Sonalika Tractor Founder Lachhman Das Mittal Success Story in Telugu - Sakshi
Sakshi News home page

ఎల్‌ఐసీ ఏజంట్ నుంచి రూ. 23,000కోట్ల అధిపతిగా! లచ్మన్ దాస్ మిట్టల్ సక్సెస్ స్టోరీ!

Published Sun, Aug 13 2023 9:22 AM | Last Updated on Sun, Aug 13 2023 10:38 AM

Sonalika tractor founder Lachhman Das Mittal interesting success story - Sakshi

Sonalika Tractors Founder Success Story: జ్ఞానం పెంచుకోవడానికి వయసుతో సంబంధం లేనట్లుగానే.. ఒక వ్యక్తి సక్సెస్ సాధించడానికి కూడా వయసుతో పని లేదు. పిల్లాడి దగ్గరి నుంచి వయసుడిగిన వృద్దులు వరకు తమదైన ఆలోచనలతో ఎవరైనా విజయం సాధించవచ్చు. అలాంటి కోవకు చెందిన 'లచ్మన్ దాస్ మిట్టల్' (Lachhman Das Mittal) గురించి ఈ కథనంలో తెలుసుసుకుందాం.

60ఏళ్ల వయసులో కంపెనీ..
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) నుంచి బయటకు వచ్చిన తరువాత ఓ కొత్త రంగానికి పునాది వేసాడు. అదే సోనాలిక (Sonalika) ట్రాక్టర్స్. 60ఏళ్ల వయసులో కంపెనీ ప్రారంభించి ఈ రోజు భారతదేశంలోని ప్రముఖ ట్రాక్టర్ తయారీదారులలో ఒకరుగా నిలబడ్డారు. దీన్ని బట్టి చూస్తే ఇందులో ఆయన కృషి, పట్టుదల మనకు స్పష్టంగా కనిపిస్తాయి.

సోనాలికా ట్రాక్టర్‌..
నివేదికల ప్రకారం, 1990లో తన వ్యాపార వృత్తిని ప్రారంభించిన మిట్టల్ 1995లో పంజాబ్‌లో సోనాలికా ట్రాక్టర్‌లను మొదలెట్టాడు. ఇదే ప్రస్తుతం భారతదేశపు మూడవ అతిపెద్ద ట్రాక్టర్ ఉత్పత్తిదారుగా.. ఏడాది 3 లక్షల ట్రాక్టర్లను ఉత్పత్తి చేసినట్లు సమాచారం. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతిదారుల జాబితాలో అగ్రగామిగా నిలిచింది. దీని వాటా ఏకంగా 11.7శాతం కావడం గమనార్హం.

పెద్ద ఎదురు దెబ్బ..
ఎల్‌ఐసీతో కలిసి పని చేయడం ద్వారా లక్మన్ దాస్ మిట్టల్ పొదుపు, పెట్టుబడి గురించి అవగాహన పొందాడు. దీంతో తన డబ్బును బ్యాంకు ఖాతాల్లో సేవ్ చేసుకోకుండా అనేక స్కీమ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాడు. ఆ తరువాత సైడ్ వెంచర్‌గా వ్యవసాయ పరికరాల కంపెనీ స్టపించాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో ఊహించని పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. పెట్టుబడులు అన్నీ పోయాయి.

ఇదీ చదవండి: పాముల పెంపకం.. కోట్లలో ఆదాయం - ఎక్కడో తెలుసా?

74 దేశాలకు ఎగుమతి..
భారీ నష్టాలను చవి చూసినప్పటికీ మిట్టల్ పట్టువదలని విక్రమార్కుని మాదిరిగా ఒకసారి గోధుమ, ఎండుగడ్డిని వేరు చేసే యంత్రం గమనించాడు. దీంతో అతనికి కొత్త ఆలోచనలు పుట్టుకొచ్చాయి. ఇందులో భాగంగా నూర్పిడి యంత్రాలు నిర్మించడం ప్రారంభించాడు. ఇవి కేవలం ఎనిమిది సంవత్సరాల్లో ఊహకందని విజయం పొందింది. ఆ తరువాత ట్రాక్టర్లను నిర్మించడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ సోనాలిక ట్రాక్టర్లు 74 దేశాలకు ఎగుమతి అవుతున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: మానవాద్భుత సృష్టి.. వీడియో చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు!

నికర విలువ..
సోనాలికా ట్రాక్టర్స్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ, ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ బాధ్యతలు మిట్టల్ కుమారులు అమృత్ సాగర్, దీపక్, మనవళ్లు రామన్, సుశాంత్ అండ్ రాహుల్‌లకు అప్పగించారు. ఫోర్బ్స్ ప్రకారం లచ్మన్ దాస్ మిట్టల్ నికర విలువ రూ. 23,000 కోట్ల కంటే ఎక్కువని తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 12న కేషుబ్ మహీంద్రా మరణించిన తర్వాత, మిట్టల్ ఇప్పుడు దేశంలోనే అత్యంత వృద్ధ బిలియనీర్‌గా ఖ్యాతి పొందాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement