ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా సంతానానికి హిందాల్కో బోర్డులో చోటు దక్కింది. అనన్య బిర్లా, ఆర్యమాన్ విక్రమ్ బిర్లా బోర్డులో డైరెక్టర్లుగా ఎంపికయ్యారు. ఈమేరకు బోర్డు అనుమతించింది. అనన్య బిజినెస్‌తోపాటు గాయనిగా ఆమె ప్లాటినమ్ సెల్లింగ్ ఆర్టిస్ట్‌గా రాణించారు. తన 17వ ఏట ఏర్పాటు చేసిన తొలి కంపెనీ స్వతంత్ర మైక్రోఫిన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రస్తుతం మైక్రోఫైనాన్స్ పరిశ్రమలో రెండో పెద్ద సంస్థగా కార్యకలాపాలు సాగిస్తోంది. వీరితోపాటు బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లుగా అంజనీ కుమార్ అగర్వాల్, సుకన్య కృపాలును బోర్డు నియమించింది. భరత్ గోయెంకా సీఎఫ్‌వోగా బాధ్యతలు చేపట్టనున్నారు.
2023లోనే ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రధాన కంపెనీలు గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఏబీ ఫ్యాషన్ అండ్ రిటైల్ బోర్డుల్లో అనన్య, ఆర్యమాన్ సభ్యులుగా చేరారు. మరోవైపు, గ్రూప్ బిజినెస్‌లకు మార్గదర్శకంగా వ్యవహరించే ఏబీ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ బోర్డులో డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టారు.
ఇదీ చదవండి: కోరికలు తీర్చే ‘ఫిష్’!
ఈ సందర్భంగా హిందాల్కో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా మాట్లాడుతూ..‘ప్రస్తుతం హిందాల్కో మరో వృద్ధి దశ పరివర్తనలో ఉంది. పటిష్ట నిర్ణయాలు, భవిష్యత్‌పై ప్రత్యేక దృష్టి కలిగిన అనన్య, ఆర్యమాన్‌లకు డైరెక్టర్లుగా బోర్డులో చోటు కల్పించడానికి ఇదే తగిన సమయమని బోర్డు నిర్ణయించింది. డైరెక్టర్లుగా వారు హిందాల్కోకు మరింత విలువ చేకూర్చే నిర్ణయాలు, ప్రణాళికలను సిద్ధం చేసి వాటిని పాటిస్తారని విశ్వసిస్తున్నాను’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment