
ఇటీవల జరిగిన ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (AIMA) 13వ మేనేజింగ్ ఇండియా అవార్డ్స్ వేడుకలో కుమార్ మంగళం బిర్లా ప్రతిష్టాత్మక 'బిజినెస్ లీడర్ ఆఫ్ ది డికేడ్' అవార్డుని సొంతం చేసుకున్నారు. వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకున్న ఈయన 2017లోనే అవుట్‌స్టాండింగ్ బిజినెస్ లీడర్ అవార్డుని కైవసం చేసుకున్నాడు. సుమారు 34 దేశాల్లో వ్యాపారణాలను విజయవంతంగా ముందుకు సాగిస్తున్నారు మంగళం బిర్లా గత దశాబ్దంలో భారతీయ పరిశ్రమకు చేసిన సేవలకుగాను ఈ అవార్డు లభించింది.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రంలో ఇతర కంపెనీల నాయకులు కూడా ఆవార్డులను గెలుచుకున్నారు. ఇందులో టాటా స్టీల్ చైర్మన్ టీవీ నరేంద్రన్‌కు 'AIMA-JRD టాటా కార్పొరేట్ లీడర్‌షిప్' అవార్డు, ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును టొరెంటో గ్రూప్ చైర్మన్ సమీర్ మెహతా సొంతం చేసుకున్నారు.
యంగ్ ఎంటర్ ఎంటర్‌ప్రెన్యూర్ ఏథర్ ఎనర్జీ వ్యవస్థాపకులు తరుణ్ మెహతా, స్వప్నిక్ జైన్ కైవసం చేసుకున్నారు. అదే సమయంలో టీవీఎస్ కంపెనీ చైర్మన్ వేణు శ్రీనివాసన్ అవుట్‌స్టాండింగ్ ఇన్‌స్టిట్యూట్ బిల్డర్ అవార్డు, బజాజ్ ఫిన్ సర్వ్ చైర్మన్ సంజయ్ బజాజ్ ట్రాన్స్‌ఫార్మషన్ బిజినెస్ లీడర్ అవార్డు సొంతం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment