాగర్, దీపక్, మనవళ్లు రామన్, సుశాంత్ అండ్ రాహుల్‌లకు అప్పగించారు. ఫోర్బ్స్ ప్రకారం లచ్మన్ దాస్ మిట్టల్ నికర విలువ రూ. 23,000 కోట్ల కంటే ఎక్కువని తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 12న కేషుబ్ మహీంద్రా మరణించిన తర్వాత, మిట్టల్ ఇప్పుడు దేశంలోనే అత్యంత వృద్ధ బిలియనీర్‌గా ఖ్యాతి పొందాడు. -
బొమ్మకారుతో ఆడుకుంటున్న ఈ ప్రపంచ కుబేరుడిని గుర్తుపట్టారా?
ప్రపంచ దేశాల్లో ఎందరెందరో దిగ్గజ పారిశ్రామికవేత్తలున్నారు. ఎంతమంది ఉన్నా టెస్లా సీఈఓ మాత్రం చాలా ప్రత్యేకం. కొత్త కొత్త ఆలోచనలతో ఎప్పటికప్పుడు ట్రెండ్ సెట్ చేస్తూ తనదైన రీతిలో పాపులర్ అవుతున్నారు. ఓ వైపు ఆటోమొబైల్ బ్రాండ్, మరో వైపు ట్విట్టర్ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తూ.. నేడు కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. మనం చెప్పుకుంటున్న ఎలాన్ మస్క్ ఈ రోజు ఎలా ఉంటాడో దాదాపు అందరికీ తెలుసు. అయితే చిన్నప్పుడు ఎలా ఉంటాడో చాలామందికి తెలియకపోవచ్చు. మస్క్ తల్లి 2020లో ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన ఫొటోలో చిన్నప్పటి 'మస్క్' ఎలా ఉంటాడో తెలుస్తోంది. అట బొమ్మలతో ఆడుకుంటూ ప్రపంచంతో సంబంధం లేకుండా కనిపించే ఈ బుడతడే.. ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడయ్యాడు. (ఇదీ చదవండి: ఆత్మీయుల మరణంతో సన్యాసం - ఓ కొత్త ఆలోచనతో వేల కోట్లు!) ప్రపంచంలోని 500 మంది ధనవంతుల జాబితాలో ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈయన సంపద సుమారు 192.3 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువని నివేదికలు చెబుతున్నాయి. తాజాగా మస్క్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో మరోసారి వైరలవుతోంది. -
బిజినెస్ టైకూన్ల తొలి జాబ్ ఏదో తెలుసా? మెగా స్టార్ల సక్సెస్ జర్నీ తెలుసా?
కష్టాల్లేని జీవితం ఉంటుందా? అంటే కచ్చితంగా ఉండదు. తర తమ స్థాయిల్లో ఏదో ఒక కష్టం, నష్టం ఉంటూనే ఉంటుంది. నిజానికి కష్టాలు కన్నీళ్లు, అవమానాలు, ఓటములు లేని జీవితంలో కిక్కే ఉండదు. పడాలి..లేవాలి.. ఫీనిక్స్ పక్షిలా పునరుజ్జీవంతో పైపైకి ఎదగాలి. మనలో చాలామంది చాలాసార్లు అనేక విషయాల్లో అనేక స్లారు ఫెయిల్ అవుతాం. అంతమాత్రాన ప్రయత్నాలు ఆపేస్తే ఎలా? అందరూ సిల్వర్ స్పూన్తోనే పుట్టరు. ఎదగాలని తపన ఉంటే చాలు.. మనకు మనమే పోటీ. చిన్న చిన్న ఉద్యోగాల తోనే అందలాన్ని ఎక్కిన వాళ్లు, ఎన్ని కష్టాలొచ్చినా వెరవక ఒక్కో మెట్టు ఎదిగారు. అలాంటి దిగ్గజాల స్ఫూర్తి దాయక ప్రస్థానం చూడండి.. ధీరూ భాయి అంబానీ: ఆసియా బిలియనీర్ ముఖేష్ అంబానీ తండ్రి ధీరూ భాయి అంబానీ కూడా చిన్న ఉద్యోగంతో మొదలుపెట్టి రిలయన్స్ లాంటి దిగ్గజ సంస్థకు ప్రాణం పోశారు. దుబాయ్‌లో పెట్రోలు బంకులో పనిచేసిన ధీరూ భాయ్ అంబానీ 1957లో దేశానికి తిరిగి వచ్చి దిగ్గజ కంపెనీ రిలయన్స్‌కు పునాది వేశారు. రతన్ టాటా బ్రిటీష్ ఇండియాలోని బొంబాయిలో 1937, 28 డిసెంబర్ పుట్టిన రతన్ టాటా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1961లో టాటా స్టీల్ షాప్ ఫ్లోర్లో బ్లాస్ట్ ఫర్నేస్, పార సున్నపురాయి సంస్థలో తొలి ఉద్యోగం చేశారు. నిబద్ధతకు, నిజాయితీకి మారుపేరుగా దేశంలోని గొప్ప వ్యాపారవేత్తలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఎలాన్ మస్క్: చిన్నతనం నుంచి అంతరిక్షంపై ఆసక్తి ఎక్కువగా ఉన్న మస్క్ తన 12వ ఏటా స్పేస్ థీమ్డ్ వీడియో గేమ్ బ్లాస్టర్‌కు కోడింగ్ చేశాడు. ఇపుడు సోషల్ మీడియా ప్లాట్‌పాం ట్విటర్ టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేతగా మస్క్ ఉన్నాడు. మార్క్ జూకర్బర్గ్ ఫేస్బుక్, మెటా వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌కి చిన్నతనం నుంచే ఇంటర్నెట్, టెక్నాలజీపై ఆసక్తి ఎక్కువ. 18 ఏళ్లకే జుకర్‌బర్గ్ సినాస్సీ అనే మ్యూజిక్ రికమండేషన్ యాప్ తయారుచేశాడు. ఇపుడు మెటా ఫౌండర్‌గా బిలియనీర్‌గా ఉన్నాడు. జెఫ్ బెజోస్: 1980లో తొలి ఉద్యోగం మెక్ డోనాల్డ్స్‌లో ఫ్రై కుక్‌గా ఉద్యోగం, తొలి జీతం గంటకు రెండు డాలర్లు మాత్రమే సంపదన. ఆ తరువాత వాల్ స్ట్రీట్ హెడ్జ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. చివరికి 1994లో వాషింగ్టన్‌లోని బెల్లేవ్‌లోని గ్యారేజీలో అమెజాన్‌లో జాబ్ చేశారు. ఇపుడు అమెజాన్ సీఈవోగా తన ప్రతిభను చాటుకుంటున్నారు. ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి: ఐఐఎం అహ్మదాబాద్‌లో ఫ్యాకల్టీ, తరువాత రిసెర్చ్ అసోసియేట్‌గా మొదలైన ఆయన ప్రయాణం దేశంలో ఐటీ దిగ్గం ఇన్ఫోసిస్ కో వ్యవస్థాపకుడి దాకా చేరింది. ఐటీ రంగంలో నారాయణమూర్తిని మెగాస్టార్ అనడంలో ఎలాంటి సందేహంలేదు. వారెన్‌బఫెట్ బెర్క్లైన్ హాత్వే ఛైర్మన్, స్టాక్ మార్కెట్ దిగ్గజం వారెన్‌బఫెట్ 1944లో వాషింగ్టన్ పోస్ట్ పేపర్ బాయ్‌గా ఉద్యోగం, నెల జీతం 173 డాలర్లు . కేఎఫ్‌సీ: అనేక ప్రయత్నాల్లో వైఫల్యాలు, ఓటమి తరువాత కెంటకీ ఫ్రైడ్ చికెన్ హర్లాండ్ శాండర్స్ 60 వ ఏట కేఎఫ్‌సీ మొదలు పెట్టి బిలియనీర్‌గా అవతరించారు. అబ్దుల్ కలాం: మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలాం కూడా బీద కుటుంబం నుండే వచ్చారు. కానీ దేశ మొదటిపౌరుడిగా ఉండారని కలగన్నారా? కానీ దేశాధ్యక్షుడిగా సేవలందించిన ఘనతను చాటుకున్నారు. స్టీఫెన్ హాకింగ్: ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త విశ్వ రహస్యాలను చేధించిన వ్యక్తి. 21 సంవత్సరాల వయస్సులో సమస్య, 1980ల పూర్తిగా పవర్చైర్ కే అంకితం. అయినా కడ శ్వాస దాకా విశ్వం గురించిన లోతైన అధ్యయనాలోతేనే గడిపారు. నటి మర్లీ మాట్లిన్ చిన్నప్పటి నుండి అవకరంతోనే జీవించారు. మా కానీ ఎక్కడి కృంగిపోలేదు. ధైర్యంగా వృత్తిలో ముందుకు సాగారు. 18 నెలల వయస్సులోనే వినికిడిని దాదాపు కోల్పోయి,ఉత్తమ నటిగా అకాడమీ అవార్డును గెలుచుకున్న మొదటి చెవిటి నటిగా ఖ్యాతి పొందారు. నాట్య మయూరి సుధా చంద్రన్: తనకు జరిగిన ప్రమాదం, కాలు కోల్పోవడం ఇవన్నీ అనుకోకుండా ఎదురైనా తీవ్ర కష్టాలు. కానీ కృత్రిమ కాలుతో నాట్యం చేయాలన్న తపనను తీర్చుకున్నారు. అంతేకాదు తన లాంటి వారెందరికో గొప్ప స్ఫూర్తిగా నిలిచారు. ఏఆర్ రెహమాన్: ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ తండ్రి చిన్నప్పుడే పోయారు. కుటుంబ భారం మీద పడింది. అయినా చిన్న చిన్న పనులు చేసుకుంటూ, తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ తన కలను సాకారం చేసుకున్నారు. గొప్ప మ్యూజిక్ డైరెక్టర్‌గా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. అమితాబ్ బచ్చన్ అంత ఎందుకు సన్నగా పీలగా, పొడవుగా ఉండే అమితాబ్ బచ్చన్ సినిమాలకు పనికిరావనే అవమానాన్ని ఎదుర్కొన్నాడు. మరిపుడు అనేక బ్లాక్ బస్టర్ మూవీలను బాలీవుడ్‌కు అందించి బాలీవుడ్ మెగాస్టార్‌గా అవతరించాడు. ఇప్పటికీ ఆయన సూపర్ స్టారే. ఇలా చెప్పుకుంటే పోతే థామస్ ఆల్వా ఎడిసన్ మొదలు, గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్లు జీవితాలు ఆదర్శం కావాలి. అలాగే ఇవాల్టి స్టార్టప్ యుగంలో స్టార్టప్ కంపెనీలతో మొదలై వేలకోట్ల వ్యాపార సామ్రజ్యాన్ని సృష్టిస్తున్నవారు చాలామందే ఉన్నారు. సంకల్పం ఉంటే చాలు.. ఎలాంటి కష్టమైనా దిగదిడుపే. -
బిజినెస్‌లోనూ బన్నీనే టాప్.. కేఫ్ నుంచి థియేటర్ దాకా..
టాలీవుడ్ చిత్ర సీమలో తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన 'అల్లు అర్జున్' (Allu Arjun) కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా వ్యాపారవేత్తగా కూడా పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో బఫెలో వైల్డ్ వింగ్స్, అల్లు స్టూడియోస్, ఏఏఏ సినిమాస్ వంటి బిజినెస్‌లు చేస్తూ భారీగా ఆర్జిస్తున్నాడు. బన్నీ వ్యాపారాలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బఫెలో వైల్డ్ వింగ్స్ (Buffalo Wild Wings) అల్లు అర్జున్ ప్రముఖ అమెరికన్ స్పోర్ట్స్ బార్ అండ్ రెస్టారెంట్ చైన్ అయిన 'బఫెలో వైల్డ్ వింగ్స్' కోసం ఫ్రాంచైజీని కలిగి ఉన్నాడు. హైదరాబాద్ రోడ్ నెం. 36 జూబ్లీహిల్స్‌లో సందడిగా ఉండే ప్రాంతంలో ఇది ఎంతో మంది ఆహార ప్రియులకు మంచి ఉత్సాహభరితమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఆహా ఓటీటీ ప్లాట్‌ఫారమ్ (Aha OTT Platform) తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రసారం చేయడానికి వినియోగదారులను అనుమతించే ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫామ్‌కి అల్లు అర్జున్ కో-ఫౌండర్. ఆహా ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఉంది. ఇది మంచి కార్యకలాపాలకు, కంటెంట్ సృష్టికి కేంద్రంగా పనిచేస్తుంది. (ఇదీ చదవండి: పాకిస్థాన్ ప్రజల మనసు దోచిన పాపులర్ కార్లు ఇవే!) అల్లు స్టూడియోస్ (Allu Studios) అల్లు స్టూడియోస్ అనేది అల్లు అర్జున్‌కి చెందిన అత్యాధునిక చిత్ర నిర్మాణ సంస్థ. ఇది రోడ్ నెం.10, జూబ్లీహిల్స్ హైదరాబాద్‌లో ఉంది. ఇందులో పోస్ట్ ప్రొడక్షన్ సౌకర్యాలు, ఆడియో రికార్డింగ్ వంటి అనేక సేవలు, మౌలిక సదుపాయాలు లభిస్తాయి. దీనిని హాస్యనటుడు అల్లు రామలింగయ్య స్మారకార్థం అల్లు స్టూడియోస్ ప్రారంభించారు. (ఇదీ చదవండి: హోండా సంచలన ప్రకటన.. దెబ్బకు 13 లక్షల కార్లు వెనక్కి - కారణం ఇదే!) ఏఏఏ సినిమాస్ (AAA Cinemas) ఇటీవల అల్లు అర్జున్ హైదరాబాద్ అమీర్‌పేట్‌లో ఏఏఏ సినిమాస్ అనే ఆధునిక మల్టీప్లెక్స్ ప్రారంభించాడు. ఇందులో మొత్తం 5 స్క్రీన్లు ఉన్నట్లు సమాచారం. ఇందులో మొదటి స్క్రీన్ 67 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది డాల్బీ అట్మాస్ సౌండ్‌తో బార్కో లేజర్ ప్రొజెక్షన్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. దక్షిణాదిలో ఎల్ఈడీ స్క్రీన్ ఉన్న ఒకే ఒక్క థియేటర్ ఇదే కావడం గమనార్హం. -
టాటా కంపెనీలో ఒకప్పుడు రోజులు గుర్తొచ్చేశాయి - సుధామూర్తి
భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచంలోని చాలా దేశాల్లో 'రతన్ టాటా' (Ratan Tata) గురించి తెలుసు. దీనికి ప్రధాన కారణం ఈయన గొప్ప పారిశ్రామిక వేత్త అని మాత్రమే కాదు.. దాత్రుత్వంలో కలియుగ కర్ణుడగా కీర్తించబడటం కూడా. టాటా మోటార్స్ కంపెనీ ఇప్పుడు భారతదేశంలో తిరుగులేని సంస్థగా అవతరించినప్పటికీ దీని ఫౌండర్ మాత్రం JRD టాటా. జెఆర్‌డి టాటా ప్రారంభించిన ఈ కంపెనీలో మొదటి మహిళా ఇంజనీర్ ఇన్ఫోసిస్ చైర్పర్సన్ 'సుధామూర్తి' (Sudha Murty) అని చాలా మందికి తెలియకపోవచ్చు. నిజానికి సుధామూర్తి టాటా కంపెనీలో ఇంజనీర్ కావడం వెనుక పెద్ద కథే ఉంది. అప్పట్లో టాటా సంస్థను టెల్కో అని పిలిచేవారు. ఇప్పుడు టాటా కంపెనీలో సగం మంది మహిళలు పనిచేయడానికి ప్రధాన కారకురాలు కూడా ఈమే కావడం గమనార్హం. 1974లో బెంగళూరులో టాటా ఇన్స్టిట్యూట్లో సుధామూర్తి ఎమ్.టెక్ చేస్తున్న సమయంలో తమ క్లాసులో అందరూ అబ్బాయిలే ఉండేవారని, అంతకు ముందు బీఈ చేసినప్పుడు కూడా క్లాసులో తానొక్కటే అమ్మాయని వెల్లడించింది. ఒకరోజు కాలేజీ నోటీస్ బోర్డులో ఉన్న ప్రకటనలో పుణెలోని టెల్కో కంపెనీలో పనిచేసేందుకు ఉత్సాహవంతులైన యువకులు కావాలని ఉండటం చూసింది. అయితే అందులోనే యువతులు అప్లై చేసుకోకూడదని అందులో వెల్లడించారు. (ఇదీ చదవండి: ఆ ఖరీదైన కార్లన్నీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గ్యారేజీలోనే! అవేంటంటే..) ఇది చూడగానే ఆమెకు పట్టరాని కోపం వచ్చి హాస్టల్‌కి వెళ్లి జేఆర్డీ టాటాకు లేఖ రాసి అందులో మహిళలు సంస్థలో అవకాశం ఇవ్వకపోతే భారతదేశం ఎప్పటికీ అభివృద్ధి చెందదని.. సమాజంలో 50 శాతం పురుషులు ఉంటే మిగిలిన 50 శాతం మంది స్త్రీలు ఉన్నారు. ఉద్యోగావకాశాలను కేవలం పురుషులను మాత్రమే ఎంపిక చేస్తే సమాజం ఎలా ముందుకు పోతుందని ప్రశ్నించినట్లు చెప్పింది. (ఇదీ చదవండి: ప్రపంచంలో ఇదే బెస్ట్ ఎయిర్ లైన్! భారత్ ఎక్కడుందంటే?) లేఖను అనుసరించి జెఆర్‌డీ టాటా సుధామూర్తిని ఇంటర్వ్యూకి పిలిచారు, ఆ తరువాత అందులో పనిచేసారు. అయితే సుధా మూర్తి సోషల్ మీడియావైలో చేసిన ఒక పోస్ట్ ప్రకారం, సుమారు 40-50 సంవత్సరాల తరువాత టాటా మోటార్స్‌గా పిలవబడే పూణే టెల్కోను సందర్శించినట్లు.. అక్కడ 300 మందికి పైగా మహిళలు పనిచేస్తున్నారని, అది చూడగానే తనకు ఏడుపు వచ్చిందని చెప్పుకొచ్చింది. ఇదంతా సుధామూర్తి రతన్ టాటా తాతకు చేసిన ఆ ఒక్క అభ్యర్థన ప్రతి ఫలమే. -
చిన్నప్పుడు స్కూల్లో నన్ను ఇలా ఎగతాళి చేసేవారు - అనంత్ అంబానీ
ఈ రోజు యావత్ భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరైన ముఖేష్ అంబానీ గురించి అతని కుటుంబం గురించి దాదాపు అందరికి తెలుసు. ఎన్నెన్నో వ్యాపారాలు చేస్తూ కోట్లకు కోట్లు గడిస్తూ దేశంలో అత్యంత సంపన్నులుగా విరాజిల్లుతున్న. అయితే ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ చదువుకునే రోజుల్లో తాను చదివిన స్కూల్లో తోటి స్నేహితులు ఎగతాళి చేసేవారని తెలిసింది. ఇంతకీ అనంత్ అంబానీని ఎందుకు ఎగతాళి చేసేవారు, ఏ కారణంతో ఎగతాళి చేసేవారని మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రస్తుతం అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతూ.. ఖరీదైన అన్యదేశ్య కార్లు, ఇతర ఖరీదైన వస్తువులు ఉపయోగించే అనంత్ అంబానీ చిన్నప్పుడు పాకెట్ మనీగా కేవలం రూ. 5 మాత్రమే తీసుకెళ్లేవాడని తెలిసింది. ఇతడు అయితే ముఖేష్ అంబానీకి చెందిన ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకునేటప్పుడు క్యాంటీన్లో ఖర్చు చేయడానికి ఐదు రూపాయలు తీసుకెళ్తే తోటి విద్యార్థులంతా 'తూ అంబానీ హై యా భికారీ' అని ఎగతాళి చేసేవారని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. కొడుకు చెప్పిన మాటలకు నీతా అంబానీ, ముఖేష్ అంబానీ ఇద్దరూ ఉలిక్కి పడ్డారు. (ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రా ఇకనైనా శ్రద్ద పెట్టండి - నెట్టింట్లో మహిళ ట్వీట్ వైరల్!) భారతదేశంలో అత్యంత సంపన్న కుటుంబానికి చెందిన వారైనప్పటికీ ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ వినయ ప్రవర్తన, మంచి సంప్రదాయాలను నేర్చుకున్నారు. అనంత్ అంబానీ బ్రౌన్ యూనివర్శిటీలో చదువు పూర్తి చేసి ప్రస్తుతం అనేక రిలయన్స్ వెంచర్లకు డైరెక్టర్‌గా ఉన్నారు. ఇతడు త్వరలోనే రాధిక మర్చంట్‌ను వివాహం చేసుకోనున్నాడు. ఇతని నికర ఆస్తుల విలువ సుమారు 40 బిలియన్ డాలర్లు అని సమాచారం. -
ఇండియాలో బిజినెస్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్న అమెరికన్ సిస్టర్స్.. ఎలా అంటే?
Atmosphere Kombucha: గత కొన్ని సంవత్సరాలుగా జాబ్ చేసేవారి సంఖ్య కంటే సొంతంగా ఏదైనా బిజినెస్ చేయాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ కారణంగా ఎన్నెన్నో ఆటంకాలను ఎదుర్కొని జీవితంలో సక్సెస్ సాధిస్తున్నారు. కొంత మంది తమ వ్యాపారాలను అమెరికా వంటి అగ్ర దేశాల్లో ప్రారంభించాలని కలలు కంటూ ఉంటారు. కానీ అమెరికాలో చదువుకున్న చెందిన ఇద్దరు అమ్మాయిలు ఇండియాలో బిజినెస్ చేస్తూ కోట్లలో సంపాదిస్తున్నారు. ఇంతకీ ఈ అమెరికన్ సిస్టర్స్ ఎవరు? వారు ఇండియాలో చేస్తున్న బిజినెస్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతదేశంలో ఎంతో మంది యువకులు తమ నూతన ఆలోచనలతో ఎన్నెన్నో వ్యాపారాలను ప్రారంభించి విజయవంతమయ్యారు. ఉన్నత చదువులు చదవని వారు కూడా ఇందులో ఉందులో ఉండటం గమనార్హం. విదేశాల నుంచి వచ్చిన వారిలో కూడా చాలామంది భారతదేశంలో వ్యాపారాలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అలాంటి కోవకు చెందిన వారిలో 'రెబెకా సూద్ & అరియెల్లా బ్లాంక్' ఉన్నారు. (ఇదీ చదవండి: పాకిస్థాన్‌లో అత్యంత ధనవంతురాలైన హిందూ మహిళ.. సంపాదన తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?) అట్మాస్పియర్ కొంబుచ అమెరికాలో చదువుకున్న రెబెకా సూద్, అరియెల్లా బ్లాంక్ ఇద్దరూ 2018లో దేశ రాజధాని ఢిల్లీలో 'అట్మాస్పియర్ కొంబుచ' (Atmosphere Kombucha) అనే పేరుతో వ్యాపారం మొదలు పెట్టారు. కొంబుచ అంటే పర్మెంటేడ్ అండ్ ఫ్లేవర్డ్ టీ డ్రింక్ అని అర్థం. గ్రీన్ టీని బ్యాక్టీరియా అండ్ ఈస్ట్‌తో పులియబెట్టడం ద్వారా ఈ ఉత్పత్తులు తయారు చేస్తారు. అవి అన్యదేశ లైమ్, కోలా, మామిడి పీచు, లీచీ లవ్, ఎల్డర్ఫ్లవర్, బ్లూబెర్రీ లావెండర్ వంటి వివిధ ఫ్లేవర్స్‌లో లభిస్తాయి. ఒక కొంబుచ బాటిల్ ధర రూ. 220 వరకు ఉంటుంది. (ఇదీ చదవండి: మెట్లెక్కిన మహీంద్రా స్కార్పియో ఎన్.. వైరల్ అవుతున్న వీడియో & ఫిదా అవుతున్న జనం) అరియెల్లా బ్లాంక్ & రెబెకా సూద్ ఇద్దరూ ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో జన్మించినప్పటికీ పాఠశాల విద్య పూర్తయిన తరువాత అమెరికాకు వెళ్లారు. అక్కడే ఈ ఇద్దరూ కంప్యూటర్ సైన్స్ కోర్సులు చదివారు. ఇందులో అరియెల్లా బ్లాంక్ భారతదేశంలో గత ఆరు సంవత్సరాలుగా వెల్నెస్ కేఫ్‌లు, కార్పొరేట్లలో వందకు పైగా సెషన్లకు నాయకత్వం వహించింది. ఇక రెబెకా చైనాలో కూడా పనిచేసింది. ఆ తరువాత ఇండియా వచ్చింది. ఈ ఇద్దరూ కలిసి రూ. 25 లక్షల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించారు. దీనికి వారి తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సహాయం తీసుకున్నారు. ప్రస్తుతం వీరి టర్నోవర్ నెలకు రూ. 20 లక్షల కంటే ఎక్కువ అని తెలుస్తోంది. View this post on Instagram A post shared by Atmosphere Studio (@atmosphere.in) -
రూ. 1000 కోట్ల సామ్రాజ్యం సృష్టించిన పేదవాడి సక్సెస్ స్టోరీ..!!
ఇది వరకు మనం చాలా సక్సెస్ స్టోరీలను గురించి తెలుసుకున్నాము. ఇందులో కొంత మంది డబ్బున్న కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి సక్సెస్ కొట్టిన వారు ఉన్నారు. అయితే ఇప్పుడు పేదరికం నుంచి వచ్చి రూ. 1000 కోట్లు సామ్రాజ్యం సృష్టించిన 'విజయ్ సుబ్రమణియమ్' గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ రోజు 'రాయల్ ఓక్' (Royal Oak) ఫర్నిచర్ కంపెనీ గురించి ప్రత్యేకంగా పరిచయమే అవకాశం లేదు, కానీ దాన్ని స్థాపించిన విజయ్ గురించి మాత్రం తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే సుమారు ఇరవై సంవత్సరాలు కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరులో ఒక ప్రభుత్వ కళాశాలలో బీకామ్ చేశారు. కుటుంబాన్ని పోషిచే ఒకే వ్యక్తి విజయ్ కావడంతో మాస్టర్ డిగ్రీ చేయలేకపోయాడు. బీకామ్ పూర్తయిన తరువాత సింగపూర్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని వారి బంధులలోనే ఒకరు తనని మోసం చేసారని ఒక సందర్భంలో వెల్లడించారు. ఆ తరువాత కేరళలోని మున్నార్‌కు వెళ్లి అక్కడ క్రెడిట్ కార్డు ఏజెంట్‌గా పని చేయడం ప్రారంభించాడు. ఆ తరువాత 1997లో చెన్నై వెళ్లి ప్లాస్టిక్ వస్తువుల వ్యాపారం ప్రారంభించి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా 10 రోజులలో రూ.2800 విలువైన వస్తువులను విక్రయించగలిగాడు. (ఇదీ చదవండి: బిర్యాని అమ్ముతూ రూ. 10 కోట్లు టర్నోవర్.. బెంగళూరు యువతి సక్సెస్ స్టోరీ!) విజయ్ సుబ్రమణియమ్ 2001లో బెంగళూరులోని సఫీనా ప్లాజాలో స్టాల్ ప్రారంభించడం ఆయన జీవితానికి పెద్ద మలుపుగా మారింది. ఆ తరువాత బిగ్ బజార్ తమ అవుట్‌లెట్‌లో స్టోర్‌ను ఏర్పాటు చేయమని కోరింది. ఆ తరువాత కారు కొనుగోలు చేసి ఇల్లు కట్టుకుని పెళ్లి కూడా చేసుకున్నాడు. (ఇదీ చదవండి: రోజుకి రూ. 1.6 లక్షల సంపాదిస్తున్న 34 ఏళ్ల యువతి.. ఈమె చేసే పనేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!) విజయ్ సుబ్రమణియమ్ 2004లో మొదటి షాప్ ఓపెన్ చేసాడు. 2005 నాటికి చైనీస్ ఫర్నిచర్ దిగుమతి చేసుకోవడం ప్రారంభించాడు. 2010 నాటికి మరొక షాప్ ఏర్పాటు చేసాడు. ఇదే రాయల్ ఓక్ ప్రారంభానికి నాంది పలికింది. ప్రస్తుతం ఈ సంస్థ కింద 150 స్టోర్లు ఉన్నాయి. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 280 కర్మాగారాల నుంచి తాను ఉత్పత్తులను పొందుతున్నట్లు తెలిపాడు. కాగా 2024 ఆర్థిక సంవత్సరంలో మరో 100 స్టోర్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎదగాలనే సంకల్పం ఉన్న వాడికి విజయం దాసోహమవుతుందని చెప్పడానికి ఇదో చక్కని నిదర్శనం. -
డిఫరెంట్ లుక్స్‌లో టాప్ లీడర్స్: దిమ్మదిరిగే ఫోటోలు
-
ప్రపంచంలోని టాప్ 10 శ్రీమంతులు వీరే
-
భర్త గురించి మనసులో మాట చెప్పిన సుధా మూర్తి, తొలి పరిచయం అలా..
'సుధా మూర్తి' ఈ పేరుకి భారతదేశంలో పరిచయమే అవసరం లేదు, ఎందుకంటే ఒక రచయిత్రిగా, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా మాత్రమే కాకుండా పరోపకారిగా కూడా చాలా మందికి సుపరిచయమే. అయితే ఈమె ఇటీవల తన భర్త నారాయణ మూర్తితో ఏర్పడిన తొలి పరిచయం గురించి ఒక టీవీ షోలో వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇటీవల జరిగిన ఒక ప్రముఖ 'బాలీవుడ్ టాక్ షో'లో సుధా మార్తి పాల్గొన్నారు. ఇందులో బాలీవుడ్ నటి రవీనా టండన్, ప్రొడ్యూసర్ గుణీత్ మోంగా కూడా పాల్గొన్నారు. ఈ షోకి సంబంధించిన ఒక టీజర్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో నారాయణ మూర్తిని మొదటి సారి ఎప్పుడు కలిసారని వ్యాఖ్యాత కపిల్ శర్మ సుధా మూర్తిని అడిగారు. ఈ సందర్భంలో సుధా మూర్తి తన స్నేహితురాలి ద్వారా నారాయణ మూర్తి పరిచయమయ్యారని చెప్పుకొచ్చారు. ప్రసన్న అనే స్నేహితురాలు రోజూ ఒక పుస్తకం తీసుకువచ్చేదని, అందులోని ఫస్ట్ పేజీలో నారాయణ మూర్తి పేరు మాత్రమే కాకుండా పక్కన పెషావర్, ఇస్తాంబుల్ వంటి ప్రదేశాల పేర్లు ఉండేవని చెప్పింది. ఇది చూసినప్పుడు నారాయణ మూర్తి బహుశా ఇంటర్నేషనల్ బస్ కండక్టర్ అయి ఉంటాడేమో అనుకున్నట్లు చెప్పింది. ఒక రోజు నారాయణ మూర్తిని కలవడానికి వెళ్లాలని, కలవడానికి ముందు ఆయన సినిమా హీరోలా ఉంటాడని ఊహించినట్లు చెప్పింది. కానీ డోర్ ఓపెన్ చేయగానే ఎవరీ చిన్నపిల్లాడు? అనిపించిందని అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంది. ఇది విన్న అక్కడున్న వారంతా ఒక్కసారిగా పగలబడి నవ్వారు. (ఇదీ చదవండి: 17 సార్లు ఫెయిల్.. ఇప్పుడు రూ. 40వేల కోట్ల సామ్రాజ్యం - ఇది కదా సక్సెస్ అంటే!) సుధా మూర్తి 44 సంవత్సరాల కిందట నారాయణ మూర్తిని వివాహం చేసుకుంది. వీరికి అక్షతా మూర్తి, రోహన్ మూర్తి అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. అక్షతా మూర్తి భర్త బ్రిటన్ ప్రధాని రిషి సునాక్. సుధా మూర్తి గొప్ప మానవతా మూర్తి. ఈమె చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్ వంటి గొప్ప పురస్కారాలను అందించింది. -
ఆనంద్ మహీంద్రా గురించి ఆసక్తికర విషయాలు - డోంట్ మిస్!
పరిచయం అవసరం లేని పేర్లలో 'ఆనంద్ మహీంద్రా' ఒకటి. భారతదేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తల జాబితాలో ఒకరుగా నిలిచి, ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఎన్నో ఆసక్తికరమైన వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలిస్తూ ఉండే ఆనంద్ మహీంద్రా గురించి దాదాపు అందరికి తెలుసు. అయితే ఈ రోజు ఆనంద్ మహీంద్రా జన్మదినం సందర్భంగా ఆయన గురించి చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి. 1955 మే 1న ముంబైలో హరీష్ మహీంద్రా, ఇందిరా మహీంద్రా దంపతులకు జన్మించారు. పారిశ్రామిక నేపథ్యం ఉన్న కుటుంభంలో జన్మించినప్పటికీ ఎప్పుడూ అతని కుటుంభ సభ్యులు వ్యాపార రంగానికి రావాలని బలవంతం చేయలేదు. కాబట్టి చిన్న తనంలో సినిమా ప్రొడ్యూసర్ కావాలని కలలు కనేవాడని చెబుతారు. పాఠశాల విద్యను లారెన్స్ స్కూల్లో, ఫిల్మ్ మేకింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కోర్సులను హార్వర్డ్ యూనివర్సిటీలో, హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో MBA పూర్తి చేశారు 1981లో ఇండియాకి తిరిగి వచ్చారు. చదువు పూర్తయిన తరువాత ఆనంద్ మహీంద్రా ఉజిన్ స్టీల్ కంపెనీ లిమిటెడ్ (ముస్కో)లో ఫైనాన్స్ డైరెక్టర్‌కు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా చేరి వ్యాపారాన్ని అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్లాడు. అయితే ఆ సమయంలో 1991లో సమ్మెలతో అట్టుడికిపోతున్న కండివాలీ ఫ్యాక్టరీ బాధ్యతలను చేప్పట్టవలసి వచ్చింది. కండివాలీ ఫ్యాక్టరీలో కార్మికులు పెద్ద ఎత్తున సమ్మెలు చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో కూడా ఎంతో నేర్పుగా ప్రవర్తించి ఆనంద్ మహీంద్రా ఆ సమస్యలను దూరం చేసి కార్మికులను శాంతింపజేశారు. ఇది ఆయన సాధించిన విజయాల్లో ప్రధానమైనదని చెప్పాలి. అప్పట్లో ఆటోమొబైల్ రంగంలో అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న భారతీయ కంపెనీలు వాహనాల తయారీకి ఎక్కువగా విదేశీ కంపెనీల మీద ఆధారపడవలసి వచ్చేది. కానీ ఆ సమయంలో ఫోర్డ్ కంపెనీతో కలిసి ఎస్కార్ట్ కారుని మార్కెట్లోకి పరిచయం చేశారు. కానీ ఇది ఆనంద్ మహీంద్రాకు ఆశించిన విజయాన్ని తీసుకురాలేకపోయింది. అయినా వెనుకడుగేయకుండా 300 మంది ఇంజినీర్లు, ఇతర సభ్యులతో ఒక టీమ్ తయారు చేసి ఒక ప్యాసింజర్ వెహికల్ తయారు చేయడానికి పూనుకున్నారు. ఆనంద్ మహీంద్రా తయారు చేసిన ఈ టీమ్ అహర్నిశలు కస్టపడి మహీంద్రా స్కార్పియో కారుని భారతదేశంలో విడుదల చేసి గొప్ప విజయాన్ని తీసుకువచ్చింది. అప్పటి నుంచి ఆటోమొబైల్ రంగంపై ఆనంద్ మహీంద్రా మంచి పట్టుని సంపాదించాడు. మహీంద్రా స్కార్పియో కారు కేవలం భారత దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్లో కూడా మంచి ఆదరణ పొందింది. మహీంద్రా స్కార్పియోతో ఆశించిన స్థాయికంటే గొప్ప సక్సెస్ రుచి చూసిన ఆనంద్ మహీంద్రా స్వరాజ్ ట్రాక్టర్స్, పంజాబ్ ట్రాక్టర్స్ వంటి వాటిని కొనుగోలు చేసి మహీంద్రా గ్రూపుని ఎంతగానో విస్తరించాడు. ఇప్పుడు మహీంద్రా ట్రాక్టర్లు ప్రపంచంలో అత్యధిక ప్రహజాదరణ పొంది అమ్మకాల పరంగా ముందంజలో ఉన్నాయి. (ఇదీ చదవండి: ఇంటర్లో తక్కువ మార్కులొచ్చాయని ఇల్లు అద్దెకివ్వని ఓనర్.. ఎక్కడో తెలుసా?) ఆనంద్ మహీంద్రా ప్రముఖ పాత్రికేయరాలైన అనురాధను వివాహం చేసుకున్నారు. ఈమె 'వెర్వ్' అండ్ 'మ్యాన్స్ వరల్డ్' పత్రికలకు సంపాదకురాలు. అంతేకాకుండా ఆమె 'ది ఇండియన్ క్వార్టర్లీ' మ్యాగజైన్ పబ్లిషర్‌గా కూడా పనిచేశారు. వీరికి దివ్య మహీంద్రా, అలిక మహీంద్రా అనే ఇద్డు కుమార్తెలున్నారు. వ్యారరంగంలో మాత్రమే కాకుండా గొప్ప సేవాదృక్పథం ఉన్న ఆనంద్ మహీంద్రా 1996లో భారతదేశంలోని నిరుపేద బాలికల విద్యకు మద్దతు ఇచ్చే నాన్హి కాళీ ఛారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించాడు. 2017 వరకు ఈ ట్రస్ట్ సుమారు 1,30,000 మంది బాలికల విద్యకు దోహదపడింది. అంతే కాకూండా భారతదేశ సామాజిక-ఆర్థిక అభివృద్ధికి కృషి చేసే ట్రస్ట్ నాంది ఫౌండేషన్ డైరెక్టర్ బోర్డులలో ఒకరుగా ఉన్నారు. (ఇదీ చదవండి: ఎగిరే కారు వచ్చేసిందండోయ్! రూ. 6.5 లక్షలతో ఇంటికి తీసుకెళ్లొచ్చు..) 2016లో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆనంద్ మహీంద్రాని ఎన్నో అవార్డులు సైతం వరించాయి. భారత ప్రభుత్వం 2020లో ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డును అందించింది. అంతకంటే ముందు 2012లో యుఎస్ బిజినెస్ కౌన్సిల్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డును, 2016లో బ్లూమ్‌బెర్గ్ టీవీ ఇండియా ద్వారా డిస్ట్రప్టర్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు వంటి ఎన్నో అవార్డులను అందుకున్నాడు. (ఇదీ చదవండి: స్మార్ట్‌ఫోన్‌లో ఇవి గమనించారా? లేకుంటే పేలిపోతాయ్..) పారిశ్రామిక రంగానికి వన్నె తెచ్చిన ఆనంద్ మహీంద్రాకు కార్లంటే ఇష్టమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కావున ఈయన గ్యారేజిలో ఇప్పటికే మహీంద్రా బొలెరో ఇన్వాడర్, టియువి300, టియువి300 ప్లస్, మహీంద్రా స్కార్పియో, ఆల్టురాస్ జి4, స్కార్పియో ఎన్ మొదలైన కార్లు ఉన్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సలహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
28 ఏళ్లకే తండ్రి మరణం.. ఇప్పుడు లక్షల కోట్లకు యజమాని
భారతదేశంలోని అగ్రశ్రేణి వ్యాపారవేత్తల్లో ఒకరైన 'కుమార్ మంగళం బిర్లా' (Kumar Mangalam Birla) గురించి దాదాపు అందరికి తెలుసు. ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్‌గా మాత్రమే కాకుండా సుమారు 14.2 బిలియన్ డాలర్ల సంపదకు నాయకుడై భారతీయ సంపన్నుల జాబితాలో 9వ స్థానం పొందిన బిర్లా ఈ స్థాయికి రావడానికి ఎన్నెన్ని అడ్డంకులను ఎదుర్కొన్నాడు? ఆయన సక్సెస్ రహస్యం ఏమిటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. 1967 జూన్ 14న జన్మించిన కుమార్ మంగళం బిర్లా ముంబై విశ్వవిద్యాలయంలోని హెచ్ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుంచి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి తరువాత లండన్ బిజినెస్ స్కూల్లో చదువుకున్నాడు. 1992లో లండన్‌లో CA పూర్తి చేశారు. చదువు పూర్తయిన తరువాత 1995లో ఆయన తండ్రి ఆదిత్య విక్రమ్ బిర్లా మరణించారు. తండ్రి మరణించిన తరువాత 28 సంవత్సరాల వయసులో ఆదిత్య బిర్లా గ్రూప్‌కు ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అతి తక్కువ కాలంలోనే కంపెనీ టర్నోవర్ 2 బిలియన్ల నుంచి 45 బిలియన్లకు చేరింది. (ఇదీ చదవండి: Volkswagen Discounts: ఈ ఆఫర్స్ చాలదా ఫోక్స్‌వ్యాగన్ కారు కొనడానికి - పూర్తి వివరాలు) కుమార్ మంగళం బిర్లా టెలికమ్యూనికేషన్స్, సిమెంట్, మైనింగ్ వంటి వాటితో పాటు సుమారు 16 కంటే ఎక్కువ పరిశ్రమల్లోకి అడుగుపెట్టారు. అంతే కాకుండా వీరు అలెన్ సోలీ, పీటర్ ఇంగ్లాండ్, లూయిస్ ఫిలిప్, పాంటలూన్స్ పేర్లతో దుస్తులను విక్రయిస్తున్నారు. కార్బన్ బ్లాక్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ అండ్ సప్లయర్స్ పేరుతో ఐదు ఖండాల్లోని 12 దేశాలకు కార్బన్ ఎగుమతి చేస్తున్నారు. భారతదేశంలో రైల్వే అవసరాలకు అవసరమైన కార్బన్ పంపించడంలో బిర్లా కాపర్ వాటా భారీగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 47 బ్రాండ్లు, 27 ఎంటర్ప్రైజెస్, 14 పరిశ్రమ రంగాలను కలిగి ఉన్న ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రస్తుతం విజయపథంలో నిర్విరామంగా ముందుకు సాగుతోంది. బాక్సైట్ తవ్వకాలు, అల్యూమినా ప్రాసెసింగ్, అల్యూమినియంతో కూడిన ఇతర కార్యకలాపాలలో నిమగ్నమైన హిండాల్కోకు కూడా బిర్లా యజమాని. ఇందులో సుమారు 40వేలకంటే ఎక్కువ మంది పనిచేస్తున్నారు. 2004లో గ్రాసిమ్ కొనుగోలు చేసినప్పటి నుంచి అల్ట్రాటెక్ సిమెంట్ భారతదేశంలో అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తిదారుగా ప్రపంచంలో మూడవ అతిపెద్దదిగా ఎదిగింది. దీని ఆదాయం ప్రస్తుతం రూ.50000 కోట్ల కంటే ఎక్కువ అని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం కుమార్ మంగళం బిర్లా నికర ఆస్తుల విలువ సుమారు పది లక్ష కోట్లకంటే ఎక్కువ. -
వైద్య వృత్తిలో వెయ్యికోట్లకంటే ఎక్కువ సంపాదిస్తున్న డాక్టర్ - ఈమె
ప్రిస్టిన్ కేర్ కో ఫౌండర్ డాక్టర్ 'గరిమా సాహ్నీ' గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ వైద్య వృత్తిలో కోట్లు గడిస్తున్న ఈమె 800 పైగా ఆసుపత్రులతో భాగస్వామ్యం కలిగి ఎంతో మంది రోగులకు సేవ చేస్తూ ముందుకు వెళ్తున్న సాహ్నీ సక్సెస్ స్టోరీ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. గైనకాలజీ విభాగంలో ఉత్తమ వైద్యురాలుగా, మృదుభాషిగా పేరుపొందిన గరిమా సాహ్నీ వైద్య వృత్తిలోనే కొత్త సొగసులకు శ్రీకారం చుట్టింది. హాస్పిటల్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ప్రిస్టిన్ కేర్ అనే క్లినిక్ ప్రారంభించి ఏడాదికి 1.4 బిలియన్ డాలర్లు సంపాదిస్తోంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఇది సుమారు రూ.11400 కోట్లు. డాక్టర్ గరిమ, ఆమె స్నేహితుడు డాక్టర్ వైభవ్, అతని చిన్ననాటి స్నేహితుడు హర్సిమర్బీర్ సింగ్ క్లినిక్‌ని ఎలా విస్తరించాలనే దానిపై నిరంతరం కృషి చేసి ఎలక్టివ్ సర్జరీ రంగాన్ని ఎంచుకుని నాణ్యమైన వైద్యం అందించడం ప్రారంభించారు. వైద్యంలో మౌలిక సదుపాయాలు అందించడానికి, అదే సమయంలో రోగులకు చికిత్స అందించడానికి వారి ఖాళీ స్థలాన్ని ఉపయోగించాలనుకున్నారు. ప్రస్తుతం 42 నగరాల్లో సుమారు 1.5 మిలియన్ల మంది రోగులు సేవ చేస్తున్నారు. (ఇదీ చదవండి: భారత్‌లో చీప్ అండ్ బెస్ట్ డీజిల్ కార్లు - మహీంద్రా బొలెరో నుంచి టాటా నెక్సాన్ వరకు..) డాక్టర్ సాహ్నీ ఆమె కుటుంబంలో మొదటి వైద్యురాలు. ఆమె తండ్రి సలహా మేరకు గైనకాలజీని ఎంచుకుంది. ఈమె డాక్టర్ వైభవ్‌ను వివాహం చేసుకుంది. ప్రిస్టిన్ కేర్ ప్రస్తుతం 800 పైగా ఆసుపత్రులతో భాగస్వామ్యం కలిగి ఉంది. ఇందులో దాదాపు అత్యాధునిక పరికరాల అందుబాటులో ఉంటాయి. (ఇదీ చదవండి: BIS Care App: మీరు కొనే బంగారం స్వచ్ఛమైనదా.. కాదా? ఈ యాప్ ద్వారా తెలుసుకోండి!) ప్రిస్టిన్ కేర్ అతి తక్కువ కాలంలోనే విజయవంతమైంది, 2022 ఆర్థిక సంవత్సరంలో వీరు రూ. 350 కోట్లకంటే ఎక్కువ ఆదాయాన్ని పొందారు. ఈ ఏడాది వారి సంపాదన సుమారు రూ. 1000 కోట్లు దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తానికి డాక్టర్ వృత్తిలో ఉంటూ బిలీనియర్స్ అయ్యారు. -
ముఖేష్ అంబానీ ఒక ఎత్తైతే.. వారి పిల్లలు అంతకు మించి!
కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ఆసియాలో అత్యంత ధనవంతుడిగా కీర్తి పొందిన 'ముఖేష్ అంబానీ' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వ్యాపార ప్రపంచంలో తిరుగులేని వ్యాపారవేత్తగా ముందుకు సాగుతున్న ఈ అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రమే కాకుండా.. పెట్రోకెమికల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, టెలికాం రంగాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. ముఖేష్ అంబానీ ప్రపంచంలోని 13వ అత్యంత సంపన్న బిలియనీర్ స్థానాన్ని సొంతం చేసుకున్నట్లు ఇటీవల ఫోర్బ్స్ నివేదించింది. ఈయన నికర ఆస్తుల విలువ 84.1 బిలియన్ డాలర్లు అని అంచనా. అంబానీ పిల్లలు కూడా తండ్రి వ్యాపారాల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటూ.. తండ్రికి తగ్గ పిల్లలుగా ఖ్యాతి పొందారు. ఇంతకీ ముఖేష్ అంబానీ పిల్లలు రిలయన్స్ గ్రూప్‌లో ఎలాంటి పాత్రలు పోషిస్తున్నారనేది ఇక్కడ తెలుసుకుందాం. ఆకాష్ అంబానీ: ముఖేష్ అంబానీ, నీతా అంబానీల పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ రిలయన్స్ జియో చైర్మన్. భారతదేశంలో అతి పెద్ద టెలికాం బిజినెస్ ఆకాష్ నియంత్రణలో ఉంది. అంతే కాకుండా ఈయన ముంబై IPL జట్టుకు కో-ఓనర్ కూడా. ముంబైలోని క్యాంపియన్ స్కూల్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించిన ఆకాష్ అంబానీ 2013లో యూఎస్‌లోని బ్రౌన్ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తరువాత తండ్రి వ్యాపార రంగంలో అడుగులు వేశారు. మొదట్లో జియో ఇన్ఫోకామ్‌లో స్ట్రాటజీ చీఫ్‌గా ప్రారంభమై దానిని వేగంగా అభివృద్ధి చేయడంలో ప్రధాన పాత్ర వహించారు. ప్రస్తుతం ఆతని ఆస్తుల విలువ 40 బిలియన్ డాలర్లు. (ఇదీ చదవండి: భారత్‌లో విడుదలైన కోటి రూపాయల లెక్సస్ కారు, ఇదే.. చూసారా?) ఇషా అంబానీ: ముఖేష్, నీతా అంబానీల కవల పిల్లలు ఇషా, ఆకాష్. వీరి ముగ్గురు పిల్లల్లో 'ఇషా' ఒక్కగానొక్క అమ్మాయి. ఈమె ప్రస్తుతం రిలయన్స్ గ్రూప్ రిటైల్ వ్యాపారానికి బాధ్యత వహిస్తోంది. స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పూర్తి చేసిన తరువాత మిలియనీర్ ఆనంద్ పిరమల్‌ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఇషా అంబానీ ఆస్తుల విలువ 100 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. (ఇదీ చదవండి: MG Comet EV: ఇది పొట్టిది కాదండోయ్.. చాలా గట్టిది - బుకింగ్స్ & లాంచ్ ఎప్పుడంటే?) అనంత్ అంబానీ: ముఖేష్ అంబానీ ముగ్గురు పిల్లల్లో చిన్నవాడు అనంత్ అంబానీ. ఈయన రిలయన్స్ న్యూ ఎనర్జీ వ్యాపారానికి బాధ్యతలు వహిస్తూ.. రిలయన్స్ 02C & రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీకి డైరెక్టర్ పదవిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ సుమారు 40 బిలియన్ డాలర్లు అని అంచనా. ఇటీవల అనంత్ అంబానీకి రాధిక మర్చంట్‌తో నిశ్చితార్థం జరిగింది. -
బీకామ్ డ్రాప్ అవుట్.. బిజినెస్ టేకప్: ప్రియాంక్ సుఖిజా సక్సెస్ స్టోరీ
ఎంతోమంది చదువులో ముందుకు సాగలేకపోయినా జీవితంలో అనుకున్నది సాధించి సక్సెస్ అవుతారు. అలాంటి వారిలో ఒకరు 'ప్రియాంక్ సుఖిజా' (Priyank Sukhija). ఇంతకీ ఈయన సాధించిన సక్సెస్ ఏమిటి? ప్రస్తుతం ఎంత సంపాదిస్తున్నాడనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. కేవలం 19 సంవత్సరాల వయసులోనే చదువుకి స్వస్తి చెప్పి ఏదైనా సొంతంగా చేయాలని నిర్ణయించుకుని, తన తండ్రి నుంచి కొంత డబ్బుని తీసుకుని మొదట్లో రెస్టారెంట్ లాజీజ్ ఎఫైర్‌ను ప్రారంభించాడు. ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు భారతదేశంలో అత్యంత సంపన్నమైన, విజయవంతమైన రెస్టారెంట్ యజమానిగా నిలదొక్కుకోగలిగాడు. ప్రస్తుతం భారతదేశం మొత్తం మీద 30 కంటే ఎక్కువ హై-ఎండ్ రెస్టారెంట్లు, కేఫ్‌లను కలిగి ఉన్నారు. డయాబ్లో, లార్డ్ ఆఫ్ ది డ్రింక్స్, వేర్‌హౌస్ కేఫ్, ఫ్లయింగ్ సాసర్, డ్రాగన్‌ఫ్లై ఎక్స్పీరియన్స్ వంటి పేర్లతో ఢిల్లీలో రెస్టారెంట్లు ఉన్నాయి. ఢిల్లీలో మాత్రమే కాకుండా దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా ఈయనకు బ్రాంచెస్ ఉన్నాయి. ప్రియాంక్ సుఖిజా రెస్టారెంట్లు అనేక రకాల వంటకాలకు ప్రసిద్ధి చెంది ఢిల్లీలోని ఇతర రెస్టారెంట్లకు పోటీగా నిలుస్తోంది. F&B Pvt Ltd పేరుతో ప్రియాంక్ సుఖిజా కంపెనీ 2022లో ఏకంగా రూ. 275 కోట్లను ఆర్జించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం అతన్ని దేశంలోని అత్యంత సంపన్నుడైన వ్యక్తిగా పిలుస్తున్నారు. అయితే ప్రస్తుతం అతని నికర ఆస్తుల విలువ అందుబాటులో లేదు. కానీ చిన్న మొత్తంతో బిజినెస్ ప్రారభించి ఈ రోజు భారదేశంలో లెక్కకు మించిన బ్రాంచెస్ ప్రారభించి విజయానికి చిరునామాగా నిలిచాడు. -
ప్రతిష్టాత్మక అవార్డులు సొంతం చేసుకున్న వ్యాపారవేత్తలు.. వీరే!
ఇటీవల జరిగిన ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (AIMA) 13వ మేనేజింగ్ ఇండియా అవార్డ్స్ వేడుకలో కుమార్ మంగళం బిర్లా ప్రతిష్టాత్మక 'బిజినెస్ లీడర్ ఆఫ్ ది డికేడ్' అవార్డుని సొంతం చేసుకున్నారు. వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకున్న ఈయన 2017లోనే అవుట్‌స్టాండింగ్ బిజినెస్ లీడర్ అవార్డుని కైవసం చేసుకున్నాడు. సుమారు 34 దేశాల్లో వ్యాపారణాలను విజయవంతంగా ముందుకు సాగిస్తున్నారు మంగళం బిర్లా గత దశాబ్దంలో భారతీయ పరిశ్రమకు చేసిన సేవలకుగాను ఈ అవార్డు లభించింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రంలో ఇతర కంపెనీల నాయకులు కూడా ఆవార్డులను గెలుచుకున్నారు. ఇందులో టాటా స్టీల్ చైర్మన్ టీవీ నరేంద్రన్‌కు 'AIMA-JRD టాటా కార్పొరేట్ లీడర్షిప్' అవార్డు, ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును టొరెంటో గ్రూప్ చైర్మన్ సమీర్ మెహతా సొంతం చేసుకున్నారు. యంగ్ ఎంటర్ ఎంటర్ప్రెన్యూర్ ఏథర్ ఎనర్జీ వ్యవస్థాపకులు తరుణ్ మెహతా, స్వప్నిక్ జైన్ కైవసం చేసుకున్నారు. అదే సమయంలో టీవీఎస్ కంపెనీ చైర్మన్ వేణు శ్రీనివాసన్ అవుట్‌స్టాండింగ్ ఇన్స్టిట్యూట్ బిల్డర్ అవార్డు, బజాజ్ ఫిన్ సర్వ్ చైర్మన్ సంజయ్ బజాజ్ ట్రాన్స్ఫార్మషన్ బిజినెస్ లీడర్ అవార్డు సొంతం చేసుకున్నారు. -
ప్యూన్ ఉద్యోగం రాలేదు: ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడిలా!
పట్టుదలతో చేస్తే సమరం.. తప్పకుండ నీదే విజయం అనే మాటలు నిజ జీవితంలో అక్షర సత్యాలు. జీవితంలో ఎదగాలనే కసి నీకుంటే తప్పకుండా గొప్ప స్థాయికి చేరుకుంటావు. దీనికి నిలువెత్తు నిదర్శనమే 'దిల్ఖుష్ సింగ్' సక్సెస్ స్టోరీ. సహర్సాలోని ఒక చిన్న గ్రామానికి చెందిన 'దిల్ఖుష్ సింగ్' ఇంటర్ మీడియట్ మాత్రమే చదివి ఈ రోజు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఈ రోజు అతని సంవత్సరాదాయం సుమారు రూ. 20 కోట్లు వరకు ఉంటుందని అంచనా. ఈ స్థాయికి రావడానికి దిల్ఖుష్ ఎంతో కష్టపడ్డాడు. రిక్షా లాగించేవాడు, బతుకుదెరువు కోసం పాట్నాలో కూరగాయలు కూడా అమ్మేవాడు. ఒకసారి ప్యూన్ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళితే యాపిల్ లోగోను గుర్తించమని అడిగారని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. దిల్ఖుష్ సింగ్ రాడ్బెజ్ అనే కంపెనీ ప్రారంభించి బీహార్‌లో క్యాబ్‌లను అందించడం మొదలెట్టాడు. అయితే ఇది ఓలా, ఉబర్ సంస్థలకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఓలా, ఉబర్ కంపెనీలు నగర ప్రయాణాలపై మాత్రమే దృష్టి పెడుతుంటే.. ఈ కంపెనీ నగరం నుంచి 50 కిమీ దూరం వెళ్లి కూడా సర్వీస్ చేస్తుంది. (ఇదీ చదవండి: వెబ్సైట్లో మాయమైన క్విడ్, ఇక కావాలన్నా కొనలేరు!) రాడ్బెజ్ కంపెనీ ట్రావెల్ కంపెనీలతో పాటు వ్యక్తిగత క్యాబ్ డ్రైవర్లతో టై-అప్‌లను కలిగి ఉంది. అయితే వారి ప్రయాణం ముగించుకుని తిరిగి వచ్చేటప్పటికి ప్రయాణీకులను ఎంపిక చేసుకోమని వారు క్యాబ్ డ్రైవర్లను అడుగుతారు. వారు తిరుగు ప్రయాణాలలో ప్రయాణికులు లేకుండా వస్తారు కాబట్టి, మార్కెట్ ధరల కంటే తక్కువ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. దీని ద్వారా ప్రతి వినియోగదారుడు ఒక్కో ట్రిప్పుకు కనీసం రూ. 1500 ఆదా చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ తరువాత ఆర్య గో క్యాబ్స్‌గా తన బిజినెస్ ప్రారంభించాడు. టాటా నానో కారుతో కంపెనీని ప్రారభించి, కేవలం ఆరు నెలల్లో కోట్ల రూపాయల సంపాదించగలిగాడు. ఇప్పటికి అతని సంపాదన రూ. 20 కోట్లకి చేరింది. అతని లక్ష్యం రూ. 100 కోట్లకి చేరుకోవడమే అని గతంలో వెల్లడించారు. (ఇదీ చదవండి: 1986లో రాయల్ ఎన్ఫీల్డ్ ధర ఇంత తక్కువా? వైరల్ అవుతున్న బిల్!) తన కంపెనీలో పనిచేసే డ్రైవర్లకు ఎటువంటి నష్టం జరగకుండా చూడటానికి నష్టపరిహారం వంటివి కూడా అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒక డ్రైవర్ తన ప్లాట్‌ఫామ్ ద్వారా నెలకు రూ.55,000 నుంచి రూ. 60,000 వరకు సంపాదించవచ్చని చెబుతున్నారు. ఐఐటీ గౌహతి నుంచి, ఐఐఎంల నుంచి చాలా మంది తమ ప్లాట్ఫామ్లో పార్ట్‌టైమ్‌గా పనిచేస్తున్నారని దిల్ఖుష్ చెప్పుకొచ్చారు. -
నాడు 150 సార్లు తిరస్కరించారు.. నేడు రూ. 65వేల కోట్లకు అధిపతి!
చిన్నప్పుడు చందమామ కథల్లో విక్రమార్కుని గురించి చదువుతుంటే కొంత ఆశ్చర్యం కలిగేది, ఎందుకంటే బేతాళున్ని తీసుకురావడానికి విక్రమార్కుడు మళ్ళీ మళ్ళీ చెట్టు దగ్గరికి వెల్తూనే ఉంటాడు. అయితే చివరికి అనుకున్నది సాధిస్తాడు. సరిగ్గా ఈ కథను పోలిన జీవితాన్ని హర్ష్ జైన్ అనుభవించాడు. 1986లో ముంబైలో జన్మించిన హర్ష్ జైన్ ప్రాథమిక విద్యను గ్రీన్లాస్ హైస్కూల్లో, ఆ తరువాత ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ చేయడానికి ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీకి వెళ్ళాడు. చదువుకునే రోజుల్లోనే ఉపెన్ క్రికెట్ క్లబ్, ఇంట్రామ్యూరల్ ఫుట్‌బాల్ వంటి వాటిలో పాల్గొన్నాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కొంతమంది డ్రీమ్11 యాప్ ఉపయోగించి క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్, కబడ్డీ, బాస్కెట్‌బాల్ వంటి ఫాంటసీ ఆటలను ఆడుతుంటారు. 2019 ఏప్రిల్‌లో డ్రీమ్11 "యునికార్న్ క్లబ్" లోకి ప్రవేశించిన మొదటి ఇండియన్ గేమింగ్ కంపెనీగా అవతరించింది. అతి తక్కువ కాలంలోనే గొప్ప స్థాయికి చేరుకున్న డ్రీమ్11 వెనుక చాలా పెద్ద కథ ఉంది. (ఇదీ చదవండి: రీల్స్ చెయ్.. లక్ష పట్టేయ్! తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్..) నిజానికి IPL మొదటిసారి ప్రారంభమైనప్పుడు, హర్ష్ జైన్ అతని కాలేజీ ఫ్రెండ్ భవిత్ డ్రీమ్11 ప్రారంభించాలనే ఆలోచనను కలిగి ఉన్నట్లు, నిధుల కోసం రెండు సంవత్సరాలు సుమారు 150 మంది వెంచర్ క్యాపిటలిస్ట్‌లను సంప్రదించామని, అయితే తన ఆలోచనలను వీరందరూ తిరస్కరించారని హర్ష్ తెలిపారు. డ్రీమ్11 ప్రారంభ రోజులలో ఇద్దరూ కష్టాలను ఎదుర్కొన్నారు, కానీ చివరికి విజయం సాధించారు. 2013లో హర్ష్ జైన్ డెంటిస్ట్ అయిన రచనా షాను వివాహం చేసుకున్నాడు, వీరికి క్రిష్ అనే కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం వీరు దక్షిణ ముంబైలోని పెద్దార్ రోడ్లో రూ. 72 కోట్ల విలువైన లగ్జరీ డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్లో ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా 2010 జులైలో ముంబైలో రెడ్ డిజిటల్ అనే సోషల్ మీడియా ఏజెన్సీ స్థాపించారు. ఈ సంస్థను 2013లో ముంబైలోని మార్కెటింగ్ ఏజెన్సీ గోజూప్ కొనుగోలు చేసింది. (ఇదీ చదవండి: మహిళల కోసం ఫైర్ బోల్ట్ నయా స్మార్ట్‌వాచ్ - తక్కువ ధర & ఎక్కువ ఫీచర్స్) 2017లో హర్ష్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ అధ్యక్షుడయ్యాడు. నేడు డ్రీమ్11 ఏకంగా 8 బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించింది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ. 65,000 కోట్లకంటే ఎక్కువ. ఈ ప్లాట్ఫామ్లో సుమారు 150 మిలియన్స్ యాక్టివేట్ యూజర్స్ ఉన్నారు. ప్రస్తుతం భారతదేశంలోని అత్యంత ధనవంతులైన యువ బిలియనీర్లలో హర్ష్ జైన్ ఒకరుగా ఉన్నారు. -
వీధుల్లో మొదలైన వ్యాపారం, 5వేల కోట్ల సామ్రాజ్యంగా..
భారతదేశంలో ఎంతోమంది వ్యాపారవేత్తలకు స్ఫూర్తిగా నిలిచిన 'మహాశయ్ ధరంపాల్ గులాటీ' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన చనిపోయి రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ పేరు మాత్రం సజీవంగానే ఉంది. కేవలం రూ. 1500తో భారతదేశానికి వచ్చి ఏకంగా 5వేల కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. 1923లో పాకిస్థాన్ సియాల్కోట్లో సుగంధ ద్రవ్యాల వ్యాపారి చున్నీలాల్ కుటుంబంలో జన్మించిన ధరంపాల్ చిన్నప్పటి నుంచే వ్యాపారంలో తండ్రికి సహాయం చేస్తూ ఆ వ్యాపారాన్నే నేర్చుకున్నాడు. ఆ తరువాత చాలా తక్కువ డబ్బుతో భారతదేశంలో అడుగుపెట్టాడు. తన దగ్గర ఉన్న ఆ తక్కువ డబ్బుతోనే ఒక గుర్రపు బండిని కొనాలని నిర్ణయించుకున్నాడు. గుర్రపు బండి కొన్న తరువాత దానిపైనే ఢిల్లీ నగరంలో మసాలాలు విక్రయిస్తూ వ్యాపారం ప్రారంభించాడు. చిన్న కొట్టుతో మొదలై మహాషియాన్ డి హట్టి (MDH) పేరుతో మంచి ఆదాయం పొందాడు. అతి తక్కువ కాలంలో భారతదేశపు 'మసాలా కింగ్'గా కీర్తి పొందాడు. (ఇదీ చదవండి: క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్సాక్షన్ - సులభంగా ఇలా!) ధరంపాల్ గులాటీ కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా తన వ్యాపారాన్ని ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చేసి కోట్లలో సంపాదించడం మొదలెట్టాడు. 2017లో ఆయన సంస్థ ఆదాయం ఏకంగా రూ. 1000 కోట్లు దాటింది. కాగా 2020లో 98 సంవత్సరాల వయసులో మరణించారు. అప్పటికి ఆయన ఆస్తుల విలువ సుమారు రూ. 5,000 కోట్లు దాటింది. అతి తక్కువ కాలంలోనే భారతదేశపు మసాలా కింగ్ స్థాయికి ఎదిగిన ధరంపాల్ గులాటీ విలాసవంతమైన కార్లను కూడా కలిగి ఉన్నారు. నివేదికల ప్రకారం ఆయన గ్యారేజీలో రోల్స్ రాయల్ ఘోస్ట్, క్రిస్లర్ 300 సి లిమోసిన్, మెర్సిడెస్ బెంజ్ ఎం-క్లాస్ ఎంఎల్ 500 వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. అంతే కాకుండా ఆయన మరణానికి ముందే ఫుడ్ ప్రాసెసింగ్ ఫీల్డ్‌లో ఆయన కృషికి భారత ప్రభుత్వం 'పద్మభూషణ్' పురస్కారం అందించి గౌరవించింది. -
ప్రపంచంలో అతిపెద్ద లిక్కర్ సామ్రాజ్యం: ఇకపై మహిళ సారథ్యంలో..
ప్రపంచంలోని అతిపెద్ద స్పిరిట్స్ తయారీదారు డియాజియో (Diageo) కంపెనీకి త్వరలో ఒక మహిళ నాయకత్వం వహించనుంది. ఈమె పేరు 'డెబ్రా క్రూ'. ఏప్రిల్ 01 నుంచి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పదవి నుంచి CEOగా పదోన్నతి కల్పించనున్నట్లు కంపెనీ తెలిపింది. జానీ వాకర్ స్కాచ్ విస్కీ, గిన్నిస్, బెయిలీస్ వంటి ప్రముఖ బ్రాండ్లను తయారు చేసే కంపెనీకి సర్ ఇవాన్ మెనెజెస్ గత పది సంవత్సరాల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా స్థానంలో కొనసాగారు. అయితే ఈ పదవికి త్వరలోనే ఒక కొత్త బాస్ రాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా డియాజియో 28,000 కంటే ఎక్కువమంది ఉద్యోగులను కలిగి ఉన్నట్లు సమాచారం. డియాజియో కంపెనీ 180 కంటే ఎక్కువ మార్కెట్లలో 200 కంటే ఎక్కువ బ్రాండ్లను విక్రయిస్తోంది. ఇందులో స్కాచ్, కెనడియన్ విస్కీ, వోడ్కా, జిన్, రమ్, లిక్కర్స్ వంటివి ఉన్నాయి. మొత్తం మీద అమ్మకాల పరంగా ఇది అతి పెద్ద కంపెనీ అని తెలుస్తోంది. ఇప్పటి వరకు UKలోని టాప్ 100 లిస్టెడ్ కంపెనీలలో ఎనిమిది మంది మాత్రమే మహిళా సీఈఓలు ఉన్నారు. ఈ జాబితాలో ఇప్పుడు డెబ్రా క్రూ కూడా చేరనుంది. (ఇదీ చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి అకౌంట్లోకి డబ్బులు) 1970 డిసెంబర్ 20న జన్మించిన 'క్రూ' కొలరాడో యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ & చికాగో విశ్వవిద్యాలయం బూత్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి MBA పూర్తి చేసి.. పెప్సీ, క్రాఫ్ట్ ఫుడ్స్, నెస్లే, మార్స్ వంటి సంస్థల్లో పనిచేసింది. ఆ తరువాత పొగాకు సంస్థ రేనాల్డ్స్ అమెరికన్‌కు నాయకత్వం వహించింది. 2019లో డియాజియో కంపెనీలో అడుగుపెట్టిన డెబ్రా క్రూ 2022 అక్టోబర్‌లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ స్థానం పొందింది. ఆ తరువాత 2020లో డియాజియో అతిపెద్ద మార్కెట్ అయిన ఉత్తర అమెరికా వ్యాపారానికి నాయకత్వం వహించింది. కాగా ఇప్పుడు ఆ కంపెనీకి త్వరలోనే సీఈఓ పగ్గాలను చేతపట్టనుంది. -
జీవితాన్ని మార్చేసిన బొమ్మల వ్యాపారం: గార్డు నుంచి బిజినెస్ మ్యాన్‌గా..
నీలో ఉన్న కృషి, పట్టుదలే నీ తలరాతను మారుస్తాయనటానికి నిలువెత్తు నిదర్శనం 'గౌరవ్ మిర్చందానీ' (Gaurav Mirchandani). జీవితంలో ఎదగటానికి సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేయడానికి కూడా వెనుకాడకుండా.. ఈ రోజు వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈ రోజు చిన్నపిల్లలు తినే చిప్స్ ప్యాకెట్స్ లేదా ఇతర చిన్న ప్యాకెట్స్‌లో 'టాయ్స్' (బొమ్మలు) గమనించే ఉంటారు. ఈ చిన్న బొమ్మలతోనే ఈ రోజు సంవత్సరానికి 150 కోట్లు సంపాదిస్తున్నాడు మన గౌరవ్. నిజానికి గౌరవ్ మిర్చందానీ తన స్కూల్ ఏజికేషన్ ఇండోర్‌లోని చోయిత్రమ్ స్కూల్లో పూర్తి చేసి, మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్‌లో గ్రాడ్యుయేషన్ చదవటానికి అమెరికా వెళ్ళాడు. 2009లో మార్కెటింగ్ & ఎకానమీలో MBA పూర్తి చేసాడు. అమెరికాలో చదువుకునే రోజుల్లో ఎన్నో కష్టాలను ఎదుర్కుంటూ హాస్టల్ ఫీజు చెల్లించడానికి అప్పుడప్పుడు కూలి పనులు, ఒక చర్చిలో గార్డుగా కూడా పనిచేశాడు. (ఇదీ చదవండి: Honda: ఏప్రిల్ నుంచి ఈ కార్ల ఉత్పత్తి బంద్) తరువాత కొన్ని పెద్ద మాల్స్‌లో మొబైల్స్ అమ్మడం ప్రారంభించాడు. ఆ సమయంలో హైదరాబాద్‌కు చెందిన ఓ పెర్ఫ్యూమ్ స్టోర్ యజమానితో ఏర్పడిన పరిచయంతో అక్కడే సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా చేరాడు. అయితే ఆ స్టోర్ ఓనర్ ఇండియాకి తిరిగి వచ్చేస్తున్న కారణంగా ఆ దుకాణం గౌరవ్‌కు విక్రయించాడు. 2013లో ఆన్లైన్ కొనుగోలుకు ఎక్కువ ప్రాధాన్యం లేకపోవడం వల్ల పెద్దగా వ్యాపారం ముందుకు సాగలేదు, కానీ వాలెంటైన్స్ డే, బ్లాక్ ఫ్రైడే, క్రిస్మస్ వంటి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వ్యాపారంలో కొంత పురోగతి ఉండేది. ఆన్లైన్ షాపింగ్ ప్రారంభమైన తరువాత కూడా బిజినెస్‌లో మార్పు రాకపోవడంతో 2015లో ఇండియాకి తిరిగి వచ్చేసాడు. (ఇదీ చదవండి: సన్‌రూఫ్ లీక్‌పై రచ్చ లేపి.. ఇప్పుడు హ్యాపీ అంటున్నాడు: వీడియో) గౌరవ్ మిర్చందానీ ఇండియాలో ఎల్లో డైమండ్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ దీపక్ బ్రాహ్మణేని కలిసిన తరువాత జీవితంలో గొప్ప మార్పు ఏర్పడింది. ఆ తరువాత చిన్న బొమ్మలతో వ్యాపారం చేయాలని నిర్చయించుకున్నాడు. ఇందులో భాగంగానే యితడు చైనా నుంచి బొమ్మలను దిగుమతి చేసుకుని చిన్న ప్యాకెట్లతో అందించడం మొదలుపెట్టాడు. మొదట్లో తన తండ్రి కంపెనీ అయిన ఎస్ఎం డైస్ ద్వారా రూ.10 లక్షలతో బొమ్మల వ్యాపారం ప్రారంభించాడు, దానికి అతడు ఎస్ఎం టాయ్స్ అని పేరు పెట్టుకున్నాడు. మొదట చైనా నుంచి బొమ్మలను దిగుమతి చేసుకున్నప్పటికీ.. క్రమంగా మన దేశంలోనే కొంతమంది నుంచి బొమ్మలు కొనుగోలు చేయడం ప్రారంభించాడు. ఇతడు రేసర్ పుల్ బ్యాక్ కార్స్, DIY టాయ్స్, LED టాయ్స్, మ్యూజికల్ టాయ్స్, ప్రాంక్ టాయ్స్, డైనోసార్ టాయ్స్ వంటి అనేక ఆసక్తికరమైన బొమ్మలను అందిస్తున్నాడు. (ఇదీ చదవండి: వంటగదిలో మొదలైన ఆలోచన.. కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా..) క్యాండీ టాయ్స్ కార్పొరేట్ ప్రైవేట్ పేరుతో ఇప్పుడు కంపెనీ రూ. 150 కోట్ల వార్షిక ఆదాయాన్ని పొందుతోంది. అంతే కాకుండా గౌరవ్ ఫ్యాషన్ డిజైనింగ్ గ్రాడ్యుయేట్ అయిన రీమాను వివాహం చేసుకున్నాడు. వ్యాపార రంగంలో మెళుకువలు తెలిసిన ఈమె కూడా టాయ్స్ వ్యాపారాభివృద్ధికి బాగా దోహదపడుతోంది. -
Sanjiv Mehta: తిరుగులేని సీఈఓ - సక్సెస్ స్టోరీ
భారతదేశపు అతిపెద్ద ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ కంపెనీ అయిన హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతా గురించి ఈ రోజు అందరికి తెలుసు. అయితే అతను ఎక్కడ పుట్టాడు, ఎలా అంత గొప్ప స్థాయికి ఎదిగాడు, వార్షిక ఆదాయం ఎంత అనే మరిన్ని వివరాలు తెలిసి ఉండవు. అలాంటి వారికోసం ఈ ప్రత్యేక కథనం.. ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో జన్మించిన సంజీవ్ మెహతా ముంబై, నాగ్‌పూర్‌లలో చదువుకున్నాడు. అయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుంచి చార్టర్డ్ అకౌంటెంట్ కోర్సు పూర్తి చేసి, ఆ తరువాత అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కోసం చేయడానికి హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వెళ్లాడు. ఆయన భార్య మోనా కూడా చార్టర్డ్ అకౌంటెంట్ కావడం గమనార్హం. 2013లో సంజీవ్ మెహతా హిందుస్థాన్ యూనిలీవర్ యొక్క CEO & MDగా నియమితుడయ్యాడు. ఆ తరువాత 2018లో ఛైర్మన్‌గా పదవి చేపట్టాడు. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్‌లోని వ్యాపారాలను కలుపుతూ క్లస్టర్ ప్రెసిడెంట్‌గా దక్షిణాసియాలో యూనిలీవర్ వ్యాపారానికి కూడా నాయకత్వం వహిస్తున్నాడు. (ఇదీ చదవండి: Mahindra Scorpio-N: సన్‌రూఫ్ లీక్‌పై రచ్చ లేపి.. ఇప్పుడు హ్యాపీ అంటున్నాడు) 2021-22 మధ్య కాలంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడిగా, ఎయిర్ ఇండియా బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్ కూడా పనిచేశారు. HULకి విజయవంతంగా నాయకత్వం వహించడంతో సక్సెస్ సాధించిన మెహతా అధికారంలో ఉన్న తొమ్మిదేళ్ల కాలంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ 17 బిలియన్ డాలర్ల నుంచి 75 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఆయన వార్షికాదాయం 2021లో రూ. 15 కోట్ల నుంచి 2022 నాటికి రూ. 22 కోట్లకు చేరింది. -
Trina Das: ఒకప్పుడు ట్యూషన్ టీచర్.. ఇప్పుడు వంద కోట్లకు అధిపతి!
'అనుకుంటే కానిది ఏమున్నది' అన్న మాటలకు రూపం పోస్తే అది 'త్రినా దాస్' (Trina Das). ఈ మాట ఇక్కడ ఊరికే ఉపయోగించలేదు, పిల్లలకు ట్యూషన్ చెప్పే స్థాయి నుంచి ఈ రోజు ఎంతోమందికి ఉద్యోగాలు కల్పిస్తూ కోట్లకు అధిపతి అయిన త్రినా దాస్ ఎవరు, ఈమె సక్సెస్ సీక్రెట్ ఏమిటనేది ఈ కథనంలో చూసేద్దాం.. పశ్చిమ బెంగాల్లో పుట్టిన త్రినా దాస్ మొదటి నుంచే తాను వ్యాపారవేత్త కావాలని, ప్రపంచంలో మార్పు తీసుకురావడానికి తనవంతు తప్పకుండా కృషి చేయాలని కలలు కనింది. ఈ రోజు ఆ కలలకు నిజం చేసుకుంది. నిజానికి త్రినా దాస్ కోల్‌కతాలోని బల్లిగంజ్ శిక్షా సదన్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, బెంగాల్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్‌లో బిటెక్ చదివింది. ప్రారంభంలో పాకెట్ మనీ కోసం ఇంటిదగ్గరే పిల్లలకు ట్యూషన్ చెప్పడం ప్రారంభించింది. ఆ తరువాత తన తండ్రి కోరిక మేరకు 16 మంది 11, 12 తరగతుల పిల్లలకు కేవలం ఒక్కొక్కరికి రూ. 400 ఫీజుతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ చెప్పడం ప్రారభించింది. పదహారు మందితో ప్రారంభమైన ట్యూషన్ సంవత్సరం చివరి నాటికి 1,800కి చేరింది. తరువాత ఆ పిల్లలకు వసతులు కల్పిస్తూ ఆమెకు సహాయంగా మరికొంతమంది ఉపాధ్యాయులను నియమించుకుని సంవత్సరానికి రూ. 8 నుంచి 10 లక్షలు సంపాదించింది. అతి తక్కువ కాలంలోనే ఆమె ఫ్రాంచైజ్ మోడల్ ద్వారా 86 కోచింగ్ సెంటర్లను ప్రారంభించి 2014-15 నాటికి రూ. 5 కోట్లు ఆర్జించింది. త్రినా దాస్ 2017లో తన ఇద్దరు స్నేహితులైన నీరజ్ దహియా, అరుణ్ సెహ్రావత్‌తో కలిసి టాలెంట్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించింది. దీని ద్వారా ఒక సంవత్సరంలో సుమారు రూ. 20 కోట్లు సంపాదించారు. మొదటి లాక్డౌన్ సమయంలో వారు బ్లూ కాలర్ ఉద్యోగాలపై దృష్టి సారించి ఉద్యోగాలు కోల్పోయిన వారికి గుర్గావ్, ఢిల్లీలోని అనేక కంపెనీలకు సెక్యూరిటీ వర్కర్లు, డెలివరీ బాయ్స్, ఆఫీస్ వర్కర్స్ ఉద్యోగాలను అందించడం ప్రారంభించారు. దీని ద్వారా దాదాపు 6,000 మందికి ఉద్యోగాలను కల్పించారు. (ఇదీ చదవండి: భయం గుప్పెట్లో ఉద్యోగులు.. నీటి బుడగలా ఉద్యోగాలు: భారత్‌లోనూ..) ఏప్రిల్ 2022లో ఉద్యోగుల కంటే కంపెనీలకు ఉద్యోగులను అందించడానికి నిర్ణయించుకున్నారు. దీని ద్వారా ఉద్యోగులు మంచి జీతం, హోదా పొందవచ్చని ఆశించింది. దీనికోసం వారు గిగ్‌చెయిన్ ప్రారంభించి వివిధ కంపెనీలకు ఉద్యోగులను అందించింది. ప్రస్తుతం వారి టర్నోవర్ రూ. 102 కోట్లు. (ఇదీ చదవండి: Flipkart Summer Offer: వీటిపై 60 శాతం డిస్కౌంట్! మార్చి 26 వరకే..) 2012 లో బరాక్ ఒబామా ప్రశంసలు అందుకుని ప్రపంచవ్యాప్త గుర్తింపును పొందిన త్రినా దాస్ 2021లో తోటి వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. మొత్తానికి త్రినా అనుకున్నది సాధించి విజయానికి చిరునామాగా నిలిచింది. -
పెట్టుబడులతో ముందుకు రండి
సాక్షి, హైదరాబాద్: దేశ ఆర్థిక రాజధాని ముంబై పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్ గురువారం పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యారు. తెలంగాణలో అమలవుతున్న పారిశ్రామిక విధానం ప్రత్యేకతలు వివరించడంతోపాటు రాష్ట్రంలో ఉన్న విస్తృత వ్యాపార, వాణిజ్య అవకాశాలపై చర్చించారు. తొలుత టాటా కార్పొరేట్ కేంద్ర కార్యాల యం బాంబే హౌజ్‌లో టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో భేటీ అయ్యారు. తెలంగాణలో టాటా గ్రూప్ విస్తరణకు ఉన్న అవకాశాలను వివరిస్తూ సంస్థ విస్తరణ ప్రణాళికల్లో రాష్ట్రానికి ప్రాధాన్యతనివ్వాలని కేటీఆర్ కోరారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో హైదరాబాద్ కేంద్రంగా టాటా గ్రూప్ ప్రగతిని ప్రస్తావించడంతోపాటు టీసీఎస్ కార్యకలాపాలను వరంగల్‌కు విస్తరించాలని కోరారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో సానుకూల వాతావరణాన్ని వివ రిస్తూ పెట్టుబడులతో ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. విమానయాన రంగంలో పురోగతిలో ఉన్న టాటా సంస్థ హైదరాబాద్‌లో నిర్వహణ, మరమ్మ తు, ఓవర్‌హాలింగ్ (ఎంఆర్ఓ) కేంద్రాన్ని ఏర్పా టు చేయాలని కోరారు. తెలంగాణలో తమ సంస్థ కార్యకలపాలపై నటరాజన్‌చంద్రశేఖరన్ సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యాపార నిర్వహణ అత్యంత సులువుగా ఉందనే విషయం తమ అనుభవంలో తేలిందన్నారు. దేశ ఆర్థిక పురోగతి, అంతర్జాతీయ వ్యాపార వాణిజ్య పరిస్థితులు, పెట్టుబడి అవకాశాల వంటి అనేక అంశాలపై ఇద్దరు చర్చించారు. ఎఫ్ఎంసీజీలో పెట్టుబడులు తెలంగాణ ప్రజల తలసరి ఆదాయంతోపాటు అనేక ఇతర ఆర్థిక సూచీలు వేగంగా వృద్ధి చెందు తున్నాయని హిందుస్తాన్ యూనిలీవర్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతాతో జరిగిన భేటీలో కేటీఆర్ చెప్పారు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగిన నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ రంగంలో తెలంగాణను పెట్టుబడు ల గమ్యస్థానంగా ఎంచుకునేందుకు ఇదే సరైన అవ కాశమని తెలిపారు. పామాయిల్ ఉత్పత్తి కోసం ఒక బృహత్తర లక్ష్యాన్ని ఎంచుకున్న ప్రభుత్వం, ఆ దిశగా రైతులను చైతన్యపరిచి ప్రోత్సహి స్తోందని తెలిపారు. వంట నూనెల ఉత్పత్తి కోసం హిందుస్తాన్ యూనిలీవర్ పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని సూచించారు. ఫార్ములా–ఈ రేసింగ్ కౌంట్‌డౌన్ షురూ.. హైదరాబాద్‌లో జరగనున్న ‘ఫార్ములా–ఈ’ ఎలక్ట్రానిక్ కార్ల రేసింగ్ 30 రోజుల కౌంట్‌డౌన్‌ను ముంబైలోని ఇండియాగేట్ వద్ద ప్రారంభించారు. మహారాష్ట్ర సీఎం షిండే, కేంద్ర మంత్రి గడ్కరీ, మంత్రి కేటీఆర్, గ్రీన్కో– ఏస్ గ్రూప్ వ్యవస్థాపకుడు అనిల్‌కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయండి బయ్యారంతోపాటు పొరుగునే ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో ఇనుప ఖనిజం నిల్వలను దృష్టిలో ఉంచుకొని అక్క డ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీ లించాలని ప్రముఖ పారిశ్రామిక సంస్థ జేఎస్ డబ్ల్యూ ఎండీ సజ్జన్ జిందాల్‌ను కేటీఆర్ కోరారు. సజ్జన్ జిందాల్‌తో ఆయన జేఎస్‌డబ్ల్యూ కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. జేఎస్‌డబ్ల్యూ సంస్థకు స్టీల్, సిమెంట్ వంటి రంగాల్లో ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణకు పెట్టుబడులతో రావాలని ఆహా్వనించారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు జేఎస్‌డబ్ల్యూ ముందుకు వస్తే అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. విద్య, క్రీడలు తదితర రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని జిందాల్‌ను కోరారు. తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతి, పెట్టుబడుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని జిందాల్ ప్రశంసించారు. -
టాటా గ్రూప్ కృష్ణకుమార్ కన్నుమూత
ముంబై: రతన్ టాటాకి అత్యంత సన్నిహితుడు, టాటా గ్రూప్‌లో పలు అత్యున్నత బాధ్యతలు నిర్వర్తించిన ఆర్ కృష్ణకుమార్(84) ఇక లేరు. ఆదివారం గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ సాయంత్రం కన్నుమూశారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత అయిన ఆర్ కృష్ణకుమార్.. కేరళ తలస్సెరీలో పుట్టిపెరిగారు. చెన్నైలో ఉన్నత చదువులు పూర్తి చేసి.. 1963లో టాటా గ్రూప్‌లో అడుగుపెట్టారు. టాటా సన్స్‌కు డైరెక్టర్‌గానే కాదు, గ్రూప్‌లో పలు కంపెనీల టాప్ పొజిషన్లో ఆయన పని చేశారు. ట్రస్ట్‌ల బాధ్యతలను కూడా ఆయన చూసుకున్నారు. టాటాలోని వివిధ సంస్థలతో పాటు దాని అనుబంధ సంస్థ ఇండియన్ హోటల్స్‌కు హెడ్‌గానూ ఆయన పని చేశారు. దూకుడు నిర్ణయాలకు కేరాఫ్‌గా ఈయనకంటూ ఓ గుర్తింపు ఉంది. టాటా సంస్థలకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా ఆయన పలు కీలక నిర్ణయాల్లో ముఖ్యభూమిక పోషించారు. వ్యాపార కార్యనిర్వాహకుడిగానే కాకుండా.. దాదాపు ఒకే వయసు వాళ్లు కావడంతో రతన్ టాటాతో కృష్ణకుమార్‌కు మంచి అనుబంధం కొనసాగింది. సైరస్ మిస్ట్రీ తొలగింపు ఎపిసోడ్లో.. రతన్ టాటాకు కీలక సూచనలు చేసిన బృందంలో ఈయన కూడా ఉన్నారు. 2009లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం అందించింది. ఇక కృష్ణకుమార్ మృతి టాటా గ్రూప్ స్పందించింది. టాటా సన్స్ ప్రస్తుత చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పేరిట సంతాప ప్రకటన విడుదల చేసింది. టాటా గ్రూప్‌నకు ఆయన చేసిన సేవలు మరువలేనివని అందులో చంద్రశేఖరన్ కొనియాడారు. మరోవైపు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైతం కృష్ణకుమార్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముంబైలోని చందన్‌వాడీ శ్మశానవాటికలో సోమవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
పద్మభూషణ్ నుంచి.. కటకటాల్లోకి, ‘ఎంత పనిచేశావయ్యా అరవింద్’
వేగంగా డబ్బు సంపాదించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ కథ అడ్డం తిరిగినప్పుడు కళ్లముందున్న డబ్బు కూడా చేతికొచ్చేలోగా ఆవిరైపోవచ్చు. అప్పుడు చేసిన పాపాలకు ముసుగేసే టైం దొరక్కపోవచ్చు. కష్టపడకుండా వచ్చిన సొమ్మును కాపాడుకోవడం కూడా కష్టమేనని నిరూపించిన సంఘటన చందాకొచ్చర్ స్కాం. కాస్త తెలివితేటలతో బ్యాంకింగ్ వ్యవస్థను అడ్డంగా వాడుకోవచ్చని బయటపెట్టిన ఈ కుంభకోణమే చందా కొచ్చర్ స్కాం. ఏదైనా సాధించడం ఎంత కష్టమో. దాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం. పవర్ఫుల్ బ్యాంకర్‌గా పేరు తెచ్చుకున్న చందా కొచ్చర్ పొజీషన్ కూడా అదే. లక్షల కోట్ల ఆస్తులు. వేల సంఖ్యలో ఉద్యోగులు. పురుషాధిక్య వ్యాపార రంగం. ప్రభుత్వ రంగ సంస్థలతో పోటీ. అయితేనేం అంకెలతో గారెడీ చేసే ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవోగా.. బ్యాంకర్లకు మెగస్టార్లా..తోటి ఉద్యోగులకు దేవుడిలా కనిపించారు. ఇండియన్ బ్యాంకింగ్ ట్రెండ్‌ను మార్చేసి.. ఆ రంగాన్ని పరుగులు పెట్టించారు. ఎవరి అంచనాలకు అందకుండా దూసుకెళ్లారు. కానీ కొంతమందిని కొంతకాలమే మోసం చేయొచ్చు. కానీ ఎక్కువ మందిని ఎక్కువ కాలం మోసం చేయలేరు. సీఈవోగా ఐసీఐసీఐ బ్యాంక్‌ను ఏలిన కొచ్చర్ కూడా అలాగే దొరికి పోయారు. బ్యాంకింగ్ రంగంలో నడిచిన కరప్షన్ ఏపీసోడ్ మొత్తం బయటపడింది. చందా కొచ్చర్ అక్రమసామ్రాజ్యం పునాదులతో కదిలాయి. సీబీఐ అరెస్ట్ ఒకప్పుడు మ్యాగజైన్ కవర్ పేజీల మీద మెరిసిన స్టార్ చందా కొచ్చర్తో పాటు ఆమె భర్త దీపక్ కొచ్చర్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అరెస్టు చేసింది. వేణుగోపాల్ ధూత్‌కి చెందిన వీడియోకాన్ గ్రూపునకు ఇచ్చిన రూ. 3,000 కోట్లకు పైగా రుణాల విషయంలో అవకతవకలు జరిగాయంటూ అరెస్టు చేశారు. ఇంతకీ ఈ ముడుపుల వ్యవహారం ఎలా వెలుగులోకి వచ్చింది? ఎస్సార్ గ్రూప్, వీడియోకాన్ గ్రూప్‌లో లాంచాల భాగోతం ఎలా వెలుగులోకి వచ్చింది. ఇచ్చుకో.. పుచ్చుకో 2010లో ఐసీఐసీఐ బ్యాంక్ ఎస్సాఆర్ స్టీల్‌కి 530 మిలియన్ డాలర్లు అప్పిచ్చింది. ఎస్సార్ ఆయిల్‌కి 350 మిలియన్ డాలర్ల అప్పును పువ్వులో పెట్టి ఇచ్చింది. ఎస్సార్ గ్రూప్‌లోని రెండు కంపెనీలకు అప్పులిచ్చిన తర్వాత లంచాల భాగోతం మొదలైంది. అంటే 2010 నుంచి 2012 మధ్య కాలంలో చందా కొచ్చర్ భర్త దీపా కొచ్చర్ కంపెనీలో పెట్టుబడులను అంటే లంచాల ద్వారా పంపించారు. ‘ఎంత పనిచేశావయ్యా అరవింద్’ రవి రూయా అల్లుడు నిషాంత్ కనోడియాకు చెందిన ఫస్ట్ హ్యాండ్ హోల్డింగ్స్ నాలుగు విడతులుగా న్యూ పవర్లో రూ.325 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. శశిరూయా అల్లుడు అనిరుధ్ భువాల్కాకు చెందిన ఏ1 మోటార్స్ అనే సంస్థ ఏంఎండబ్ల్యూ అనే మరో సంస్థతో న్యూపవర్ టెక్నాలజీస్‌ను కొనుగోలు చేసిందని అరవింద్ గుప్తా అనే ఇన్వెస్టర్, సామాజిక కార్యకర్త అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ విలువ ఎంతన్నది బయటకు రాలేదు. అంటే ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రెండు కంపెనీలకు అప్పులందాయి. అడిగినంత అప్పు ఇచ్చినందుకు ప్రతిఫలంగా న్యూపవర్‌కు వెళ్లింది. చదవండి👉ఇదేందయ్యా..ఇది నేను చూడలా.. ‘ఓలా’ ఎలక్ట్రిక్ స్కూటర్ వైరల్! తీగలాగితే డొంక కదలింది అప్పులిచ్చిన చందా కొచ్చర్, లంచం తీసుకున్న దీపా కొచ్చర్ భార్యభర్తలు. అప్పులు తీసుకున్న రుయా సోదరులకు పెట్టుబడులు పెట్టిన అనిరుధ్, నిషాంత్ అల్లుళ్లు. ఈ వ్యవహారమే క్విడ్ ప్రోకో అని రిజిష్టార్ ఆఫీస్ కంపెనీస్ నుంచి సేకరించిన సమాచారం తన దగ్గరుందని విజిల్ బ్లోయర్ అరవింద్ గుప్తా సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు కొనసాగుతుండగా చందా కొచ్చర్ వీడియోకాన్‌కు రూ.3 వేల కోట్లకు పైగా ఇచ్చిన రుణం ఇచ్చినందుకు గాను తీసుకున్న ముడుపుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో చందా కొచ్చర్ చీకటి సామ్రాజ్యం ప్రపంచానికి తెలిసింది. తీగలాగితే డొంక కదిలిందిన్నట్లుగా వీడియో కాన్ గ్రూప్‌ల వద్ద నుంచి తీసుకున్న ముడుపులు దెబ్బకు గతంలో ఎస్సాఆర్ గ్రూప్ వ్యవహారం బయటకొచ్చింది. కొచ్చర్ భాగోతంపై ప్రధానికి లేఖ వీడియోకాన్ గ్రూప్‌లో పెట్టుబడిదారు అరవింద్ గుప్తా. ఆ అరవింద్ గుప్తా 2016లో ఐసీఐసీఐ బ్యాంక్, వీడియోకాన్ గ్రూప్‌ల మధ్య జరిగిన లావాదేవీలపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. కొచ్చర్ భాగోతాలపై అదే ఏడాది మార్చిలో ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. ఆ లేఖతో రంగంలో దిగిన ఆర్బీఐ దర్యాప్తు చేసింది. చందా కొచర్ - దీపక్ కొచ్చర్ అరెస్ట్: అక్టోబరు 2016: చందా కొచ్చర్‌పై ఆరోపణలు వెల్లు వెత్తిన తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్‌లో రుణ అక్రమాలు హైలెట్ అయ్యాయి. రంగంలోకి దిగిన ఆర్బీఐ దర్యాప్తు చేసింది కానీ.. కొచ్చర్ ముడుపుల వ్యవహారాన్ని ఎటూ తేల్చ లేకపోయింది. మార్చి 2018: 31లోన్ తీసుకున్న బ్యాంక్ అకౌంట్లలో సమస్యలను గుర్తించడంలో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తూ బ్యాంక్, ఆర్బీఐకు విజిల్ బ్లోయర్ అరవింద్ గుప్తా ఫిర్యాదు చేచేశారు. ఇది జరిగిన కొన్ని వారాల తర్వాత, సీబీఐ అంతర్గత విచారణను దాఖలు చేసి దీపక్ కొచ్చర్‌ను ప్రశ్నించడం ప్రారంభించింది. ఏప్రిల్ 2018: ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు చందా కొచ్చర్‌కు అండగా నిలిచింది. ఆమెపై వచ్చిన ఆరోపణల్ని ఖండించింది. కొన్ని వారాల తర్వాత, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFO) ఐసీఐసీఐ బ్యాంక్ మంజూరు చేసిన వీడియోకాన్ రుణంపై దర్యాప్తు చేయడానికి కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతిని కోరింది. మే - జూన్ 2018: చందా కొచ్చర్‌పై విజిల్‌బ్లోయర్ తాజా ఆరోపణలతో ఐసీఐసీఐ బ్యాంక్ తప్పులు చేసిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ విచారణ ప్రారంభించడంతో మే నెలలో కొచ్చర్ సెలవుపై వెళ్లారు. జూలై 2018: షోకాజ్ నోటీసుకు తన ప్రత్యుత్తరాన్ని సమర్పించాల్సిందిగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కొచ్చర్‌ని కోరింది. అక్టోబర్ 2018: ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), సీఈవో బాధ్యతలకు చందా కొచ్చర్ రాజీనామా సమర్పించారు. జనవరి 2019: 2012లో వీడియోకాన్ గ్రూప్‌కు మంజూరైన రుణాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దీపక్ కొచ్చర్, చందా కొచ్చర్, వేణుగోపాల్ ధూత్‌లపై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఆ వెంటనే, చందా కొచ్చర్ బ్యాంక్ కోడ్‌ను ఉల్లంఘించినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ స్వతంత్ర దర్యాప్తులో తేలింది. ఫిబ్రవరి 2019: చందా కొచ్చర్‌పై సీబీఐ లుక్అవుట్ నోటీసు జారీ చేసింది. జనవరి 2020: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చందా కొచ్చర్, ఆమె కుటుంబ సభ్యుల ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసింది. వీటి విలువ రూ.78 కోట్ల పైమాటే. సెప్టెంబర్ 2020: మనీలాండరింగ్ కేసులో దీపక్ కొచ్చర్‌ను ఈడీ అరెస్టు చేసింది. నవంబర్ 2020: చందా కొచ్చర్‌పై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. మార్చి 2021: దీపక్ కొచ్చర్ రూ. 3 లక్షల వ్యక్తిగత బాండ్‌పై విడుదలయ్యారు మే 2022: సీబీఐ చందా కొచ్చర్‌పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. డిసెంబర్ 23, 2022: చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్లను సిబిఐ అరెస్టు చేసింది. డిసెంబరు 26, 2022 వరకు వారిని 3 రోజుల పాటు సీబీఐ కస్టడీకి తీసుకుంది. పద్మభూషణ్ నుంచి.. కటకటాల్లోకి 1984లో ఐసీఐసీఐ బ్యాంక్‌లో మేనేజ్మెంట్ ట్రైనీగా చేరిన చందా కొచ్చర్.. అతి తక్కువ సమయంలో దేశ బ్యాంకింగ్ రంగంలో స్టార్‌గా ఎదిగారు. అనతి కాలంలో ట్రైనీ నుంచి బ్యాంక్ సీఈవోగా ఆమె ఎదిగిన తీరు అమోఘం..అనర్వచనీయం. 2009 మేలో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓగా, ఎండీగా చందా కొచ్చర్ నియమితులయ్యారు. ఆ బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఐసీఐసీఐ బ్యాంక్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ప్రభుత్వ బ్యాంకులకు గట్టి పోటీ ఇచ్చింది. బ్యాంకింగ్ రంగంలో ఆమె చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం 2011లో పద్మ భూషణ్ ప్రదానం చేసింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఆమెకు కూడా చోటు దక్కింది. ఐసీఐసీఐ బ్యాంక్‌లో మూడు దశాబ్దాలకుపైగా కాలంలో ఎన్నోసార్లు అత్యంత ప్రభావశీల మహిళగా చందా కొచ్చర్ గుర్తింపును పొందారు. కానీ, ఎంతో అద్భుతంగా సాగుతున్న తన బ్యాంకింగ్ కెరీర్ మెరుపుల నుంచి మరకల వరకు ఇలా కటకటాల వెనక్కి వెళ్తామని బహుశా ఆమె కూడా ఊహించి ఉండరు. చదవండి👉 ‘బండ్లు ఓడలు ..ఓడలు బండ్లు అవ్వడం అంటే ఇదేనేమో’! -
Asia Power Businesswomen List 2022: పవర్‌కు కేరాఫ్ అడ్రస్
‘అవకాశం అనేది మీ తలుపు తట్టకపోతే కొత్త తలుపు తయారు చేసుకోండి’ అనే మాట ఉంది. అవును. కొత్తగా ఆలోచించినప్పుడు మాత్రమే కొత్తశక్తి వస్తుంది. ఆ శక్తి ఈ ముగ్గురు మహిళలలో ఉంది. ‘ఆసియాస్ పవర్ బిజినెస్ ఉమెన్’ జాబితాలో చోటు సంపాదించిన గజల్ అలఘ్, నమితా థాపర్, సోమా మండల్ల గురించి... ఫోర్బ్స్ ‘ఆసియాస్ పవర్ బిజినెస్ ఉమెన్’ జాబితాలో మన దేశానికి చెందిన గజల్ అలఘ్, నమితా థాపర్, సోమా మండల్లు చోటు సంపాదించారు. కోవిడ్ కష్టాలు, నష్టాలను తట్టుకొని తమ వ్యాపార వ్యూహాలతో సంస్థను ముందుకు తీసుకెళ్లిన వారికి ఈ జాబితాలో చోటు కల్పించారు. ‘హొనాసా కన్జూమర్’ కో–ఫౌండర్ గజల్ అలఘ్ చండీగఢ్‌లోని ఉమ్మడి కుటుంబంలో పెరిగింది. ఆ పెద్ద కుటుంబంలో మహిళల నోట ఉద్యోగం అనే మాట ఎప్పుడూ వినిపించేది కాదు. అయితే తల్లి మాత్రం గజల్‌కు ఆర్థిక స్వాత్రంత్యం గురించి తరచు చెబుతుండేది. పదిహేడు సంవత్సరాల వయసులో కార్పోరేట్ ట్రైనర్‌గా తొలి ఉద్యోగం చేసిన గజల్ ఆ తరువాత కాలంలో సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్, ఇన్నోవేటర్ అండ్ ఇన్వెస్టర్‌గా పేరు తెచ్చుకుంది. ప్రణాళికాబద్ధంగా పని చేయడం తన విజయరహస్యం. మూడురోజుల తరువాత చేయాల్సిన పని అయినా సరే ఈ రోజే పక్కాగా ప్లాన్ చేసుకుంటుంది. ధ్యానంతో తన దినచర్య మొదవుతుంది. కోవిడ్ ఉధృతి సమయంలో వ్యాపారం కుప్పకూలిపోయింది. అందరిలో భయాలు. ఆ భయం ఆఫీసు దాటి ఇంట్లోకి కూడా వచ్చింది. తల్లిదండ్రుల మౌనం పిల్లలపై పడింది. దీంతో వెంటనే మేల్కొంది గజల్. సరదాగా భర్త, పిల్లలతో యూట్యూబ్ వీడియోలు చేయడం మొదలుపెట్టింది. అలా ఇంట్లో మళ్లీ సందడి మొదలైంది. ఆ ఉత్సాహవంతమైన సందడిలో విచారం మాయమై పోయింది. తన సరికొత్త వ్యూహాలతో వ్యాపారం పుంజుకుంది. ‘విచారంలో మునిగిపోతే ఉన్న కాస్తో కూస్తో ఆశ కూడా మాయమైపోతుంది. పరిస్థితులు మరింత దిగజారిపోతాయి. ఇలాంటి సమయంలోనే మానసికంగా గట్టిగా ఉండాలి’ అంటుంది గజల్. ‘ఎమ్క్యూర్ ఫార్మా’ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నమితా థాపర్ రచయిత్రి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోచ్, యూ ట్యూబ్ టాక్‌షో ‘అన్కండీషన్ యువర్సెల్ఫ్ విత్ నమితా థాపర్’ నిర్వాహకురాలు. సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణిస్తున్న నమితా ‘థాపర్ ఎంటర్ప్రెన్యూర్ అకాడమీ’ ద్వారా ఎంతోమంది ఔత్సాహికులకు విలువైన పాఠాలు చెబుతోంది. తన తాజా పుస్తకం ‘ది డాల్ఫిన్ అండ్ ది షార్క్: లెస్సెన్స్ ఇన్ ఎంటర్ప్రెన్యుర్షిప్’కు మంచి ఆదరణ లభించింది. ‘ప్రపంచం కోసం నువ్వు మారాలని ప్రయత్నించకు. నువ్వు నీలాగే ఉంటే ప్రపంచమే సర్దుబాటు చేసుకుంటుంది’ ‘నిన్ను నువ్వు ప్రేమించుకోవడం ద్వారా మాత్రమే నీలోని శక్తి నీకు కనిపిస్తుంది’...ఇలాంటి ఉత్తేజకరమైన వాక్యాలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి. ‘మొదట్లో నాలో ఆత్మవిశ్వాసం ఉండేది కాదు. లావుగా ఉండడం వల్ల చిన్నప్పుడు తోటి పిల్లలు వెక్కిరించేవారు. వారి మాటలను సీరియస్‌గా తీసుకొని ఉంటే నిస్పృహ అనే చీకట్లోనే ఉండేదాన్ని. నన్ను నేను తెలుసుకోవడానికి సమయం పట్టింది. ఆ తరువాత మాత్రం ఆత్మ విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోలేదు’ అంటుంది నమితా థాపర్. భువనేశ్వర్‌కు చెందిన సోమా మండల్ చదువులో ఎప్పుడూ ముందుండేది. తాను ఇంజనీరింగ్‌లో చేరడానికి తండ్రి ఒప్పుకోలేదు. ఇంజనీరింగ్‌లాంటి వృత్తులు అమ్మాయిలు చేయలేరు అని ఆయన అనుకోవడమే దీనికి కారణం. అయితే కుమార్తె పట్టుదలను చూసి తండ్రి తన నిర్ణయాన్ని మార్చుకోక తప్పలేదు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పట్టా తీసుకున్న సోమా మండల్ అల్యూమినియం తయారీ సంస్థ ‘నాల్కో’లో ట్రైనీగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు తొలి మహిళా చైర్‌పర్సన్‌గా చరిత్ర సృష్టించింది. నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల బాట పట్టించి జేజేలు అందుకుంది. -
Bigg Boss: బాస్‌లకే బాస్ అసలైన బిగ్‌బాస్ ఇతనే
Bigg Boss Show Creator: ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది ఇది ఓ మొబైల్ కంపెనీకి సంబంధించిన ఫేమస్ కొటేషన్. అయితే హలాండ్కి చెందిన ఓ వ్యక్తికి వచ్చిన ఐడియా ఆయన జీవితాన్నే కాదు ఎంటైర్టైన్మెంట్ వరల్డ్ రూల్స్‌నే మార్చేసింది. బుల్లితెరపై సంచలన విప్లవానికి దారి తీసింది. కొత్త తరహా ఐడియాకి బిజినెస్ రూపం ఇచ్చిన అమలు పరిచిన వ్యక్తి వందల కోట్లకు అధిపతి అయితే ఆ ఐడియా ఆధారంగా రూపొందిన గేమ్‌షోను వందల కోట్ల మంది కళ్లప్పగించి చూస్తున్నారు. అంతమందిని తన ఐడియా చుట్టూ తిప్పుకున్న ఆ బిగ్‌బాస్, ఆ బిగ్‌బ్రదర్ పేరు జాన్ డే మోల్. ఫ్లాష్‌లా తట్టిన ఒక ఐడియాను ఓ సక్సెస్ఫుల్ షోలా ఎలా మార్చగలిగాడు? అతని విజయానికి కారణాలేంటీ ? అసలైన వ్యాపార సూత్రం కొత్తదనం అనేది వ్యాపార విజయ సూత్రాల్లో ప్రధానమైంది. అప్పటి వరకు నడుస్తున్న ట్రెండ్‌కి భిన్నంగా వెళ్లగలిగే వాళ్లు అతి తక్కువ కాలంలో అత్యంత భారీ విజయాలు సాధిస్తారనడానికి మరో ఉదాహరణ జాన్ డే మోల్. అప్పటి వరకు నాటకాలు మొదలు సినిమా, టీవీ సీరియళ్ల వరకు వినోదరంగం అంతా స్క్రిప్ట్ బేస్డ్‌గానే ఉండేది. ముందుగానే ఏ సన్నివేశం ఎలా ఉండాలో, నటీనటులు ఎలా నటించాలో, కెమెరా యాంగిల్ ఎలా ఉండాలో ముందుగానే నిర్ణయం జరిగేది. కానీ ఇందుకు విరుద్ధంగా అసలు స్క్రిప్ట్ అనేదే లేకుండా వినోద కార్యక్రమాన్ని రియలిస్టిక్‌గా చూపితే ఎలా ఉంటుందనే కొత్త రకం ఐడియాకు పురుడు పోసి భారీ విజయం అందుకున్నాడు జూన్ డే మూల్. ఐడియాలో నవ్యత, తాజాదనం, యూనివర్సల్ అప్పీల్ ఉంది కాబట్టే నెదర్లాండ్ వంటి చిన్న దేశంలో ప్రారంభమైన బిగ్‌బ్రదర్ రియాల్టీ షో బిగ్‌బాస్‌గా మారి ప్రపంచ దేశాలను చుట్టేసింది. పరిశీలన దృష్టి బిజినెస్‌లో రాణించాలంటే సునిశిత పరిశీలనా దృష్టి ఎంతో అవసరం. అది మెండుగా ఉన్న వారిలో జాన్ డే మూల్ ఒకరు. తన ఆఫీసులో పని చేసే ఓ ఉద్యోగి, ఓ రోజు మాటల సందర్భంగా తాను చదివిని అమెరికన్ సైన్స్ జర్నల్‌లోని అంశాలను జాన్‌తో చర్చించాడు. ఈ సందర్భంలో బయో స్పియర్ పేరుతో అమెరికా ఓ సైంటిఫిక్ రీసెర్చ్ చేపట్టాలనుకుందని, అందులో భాగంగా ఒక పెద్ద గాజు భవంతిని నిర్మించి అందులో కొందరు మనుషులను ఉంచాలనుకుందని చెప్పాడు. ఆ గాజు గ్లాసు లోపలే ఉంటూ మనుగడ సాగించేందుకు అందులోని మనుషులు ఎలా పంటలు పండిస్తారు, ఎలా నీటిని నిల్వ చేసుకుంటారు... ఇలా మానవ మనుగడ ఏ తీరుగ ఎవాల్వ్ అయ్యిందనే అంశాలను ప్రత్యక్షంగా చూడాలని అనుకుందంటూ జాన్‌తో చెప్పుకుంటూ పోయాడు. అందులో మనుషుల మనుగడను ప్రత్యక్షంగా చూడటం అనే అంశం జాన్ దృష్టిని ఆకర్షించింది. ఐడియాల మేళవింపు ఐడియా అనేది చాలా చిన్నది. కానీ దానిని విస్తరించి కార్యరూపం ఇవ్వడం కష్టమైన పని. అది చేయాలంటే ఎంతో పట్టుదల, దానికి కావాల్సిన వనరులను సమకూర్చుకోవడానికి ఎంతో కృషి కావాలి. సైన్స్ జర్నల్‌లో వచ్చిన బయో స్పియర్ కాన్సెప్టుకి కార్యరూపం ఇచ్చేందుకు తన మెదడుని మథించాడు జాన్. అప్పుడే అతని బుర్రలో ఫ్లాష్‌లా మెరిసింది జార్జ్ ఓర్వెల్ రాసిన 1984 అనే నవల. రెండు ప్రపంచ యుద్దాల తర్వాత భవిష్యత్తు ఎలా ఉండవచ్చనే ఊహతో 1949లో ఆ నవల రాయబడింది. అందులో భవిష్యత్తులో ప్రజలను కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వాలు దేశమంతంటా ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు అమర్చుతాయి. వ్యక్తిగత జీవితాన్ని చాలా దగ్గరగా పరిశీలిస్తుంటాయి. దీంతో ప్రజలు పడిన ఇబ్బందులు అందులో నుంచి పుట్టుకొచ్చే హాస్యం ఇతర భావోద్వేగాల ఆధారంగా ఆ నవల సాగుతుంది. ఒక సైన్స్ జర్నల్‌లో నచ్చిన ఐడియాకి మరో ఫిక్షన్ నవల కాన్సెప్టుని జోడిస్తే అద్భుతంగా ఉంటుందని నమ్మాడు జాన్ డీ మోల్. పట్టుదల ఫ్రేమ్‌లో కొద్ది మంది యాక్టర్లు ముందుగా ఇచ్చిన స్క్రిప్ట్‌ని బట్టి నటిస్తుంటే ఓ నాలుగు కెమెరాల్లో షూట్ చేసి సినిమా, సీరియల్స్‌గా అందిస్తే ఆడియన్స్‌కి నచ్చుతోంది. మరి పది మంది నటులు ఎటువంటి స్క్రిప్ట్ లేకుండా 120 కెమెరాలతో షూట్ చేస్తే... ఆ ఫుటేజీ చూడటానికి ఎంతోమంది ఆసక్తి చూపిస్తారనే ఐడియాతో అనే పేరుతో షూటింగ్ ప్రారంభించారు. చూసిన వాళ్లెవరు ఈ ప్రొగ్రామ్ క్లిక్ అవుతుందని నమ్మలేదు. అంతా నిరాశ పరిచిన వారే. ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయడానికి ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. అయినా తన ఐడియాపై నమ్మకంతో పట్టుదలగా ముందుకు వెళ్లాడు. మొదటి సీజన్ షూట్ పూర్తియినా అడ్వర్టైజ్మెంట్లు రాలేదు. గుండె ధైర్యంతో ప్రోగ్రామ్‌ను ప్రసారం మొదలుపెట్టారు. నాలుగు వారాలు గడిచాక మెల్లగా జనాలు ఎక్కడం మొదలైంది. అంతే ఇక వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు. మన తెలుగులో ప్రస్తుతం ఐదో సీజన్ ప్రారంభం అయ్యింది. పాజిటివ్ థింకింగ్ బిగ్‌బాస్ మాతృక బిగ్‌బ్రదర్ కార్యక్రమానికి మొదట అనుకున్న పేరు గోల్డెన్ కేజ్. కానీ పంజరం, బోను అనే పదాలు అందులో బంధిగా ఉండగా ఉండటం అనేది నెగటీవ్‌గా ఉన్నట్టు జాన్ డీ మోల్కి చెప్పారు. తన ఐడియాపై గట్టి నమ్మకం ఉన్నప్పుడు ఎంతమంది వారించినా ధైర్యంగా ముందుకు వెళ్లాడో.. అదే తీరులో తనకు నచ్చిన పేరైనా సరే లాజికల్‌గా బాగాలేదనే సలహాని అదే స్ఫూర్తితో జాన్ స్వీకరించాడు దీంతో 1984 నవలలో ఉన్న సోషల్ సర్వైలెన్స్ పేరైన బిగ్బ్రదర్నే ఈ కార్యక్రమానికి ఎంచుకున్నారు. ఆ బిగ్బ్రదరే మనల్ని ఇప్పుడు బిగ్‌బాస్‌గా అలరిస్తున్నాడు. రెండు బిలియన్ డాలర్లు ఫోర్బ్స్ పత్రిక అత్యంత ధనవంతుల లిస్టును ప్రతీ ఏడు ప్రచురిస్తుంది. అందులో ఎక్కువ పేర్లు బిజినెస్ కేటగిరీకి చెందిన వ్యక్తులకే స్థానం దక్కుతుంది. ఆ తర్వాత స్పోర్ట్స్ , సినీ సెలబ్రిటీలు ఉంటారు. కానీ ఒక టీవీ నిర్మాతగా ఫోర్బ్స్ జాబితాలో చోటు సాధించాడు. వ్యక్తిగత ఆస్తుల విలువే రెండు బిలియన్ డాలర్లుగా నమోదు అయ్యింది. ప్రపంచమంతటా బిగ్బ్రదర్తో పాటు యూటోఫియా, ది వాయిస్, ఫియర్ ఫ్యాక్టర్, డీల్ ఆర్ నో డీల్ వంటి అనేక రియాల్టీ షోలను అందించారు. పెద్ద సంస్థలతో సంబంధం లేకుండా ప్రపంచంలోనే వ్యక్తిగతంగా అత్యధికంగా ప్రోగ్రామ్స్‌ను సృష్టించిన నిర్మాతగా ఆయన రికార్డు సృష్టించారు. ఒక క్రియరేటర్గా పక్కా బిజినెస్‌మెన్‌గా ఆయన ప్రొడక్షన్ హౌజ్ నుంచి వచ్చిన అనేక రియాల్టీ షోలు వివిధ పేర్లతో వివిధ రూపాల్లో 76 దేశాల్లో 295 ఛానల్స్‌లో 800లకు పైగా రియాల్టీషోలుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. - సాక్షి, వెబ్‌డెస్క్ చదవండి: Deccan Aviations: రూపాయికే విమానం ఎక్కించిన గోపినాథ్ ఏమంటున్నారు -
ఏడుగురు మహిళలు..రూ.80 పెట్టుబడి కట్ చేస్తే రూ.1600 కోట్ల టర్నోవర్
సాక్షి వెబ్ డెస్క్: మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఏడుగురు మహిళలు. బిజినెస్ బ్యాక్ గ్రౌండ్ లేదు.పెద్దగా చదువు కోలేదు. కానీ రూ.80 పెట్టుబడి పెట్టి 1600 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఇప్పుడు 69 ప్రాంతాల్లో 42వేల మంది ఉద్యోగులతో నిర్వహిస్తున్నారు. ఆ మహిళలు ఎవరో కాదు శ్రీ మహిళా గృహ ఉద్యోగ్ లిజ్జత్ పాపడ్ వ్యవస్థాపకులు. ఇంటి వద్ద నుంచే ప్రారంభమైన లిజ్జత్ పాపడ్ బిజినెస్ కార్పొరేట్ స్థాయిలో వ్యాపార కార్యకలాపాల్ని నిర్వహిస్తుంది. ఇంతకీ ఆ పాపడ్ కంపెనీ స్పెషల్ ఏంటీ? ఆ ఏడుగురు మహిళలు కేవలం రూ.80 ప్రారంభ పెట్టుబడితో 62 ఏళ్లుగా వందల కోట్ల బిజినెస్‌ను ఎలా రన్ చేస్తున్నారు. ఆత్మవిశ్వాసమే ఆలంబనగా 1959లో ముంబై గూర్ గావ్ ప్రాంతానికి చెందిన లోహన నివాస్ అనే బిల్డింగ్‌లో నివాసం ఉంటున్న గుజరాతి కుటుంబాలకు చెందిన జశ్వంతిబెన్ జమ్నాదాస్ పోపాట్, పార్వతీబెన్ రామదాస్ తోడాని, ఉజాంబెన్ నారందాస్ కుండాలియా, బానుబెన్. ఎన్. తన్నా, లగుబెన్ అమృతలాల్ గోకాని, జయబెన్ వి. విఠలానీ, దివాలిబెన్ లుక్కా అనే ఏడుగురు మహిళలు కలిసి ఏదైనా బిజినెస్ పెట్టాలని అనుకున్నారు. చదువు లేదు. ఇంట్లోనుంచి బయటకు వెళ్లలేరు. కేవలం ఏదో సాధించాలనే పట్టుదల, కష్టాలను వెరవని ఆత్మవిశ్వాసమే వారిని ముందుకు నడిపింది. కేవలం రూ.80పెట్టుబడితో తమకు తెలిసిన పాపడ్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించారు. దానికి లిజ్జత్ పాపడ్ అని పేరు పెట్టారు. లిజ్జత్ అంటే అందరూ ఎదగాలని అర్ధం . ఇంటింటికి లిజ్జత్ మంచి క్వాలిటీ, టేస్ట్ తో పాపడ్ ను తయారు చేయడంతో ఇతర దుకాణాలకు చెందిన వ్యాపారులు లిజ్జత్ పాపడ్లను కొనుగోలు చేయడం ప్రారంభించారు. అందుకు తగ్గట్టుగా వ్యాపారాన్ని విస్తరించేంత పెట్టుబడి వారి దగ్గర లేదు. అప్పుడే వారికో ఐడియా తట్టింది. ఇంటి దగ్గర ఉండే మహిళలన్ని తమ వ్యాపారంలో భాగస్వాములను చేశారు. పాపడాలు తయారు చేసే పనిని వారికి అప్పగించారు. తక్కువ పని, తక్కువ జీతం ఎక్కువ ఉత్పత్తి సాధ్యమైంది. మార్కెట్ డిమాండ్‌ని అందుకోగలిగారు. అలా ముంబైలో లిజ్జత్ ఇంటింటా ఓ తప్పనిసరి వస్తువుగా మారిపోయింది. అయితే ఈ పని అంత ఈజీగా జరగలేదు. దీని కోసం ఆ మహిళలు కొత్త వ్యూహాన్ని రచించారు. బిజినెస్ మోడల్ ఇప్పుడంటే ఆడవాళ్లు కూడా ఆఫీసులకు వెళ్లి పని చేయగలుగుతున్నారు కానీ 1950,1960ల అంత సులువు కాదు. అందుకే పాపాడ్ తయారీకి అనువైన పిండి, ఇతర మసాల దినుసులను లిజ్జత్ ప్రధాన కార్యాలయంలో ఉంచేవారు. పాపడ్ తయారు చేసే మహిళలు వాటిని తమ ఇళ్లకు తీసుకెళ్లి ఇంటి దగ్గరే వాటిని తయారు చేసేవారు. మరుసటి రోజు వాటిని హెడ్ ఆఫీస్‌లో ఇచ్చే వారు. మళ్లీ పిండి తీసుకువెళ్లేవారు. చేసిన అప్పడాలకు సంబంధించిన డబ్బులు ఎప్పటికప్పుడు ఇచ్చేవారు. ఇంటి దగ్గరే ఉంటూనే డబ్బులు సంపాదించే వాలు ఉండటంతో అనతి కాలంలోలోనే లిజ్జత్ పాపాడాలు తయారు చేసేందుకు ఆసక్తి చూపించే మహిళల సంఖ్య పెరిగిపోయింది. ప్రతీక్షణం అప్రమత్తం గృహిణులు ప్రతీ రోజు ఆఫీసుకు ఇంటికి వచ్చి పోయేప్పుడు ఇబ్బందులు రాకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అంతేకాదు ఇంటి దగ్గర పరిశుభ్రమైన వాతావరణంలో నాణత్య పాటిస్తున్నారా లేదా అని తెలుసుకునేందుకు రెగ్యులర్‌గా హోం చెకప్‌లు కూడా చేసేవారు. లిజ్జత్ పాపడ్‌లో పని చేయాలనుకునే వారికి మొదట పాపడ్ రోలింగ్ వర్క్ అప్పచెప్పేవారు. అక్కడ బాగా పని చేస్తేనే తర్వాత పిండి కలపడం వంటి ఇతర బాధ్యతలు ఓ క్రమ పద్దతిలో అప్పగించేవారు. ఇలా గృహిణులు తమకు తెలిసిన పద్దతిలో తమకు ఎదురైయ్యే సవాళ్లను ముందుగానే ఊహిస్తూ బిజినెస్‌ను ముందుకు తీసుకెళ్లారు. కుటుంబ భావన లిజ్జత్ ఎదిగే క్రమంలో అండగా నిలిచిన వర్కర్లందరికీ ఆసరాగా ఉండాలని నిర్ణయించుకున్నారు. లిజ్జత్ పాపడ్ స్థాపించిన ఐదేళ్ల తర్వాత దానిని శ్రీ మహిళా గృహ ఉద్యోగ్ లిజ్జత్ లిమిటెడ్ సంస్థగా మార్చారు. అందులో పని చేసే కింది స్థాయి ఉద్యోగి నుంచి పై స్థాయి వరకు అందరికీ కంపెనీలో భాగస్వామ్యం ఇచ్చారు. ఇది మనది అనే భావన కలిగించారు. కంపెనీలో లాభాలు వచ్చినా, నష్టాలు వచ్చినా మహిళలందరూ సమానంగా పంచుకునేలా తీర్మాణం చేశారు. 42 వేల మందికి ఉపాధి అత్తెసరు అక్షర జ్ఞానం కలిగిన ఏడుగురు మహిళలు ఏర్పాటు చేసిన లిజ్జత్ ఈరోజు మహా వృక్షంగా మారింది. దేశంలో 67 బ్రాంచీల్లో 42 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. మనదేశంలో పాటు 15 దేశాలకు ఈ పాపడ్లు ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం లిజ్జత్ కంపెనీ ఏడాది టర్నోవర్ ఏకంగా రూ. 1600 కోట్ల రూపాయల పైమాటే అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఎలాంటి మేనేజ్మెంట్ డిగ్రీలు లేకుండా కేవలం పరిస్థితులను అంచనా వేస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటూ లిజ్జత్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. అచ్చం కుటుంబం లానే సాధారణంగా కంపెనీలు జీతం తప్ప కార్మికుల సంక్షేమం పట్ల అంతగా పట్టించుకోవు అనుకుంటాం. కానీ లిజ్జత్ పూర్తిగా మహిళల ఆధ్వర్యంలో నడిచే సంస్థ అందుకే జీతాలు, భాగస్వామ్యం వంటి మనీ మ్యాటర్స్ ఒక్కటే కాదు వెల్ఫేర్‌లోనూ ముందు ఉంది. ఈ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల పిల్లలకు ఉన్నత విద్య, వైద్యాన్ని అందిస్తున్నారు. సహాకసంఘాల శక్తి ఎలాంటిదో ప్రపంచానికి చాటి చెప్పారు. చదవండి : నీ లుక్ అదిరే, సరికొత్త ఫీచర్లతో విడుదలైన సెడాన్ -
వ్యాపార పద్మాలు అయిదుగురు..
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలు ఈసారి వ్యాపార, పారిశ్రామిక రంగంలో అయిదుగురికి దక్కాయి. రజనీకాంత్ దేవీదాస్ ష్రాఫ్, రజనీ బెక్టార్, జస్వంతీబెన్ జమ్నాదాస్ పోపట్, పి. సుబ్రమణియన్, శ్రీధర్ వెంబు ఇందులో ఉన్నారు. వీరిలో ఒకరికి పద్మభూషణ్ పురస్కారం రాగా, మిగతావారికి పద్మశ్రీ పురస్కారం దక్కింది. వారి వివరాలు.. రజనీకాంత్ దేవీదాస్ ష్రాఫ్ (పద్మభూషణ్): పంట సంరక్షణ ఉత్పత్తుల సంస్థ యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్ (యూపీఎల్) వ్యవస్థాపకుడు. ఈ సంస్థ క్రిమిసంహారకాలు, విత్తనాలు మొదలైనవి ఉత్పత్తి చేస్తోంది. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం ష్రాఫ్ 1.7 బిలియన్ డాలర్ల సంపదతో దేశీ కుబేరుల్లో 93వ స్థానంలో ఉన్నారు. రజనీ బెక్టార్ (పద్మశ్రీ): మిసెస్ బెక్టార్స్ ఫుడ్ కంపెనీ అధినేత. రూ. 20,000 పెట్టుబడితో ప్రారంభించిన ఐస్–క్రీమ్స్ వ్యాపారాన్ని నేడు రూ. 1,000 కోట్ల స్థాయికి విస్తరించారు. ఇటీవలే ఇది ఐపీఓ ద్వారా విజయవంతంగా లిస్ట్ అయింది. జస్వంతీబెన్ జమ్నాదాస్ పోపట్ (పద్మశ్రీ): అప్పడాల తయారీ సంస్థ లిజ్జత్‌ను ఏర్పాటు చేసిన వ్యవస్థాపకుల్లో ఒకరు. ఓ సామాజిక సేవా కార్యకర్త నుంచి అప్పుగా తీసుకున్న రూ. 80తో 1950లలో ప్రారంభమైన లిజ్జత్ ప్రస్తుతం 800 కోట్ల పైచిలుకు వ్యాపారం సాగిస్తోంది. పి. సుబ్రమణియన్ (పద్మశ్రీ): గేర్ మ్యాన్ ఆఫ్ కోయంబత్తూర్‌గా పిల్చుకునే సుబ్రమణియన్.. 1969లో శాంతి ఇంజినీరింగ్ అండ్ ట్రేడింగ్ కంపెనీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అది శాంతి గేర్స్గా మారింది. మురుగప్ప గ్రూప్‌నకు దీన్ని విక్రయించాక సుబ్రమణియన్ .. తను సొంతంగా ఏర్పాటు చేసిన శాంతి సోషల్ సర్వీస్ అనే సంస్థ ద్వారా సామాజిక సేవా కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. ఆయన మరణానంతరం పద్మశ్రీ పురస్కారం దక్కింది. శ్రీధర్ వెంబు (పద్మశ్రీ): క్లౌడ్ ఆధారిత బిజినెస్ సాఫ్ట్వేర్ సేవల సంస్థ జోహో వ్యవస్థాపకుడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేవలం పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేయకుండా గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నారు. -
పారిశ్రామిక దిగ్గజాలతో నేడు ప్రధాని భేటీ
న్యూఢిల్లీ: దేశీయంగా వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసేందుకు తీసుకోదగిన మరిన్ని చర్యలపై చర్చించేందుకు పారిశ్రామిక దిగ్గజాలు, విధానకర్తలతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సమావేశం కానున్నారు. టాప్ 50 దేశాల జాబితాలోకి చేరేందుకు అవసరమైన చర్యలు చర్చించనున్నారు. పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం దీన్ని నిర్వహిస్తోంది. ఆనంద్ మహీంద్రా వంటి పారిశ్రామిక దిగ్గజాలు, సీఐఐ .. ఫిక్కీ .. అసోచాం వంటి పరిశ్రమల సమాఖ్యల ప్రతినిధులతో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణలను రూపొందించిన సీనియర్ ప్రభుత్వ అధికారులు ఇందులో పాల్గోనున్నారు. సులభతరంగా వ్యాపారాల నిర్వహణకు అనువైన పరిస్థితులున్న దేశాలకు సంబంధించి (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) అక్టోబర్ 31న ప్రపంచ బ్యాంకు ప్రకటించిన జాబితాలో భారత్ 23 స్థానాలు ఎగబాకి 77వ ర్యాంకుకి చేరిన సంగతి తెలిసిందే. -
నవకల్పనా శక్తి..
స్త్రీ ఇంటిని, పిల్లల్ని చక్కదిద్దుతుంది... బంధాలు నిలబెడుతుంది.. గృహిణిగా బాధ్యతలన్నీ నిర్వర్తిస్తుంది.. వీటన్నిటితో పాటు కార్యక్షేత్రంలో నిరంతరం ఎదురయ్యే సవాళ్లు ఎదుర్కొని ఏ పనినైనా విజయవంతంగా పూర్తిచేయగలదని నిరూపించిన మహిళా వ్యాపారవేత్తలు ఎందరో.. వీరిలో కొందరికి వ్యాపారం వారసత్వంగా లభిస్తే... మరికొందరు తమకున్న అవకాశాల్ని సద్వినియోగం చేసుకుని యువ వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందూ జైన్ భారత్‌లో అతిపెద్ద మీడియా గ్రూప్ బెన్నెట్, కోలెమన్– కో లిమిటెడ్(టైమ్స్ ఆఫ్ ఇండియా) చైర్పర్సన్. సాహు జైన్ కుటుంబానికి చెందినవారు. ఆధ్యాత్మికవేత్త, మానవతావాది, సంస్కృతి, సంప్రదాయాల మద్దతుదారు, విద్యావేత్త ఇలా భిన్న పార్శ్వాలు కలవారు. 2016లో పద్మ భూషణ్ అవార్డు పొందారు. భిన్నత్వంలో ఏకత్వం సాధించేందుకు, సంక్షేమ కార్యక్రమాల్లో యువతను భాగస్వాములు చేసేందుకు ఏర్పాటైన ‘ద వన్నెస్ ఫోరమ్’ కు మార్గదర్శకురాలిగా వ్యవహరించారు. ఈ సంస్థకు ప్రఖ్యాత మహాత్మా– మహవీర అవార్డు లభించింది. ఇంద్ర నూయి భారత మహిళా వ్యాపారవేత్తల్లో ప్రముఖ స్థానం కలవారు. ప్రఖ్యాత శీతలపానీయం పెప్సీకో చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్ఓ)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత రెండేళ్లలో కంపెనీకి 30 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం అభించిందంటే అది ఆమె వ్యాపార చతురతకు నిదర్శనం. చెన్నైలో జన్మించిన ఇంద్ర యేల్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ మేనేజ్మెంట్, ఐఐఎమ్ కోల్కత్తా నుంచి ఫినాన్స్, మార్కెటింగ్ విద్యనభ్యసించారు. మోటరోలా, ఆసియా బ్రౌన్ బోవెరి, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. వ్యాపార రంగంలో ఆమె సేవకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. వందనా లూత్రా నేడు యువతరానికి ఆరోగ్య స్పృహతో పాటు, సౌందర్య స్పృహ కూడా పెరిగింది. ఈ రెండింటినీ ఒకే గొడుగు కింద అందించే ఉద్దేశంతో వందన.. వీఎల్సీసీ బ్యూటీ అండ్ వెల్నెస్ కంపెనీని ప్రారంభించారు. కోల్‌కత్తాకు చెందిన వందన ఢిల్లీలో పాలిటెక్నిక్ పూర్తిచేసి, జర్మనీ, యూకే, ఫ్రాన్స్‌లలో ఉన్నత విద్యనభ్యసించారు. గృహిణిగా ఇంటికే పరిమితమైన వందన, ఇద్దరు కూతుళ్ల ఆలనాపాలనా చూసుకుంటూనే 1989లో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి, నేడు తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆసియా, ఆఫ్రికా, గల్ఫ్ సహకార సమాఖ్యలలోని సుమారు 11 దేశాలకు విస్తరించారు. 2013లో ఆమెకు పద్మశ్రీ పురస్కారం లభించింది. 2015 ఫార్చూన్ ఇండియా ప్రచురించిన శక్తిమంతమైన భారతీయ మహిళా వ్యాపారవేత్తల్లో 33వ స్థానం దక్కించుకున్నారు. నైనాలాల్ కిద్వాయ్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో విద్యనభ్యసించిన మొదటి భార తీయ మహిళగా, భారత్‌లో అత్యంత విజయవంతమైన మహిళా వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ఎస్ హెచ్‌బీసీ ఇండియా గ్రూప్ జనరల్ మేనేజర్‌గా, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ గ్లోబల్ అడ్వైజర్‌గా, నెస్లే సౌత్ఏషియా నాన్ ఎక్స్క్యూటివ్ డైరెక్టర్‌గా, ప్రభుత్వరంగ సంస్థ ఎన్సీఏఈఆర్ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఫిక్కీ అధ్యక్షురాలిగా పనిచేశారు. వాణిజ్య, పారిశ్రామిక రంగాలలో ఆమె కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. రిచా కర్ ‘జివామీ’ ఆన్లైన్ స్టోర్ రూపకర్త. భారతదేశంలో లోదుస్తులను ఆన్లైన్లో విక్రయిస్తున్న మొదటి స్టోర్ ఇది. స్టోర్ ద్వారా లోదుస్తుల వాడకం ఆవశ్యకత గురించి మహిళలకు అవగాహన కూడా కల్పిస్తోంది. జంషెడ్‌పూర్‌లో పెరిగిన రిచా బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ పూర్తిచేసి, ప్రఖ్యాత నార్సిమోంజీ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. అదితి గుప్త ‘ఆ ఐదు రోజుల్లో’ ఆమె వంటగదిలోకి , గుడిలోకి , చివరికి ఇంట్లో అడుగుపెట్టడానికి వీలులేదు. తమ శరీరంలోని ఈ మార్పులకు కారణాలేమిటో, రుతుస్రావ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహనలేని బాలికలు నేటికీ ఉన్నారు. ఒక ఆడపిల్లగా తాను కూడా ఇటువంటి పరిస్థితులనే ఎదుర్కొంది అదితి. రుతుస్రావం గురించి ఉన్న భయాలను, అపోహలను తొలగించేందుకు, ఆ విషయం పట్ల అవగాహన కల్పించేందుకు భర్త తుహిన్ పటే ల్లతో కలిసి హిందీలో కామిక్ పుస్తకం తీసుకువచ్చింది. దీని ద్వారా బాలికల్లో అవగాహన కల్పిస్తోంది. మెనుస్ట్రుపిడేషన్.కామ్ అనే వెబ్సైట్ కూడా నడుపుతోంది. రుతుస్రావ సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత, ఆరోగ్య విధానాల గురించి సమాచారం పొందుపరుస్తోంది. శుభ్రా చద్దా భర్త వివేక్ ప్రభాకర్‌తో కలిసి ఆన్లైన్ దుస్తుల విక్రయ కంపెనీ ‘చుంబక్’ స్థాపించారు. హిందీలో చుంబక్ అంటే ఫ్రిజ్‌కు అతికి ఉండే అయస్కాంతం అని అర్థం. రెండేళ్ల కూతురికి తల్లిగా, కంపెనీ బాధ్యతలు నిర్వహించడంలో విజయవంతమయ్యారు. దేశవ్యాప్తంగా చుంబక్ 120కి పైగా స్టోర్లు కలిగి ఉంది. స్నేహా రైసోనీ ఐదేళ్లు చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేసిన స్నేహకు ఆ వత్తి తృప్తినివ్వలేదు. ఆ ఉద్యోగాన్ని వదిలి ‘టప్పూ దుకాణ్’ ప్రారంభించారు. ఇది ఒక గిఫ్ట్ షాప్. సీఏగా మంచి వేతనాన్ని వదులుకొని స్టోర్ ప్రారంభించినపుడు అందరూ ఆమె తప్పటడుగు వేస్తున్నారనుకున్నారు. కానీ టప్పూ దుకాణ్ సంవత్సరంలోపే లాభాల బాటపట్టడంతో ఆమె నిర్ణయం సరైందని రుజువైంది. సుచి ముఖర్జీ సోషల్ కామర్స్ సైట్ లైమ్‌రోడ్.కామ్(పట్టణ మహిళల కోసం ఉద్దేశించిన ) సీఈఓ. లేమన్ బ్రదర్స్ బ్యాంకులో ఐదేళ్లు, వర్జిన్ మీడియాలో రెండేళ్లపాటు డైరెక్టర్‌గా పనిచేశారు. ఈబే, స్కైప్, గమ్ట్రీలలో పనిచేసిన అనుభవం లైమ్‌రోడ్ ఆరంభానికి పునాది వేసింది. సురభీ దేవ్రా భారత్‌లో అతిపెద్ద ఆన్లైన్ కెరీర్ గైడ్‌గా పేరుపొందిన మేరాకెరీర్గైడ్.కామ్ రూపకర్త. ఈ వెబ్సైట్లో వివిధ విద్య, ఉద్యోగావకాశాలకు సంబంధించిన సమాచారం లభిస్తుంది. ప్రారంభమైన రెండు నెలల్లోనే 50వేల మంది యూజర్లతో దూసుకుపోతోంది. ఈ సైట్ ఎంతో మంది విద్యార్థులు తమకిష్టమైన కెరీర్‌ని ఎన్నుకునేలా బాటలు వేస్తోంది. ఉపాసనా టాకూ జాక్‌పే, మొబిక్విక్ కంపెనీలకు సహ వ్యవస్థాపకురాలు. ఈ- కామర్స్ బిజినెస్‌లో చెల్లింపుల విధానంలో ఎదురవుతున్న అవాంతరాలను తొలగించేందుకు జాక్‌పే రూపొందించారు. మొబిక్విక్ అనేది మొబైల్ వాలెట్లాంటిది. ఈ యాప్ రీచార్జ్, బిల్ పేమెంట్లు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. వలరీ వాగ్నర్ మార్కెటింగ్, అడ్వర్టైజ్ టెక్నిక్స్‌ను తెలిపే మొబైల్ ప్లాట్‌ఫాం ‘జిప్‌డయల్’ను స్థాపించారు. దీనిలో ఎన్రోల్ చేసుకున్నట్లయితే అడ్వర్టైజ్ కంపెనీలకు డైరెక్ట్‌గా ఫోన్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. ఇది పూర్తి ఉచితం. జిప్‌డయల్ ద్వారా జిల్లెట్, నివియా, డిస్నీ వంటి 500 బ్రాండ్లకు సంబంధించిన యాడ్లు పోస్ట్‌చేయవచ్చు. రాధికా ఘయ్ అగర్వాల్ ప్రఖ్యాత షాప్‌క్లూస్. కామ్ సహ వ్యవస్థాపకురాలు. 2011లో సిలికాన్ వ్యాలీలో ఈ వెబ్సైట్ రూపొందించారు. ప్రస్తుతం భారత్‌లో అతిపెద్దదైన మార్కెట్‌ప్లేస్‌గా నిలిచింది. నెలకు దాదాపు 7 మిలియన్ల మంది ఈ సైట్‌ను వీక్షిస్తున్నారు. సబీనా చోప్రా ప్రఖ్యాత ట్రావెల్ పోర్టల్ యాత్రా.కామ్ వ్యవస్థాపకురాలు. ఇంతకుముందు యూరప్ ఆన్లైన్ ట్రావెల్ పోర్టల్ ఈ-బుకర్స్ ఇండియా ఆపరేషన్స్ హెడ్‌గా, జపాన్ ఎయిర్‌లైన్స్ కంపెనీలో పనిచేశారు. దేశీయ రుచులను అందించే హోటల్ వ్యాపారంలో అడుగుపెట్టారు. దాదాపు పదిహేనేళ్ల అనుభవంతో యాత్రా.కామ్ రూపకల్పనకు శ్రీకారం చుట్టి ట్రావెల్, టూరిజమ్ గ్రూప్ రంగంలో విజేతగా నిలిచారు. 2010 భారత మహిళా నాయకురాలు అవార్డు కూడా పొందారు. నీరూ శర్మ ప్రముఖ ఈ- కామర్స్ పోర్టల్ ఇన్ఫీబీమ్.కామ్ సహ వ్యవస్థాపకురాలు. ఈ ఏడాది ప్రఖ్యాత డిజిటల్ మార్కెట్ కంపెనీ ఒడిగామాను 5 మిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశారు. గతంలో నీరూ శర్మ అమెజాన్ యూఎస్ఏ మీడియా రీటైల్ రంగంలో పనిచేశారు. జాపోస్ వంటి వివిధ కంపెనీల విలీన ఒప్పందాల్లో(850 మిలియన్ డాలర్లు) వ్యూహాత్మక పాత్ర పోషించారు. హర్‌ప్రీత్ కౌర్ ఈ- కామర్స్ వెబ్సైట్ ‘లవ్ ఫర్ ఆపిల్’ సహ వ్యవస్థాపకురాలు. ఈ వెబ్సైట్ ప్రత్యేకంగా ఆపిల్ వినియోగదారుల కోసం రూపొందించబడింది. ఆపిల్ కంపెనీకి సంబంధించిన అసలైన ఉత్పత్తులను అందించే లక్ష్యంతో 2013లో ఏర్పాటు చేశారు. ఐఫోన్, ఐపాడ్ కవర్ల తయారీ కోసం ప్రత్యేకంగా తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ యూనిట్ ద్వారా ఔత్సాహిక కళాకారులకు ఉపాధి కల్పిస్తున్నారు. గుర్లిన్ కౌర్ పెట్టుబడిదారులకు ఆర్థిక సలహాలు అందించేందుకు ఉద్దేశించబడిన ‘హరీపత్తి’ కంపెనీ సీఈఓ. ఆంగ్ల భాషలో ఆమెకు గల ప్రావీణ్యం ఆర్థిక అంశాలను చక్కగా అర్థం చేసుకునేందుకు ఉపయోగపడింది. ఘజియాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీలో ఆర్థిక విద్యనభ్యసించారు. గతేడాది సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్‌గా మారారు. చిత్రా గుర్ననీ దాగా భర్త అభిషేక్ దాగాతో కలిసి భారత సాహస యాత్రా కంపెనీ ‘థ్రిలోఫిలా’ ను స్థాపించారు. యాత్రకు వెళ్లిన వారికోసం అనుభవమున్న, స్థానిక గైడ్లను అందుబాటులో ఉంచుతారు. ఉన్నత విద్యా కుటుంబాలకు చెందిన చిత్ర, అభిషేక్ కలలను సాకారం చేసుకునేందుకు తమకు అనుభవంలేని రంగంలో ప్రవేశించి విజయవంతంగా దూసుకుపోతున్నారు. అశ్వినీ అశోకన్ కృత్రిమ మేథను ఉపయోగించి స్మార్ట్ఫోన్లలోని కెమెరాల ద్వారా మనుషుల ముఖాలను, కవళికలను, హావభావాలను పసిగట్టే మెకానిజమ్ ఉపయోగించుకునేందుకు వీలుగా‘మ్యాడ్ స్ట్రీట్ దెన్’స్థాపించారు. ఆమె భర్త ఆనంద్ చంద్రశేఖరన్ సహవ్యవస్థాపకులుగా ఉన్నారు. గతంలో ఇంటెల్ కంపెనీ ఇంటరాక్షన్ , ఎక్స్పీరియన్స్ రీసర్చ్ ల్యాబ్‌లో పనిచేశారు. అంకిత గాబా సోషల్ మీడియా వ్యూహకర్తగా, వ్యాపారవేత్తగా, లెక్చరర్, కన్సల్టెంట్‌గా బహుముఖ ప్రఙ్ఞ కలవారు. సోషల్సమోసా.కామ్ సహవ్యవస్థాపకురాలు. ఈ వెబ్సైట్ సోషల్ మీడియాకు సంబంధించిన ఆలోచనలు, పోకడలు, వార్తలు ఇలా అన్ని విషయాలకు చర్చా వేదికగా నిలుస్తోంది. గ్లోబల్ ‘టాప్ 100 సోషల్ మీడియా ఏజెన్సీస్ అండ్ కన్సల్టెంట్స్ 2012-13’జాబితాలో ఆమె చోటు దక్కించుకున్నారు. షహనాజ్ హుసేన్ ‘క్వీన్ ఆఫ్ హెర్బల్ బ్యూటీ కేర్’గా ప్రసిద్ధి పొందారు. 16వ ఏటనే వివాహం చేసుకున్నారు. సౌందర్యం, సౌందర్య సాధనాల పట్ల ఉన్న మక్కువ ఆమెను సాధారణ గృహిణి స్థాయి నుంచి ‘షహనాజ్ హెర్బల్ ఇన్కార్పోరేషన్’ కంపెనీని స్థాపించే స్థాయికి చేర్చింది. ఈ కంపెనీ జంతువులపై ఎటువంటి ప్రయోగాలు(విత్ అవుట్ ఎనిమల్ టెస్టింగ్) చేయకుండానే చర్మ సౌందర్య సాధనాలను ఉత్పత్తి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 138 దేశాల్లో 400 ఫ్రాంఛైజీలను కలిగి ఉంది. 2006లో ఆమెకు పద్మశ్రీ పురస్కారం లభించింది. సక్సెస్ మాగజీన్ 1996లో ‘వరల్డ్ గ్రేటెస్ట్ వుమన్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు’ అందజేసింది. రవీనా రాజ్ కొహ్లి మీడియా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. టీవీ రంగంలో మొదటి మహిళా సీఈఓగా గుర్తింపు పొందారు. సోనీ ఎంటర్టేన్మెంట్ టీవీ కంటెంట్, కమ్యూనికేషన్ హెడ్‌గా, స్టార్ న్యూస్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పనిచేశారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా మీడియా టైకూన్ కెర్రీ పాకర్‌కు చెందిన ‘చానెల్ 9 (ఇండియా)’ సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ జర్నలిజంలో డిప్లొమా చేశారు. బెంగళూరు యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్, సాహిత్యం, సైకాలజీలలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. మహిళా సాధికారత కోసం పాటుపడేందుకు ‘జాబ్కార్్ప కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్’ను స్థాపించారు. రష్మీ సిన్హా లక్నోలో జన్మించిన రష్మీ న్యూరో సైకాలజీలో పీహెచ్డీ చేశారు. భర్తతో కలిసి‘స్లైడ్‌షేర్’ అనే ఆన్లైన్ కంపెనీ ప్రారంభించారు. దీని ద్వారా ఆన్లైన్ ప్రజంటేషన్స్ ఇవ్వవచ్చు. అనతికాలంలోనే నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన లభించడంతో సోషల్ మీడియా సైట్ లింక్డిన్ 100 మిలియన్ డాలర్లు వెచ్చించి 2012లో స్లైడ్షేర్ను కొనుగోలు చేసింది. ఫార్చూన్ అత్యంత శక్తిమంతమైన మహిళా వ్యాపారవేత్తల జాబితాలో 8వ స్థానంలో నిలిచారు. ఫాస్ట్ కంపెనీ - 2వెబ్ ప్రపంచంలో అత్యంత ప్రభావంతమైన మహిళ’ల జాబితాలో టాప్-10లో స్థానం పొందారు. శ్రద్ధా శర్మ యువ వ్యాపారవేత్తలు, వారి స్టార్టప్ సంస్థల గురించి, వారి అనుభవాలు పొందుపరిచేందుకు ప్రత్యేకంగా ‘యువర్‌స్టోరీ’ అనే వెబ్‌సైట్‌ను రూపొందించారు. దీనికి చీఫ్ ఎడిటర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. గతంలో టైమ్స్ ఆఫ్ ఇండియా, సీఎన్‌బీసీ టీవీ18లో పనిచేశారు. స్వాతి భార్గవ ‘క్యాష్‌కరో సైట్’ సహ వ్యవస్థాపకురాలు. ఈ సైట్లో ఎన్రోల్ చేసుకోవడం ద్వారా క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి ఆనర్స్ పట్టా పొందారు. లండన్‌లోని ప్రఖ్యాత గోల్డ్‌మన్ సాచ్స్ కంపెనీలో నాలుగేళ్లు పనిచేశారు. ప్రస్తుతం క్యాష్‌కరో సీఈఓగా ఉన్నారు. సాక్షి తుల్సియన్ రెస్టారెంట్ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫాం ‘పోసిస్ట్’ సహ వ్యవస్థాపకురాలు. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి వివిధ రెస్టారెంట్లకు సంబంధించి టేబుల్స్, డెలివరీ, మెనూ కార్డు, ఖర్చు వివరాలు తెలుసుకోవచ్చు. ఢిల్లీలోని భారతి విద్యాపీఠ్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన సాక్షి పలు సాఫ్ట్వేర్ కంపెనీల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. మెవిష్ ముస్తాక్, శ్రీనగర్ ప్రతిభకు కుల, మత, ప్రాంత భేదాలు అడ్డురావని ముస్తాక్ నిరూపించారు. ఆండ్రాయిడ్ అప్లికేషన్ తయారుచేసిన మొదటి కాశ్మీరీ మహిళగా చరిత్ర సృష్టించారు. ఈ అప్లికేషన్లో యూజర్‌కు కావాల్సిన చిరునామా, ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ ఐడీల గురించి సమాచారం అందుబాటులో ఉంటుంది. వీటితో పాటు ప్రభుత్వానికి చెందిన విద్య, వైద్య, రవాణా , పోలీసు వ్యవస్థతో పాటు వివిధ రంగాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఒకే వేదికపై అందుబాటులో ఉంటుంది. కశ్మీరీ ప్రజలకు ఇది ఎంతో ఉపయోగపడుతోంది. హేమలత అన్నమలై, కోయంబత్తూరు కేవలం పురుషులకే పరిమితమనుకున్న ఆటోమొబైల్ రంగంలోకి అడుగుపెట్టి, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ(ఆంపియర్ ఎలక్ట్రిక్) స్థాపించి విజయం సాధించారు. ఈ- సైకిల్లు, ఈ- స్కూటర్లు, ఈ- ట్రాలీస్తో పాటు వేస్ట్ మేనేజ్మెంట్ కోసం, వికలాంగుల కోసం ప్రత్యేక వాహనాలు రూపొందిస్తున్నారు. సోబితా తమూలీ, తెలానా అస్సాంలోని తెలానా గ్రామానికి చెందిన సోబిత స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేశారు. అస్సాం సాంప్రదాయ టోపీ ‘జాపీస్’ మొదలుకొని సేంద్రీయ ఎరువు వరకు మధ్యవర్తులు లేకుండా తమ ఉత్పత్తులు నేరుగా మార్కెట్లో అమ్ముకునే విధానాన్ని రూపొందించారు. దీని ద్వారా అక్కడి మహిళలకు ఉపాధి ఉపాధి లభిస్తోంది. లక్ష్మీ మీనన్, ఎర్నాకులం పర్యావరణ హిత వస్తువులు తయారుచేసేందుకు 2012లో ‘ప్యూర్ లివింగ్’ కంపెనీ స్థాపించారు. ప్రింటింగ్ ప్రెస్‌లో కార్డుల తయారీ సమయంలో విడుదలయ్యే ఉప ఉత్పత్తుల ద్వారా పెన్నులు తయారు చేస్తున్నారు. ఈ కంపెనీ ద్వారా వికలాంగ మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఛాయా నంజప్ప, మైసూరు ఫుడ్ ప్రాసెసింగ్ విభాగంలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా భారత మహిళా వ్యాపారవేత్త సమాఖ్య అందజేసే ‘జాతీయ ఉత్తమ వ్యాపారవేత్త -2014 ’ అవార్డు పొందారు. గ్రామీణ ఉత్పత్తులను ప్రోత్సహించే ఉద్దేశంతో ‘నెక్టార్ ఫ్రెష్ ’ కంపెనీ స్థాపించారు. దీని ద్వారా స్వచ్ఛమైన తేనెను యూరప్, అమెరికా దేశాలకు ఎగుమతి చేస్తూ మైసూర్, మాండ్యా జిల్లాల్లోని నిరక్షరాస్య ప్రజలకు, గిరిజనులకు ఉపాధి కల్పిస్తున్నారు. సుమితా ఘోష్, బికనీర్ హస్తకళలను ప్రోత్సహించే ఉద్దేశంతో ‘రంగసూత్ర’ అనే కంపెనీ స్థాపించారు. దీని ద్వారా 3000 మంది కళాకారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చారు. 10 లక్షల రూపాయల పెట్టుబడితో ప్రారంభించిన కంపెనీ నేడు ఫాబ్ ఇండియా, ఇకియా వంటి ప్రఖ్యాత సంస్థలకు ఉత్పత్తులను అమ్మే స్థాయికి ఎదిగింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మణిపూర్‌కు చెందిన 35 బృందాలు రంగసూత్ర కోసం పనిచేస్తున్నాయి. సుమిత ప్రోత్సాహంతో మధ్యప్రదేశ్‌లోని ఎందరో పారిశుద్ధ్య కార్మికులు హస్తకళల తయారీదారులుగా మారారు. నేహా అరోరా, ఢిల్లీ అంధుడైన తండ్రి, వీల్‌చెయిర్‌కే పరిమితమైన తల్లి. అందరు పిల్లల్లాగే సెలవుల్లో టూర్లకు వెళ్లాలని భావించిన నేహ కోరిక తీరలేదు. అందుకే తన తల్లిదండ్రుల్లాంటి దివ్యాంగులు కూడా వివిధ ప్రదేశాలను సందర్శించేందుకు 2016లో ‘ప్లానెట్ ఏబుల్డ్ ’ అనే ట్రావెల్ కంపెనీ స్థాపించారు. దివ్యాంగుల సౌకర్యార్థం పోర్టబుల్ ర్యాంప్స్ అందుబాటులో ఉంటాయి. వివిధ ప్రదేశాలకు వెళ్లాలనే దివ్యాంగుల కలను నిజం చేస్తూ 17 రోజుల్లో 2 దేశాలు, 5 రాష్ట్రాలు, 13 నగరాల్లో పర్యటించింది ప్లానెట్ ఏబుల్డ్ బృందం. థోనాల్స్ చరోల్, లడఖ్ లడఖ్ ఎకోటూరిజమ్ను ప్రోత్సహిస్తూనే, మహిళలకు పర్వాతారోహణలో శిక్షణనిచ్చేందుకు 2009లో ‘లడఖీ వుమెన్స్ ట్రావెల్ కంపెనీ’ స్థాపించారు. లడఖ్‌లో మహిళా యజమాని, గైడ్లు, పోర్టర్లుగా మొత్తమంతా మహిళా సిబ్బంది(30 మంది) గల ఒకే ఒక ట్రావెల్ కంపెనీ ఇది. తమన్నా శర్మ, ఢిల్లీ ఈవెంట్, వ్యర్థ పదార్థాల నిర్వహణ కంపెనీ ‘ఎర్త్లింగ్ ఫస్ట్ ప్రైవేట్ లిమిటెడ్’ను స్థాపించారు. ఈ కంపెనీ వ్యర్థ పదార్థాల నిర్వహణ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి మార్గదర్శకంగా నిలిచింది. మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు సంస్థలో పురుషుల సంఖ్యకు సమానంగా మహిళలను నియమిస్తున్నారు. పబీబెన్ రబరీ, కుకాద్సర్ గిరిజన జాతి ‘రబరీ’ వారసత్వాన్ని, హస్తకళల ఉనికిని కాపాడే బాధ్యత చేపట్టి కచ్ జిల్లా అంబాసిడర్‌గా పేరుపొందారు. రబరీ జాతికే పరిమితమైన ‘హరి జరీ-పబీ జరీ’ వంటి సంప్రదాయ ఎంబ్రాయిడరీ రకాలను ‘పబీబెన్.కామ్’ వెబ్సైట్ ద్వారా అందరికీ పరిచయం చేస్తున్నారు. మహిళలు రూపొందించే హస్తకళలను అమ్మే వేదిక ఏర్పరచిన మొదటి మహిళగా పబీబెన్ నిలిచారు. సుమారు 60 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. పబీబెన్.కామ్ అనతికాలంలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. రాశి చౌదరి ముంబైలో మొదటి ఆన్లైన్ గ్రోసరీ స్టోర్ ‘లోకల్‌బన్యా’ సహ వ్యవస్థాపకురాలు. ముంబై, థానె, నవీ ముంబైల నుంచి రోజుకి సగటున 600 ఆర్డర్లు అందుకుంటోంది. రేమండ్ లిమిటెడ్, రాశి పెరిఫెరల్స్లలో పనిచేసిన రాశి లోకల్‌బన్యా కోసం స్వయంగా క్షేత్ర స్థాయిలో కూడా పనిచేస్తున్నారు. - సుష్మారెడ్డి -
నాలుగేళ్లలో అగ్రగామిగా తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: రాబోయే నాలుగేళ్లలో తెలంగాణను వ్యాపార, వాణిజ్య రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఒకరోజు ముంబై పర్యటనలో భాగంగా మంత్రి పలువురు వ్యాపార దిగ్గజాలను కలిశారు. ఫోర్త్ ఇంజక్షన్, బ్లో మౌల్డింగ్ అండ్ పీఈటీ ఇంటర్నేషనల్ సమ్మిట్‌లో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చిన సుమారు 600 మంది ప్లాస్టిక్, పెట్రో కెమికల్, ప్యాకేజింగ్ రంగాల పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. తెలంగాణలో ఆయా పరిశ్రమలకున్న అవకాశాలను వివరించారు. ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, లైఫ్ సెన్సైస్, ఏరోస్పెస్, రక్షణ రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉంచేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. టీ హబ్, నూతన పారిశ్రామిక విధానం, ఫార్మాసిటీ వంటి అంశాలు ఈ రంగాల్లో ముందుకు వెళ్లేం దుకు దోహదం చేస్తున్నాయని పేర్కొన్నారు. గత రెండేళ్లుగా నిరంతర విద్యుత్ సరఫరా, టీఎస్ ఐపాస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుదల వంటి అంశాలతో దేశంలోనే పెట్టుబడులకు అత్యుత్తమ స్నేహపూరిత వాతావరణం కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ఉందని తెలిపారు. అందుబాటులో ఉన్న ల్యాండ్‌బ్యాంకు పెట్టుబడులకు మరో అదనపు ప్రయోజనమని మంత్రి తెలిపారు. వంద ఎకరాల్లో సుల్తాన్‌పూర్‌లో మొదటి దశలో ఒక ప్లాస్టిక్ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు. రెండో దశలో మూడు వందల నుంచి 500 ఎకరాల్లో ప్లాస్టిక్ సిటీని మెదక్ నిమ్జ్ పార్కులో ఏర్పాటు చేస్తామని అన్నారు. పరిశ్రమలకు ప్రభుత్వం కల్పించే సౌకర్యాల గురించి పరిశ్రమల ప్రతినిధులకు మంత్రి వివరించారు. మంత్రి ప్రజెంటేషన్‌పై పారిశ్రామికవేత్తలు అభినందనలు తెలిపారు. ఆర్బీఐ గవర్నర్‌ను కలిసిన మంత్రి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్‌ను మంత్రి కేటీఆర్ ముంబైలో గురువారం కలిశారు. ఎంఎస్ఎం ఈ సెక్టార్‌లోని పరిశ్రమలు బ్యాంకు రుణాలు అందుకోవడంలో ఉన్న పలు సమస్యలను మంత్రి గవర్నర్‌కు వివరించారు. పలు ఎంఎస్ఎంఈ రంగ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణలో ప్రభుత్వం ఈ పరిశ్రమలను ఆదుకునేందుకు తీసుకోబోతున్న చర్యలను వివరించి పలు సూచనలను తీసుకున్నారు.