టాలీవుడ్ చిత్ర సీమలో తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన 'అల్లు అర్జున్' (Allu Arjun) కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా వ్యాపారవేత్తగా కూడా పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో బఫెలో వైల్డ్ వింగ్స్, అల్లు స్టూడియోస్, ఏఏఏ సినిమాస్ వంటి బిజినెస్‌లు చేస్తూ భారీగా ఆర్జిస్తున్నాడు. బన్నీ వ్యాపారాలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
బఫెలో వైల్డ్ వింగ్స్ (Buffalo Wild Wings)
అల్లు అర్జున్ ప్రముఖ అమెరికన్ స్పోర్ట్స్ బార్ అండ్ రెస్టారెంట్ చైన్ అయిన 'బఫెలో వైల్డ్ వింగ్స్' కోసం ఫ్రాంచైజీని కలిగి ఉన్నాడు. హైదరాబాద్ రోడ్ నెం. 36 జూబ్లీహిల్స్‌లో సందడిగా ఉండే ప్రాంతంలో ఇది ఎంతో మంది ఆహార ప్రియులకు మంచి ఉత్సాహభరితమైన వాతావరణాన్ని అందిస్తుంది.
ఆహా ఓటీటీ ప్లాట్‌ఫారమ్ (Aha OTT Platform)
తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రసారం చేయడానికి వినియోగదారులను అనుమతించే ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫామ్‌కి అల్లు అర్జున్ కో-ఫౌండర్. ఆహా ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఉంది. ఇది మంచి కార్యకలాపాలకు, కంటెంట్ సృష్టికి కేంద్రంగా పనిచేస్తుంది.
(ఇదీ చదవండి: పాకిస్థాన్ ప్రజల మనసు దోచిన పాపులర్ కార్లు ఇవే!)
అల్లు స్టూడియోస్ (Allu Studios)
అల్లు స్టూడియోస్ అనేది అల్లు అర్జున్‌కి చెందిన అత్యాధునిక చిత్ర నిర్మాణ సంస్థ. ఇది రోడ్ నెం.10, జూబ్లీహిల్స్ హైదరాబాద్‌లో ఉంది. ఇందులో పోస్ట్ ప్రొడక్షన్ సౌకర్యాలు, ఆడియో రికార్డింగ్ వంటి అనేక సేవలు, మౌలిక సదుపాయాలు లభిస్తాయి. దీనిని హాస్యనటుడు అల్లు రామలింగయ్య స్మారకార్థం అల్లు స్టూడియోస్ ప్రారంభించారు.
(ఇదీ చదవండి: హోండా సంచలన ప్రకటన.. దెబ్బకు 13 లక్షల కార్లు వెనక్కి - కారణం ఇదే!)
ఏఏఏ సినిమాస్ (AAA Cinemas)
ఇటీవల అల్లు అర్జున్ హైదరాబాద్ అమీర్‌పేట్‌లో ఏఏఏ సినిమాస్ అనే ఆధునిక మల్టీప్లెక్స్ ప్రారంభించాడు. ఇందులో మొత్తం 5 స్క్రీన్‌లు ఉన్నట్లు సమాచారం. ఇందులో మొదటి స్క్రీన్ 67 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది డాల్బీ అట్మాస్ సౌండ్‍తో బార్కో లేజర్ ప్రొజెక్షన్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. దక్షిణాదిలో ఎల్‌ఈడీ స్క్రీన్ ఉన్న ఒకే ఒక్క థియేటర్ ఇదే కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment