భారతదేశంలోని అగ్రశ్రేణి వ్యాపారవేత్తల్లో ఒకరైన 'కుమార్ మంగళం బిర్లా' (Kumar Mangalam Birla) గురించి దాదాపు అందరికి తెలుసు. ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్‌గా మాత్రమే కాకుండా సుమారు 14.2 బిలియన్ డాలర్ల సంపదకు నాయకుడై భారతీయ సంపన్నుల జాబితాలో 9వ స్థానం పొందిన బిర్లా ఈ స్థాయికి రావడానికి ఎన్నెన్ని అడ్డంకులను ఎదుర్కొన్నాడు? ఆయన సక్సెస్ రహస్యం ఏమిటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
1967 జూన్ 14న జన్మించిన కుమార్ మంగళం బిర్లా ముంబై విశ్వవిద్యాలయంలోని హెచ్ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుంచి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి తరువాత లండన్ బిజినెస్ స్కూల్‌లో చదువుకున్నాడు. 1992లో లండన్‌లో CA పూర్తి చేశారు.
చదువు పూర్తయిన తరువాత 1995లో ఆయన తండ్రి ఆదిత్య విక్రమ్ బిర్లా మరణించారు. తండ్రి మరణించిన తరువాత 28 సంవత్సరాల వయసులో ఆదిత్య బిర్లా గ్రూప్‌కు ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అతి తక్కువ కాలంలోనే కంపెనీ టర్నోవర్ 2 బిలియన్ల నుంచి 45 బిలియన్లకు చేరింది.
(ఇదీ చదవండి: Volkswagen Discounts: ఈ ఆఫర్స్ చాలదా ఫోక్స్‌వ్యాగన్ కారు కొనడానికి - పూర్తి వివరాలు)
కుమార్ మంగళం బిర్లా టెలికమ్యూనికేషన్స్, సిమెంట్, మైనింగ్ వంటి వాటితో పాటు సుమారు 16 కంటే ఎక్కువ పరిశ్రమల్లోకి అడుగుపెట్టారు. అంతే కాకుండా వీరు అలెన్ సోలీ, పీటర్ ఇంగ్లాండ్, లూయిస్ ఫిలిప్, పాంటలూన్స్ పేర్లతో దుస్తులను విక్రయిస్తున్నారు.
కార్బన్ బ్లాక్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ అండ్ సప్లయర్స్ పేరుతో ఐదు ఖండాల్లోని 12 దేశాలకు కార్బన్ ఎగుమతి చేస్తున్నారు. భారతదేశంలో రైల్వే అవసరాలకు అవసరమైన కార్బన్ పంపించడంలో బిర్లా కాపర్ వాటా భారీగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 47 బ్రాండ్‌లు, 27 ఎంటర్‌ప్రైజెస్, 14 పరిశ్రమ రంగాలను కలిగి ఉన్న ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రస్తుతం విజయపథంలో నిర్విరామంగా ముందుకు సాగుతోంది.
బాక్సైట్ తవ్వకాలు, అల్యూమినా ప్రాసెసింగ్, అల్యూమినియంతో కూడిన ఇతర కార్యకలాపాలలో నిమగ్నమైన హిండాల్కోకు కూడా బిర్లా యజమాని. ఇందులో సుమారు 40వేలకంటే ఎక్కువ మంది పనిచేస్తున్నారు. 2004లో గ్రాసిమ్ కొనుగోలు చేసినప్పటి నుంచి అల్ట్రాటెక్ సిమెంట్ భారతదేశంలో అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తిదారుగా ప్రపంచంలో మూడవ అతిపెద్దదిగా ఎదిగింది. దీని ఆదాయం ప్రస్తుతం రూ.50000 కోట్ల కంటే ఎక్కువ అని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం కుమార్ మంగళం బిర్లా నికర ఆస్తుల విలువ సుమారు పది లక్ష కోట్లకంటే ఎక్కువ.
Comments
Please login to add a commentAdd a comment