ఒక మనిషి జీవితంలో సక్సెస్ సాధించాలంటే కసి, పట్టుదల, నిరంతర శ్రమ అవసరం. అయితే ఉన్నతమైన చదువులు, డాక్టరేట్లు మాత్రమే సక్సెస్ తీసుకువస్తాయనేది అపోహ మాత్రమే అంటున్నారు కొంతమంది నిపుణులు. మనం ఈ కథనంలో కాలేజ్ డ్రాపౌట్ అయిన ఒక వ్యక్తి దేశంలో అగ్రగామి వ్యాపారవేత్తగా ఎలా ఎదిగాడు? ఆయన సక్సెస్ సీక్రెట్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
'RG చంద్రమోగన్' ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు.. కానీ భారతదేశంలోని బిలినీయర్ల జాబితాలో ఈయన ఒకరు. చంద్రమోగన్ బాల్యం మొత్తం తమిళనాడులోని చెన్నైలో గడిచిపోయింది. చిన్నప్పటి నుంచే లెక్కల మీద మంచి పట్టు ఉండటంతో అందరూ ఇతన్ని 'హ్యూమన్ కంప్యూటర్' అని పిలిచేవారు.
గణితంలో ఎంత పట్టు ఉన్నా.. పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం వల్ల 21 సంవత్సరాల వయసులోనే చదువుకు దూరమయ్యాడు. తన తండ్రి చిన్న ప్రొవిజనల్ స్టోర్ నడిపేవాడు, కానీ చంద్రమోగన్ అదికాదని ఒక టింబర్ డిపోలో కేవలం రూ. 65 జీతానికి ఉద్యోగం ప్రారంభించాడు. ఒక సంవత్సరం తరువాత ఆ ఉద్యోగం మానేసి 250 చదరపు అడుగుల విస్తీర్ణంలో ముగ్గురు కార్మికులతో ఐస్ క్రీమ్ వ్యాపారం ప్రారంభించాడు.
కేవలం రూ. 13,000తో ప్రారంభమైన ఐస్ క్రీమ్ బిజినెస్ ప్రారంభంలో కొంత నష్టాలను చవిచూసింది. అప్పట్లో 15 తోపుడు బండ్ల మీద వ్యాపారం ప్రారంభించి మొదటి ఏడాదిలో రూ. 1.5 లక్షలు రావడంతో చంద్రమోగన్‌కు వ్యాపారం మీద కొంత నమ్మకం కలిగింది. 1981లో చిన్న పట్టణాలలో వ్యాపారం విస్తరించడం ప్రారంభించాడు. ఇదే ఆయన పురోగతికి పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది.
ఇదీ చదవండి: నెహ్రూ ఐడియా & జెఆర్‌డీ టాటా విజన్‌తో పుట్టిన కంపెనీ ఇదే!
ఐస్ క్రీమ్ బిజినెస్ రోజురోజుకి వృద్ధి చెందుతూ 'అరుణ్' ఐస్ క్రీమ్ పేరుతో తమిళనాడులో మంచి ప్రజాదరణ పొందాడు. 1986లో హ్యాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్ పేరుతో వ్యాపారం చేయడం ప్రారంభించాడు. ఇది భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ డెయిరీ కంపెనీలలో ఒకటిగా ప్రతిరోజూ 10,000 గ్రామాలలో 4 లక్షల మంది రైతుల నుంచి పాలను సేకరిస్తుంది.
ఇదీ చదవండి: అద్దె భవనంలో ప్రపంచ కుబేరుడు 'జెఫ్ బెజోస్' - రీజన్ తెలిస్తే షాక్ అవుతారు!
ప్రస్తుతం హ్యాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్ మార్కెట్ క్యాప్ రూ.18,889 కోట్లుగా ఉంది. ఫోర్బ్స్ సంపన్నుల జాబితా ప్రకారం RG చంద్రమోగన్ నేడు రూ. 13,000 కోట్ల కంటే ఎక్కువ నికర విలువను కలిగి ఉన్నారు. అతని కంపెనీ పాల ఉత్పత్తులను 42 దేశాల్లో ఉపయోగిస్తున్నారు. చంద్రమోగన్ ఛైర్మన్‌గా ఉండగా, ఆయన కుమారుడు సి సత్యన్ ఇప్పుడు హ్యాట్సన్‌ను మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment