birla group
-
బిర్లా వారసులకు బాధ్యతలు
ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా సంతానానికి హిందాల్కో బోర్డులో చోటు దక్కింది. అనన్య బిర్లా, ఆర్యమాన్ విక్రమ్ బిర్లా బోర్డులో డైరెక్టర్లుగా ఎంపికయ్యారు. ఈమేరకు బోర్డు అనుమతించింది. అనన్య బిజినెస్‌తోపాటు గాయనిగా ఆమె ప్లాటినమ్ సెల్లింగ్ ఆర్టిస్ట్‌గా రాణించారు. తన 17వ ఏట ఏర్పాటు చేసిన తొలి కంపెనీ స్వతంత్ర మైక్రోఫిన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రస్తుతం మైక్రోఫైనాన్స్ పరిశ్రమలో రెండో పెద్ద సంస్థగా కార్యకలాపాలు సాగిస్తోంది. వీరితోపాటు బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లుగా అంజనీ కుమార్ అగర్వాల్, సుకన్య కృపాలును బోర్డు నియమించింది. భరత్ గోయెంకా సీఎఫ్‌వోగా బాధ్యతలు చేపట్టనున్నారు.2023లోనే ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రధాన కంపెనీలు గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఏబీ ఫ్యాషన్ అండ్ రిటైల్ బోర్డుల్లో అనన్య, ఆర్యమాన్ సభ్యులుగా చేరారు. మరోవైపు, గ్రూప్ బిజినెస్‌లకు మార్గదర్శకంగా వ్యవహరించే ఏబీ మేనేజ్మెంట్ కార్పొరేషన్ బోర్డులో డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టారు.ఇదీ చదవండి: కోరికలు తీర్చే ‘ఫిష్’!ఈ సందర్భంగా హిందాల్కో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా మాట్లాడుతూ..‘ప్రస్తుతం హిందాల్కో మరో వృద్ధి దశ పరివర్తనలో ఉంది. పటిష్ట నిర్ణయాలు, భవిష్యత్‌పై ప్రత్యేక దృష్టి కలిగిన అనన్య, ఆర్యమాన్లకు డైరెక్టర్లుగా బోర్డులో చోటు కల్పించడానికి ఇదే తగిన సమయమని బోర్డు నిర్ణయించింది. డైరెక్టర్లుగా వారు హిందాల్కోకు మరింత విలువ చేకూర్చే నిర్ణయాలు, ప్రణాళికలను సిద్ధం చేసి వాటిని పాటిస్తారని విశ్వసిస్తున్నాను’ అని అన్నారు. -
Kumar Mangalam Birla: మూడేళ్లలో రూ. 10 వేల కోట్ల ఆదాయం
న్యూఢిల్లీ: కొత్త వెంచర్ అయిన డెకరేటివ్ పెయింట్స్ వ్యాపార విభాగం నుంచి వచ్చే మూడేళ్లలో రూ. 10,000 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్లు ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా తెలిపారు. అప్పటికల్లా లాభాల్లోకి మళ్లగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బిర్లా ఓపస్ బ్రాండ్ కింద డెకరేటివ్ పెయింట్ల వ్యాపారంతో పాటు మూడు పెయింట్ ప్లాంట్లను గురువారం ఆయన ప్రారంభించారు. పానిపట్ (హరియాణ), లూధియానా (పంజాబ్), చెయ్యార్ (తమిళనాడు)లో ఈ ప్లాంట్లు ఉన్నాయి. బిర్లా ఓపస్ పెయింట్లు మార్చి నుంచి పంజాబ్, హరియాణ, తమిళనాడులో లభ్యమవుతాయి. జూలై నుంచి 1 లక్షకు పైగా జనాభా ఉన్న పట్టణాల్లో ఇవి లభిస్తాయని బిర్లా చెప్పారు. ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి 6,000 పట్టణాలకు కార్యకలాపాలు విస్తరించాలని నిర్దేశించుకున్నట్లు వివరించారు. గ్రూప్‌లో కీలకమైన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ గతేడాది డెకరేటివ్ పెయింట్ల వ్యాపారంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది. 2025 నాటికి రూ. 10,000 కోట్లతో దేశీయంగా ఆరు తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే రూ. 5,000 కోట్లు వెచి్చంచినట్లు బిర్లా ఓపస్ బిజినెస్ హెడ్ హిమాంశు కపానియా తాజాగా చెప్పారు. దేశీయంగా డెకరేటివ్ పెయింట్స్ మార్కెట్ దాదాపు రూ. 80,000 కోట్ల స్థాయిలో ఉంది. ఏషియన్ పెయింట్స్, బర్జర్ పెయింట్స్, నెరోలాక్, అక్జో నోవెల్ (డ్యూలక్స్) ఈ విభాగంలో దిగ్గజాలుగా ఉన్నాయి. -
28 ఏళ్లకే తండ్రి మరణం.. ఇప్పుడు లక్షల కోట్లకు యజమాని
భారతదేశంలోని అగ్రశ్రేణి వ్యాపారవేత్తల్లో ఒకరైన 'కుమార్ మంగళం బిర్లా' (Kumar Mangalam Birla) గురించి దాదాపు అందరికి తెలుసు. ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్‌గా మాత్రమే కాకుండా సుమారు 14.2 బిలియన్ డాలర్ల సంపదకు నాయకుడై భారతీయ సంపన్నుల జాబితాలో 9వ స్థానం పొందిన బిర్లా ఈ స్థాయికి రావడానికి ఎన్నెన్ని అడ్డంకులను ఎదుర్కొన్నాడు? ఆయన సక్సెస్ రహస్యం ఏమిటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. 1967 జూన్ 14న జన్మించిన కుమార్ మంగళం బిర్లా ముంబై విశ్వవిద్యాలయంలోని హెచ్ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుంచి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి తరువాత లండన్ బిజినెస్ స్కూల్లో చదువుకున్నాడు. 1992లో లండన్‌లో CA పూర్తి చేశారు. చదువు పూర్తయిన తరువాత 1995లో ఆయన తండ్రి ఆదిత్య విక్రమ్ బిర్లా మరణించారు. తండ్రి మరణించిన తరువాత 28 సంవత్సరాల వయసులో ఆదిత్య బిర్లా గ్రూప్‌కు ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అతి తక్కువ కాలంలోనే కంపెనీ టర్నోవర్ 2 బిలియన్ల నుంచి 45 బిలియన్లకు చేరింది. (ఇదీ చదవండి: Volkswagen Discounts: ఈ ఆఫర్స్ చాలదా ఫోక్స్‌వ్యాగన్ కారు కొనడానికి - పూర్తి వివరాలు) కుమార్ మంగళం బిర్లా టెలికమ్యూనికేషన్స్, సిమెంట్, మైనింగ్ వంటి వాటితో పాటు సుమారు 16 కంటే ఎక్కువ పరిశ్రమల్లోకి అడుగుపెట్టారు. అంతే కాకుండా వీరు అలెన్ సోలీ, పీటర్ ఇంగ్లాండ్, లూయిస్ ఫిలిప్, పాంటలూన్స్ పేర్లతో దుస్తులను విక్రయిస్తున్నారు. కార్బన్ బ్లాక్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ అండ్ సప్లయర్స్ పేరుతో ఐదు ఖండాల్లోని 12 దేశాలకు కార్బన్ ఎగుమతి చేస్తున్నారు. భారతదేశంలో రైల్వే అవసరాలకు అవసరమైన కార్బన్ పంపించడంలో బిర్లా కాపర్ వాటా భారీగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 47 బ్రాండ్లు, 27 ఎంటర్ప్రైజెస్, 14 పరిశ్రమ రంగాలను కలిగి ఉన్న ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రస్తుతం విజయపథంలో నిర్విరామంగా ముందుకు సాగుతోంది. బాక్సైట్ తవ్వకాలు, అల్యూమినా ప్రాసెసింగ్, అల్యూమినియంతో కూడిన ఇతర కార్యకలాపాలలో నిమగ్నమైన హిండాల్కోకు కూడా బిర్లా యజమాని. ఇందులో సుమారు 40వేలకంటే ఎక్కువ మంది పనిచేస్తున్నారు. 2004లో గ్రాసిమ్ కొనుగోలు చేసినప్పటి నుంచి అల్ట్రాటెక్ సిమెంట్ భారతదేశంలో అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తిదారుగా ప్రపంచంలో మూడవ అతిపెద్దదిగా ఎదిగింది. దీని ఆదాయం ప్రస్తుతం రూ.50000 కోట్ల కంటే ఎక్కువ అని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం కుమార్ మంగళం బిర్లా నికర ఆస్తుల విలువ సుమారు పది లక్ష కోట్లకంటే ఎక్కువ. -
గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లాభం జూమ్
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ఆదిత్య బిర్లా గ్రూప్ డైవర్సిఫైడ్ దిగ్గజం గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 56 శాతం జంప్‌చేసి రూ. 4,070 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,617 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 18 శాతం ఎగసి రూ. 28,811 కోట్లను తాకింది. అయితే మొత్తం వ్యయాలు 23 శాతం అధికమై రూ. 25,786 కోట్లను దాటాయి. వాటాదారులకు రూ. 5 ప్రత్యేక డివిడెండుతో కలిపి షేరుకి మొత్తం రూ. 10 చొప్పున చెల్లించనుంది. పూర్తి ఏడాదికి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన పూర్తి ఏడాదికి గ్రాసిమ్ నికర లాభం 60 శాతం దూసుకెళ్లి రూ. 11,206 కోట్లను అధిగమించింది. 2020–21లో కేవలం రూ. 6,987 కోట్లు ఆర్జించింది. మొత్తం అమ్మకాలు 25 శాతంపైగా వృద్ధితో రూ. 76,404 కోట్లను తాకాయి. కాగా.. క్యూ4 ఆదాయంలో విస్కోస్ పల్ప్, స్టేపుల్ ఫైబర్, ఫిలమెంట్ యార్న్ విభాగం వాటా 46 శాతం ఎగసి రూ. 3,766 కోట్లకు చేరింది. సిమెంట్ రంగ అనుబంధ సంస్థ అల్ట్రాటెక్ టర్నోవర్ 9 శాతం పుంజుకుని రూ. 15,767 కోట్లను దాటింది. కెమికల్స్ విభాగం నుంచి 69 శాతం అధికంగా రూ. 2,487 కోట్లు సమకూరింది. ఫైనాన్షియల్ సర్వీసుల ఆదాయం 19 శాతం పుంజుకుని రూ. 6,622 కోట్లయ్యింది. ఇతర విభాగాల ఆదాయం 29 శాతం బలపడి రూ. 705 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ షేరు బీఎస్ఈలో దాదాపు 4 శాతం నష్టంతో రూ. 1,403 వద్ద ముగిసింది. -
అరరే.. బిర్లాలకు ఎంత కష్టమొచ్చింది!
న్యూఢిల్లీ: బిర్లా టైర్స్ లిమిటెడ్‌పై దివాలా చర్యలను ప్రారంభించాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) కోల్‌కతా బెంచ్ ఆదేశించింది. బీకే బిర్లా గ్రూప్ సంస్థ– బిర్లా టైర్స్ రుణదాత, మల్టీ–బిజినెస్ కెమికల్స్ సంస్థ ఎస్ఆర్ఎఫ్ దాఖలు చేసిన కేసులో బెంచ్ ఈ ఆదేశాలు ఇచ్చింది. ఐబీసీ చట్ట నిబంధనల ప్రకారం, బోర్డు ను సస్పెండ్ చేసి, మారటోరియం విధించిన ట్రి బ్యునల్, కంపెనీ కార్యకలాపాలను నిర్వహించడానికి సీక్ అబ్దుల్ సలామ్‌ను మధ్యంతర రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఐఆర్పీ)గా నియమించింది. టైర్ కార్డ్ ఫ్యాబ్రిక్ సరఫరాలకు సంబంధించి 2021 జూలై 8వ తేదీ నాటికి బిర్లా టైర్స్ తనకు రూ. 15.84 కోట్లు చెల్లించాలని ఎస్ఆర్ఎఫ్ దివాలా పిటిషన్లో పేర్కొంది. ఇందులో రూ. 10.06 కోట్ల అసలుకాగా, 5.78 కోట్లు వడ్డీ. రుణ డిఫాల్ట్‌కు సంబంధించి ఎస్ఆర్ఎఫ్ సమర్పించిన పత్రాలతో సంతృప్తి చెందినట్లు ట్రిబ్యునల్ పేర్కొంది. ఐబీసీ సెక్షన్ 9 కింద దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను బిర్లా టైర్స్ చాలా ఆషామాషీగా తీసుకుని, వాయిదాలు తీసుకోడానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు కనబడుతోందని ట్రిబ్యునల్ సభ్యులు (టెక్నికల్) హరీష్ చందర్ మరో సభ్యులు (జుడీషియల్) సూరి రోహిత్ కపూర్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఎస్ఆర్ఎఫ్ పిటిషన్‌పై బిర్లా టైర్స్‌కు ఎన్సీఎల్టీ 2021 అక్టోబర్ 20న నోటీసులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేసింది. రిప్లై ఇవ్వడానికి మూడు ద ఫాలు బిర్లా టైర్స్ వాయిదాలు తీసుకోవడం గమనార్హం. చదవండి: ఓయో ఖాతాలో డైరక్ట్ బుకర్ -
కుమార మంగళం బిర్లాకు సీఎం జగన్ ప్రత్యేక విందు
సాక్షి, అమరావతి: తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్రారంభం అనంతరం గురువారం మధ్యాహ్నం సీఎం జగన్‌తో కలిసి ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా తాడేపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తన నివాసంలో సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక విందు ఇచ్చారు. అనంతరం జ్ఞాపిక బహూకరించి సన్మానించారు. గ్రాసిమ్ ఇండస్ట్రీస్, కుమార మంగళం బిర్లాకు శుభాకాంక్షలు. మీ అపార అనుభవం, పరిచయాలు ఆంధ్రప్రదేశ్ ఎదుగుదలకు కచ్చితంగా తోడ్పతాయి. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, మరిన్ని పెట్టుబడులతో రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలవాలని ఆకాంక్షిస్తున్నాం. దేశం నలుమూలల నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు ఇది దోహదపడుతుందని భావిస్తున్నా. ఈ పరిశ్రమ వల్ల అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ సహకారం అవసరమైనా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. – సీఎం వైఎస్ జగన్ చదవండి: (పరిశ్రమలకు రాచబాట) -
బిర్లా గ్రూప్ కాస్టిక్ సోడా యూనిట్ ప్రారంభం (ఫోటోలు)
-
ఆ కేసులను ఎత్తివేస్తున్నాం: సీఎం జగన్
సాక్షి, తూర్పుగోదావరి: గతంలో గ్రాసిమ్ ప్రాజెక్టు సంబంధించి జరిగిన ఆందోళనల్లో 131 మందిపై కేసులు నమోదయ్యాయని.. ఆందోళనకారులపై ఆ కేసులను ఎత్తివేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఈ రోజే జీవో విడుదల చేస్తున్నామని తెలిపారు. బిక్కవోలు మండలం బలభద్రపురంలో గ్రాసిం ఇండస్ట్రీ కోర్ ఆల్కలీ యూనిట్‌ను గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లాతో కలిసి సీఎం జగన్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, గ్రాసిమ్ పరిశ్రమతో ప్రత్యక్షంగా 1300 మంది, పరోక్షంగా 1150 మందికి ఉపాధి కలుగుతుందని సీఎం అన్నారు. 75 శాతం స్థానికులకు ఉపాధి కల్పించేలా చట్టం చేశామన్నారు. చదవండి: మన పంతం 'అవినీతి అంతం' ‘‘ఎన్నికలకు 2 నెలల ముందు గత ప్రభుత్వం గ్రాసిమ్ సంస్థకు ప్రాజెక్ట్ అప్పగించింది. గత ప్రభుత్వం సమస్యలు పరిష్కారం కాకుండా సంతకాలు చేసింది. అన్ని సమస్యలు పరిష్కరించి కంపెనీ పనులు ముందుకు సాగేలా చేశామన్నారు. అవరోధాలను ఒక్కొక్కటికీ తొలగించి ప్రాజెక్టు నెలకొల్పామన్నారు. భూగర్భ జలాలు కాలుష్యం కాకుండా ఆధునిక సాంకేతికతో పరిశ్రమ ఏర్పాటు చేశారన్నారు. టెక్నాలజీ మార్పు ద్వారా జీరో లిక్విడ్ వేస్ట్ డిశ్చార్జ్ చేశారన్నారు. భయాలకు తావులేకుండా ప్రాజెక్టు నెలకొల్పారని’’ సీఎం వైఎస్ జగన్ అన్నారు. -
ఒక్కొక్క అవరోధాన్ని తొలగిస్తూ ప్రాజెక్టు నెలకొల్పాం: సీఎం జగన్
సాక్షి, తూర్పుగోదావరి: బిక్కవోలు మండలం బలభద్రపురంలో గ్రాసిం ఇండస్ట్రీ కోర్ ఆల్కలీ యూనిట్‌ను బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లాతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 'గ్రాసిమ్ పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి రూ.2,700 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ప్రత్యక్షంగా 1300మంది, పరోక్షంగా 1150 మందికి అవకాశం లభిస్తుంది. ఇలాంటి కంపెనీలు రావడంతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. 75 శాతం స్థానికులకు ఉపాధి కల్పించేలా ఇప్పటికే రాష్ట్రంలో చట్టం చేశాం. ఈ పరిశ్రమలో టెక్నాలజీలో మార్పు ద్వారా జీరో లిక్విడ్ వేస్ట్ డిశ్చార్జ్ అవుతుంది. భయాలకు తావులేకుండా ప్రాజెక్టును నెలకొల్పారు. గత ప్రభుత్వం ఎన్నికలకు రెండు నెలల ముందు గ్రాసిమ్ సంస్థకు ప్రాజెక్ట్ అప్పగించింది. గత ప్రభుత్వం సమస్యలు పరిష్కారం కాకుండా సంతకాలు చేసింది. మన ప్రభుత్వం వచ్చాక అన్ని సమస్యలు పరిష్కరించి కంపెనీ పనులు ముందుకు సాగేలా చేశాం. అవరోధాలను ఒక్కొక్కటిగా తొలగించి ప్రాజెక్టును నెలకొల్పామని సీఎం జగన్ అన్నారు. సీఎం జగన్ సహకారం మరవలేం: కుమార మంగళం బిర్లా బిర్లా గ్రూప్ కాస్టిక్ సోడా యూనిట్ ప్రారంభం సందర్భంగా ఆదిత్యా బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను కొనియాడారు. పరిశ్రమలో 75 శాతం మంది స్థానికులకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. దీని ద్వారా సుమారు 2,500 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందనున్నట్లు వివరించారు. భూగర్భ జలాలు కాలుష్యం కాకుండా ఆధునిక సాంకేతికతతో గ్రాసిమ్ పరిశ్రమను ఏర్పాటు చేశామని కుమార మంగళం బిర్లా తెలిపారు. పరిశ్రమల ఏర్పాటులో సీఎం జగన్ సహకారం మరవలేనిదంటూ కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే అంతకు ముందు గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్లాంట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లాతో కలిసి సీఎం జగన్ ప్లాంట్‌ను సందర్శించారు. ఉపాధి అవకాశాలు మెండు ఆదిత్య బిర్లా గ్రూపు భారీ స్థాయిలో రూ.2700 కోట్ల పెట్టుబడితో కాస్టిక్ సోడా ప్లాంట్ ఏర్పాటు చేసింది. ప్లాంట్ ఏర్పాటు ద్వారా స్థానికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఆదిత్య బిర్లా గ్రూపులో ఒకటైన గ్రాసిమ్ కంపెనీ ముఖ్యమంత్రి చొరవతో ఈ ప్లాంట్ నిర్మాణానికి ముందుకు రావడంతో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు మెండుగా లభిస్తాయని సంతోషపడుతున్నారు. -
టాన్ఫాక్ భాగస్వామిగా అనుపమ్
ముంబై: టాన్ఫాక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(టీఐఎల్)లో 24.96 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు స్పెషాలిటీ కెమికల్, కస్టమ్ సింథసిస్ కంపెనీ అనుపమ్ రసాయన్ ఇండియా లిమిటెడ్(ఏఆర్ఐఎల్) తాజాగా పేర్కొంది. ప్రమోటర్ గ్రూప్ సంస్థ బిర్లా గ్రూప్ హోల్డింగ్స్(బీజీహెచ్), తదితరుల నుంచి ఈ వాటాను సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 148 కోట్లకుపైగా వెచ్చించనున్నట్లు వెల్లడించింది. దీంతోపాటు సెబీ నిబంధనల ప్రకారం పబ్లిక్ వాటాదారుల నుంచి మరో 26 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించనున్నట్లు వివరించింది. ఇందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొంది. ఈ వాటాకు రూ. 154.3 కోట్లను వెచ్చించనున్నట్లు తెలియజేసింది. నిధులను రుణాల ద్వారా సమీకరించనున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా తమిళనాడు పారిశ్రామికాభివృద్ధి సంస్థ(టిడ్కో)తో బీజీహెచ్కు గల భాగస్వామ్య ఒప్పందాన్ని సవరించనున్నట్లు వివరించింది. తద్వారా బీజీహెచ్ స్థానే జేవీలో ఏఆర్ఐఎల్ భాగస్వామిగా చేరనున్నట్లు తెలియజేసింది. ఫ్లోరినేషన్ కెమిస్ట్రీ బిజినెస్‌కు టీఐఎల్ కొనుగోలు మరింత బలాన్నివ్వగలదని అనుపమ్ రసాయన్ ఎండీ ఆనంద్ దేశాయ్ పేర్కొన్నారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడమేకాకుండా కొత్త డెరివేటివ్స్‌ను సైతం రూపొందించేందుకు వీలుంటుందని తెలియజేశారు. ఈ వార్తల నేపథ్యంలో అనుపమ్ రసాయన్ షేరు ఎన్ఎస్ఈలో 4 శాతం జంప్‌చేసి రూ. 1,048 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 1,107ను అధిగమించి కొత్త గరిష్టాన్ని తాకింది. -
ఈ 3 చిన్న షేర్లూ యమస్పీడ్
మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదులుతున్పప్పటికీ ఈ చిన్న తరహా కౌంటర్లకు మాత్రం డిమాండ్ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఐటీ సేవల కంపెనీ బిర్లాసాఫ్ట్ లిమిటెడ్, ఆటో విడిభాగాల సంస్థ స్టీల్ స్ట్రిప్స్ వీల్స్, సాఫ్ట్వేర్ సేవల కంపెనీ రామ్‌కో సిస్టమ్స్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. బిర్లాసాఫ్ట్ డిజిటల్ సోల్యూషన్స్ అందించేందుకు గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ ఇన్నోవియోతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు బిర్లాసాఫ్ట్ పేర్కొంది. యూఎస్, యూరోపియన్ మార్కెట్లలో పలు బీమా రంగ దిగ్గజాలకు ఇన్నోవియో టెక్నాలజీ సొల్యూషన్స్ అందిస్తున్నట్లు తెలియజేసింది. నోకోడ్ ప్లాట్‌ఫామ్ విభాగంలో కంపెనీకున్న నైపుణ్యం బిర్లాసాఫ్ట్కు ఎంతో ప్రయోజనకరమని కంపెనీ ఎస్వీపీ శిల్పా భండారీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బిర్లాసాఫ్ట్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 7 శాతం జంప్‌చేసి రూ. 98 వద్ద ట్రేడవుతోంది. రామ్‌కో సిస్టమ్స్ ఏవియేషన్ రంగ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్‌కు పేరొందిన రామ్‌కో సిస్టమ్స్.. యూఎస్ కంపెనీ టాక్టికల్ ఎయిర్ సపోర్ట్ నుంచి ఆర్డర్ పొందినట్లు తెలియజేసింది. దీనిలో భాగంగా ఏవియేషన్ ఎంఆర్వో సూట్ V5.8ను టాక్టికల్ కోసం వినియోగించనున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో రామ్‌కో సిస్టమ్స్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 114 సమీపంలో ఫ్రీజయ్యింది. స్టీల్ స్ట్రిప్స్ వీల్స్ యూరోపియన్ మార్కెట్ నుంచి తొలిసారి అలాయ్ వీల్స్ సరఫరాకు కాంట్రాక్టును సంపాదించినట్లు స్టీల్ స్ట్రిప్స్ వీల్స్ తాజాగా పేర్కొంది. మెహసనా ప్లాంటు నుంచి వీటిని సరఫరా చేయనున్నట్లు తెలియజేసింది. తద్వారా యూఎస్, ఈయూ మార్కెట్లకు 3100 సీవీ వీల్స్‌ను ఎగుమతి చేయనున్నట్లు తెలియజేసింది. దీంతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో స్టీల్ స్ట్రిప్స్ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 457 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 468 వరకూ ఎగసింది. -
లాకౌట్‌కు చేరువలో అల్ట్రాటెక్ !
తాడిపత్రి: సిమెంట్ ఉత్పత్తిలో ఆసియాలోనే అతిపెద్ద కర్మాగారమైన ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన అల్ట్రాటెక్ కార్మాగారం మూత పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత నెల 22వ తేదీ నుంచి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలన్న డిమాండ్‌తో కర్మాగారం వద్ద ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో ప్లాంట్‌లో సిమెంట్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయింది. దీంతో యజమాన్యం ఇప్పటికే లాకౌట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. తాడిపత్రి మండలంలోని బోగసముద్రం ప్లాంట్ వద్ద 10 రోజులుగా కార్యకలపాలు పూర్తిగా స్తంభించాయి. సిమెంట్ ఉత్పత్తి ఆగిపోయింది. రోజుకు 10 నుంచి 12 వేల మెట్రిక్ టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి చేసే సామార్థ్యం ఉన్న ఈ ప్లాంట్ ఆసియాలోనే పెద్దది. ఇక్కడ ప్రత్యేక్షంగా ఐదు వేల మంది కార్మికులు, ప్రత్యేక్షంగా 10వేల మందికార్మికులకు ఉపాధి లభిస్తోంది. ఈ కర్మాగారం నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని చాల సంవత్సరాలుగా డిమాండ్ ఉంది. అయితే దశల వారిగా ఉద్యోగాలు ఇస్తామని యాజమాన్యం చెబుతూ వస్తోంది. కొద్ది మందికి ఇచ్చారు కూడా. ఈనెల 22వ తేదీ ఉదయం జేసీ దివాకర్ రెడ్డి ఏకంగా తన అనుచురులను, సమీప గ్రామాలకు చెందిన వారిని, రైతులను ప్లాంట్ వద్దకు రప్పించి మొత్తం ప్రధాన గేట్లను బలవంతంగా మూయించి రాకపోకలను స్తంభింపచేశారు. ప్లాంట్‌లోకి వేళ్లే రైల్వేవ్వాగిన్లను, వాహనాల రాకపోకలను కూడా అడ్డుకోవడంతో పరిశ్రమ ఆగిపోయింది. ఎం.పి.జె.సి.దివాకర్‌రెడ్డి నేతృత్వలో జరుగుతున్న అందోళన మరింత ఉపందుకుంది. ఒక దశలో ప్లాంట్‌లోకి నిత్యావసర వస్తువులు కూడా లోపలకి పంపేందుకు అందోళన కారులు అడ్డుకోవడంతో పోలీసులు జోక్యం కల్పించుకోని అనుమతించారు. ప్రధాన గేట్ల వద్ద రాత్రిం బవళ్లు కాపలా ఉంటూ ఆందోళన కొనసాగిస్తూ వస్తున్నారు. చాలా సార్లు చర్చలు జరిపినా ప్రయోజనం లేకుండా పోయింది. 15వేల మంది ఉపాధికి విఘాతం కల్పించే విధంగా ఆందోళన చేస్తున్నా కూడా ప్రభుత్వ కానీ, జిల్లా యంత్రంగం కానీ కల్పించుకున్న పాపాన పోలేదు. దీంతో చేసేది లేక లాకౌట్ దిశగా యాజమాన్యం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. లాకౌట్‌కు దారితీస్తున్న పరిణామాలపై జిల్లా యంత్రాంగానికి నివేదికలు పంపి త్వరలో అధికారికంగా ప్రకటన చేయనుంది. ఒక వైపు ప్రభుత్వం పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తామంటే ఉన్న పరిశ్రమలను మూసివేసే విధంగా సొంత నేతలే చేస్తున్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 20 ఏళ్ల తర్వాత స్పందించడంపై విమర్శల వెల్లువ 20 సంవత్సరాల క్రితం ఏర్పాటు అయిన సిమెంట్ పరిశ్రమలో పూర్తిస్థాయిలో 18 సంవత్సరాల క్రితం ఉత్పత్తి ప్రారంభం అయింది. అప్పట్లో స్థానికులకు ఉద్యోగాలు కావాలని డిమాండ్ చేయని ఎం.పి. జె.సి.దివాకర్‌రెడ్డి ఇప్పుడు ఉధృతంగా ఆందోళన చేయించడం వెనుక ఉద్దేశం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికార యంత్రంగం, పోలీసులు కూడా ఆందోళన కారులకే మద్దతు ఇస్తున్నట్లు ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.