Birla
-
20 ఏళ్ల చిన్నవాడితో డేటింగ్ చేస్తున్న టాప్ హీరోయిన్
బాలీవుడ్లో ఒకప్పుడు సెన్సేషనల్ హీరోయిన్గా అమీషా పటేల్ క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో కూడా బద్రి, నరసింహుడు, నాని సినిమాలతో మెప్పించిన ఈ బ్యూటీకి ఇక్కడ కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే, లేటు వయసులో ఈ బ్యూటీ మరోసారి ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా కొన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఒకప్పుడు గ్లామర్ క్వీన్‌గా అమీషా పటేల్ గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఆమెకు భారీగా పాపులారిటీ ఉంది. అలా స్టార్ డమ్ ఉన్నప్పుడే బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్‌తో అమీషా ప్రేమలో పడింది. సుమారు కొన్నేళ్లపాటు వారిద్దరూ డేటింగ్ కూడా చేశారు. అయితే, ఇద్దరి మధ్య పలు విభేదాలు రావడంతో బ్రేకప్ చెప్పుకున్నారు. అయితే, మళ్లీ వారిద్దరూ కలిసింది లేదు. కొద్దిరోజుల్లో అమీషా పటేల్ వయసు 50 ఏళ్లకు చేరుకుంటుంది. అయినా, ఆమె పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఇప్పుడు ఆ టైమ్ వచ్చిందని ఆమె అభిమానులు కూడా చెబుతున్నారు.విక్రమ్ భట్‌తో బ్రేకప్ చెప్పిన తర్వాత అమీషా పటేల్ మరో ఎన్ఆర్ఐతో ప్రేమాయాణాన్ని సాగించింది. అదీ కూడా పెళ్లి వరకు వెళ్లలేదు. దీంతో అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే ఉంటుంది. అయితే, తాజాగా ఓ 30 ఏళ్ల యువకుడితో దుబాయ్‌లో విహరిస్తూ అమీషా కనిపించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో ఆమె కూడా అతగాడి కౌగిలిలో ఒదిగిపోతూ ఫోజులు ఇచ్చిన ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 'నా డార్లింగ్ నిర్వాన్ బిర్లాతో.. లవ్లీ సాయంత్రం' అంటూ ఆ ఫోటోకు ఒక క్యాప్షన్ కూడా జత చేసింది. వ్యాపార కుటుంబంలో జన్మించిన 'నీరవ్ బిర్లా'.. అమీషా పటేల్ కంటే సుమారు 20 ఏళ్ల చిన్నవాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన నాటికి ఇతగాడి వయసు 6 ఏళ్లు మాత్రమేనని చెప్పవచ్చు. దీంతో నెటిజన్లు కూడా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. అమీషా అందం అలాంటిదంటూనే ఆమె ఎవరినైనా ఫిదా చేస్తుందని చెప్పుకొస్తున్నారు. సన్నీ డియోల్, అమీషా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం.. ‘గదర్ 2’. గతేడాదిలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) -
బిర్లా వారసులకు బాధ్యతలు
ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా సంతానానికి హిందాల్కో బోర్డులో చోటు దక్కింది. అనన్య బిర్లా, ఆర్యమాన్ విక్రమ్ బిర్లా బోర్డులో డైరెక్టర్లుగా ఎంపికయ్యారు. ఈమేరకు బోర్డు అనుమతించింది. అనన్య బిజినెస్‌తోపాటు గాయనిగా ఆమె ప్లాటినమ్ సెల్లింగ్ ఆర్టిస్ట్‌గా రాణించారు. తన 17వ ఏట ఏర్పాటు చేసిన తొలి కంపెనీ స్వతంత్ర మైక్రోఫిన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రస్తుతం మైక్రోఫైనాన్స్ పరిశ్రమలో రెండో పెద్ద సంస్థగా కార్యకలాపాలు సాగిస్తోంది. వీరితోపాటు బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లుగా అంజనీ కుమార్ అగర్వాల్, సుకన్య కృపాలును బోర్డు నియమించింది. భరత్ గోయెంకా సీఎఫ్‌వోగా బాధ్యతలు చేపట్టనున్నారు.2023లోనే ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రధాన కంపెనీలు గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఏబీ ఫ్యాషన్ అండ్ రిటైల్ బోర్డుల్లో అనన్య, ఆర్యమాన్ సభ్యులుగా చేరారు. మరోవైపు, గ్రూప్ బిజినెస్‌లకు మార్గదర్శకంగా వ్యవహరించే ఏబీ మేనేజ్మెంట్ కార్పొరేషన్ బోర్డులో డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టారు.ఇదీ చదవండి: కోరికలు తీర్చే ‘ఫిష్’!ఈ సందర్భంగా హిందాల్కో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా మాట్లాడుతూ..‘ప్రస్తుతం హిందాల్కో మరో వృద్ధి దశ పరివర్తనలో ఉంది. పటిష్ట నిర్ణయాలు, భవిష్యత్‌పై ప్రత్యేక దృష్టి కలిగిన అనన్య, ఆర్యమాన్లకు డైరెక్టర్లుగా బోర్డులో చోటు కల్పించడానికి ఇదే తగిన సమయమని బోర్డు నిర్ణయించింది. డైరెక్టర్లుగా వారు హిందాల్కోకు మరింత విలువ చేకూర్చే నిర్ణయాలు, ప్రణాళికలను సిద్ధం చేసి వాటిని పాటిస్తారని విశ్వసిస్తున్నాను’ అని అన్నారు. -
Indian Singer-Songwriter Ananya Birla: హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అనన్య బిర్లా (ఫొటోలు)
-
దూసుకుపోతున్న అనన్య బిర్లా: కోట్ల డీల్
ముంబై: పారిశ్రామిక దిగ్గజం కుమారమంగళం బిర్లా కుమార్తె అనన్య బిర్లాకు చెందిన సూక్ష్మ రుణాల సంస్థ ’స్వతంత్ర’ తాజాగా చైతన్య ఇండియా ఫిన్ క్రెడిట్‌ను కొనుగోలు చేయనుంది. ఇందుకోసం రూ. 1,479 కోట్లు వెచ్చించనుంది ఈ లావాదేవీ 2023 చివరి నాటికి పూర్తవుతుందని కంపెనీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ సహ–వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్‌కి చెందిన నవీ గ్రూప్‌లో చైతన్య ఇండియా భాగంగా ఉంది. చైతన్య కొనుగోలు ద్వారా 36 లక్షల మంది యాక్టివ్ కస్టమర్లు, 20 రాష్ట్రాల్లో 1,517 శాఖలు, రూ. 12,409 కోట్ల అసెట్స్ (ఏయూఎం)తో స్వతంత్ర దేశీయంగా రెండో అతి పెద్ద మైక్రోఫైనాన్స్ సంస్థగా ఆవిర్భవించనుంది. 2013లో అనన్య బిర్లా ప్రారంభించిన స్వతంత్రలో రూ. 7,499 కోట్ల ఏయూఎం, 7,000 మంది పైచిలుకు ఉద్యోగులు, 22 లక్షల గ్రామీణ కస్టమర్లు ఉన్నారు. చైతన్య ఇండియా ఫిన్ క్రెడిట్‌కు రూ. 4,900 కోట్ల ఏయూఎం, 6,000 మంది ఉద్యోగులు, 14 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. చైతన్య ఇండియా, దాని మాతృ సంస్థ నవీ ఫిన్‌సర్వ్‌ను 2019లో బన్సల్ కేవలం రూ. 150 కోట్లకు కొనుగోలు చేశారు. గత నాలుగేళ్లలో చైతన్య ఆరు రెట్లు వృద్ధి చెందినట్లు బన్సల్ తెలిపారు. ఈ కొనుగోలుతో తమ సంస్థ విస్తృతి మరింత పెరగగలదని అనన్య బిర్లా తెలిపారు. -
బిర్లా పుట్టినరోజు.. రేర్ ఫొటోతో కూతురి ఆసక్తికర పోస్ట్
ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా పుట్టినరోజు (జూన్ 14) పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమార్తె అనన్య బిర్లా రేర్ ఫొటోతో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్ననాటి ఒక త్రోబ్యాక్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. పాపాయిగా ఉన్న అనన్యను బిర్లా ఆప్యాయంగా ఎత్తుకున్న ఫొటోను ఆమె షేర్ చేశారు. “పుట్టినరోజు శుభాకాంక్షలు పా! నిన్ను చాలా ప్రేమిస్తున్నాను" అంటూ అనన్య బిర్లా తన ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో ఫొటోను పోస్ట్ చేశారు. వీటికి వేలాదిగా లైక్‌లు, కామెంట్లు వచ్చాయి. అలాగే అనేక మంది ప్రముఖులు కూడా బిర్లాకు పుట్టినరోరజు శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో నటుడు బాబీ డియోల్, పుల్కిత్ సామ్రాట్, విజె అనూషా దండేకర్ తదితరులు ఉన్నారు. ఇదీ చదవండి: బిర్లా వారసురాలు.. తండ్రి పేరు చెప్పుకునే టైపు కాదు! విభిన్న ప్రతిభతో సొంత గుర్తింపు.. వాణిజ్యం, పరిశ్రమల రంగానికి చేసిన కృషికి గాను కుమార మంగళం బిర్లాకు ఈ సంవత్సరం పద్మభూషణ్ అవార్డు లభించింది. హిందాల్కో ఇండస్ట్రీస్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్, ఆదిత్య బిర్లా క్యాపిటల్‌తో సహా అన్ని ప్రధాన గ్రూప్ కంపెనీల బోర్డులకు ఆయన అధ్యక్షత వహిస్తున్నారు. కుమార మంగళం బిర్లా ముగ్గురు సంతానంలో అనన్య బిర్లా పెద్దది. ఆమెతోపాటు బిర్లాకు కుమారుడు ఆర్యమాన్ మరో కుమార్తె అద్వైతేషా కూడా ఉన్నారు. Happy Birthday Pa! Love you so much ❤️ pic.twitter.com/cbjB0USncM — Ananya Birla (@ananya_birla) June 14, 2023 View this post on Instagram A post shared by Ananya Birla (@ananyabirla) -
బిర్లా వారసురాలు.. తండ్రి పేరు చెప్పుకునే టైపు కాదు!
అనన్య బిర్లా.. ఆదిత్య బిర్లా గ్రూప్ అధినేత, దేశంలో అత్యంత సంపన్నుల్లో ఒకరైన కుమార మంగళం బిర్లా కుమార్తె. సాంప్రదాయ వ్యాపారాలను విడిచిపెట్టి తనకంటూ సొంత మార్గాన్ని ఎంచుకుంది. ఒక్క బిజినెస్‌లోనే కాకుండా వివిధ రంగాల్లో రాణిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ! బిర్లా కుటుంబం దేశంలోనే సంపన్న కుటుంబాల్లో ఒకటి. వారికి అనేక వ్యాపారాలు ఉన్నాయి. తండ్రి కుమార మంగళం బిర్లా ఫోర్బ్స్ 2023 భారతీయ బిలియనీర్ల జాబితా ప్రకారం.. దేశంలోనే 9వ అత్యంత సంపన్న వ్యక్తి. వీటితో సంబంధం లేకుండా ఒక వ్యాపారవేత్తగా, గాయనిగా విభిన్న రంగాల్లో రాణిస్తున్న అనన్య బిర్లా చదువు, ఆమె నడుపుతున్న వ్యాపారాలు, నికర సంపద వంటివి తెలుసుకుందాం. ఉన్నత చదువు, వ్యాపారాలు అనన్య బిర్లా ముంబైలోని అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబేలో ప్రాథమిక విద్య చదివింది. యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్, మేనేజ్మెంట్లో డిగ్రీ పొందింది. అనన్య బిర్లా స్వతంత్ర మైక్రోఫైనాన్స్ అనే సంస్థను స్థాపించి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లోని పేద, అల్పాదాయ వర్గాలు, మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సేవలను అందిస్తోంది. ఈ సంస్థకు ఆమె సీఈవోగా కూడా ఉన్నారు. అలాగే క్యూరోకార్టే అనే లగ్జరీ ఈ-కామర్స్ సంస్థను కూడా ఆమె ప్రారంభించారు. హస్త కళాకృతులు, శిల్పకళా ఉత్పత్తులను ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తోంది. ఇదీ చదవండి: Satyajith Mittal: బూట్లు అమ్మి రూ.లక్షలు సంపాదిస్తున్నారు.. చిన్నప్పుడు పడిన ఇబ్బందే ప్రేరణ! View this post on Instagram A post shared by Ananya Birla (@ananyabirla) విభిన్న ప్రతిభ అనన్య బిర్లా వ్యాపారవేత్త మాత్రమే కాదు.. విజయవంతమైన సంగీత విద్వాంసురాలు కూడా. ‘లివిన్ ద లైఫ్’, ‘హోల్డ్ ఆన్’ వంటి అద్బుతమైన సింగిల్స్‌ను ఆమె విడుదల చేశారు. తన మ్యూజిక్‌కి అనేక అవార్డులను గెలుచుకున్నారు. మానసిక ఆరోగ్య న్యాయవాది కూడా అయిన అనన్య.. మానసికంగా తాను పడిన ఇబ్బందులు, కుంగుబాటు వంటి సమస్యలను కూడా నిర్భయంగా బయటపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆమె అనన్య బిర్లా ఫౌండేషన్‌ను స్థాపించారు. ఇది మానసిక ఆరోగ్య అవగాహనను పెంపొందించడం, మానసిక ఆరోగ్య కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం వంటి కార్యక్రమాలపై దృష్టి సారించింది. దీంతోపాటు లింగ సమానత్వం, ఫైనాన్షియల్ ఇన్‌క్లూషన్, విద్య, వాతావరణ మార్పు, మానవతా సహాయం వంటి అంశాలకు తోడ్పాటును అందిస్తోంది. నెట్‌వర్త్ అనన్య బిర్లా నికర సంపద విలువ సుమారు 13 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. జీతం గురించి బహిరంగంగా తెలియకపోయినా రెండు విజయవంతమైన కంపెనీలకు వ్యవస్థాపకురాలు, సీఈవోగా ఆమె గణనీయమైన ఆదాయాన్నే ఆర్జిస్తోంది. ఇక సింగర్ గానూ సంపాదిస్తోంది. ఇలాంటి స్పూర్తివంతమైన, విజయవంతమైన వ్యాపారవేత్తల సక్సెస్ స్టోరీల కోసం సాక్షి బిజినెస్ పేజీని చూడిండి -
టాటాలకే కాదు బిర్లాలకు ఉంది ఓ కారు.. ఇప్పుడది దూసుకొస్తోంది
ఒకప్పుడు ఇండియన్ రోడ్లపై రారాజుగా వెలిగిన అంబాసిడర్ కారు మార్కెట్లోకి వస్తోంది. అది కూడా కొత్త రూపులో కొత్త టెక్నాలజీతో అనే వార్తలు బయటకు రావడం ఆలస్యం అందరి దృష్టి అంబాసిడర్ మీదే పడింది. సామాన్యులు మొదలు ఇండస్ట్రియలిస్టుల వరకు అంబాసిడర్‌తో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నారు. ప్రముఖ ఇండస్ట్రియలిస్టు ఆర్పీజీ గ్రూపు చైర్మన్ హార్ష్ గోయెంకా ట్విటర్లో స్పందిస్తూ... మిలీనియం ముందు తరం వాళ్లకు అంబాసిడర్ గురించి బాగా తెలుసు. అదొక గొప్ప కారు మాత్రమే కాదు. కుటుంబంలో ఓ భాగం. అలాంటి కారు మళ్లీ తిరిగి రావడం సంతోషకరం అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక మరికొందరు నెటిజన్లు అంబాసిడర్ కారు పుట్టుపూర్వోత్తరాలను తవ్వి తీస్తున్నారు. చాలా మందికి తెలియని విషయాలను నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. అంబాసిడర్ కారును తయారు చేసింది హిందూస్థాన్ మోటార్స్ అనే సంస్థ. పేరు వినగానే ఇది ప్రభుత్వ రంగ సంస్థ అనుకుంటాం. కానీ హిందూస్థాన్ మోటాన్స్ ప్రైవేటు సంస్థ. దాని వ్యవస్థాపకుడు సీకే బిర్లా. అంటూ అంబాసిడర్ కారు గురించి ఇప్పటి తరానికి తెలియని విషయాలు చెబుతున్నారు. ఈ విషయం తెలియగానే టాటాలకే కాదు బిర్లాలకు కూడా కార్ల కంపెనీ ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. Little known fact is that this was a Birla car… HM belonged to my uncle Mr. CK #Birla!@hvgoenka 🙏 https://t.co/KhlnuxSg9l — Vedant Birla (@birla_vedant) May 30, 2022 హిందూస్థాన్ మోటార్ సంస్థ ఫ్రెంచ్‌కి చెందిన ప్యూగట్ సంస్థతో ఇటీవల ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం త్వరలో సరికొత్త హంగులతో పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ కారుగా అంబాసిడర్‌ను ఇండియాలో ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. ఒకప్పటి ఐకానిక్ కారు మళ్లీ మార్కెట్లోకి రావడాన్ని ఆహ్వానిస్తున్నారు చాలా మంది. చదవండి: Ambassador Electric Car: ఇండియన్ రోడ్ల రారాజు.. అంబాసిడర్ కొత్త లుక్కు చూసారా? -
ఎఫ్డీసీ- బిర్లా టైర్స్.. హైజంప్
ఓ మాదిరి లక్షణాలతో సమస్యలు ఎదుర్కొంటున్న కోవిడ్-19 రోగుల చికిత్సకు వినియోగించగల ఫావిపిరవిర్ ఔషధాన్ని రెండు వేరియంట్లలో విడుదల చేసినట్లు వెల్లడించడంతో ఫార్మా రంగ కంపెనీ ఎఫ్డీసీ లిమిటెడ్ కౌంటర్‌కు డిమాండ్ నెలకొంది. మరోవైపు విభిన్న మార్గాలలో నిధులను సమీకరించనున్నట్లు తెలియజేయడంతో ప్రయివేట్ రంగ కంపెనీ బిర్లా టైర్స్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఎఫ్డీసీ లిమిటెడ్ కోవిడ్-19 కారణంగా స్వల్ప లక్షణాలతో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి వినియోగించగల ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లను రెండు వేరియంట్లలో విడుదల చేసినట్లు ఎఫ్డీసీ లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. ఈ ఔషధానికి ఇప్పటికే డీసీజీఐ అనుమతి లభించడంతో తాజాగా పిఫ్లూ, ఫవెంజా బ్రాండ్లతో వీటిని ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. ఒక్కో ట్యాబ్లెట్ ఖరీదు రూ. 55గా తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఎఫ్డీసీ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 6.6 శాతం ఎగసి రూ. 338ను తాకింది. ప్రస్తుతం 4.3 శాతం జంప్‌చేసి రూ. 331 వద్ద ట్రేడవుతోంది. బిర్లా టైర్స్ లిమిటెడ్ ఈక్విటీ లేదా రుణ సెక్యూరిటీల జారీ ద్వారా రూ. 1,100 కోట్లవరకూ నిధులను సమీకరించాలని భావిస్తున్నట్లు బిర్లా టైర్స్ తాజాగా వెల్లడించింది. ఈ ప్రతిపాదనపై శుక్రవారం(28న) నిర్వహించనున్న సమావేశంలో బోర్డు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలియజేసింది. ఈక్విటీ షేర్లు లేదా మార్పిడిక వీలుకాని డిబెంచర్లు(ఎన్సీడీలు) తదితర సెక్యూరిటీల జారీ ద్వారా నిధుల సమీకరణకు ప్రతిపాదించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో బిర్లా టైర్స్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 23.40 వద్ద ఫ్రీజయ్యింది. -
బిర్లాసాఫ్ట్ దూకుడు- లక్స్ ఇండస్ట్రీస్ డీలా
గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించడంతో సాఫ్ట్వేర్ సేవల దేశీ కంపెనీ బిర్లాసాఫ్ట్ కౌంటర్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో తొలుత ఎన్ఎస్ఈలో బిర్లాసాఫ్ట్ షేరు 18 శాతం దూసుకెళ్లింది. రూ. 178ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 15.5 శాతం జంప్‌చేసి రూ. 174 వద్ద ట్రేడవుతోంది. క్లౌడ్ ఆధారిత డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సేవలు అందించేందుకు యూఎస్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు బిర్లాసాఫ్ట్ పేర్కొంది. తద్వారా మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్, తదితర ప్రొడక్టులపై ఎండ్టుఎండ్ సర్వీసులను అందించనున్నట్లు తెలియజేసింది. తద్వారా 10 కోట్ల డాలర్ల(రూ. 750 కోట్లు) బిజినెస్ పొందే వీలున్నట్లు వివరించింది. లక్స్ ఇండస్ట్రీస్ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి క్వార్టర్లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించినప్పటికీ దుస్తుల తయారీ కంపెనీ లక్స్ ఇండస్ట్రీస్ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. ఎన్ఎస్ఈలో లక్స్ ఇండస్ట్రీస్ షేరు ప్రస్తుతం 4 శాతం పతనమై రూ. 1394 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1383 వరకూ జారింది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో లక్స్ ఇండస్ట్రీస్ నికర లాభం 64 శాతం జంప్‌చేసి రూ. 31 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 6 శాతం క్షీణించి రూ. 247 కోట్లను తాకింది. -
ఇలాగైతే వొడాఫోన్ ఐడియా మూతే..
సాక్షి, న్యూఢిల్లీ : స్పెక్ర్టమ్ చెల్లింపులు, లైసెన్స్ ఫీజుల బకాయిల విషయంలో ప్రభుత్వం మరింత ఉదారంగా వ్యవహరించని పక్షంలో దేశంలో మూడో అతిపెద్ద మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ వొడాఫోన్ ఇండియా మూతపడుతుందని సంస్థ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి తమకు తక్షణ సాయం లభించకుంటే వొడాఫోన్ ఐడియా కథ ముగిసినట్టేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీ చెల్లించాల్సిన రూ 53,058 కోట్ల బకాయిలపై ప్రభుత్వం తమకు భరోసా ఇవ్వకుంటే సంస్థ మనుగడ కష్టమేనని ఆయన వ్యాఖ్యానించారు. ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో కారుచౌక మొబైల్ టారిఫ్‌ను ఎదుర్కొనేందుకు గత ఏడాది ఐడియా సెల్యులార్, బ్రిటన్ టెలికాం దిగ్గజం వొడాఫోన్ ఇండియాలు ఒకే కంపెనీగా విలీనమైన సంగతి తెలిసిందే. దీంతో వొడాఫోన్ ఐడియా సంస్థ ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలతో సహా రుణభారం రూ 1.17 లక్షల కోట్లకు చేరింది. భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, ఇతర టెలికాం కంపెనీలు కలసి టెలికాం లైసెన్స్ ఫీజు, స్పెక్ర్టమ్ యూసేజ్ చార్జీలు కలుపుకుని గత 14 ఏళ్లకు గాను ప్రభుత్వానికి రూ 1.47 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలపై వడ్డీ, జరిమానాను మాఫీ చేయాలని భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కోరుతున్నాయి. ఇక ప్రభుత్వం టెలికాం రంగాన్నే కాకుండా ఆరేళ్ల కనిష్టస్ధాయిలో జీడీపీ వృద్ధి 4.5 శాతానికి దిగజారిన క్రమంలో పరిశ్రమను ఆదుకునేందుకు ప్రభుత్వం సాయం ప్రకటిస్తుందని ఐడియా వొడాఫోన్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా ఆశాభావం వ్యక్తం చేశారు. -
ప్రముఖ పారిశ్రామికవేత్త బీకే బిర్లా కన్నుమూత
ప్రముఖ పారిశ్రామికవేత్త, సెంచరీ టెక్స్టైల్స్ అండ్ ఇండస్ట్రీస్ చైర్మన్ , కుమార్ మంగళం బిర్లా తాత బసంత్ కుమార్ బిర్లా (బీకే బిర్లా 98) బుధవారం ముంబైలో కన్నుమూశారు. బి.కె.బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ అనే ఇంజనీరింగ్ కళాశాల నడుపుతున్న కృష్ణార్పణ్ ఛారిటీ ట్రస్ట్ చైర్మన్ కూడా అయిన బిర్లా ఖతార్‌లోని బిర్లా పబ్లిక్ స్కూల్, ముంబై సమీపంలోని కళ్యాణ్‌లో బిర్లా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ స్థాపించారు. బిర్లాకు ఇద్దరు కుమార్తెలు జయశ్రీ మెహతా, మంజుశ్రీ ఖైతాను ఉన్నారు. అయితే కుమారుడు ఆదిత్య విక్రం బిర్లా, (కుమార మంగళం తండ్రి)1995, అక్టోబరులో మరణించారు. ప్రముఖ దాత ఘనశ్యామ్ దాస్ చిన్న కుమారుడైన బీకేబిర్లా పత్తి, సిమెంట్, ప్లై వుడ్, పేపర్, విస్కోస్, పాలిస్టర్, నైలాన్, పేపర్ షిప్పింగ్, టైర్‌కార్డ్, టీ, కాఫీ, ఏలకులు, రసాయనాలు తదితర రంగాల్లో కీలక వ్యాపారాలను కలిగి ఉన్నారు. 15 ఏళ్ల ప్రాయం నుంచే పలు వ్యాపార కార్యక్రమాలలో కీలక పాత్ర పోషించిన బీకే బిర్లా కేశోరాం ఇండస్ట్రీస్ ఛైర్మన్‌గా తన కరియర్‌ను ప్రారంభించారు. బీకే బిర్లా మృతిపట్ల పలువురు పరిశ్రమ పెద్దలు, ఇతర పారిశ్రామిక వేత్తలు తీవ్ర దిగ్భ్రాంతిని వక్తం చేశారు. వ్యాపార రంగానికి బిర్లా ఎనలేని సేవలందించారంటూ తమ సంతాపాన్ని ప్రకటించారు. -
మెగా టెల్కో ఆవిర్భావం
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజాలు ఐడియా సెల్యులార్, వొడాఫోన్ల మెగా విలీన ప్రతిపాదనకు కేంద్రం తుది అనుమతులు మంజూరు చేసింది. దీంతో దేశీయంగా అతి పెద్ద టెలికం సంస్థ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయినట్లయింది. విలీన సంస్థకు మొత్తం 43 కోట్ల మంది యూజర్లతో 35 శాతం మార్కెట్ వాటా ఉంటుంది. ఇప్పటిదాకా 34.4 కోట్ల యూజర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్న భారతీ ఎయిర్టెల్... ఇకపై రెండో స్థానానికి పరిమితం కానుంది. వొడాఫోన్, ఐడియాల విలీన ప్రతిపాదనకు గురువారం తుది అనుమతులిచ్చినట్లు టెలికం శాఖ (డాట్) సీనియర్ అధికారి ఒకరు తెలియజేశారు. ఇక సంబంధిత శాఖల నుంచి పొందిన అనుమతులను ఇరు సంస్థలు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ)కి సమర్పించి, విలీన ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. టెలికం ట్రిబ్యునల్, ఇతర కోర్టుల ఆదేశాలకు విలీన సంస్థ కట్టుబడి ఉండాలనే షరతులతోనే తుది అనుమతులిచ్చినట్లు స్పష్టం చేశారు. విలీనం ప్రక్రియ ఆగస్టు ఆఖరికల్లా పూర్తి కాగలదని వొడాఫోన్ గ్రూప్ సీఈవో విటోరియో కొలావో ఇటీవలే పేర్కొన్నారు. ఈ డీల్‌కు సంబంధించి జూలై 9న డాట్ కొన్ని షరతులతో కూడిన అనుమతులిచ్చింది. దీని ప్రకారం ఇరు సంస్థలు రూ. 7,269 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాయి. ఇందులో రూ. 3,926 కోట్లు నగదు రూపంలో, మిగతాది బ్యాంక్ గ్యారంటీల రూపంలో సమర్పించాయి. తమపై విధించిన షరతులను వ్యతిరేకిస్తూనే.. ఈ మొత్తాన్ని చెల్లించినట్లు రెండు సంస్థలు తెలిపాయి. విలీన సంస్థ స్వరూపం ఇలా.. బ్రిటన్ సంస్థ వొడాఫోన్‌కి భారత్‌లో ఉన్న టెలికం కార్యకలాపాలతో ఆదిత్య బిర్లా గ్రూప్‌లో భాగమైన ఐడియా సెల్యులార్ సంస్థను విలీనం చేయాలన్న ఆలోచన 2017 మార్చిలోనే ఇరు సంస్థలూ ప్రకటించాయి. అనేక ప్రతిబంధకాలన్నీ అధిగమించిన తర్వాత ఈ ఏడాది జూన్ కల్లా డీల్ ముగియొచ్చని ముందుగా భావించారు. అయితే, జూలై 9కి గానీ డాట్ నుంచి అనుమతులు రాలేదు. మొత్తం మీద.. కొత్తగా ఏర్పడే విలీన సంస్థ విలువ సుమారు 23 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 1.5 లక్షల కోట్లు) స్థాయిలో ఉండనుంది. దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో 4జీ స్పీడ్‌తో మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులు అందించడానికి వీలవుతుంది. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా దీనికి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గాను, బాలేశ్ శర్మ కొత్త సీఈవోగాను ఉంటారు. ఇది లిస్టెడ్ కంపెనీగా కొనసాగుతుంది. ఇందులో వొడాఫోన్‌కి 45.1 శాతం, ఆదిత్య బిర్లాకు 26 శాతం, ఐడియా షేర్హోల్డర్లకు 28.9 శాతం వాటాలు ఉంటాయి. నాలుగేళ్ల వ్యవధిలో సమాన వాటాల స్థాయిని సాధించేందుకు వొడాఫోన్ నుంచి ఆదిత్య బిర్లా గ్రూప్ మరో 9.5 శాతం వాటాలు కొనుగోలు చేయొచ్చు. ఒకవేళ అప్పటికీ రెండు సంస్థల వాటాలు సమాన స్థాయిలో లేని పక్షంలో వొడాఫోన్ కొంత వాటాలు విక్రయిస్తుంది. భారీ రుణభారం ఉన్న ఐడియా, వొడాఫోన్లు.. టెలికం మార్కెట్లో రిలయన్స్ జియో రాకతో పెరిగిన తీవ్ర పోటీని గట్టిగా ఎదుర్కొనేందుకు ఈ డీల్ తోడ్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. షేరు 4% అప్.. విలీన ప్రతిపాదనకు డాట్ అనుమతుల నేపథ్యంలో.. గురువారం బీఎస్ఈలో ఐడియా సెల్యులార్ షేరు సుమారు 4 శాతం పెరిగి రూ. 56.95 వద్ద క్లోజయ్యింది. ఒక దశలో 4.64 శాతం ఎగిసి రూ.57.50 స్థాయిని కూడా తాకింది. ఎన్ఎస్ఈలో 4.18 శాతం పెరిగి రూ. 57.20 వద్ద క్లోజయ్యింది. మొత్తం మీద కంపెనీ మార్కెట్ విలువ రూ. 873 కోట్లు పెరిగి రూ. 24,830 కోట్లకు చేరింది. బీఎస్ఈలో 1.77 లక్షలు, ఎన్ఎస్ఈలో 2 కోట్ల షేర్లు చేతులు మారాయి. కొత్త ప్రయాణానికి శ్రీకారం: కుమార మంగళం బిర్లా వొడాఫోన్, ఐడియాల విలీన ప్రతిపాదనకు డాట్ నుంచి తుది అనుమతులు వచ్చినట్లు అటు ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా వెల్లడించారు. గ్రూప్ సంస్థ హిందాల్కో కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని ధృవీకరించారు. ‘ఐడియా, వొడాఫోన్ విలీనంతో.. ఉత్తేజకరమైన కొత్త ప్రయాణం ప్రారంభం కానుంది. దీనిపై ఎంతో ఆశావహంగా ఉన్నాం‘ అని ఆయన చెప్పారు. మరికొద్ది వారాల్లో విలీన ప్రక్రియ పూర్తి కాగలదన్నారు. కొత్త సంస్థకు ఇంకా బ్రాండింగ్‌పై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కుమార మంగళం బిర్లా వివరించారు. -
వొడాఫోన్–ఐడియా విలీన సంస్థకు చైర్మన్‌గా కేఎం బిర్లా
న్యూఢిల్లీ: త్వరలో విలీనం కాబోయే వొడాఫోన్–ఐడియా సంస్థకు నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కుమార్ మంగళం బిర్లా బాధ్యతలు చేపడతారు. ఈ మేరకు ఐడియా ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌ను దాఖలు చేసింది. దీనిప్రకారం, బైలేశ్ శర్మ కొత్త సంస్థ సీఈఓగా ఉంటారు. శర్మ ప్రస్తుతం వొడాఫోన్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ రెండు సంస్థల విలీనంతో దేశంలో దాదాపు 23 బిలియన్ డాలర్ల విలువైన అతిపెద్ద టెలికం సంస్థ ఆవిర్భావం జరగనుంది. దీని మార్కెట్ వాటా దాదాపు 35 శాతం ఉంటుంది. -
మూడేళ్లలో రూ.50 లక్షల కోట్లు
ముంబై: ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల పాలనలో దేశీయ స్టాక్ మార్కెట్ల సంపద రూ.50 లక్షల కోట్ల మేర పెరుగుదల నమోదు చేసింది. వీటిలో కార్పొరేట్ దిగ్గజాలైన టాటా, బిర్లా, అంబానీ, బజాజ్ గ్రూపు కంపెనీల మార్కెట్ విలువే రూ.లక్ష కోట్ల చొప్పున పెరగడం విశేషం. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఎల్అండ్టీ, వేదాంత, గోద్రేజ్, మహింద్రా, హిందుజా, ఐటీసీలు కూడా ఈ కాలంలో మార్కెట్ విలువ పరంగా చెపపుకోతగ్గ వృద్ధినే సాధించాయి. కానీ, ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)ల మార్కెట్ విలువ పెరుగుదల ఈ స్థాయిలో లేదు. కొన్ని పీఎస్‌యూలు ఇన్వెస్టర్ల సంపదను కరిగించేస్తే, కొన్ని మాత్రం గణనీయమైన లాభాల్నే పంచి పెట్టాయి. ఈ మూడేళ్ల కాలంలో మొత్తం రూ.50 లక్షల కోట్ల మేర జరిగిన సంపద వృద్ధిలో బీఎస్ఈ పీఎస్‌యూ సూచీలోని కంపెనీల వాటా 8 శాతమే. అంటే ఇవి వాటి మార్కెట్ విలువను కేవలం 22 శాతం వృద్ధితో రూ.3.65 లక్షల కోట్ల మేరే పెంచుకోగలిగాయి. మోదీ సర్కారు మూడేళ్ల పాలనలో సెన్సెక్స్ పెరుగుదల 26 శాతంగా (6,000 పాయింట్లు) ఉంది. మొత్తం మీద దేశీయ స్టాక్‌మార్కెట్ల విలువ రూ.75 లక్షల కోట్ల స్థాయి నుంచి రూ.125 లక్షల కోట్ల స్థాయికి వృద్ధి చెందింది. ఈ మొత్తం విలువలో పీఎస్‌యూ కంపెనీల వాటా 16 శాతం. ఈ సంపద వృద్ధిలో అధిక భాగం ప్రమోటర్లకే చెందగా, ఆ తర్వాత ఎక్కువగా లాభపడిన వారిలో విదేశీ ఇన్వెస్టర్లు ఉన్నారు. రిటైల్ ఇన్వెస్టర్ల వాటా కంపెనీల్లో సగటున 10 శాతంలోపే ఉండడంతో వారికి దక్కింది కూడా తక్కువగానే ఉంది. -
‘మోదీ ముడుపుల’ పిటిషన్ కొట్టివేత
-
‘మోదీ ముడుపుల’ పిటిషన్ కొట్టివేత
బిర్లా, సహారా గ్రూపుల నుంచి మోదీ ముడుపులు స్వీకరించారనడానికి సరైన సాక్ష్యాధారాలు లేవంటూ కొట్టేసిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: బిర్లా, సహారా గ్రూపుల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ముడుపులు స్వీకరించారంటూ వచ్చిన ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ద్వారా విచారణ జరిపించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆయా సంస్థల కార్యాలయాలపై ఐటీ శాఖ జరిపిన దాడుల సందర్భంగా లభించాయంటూ.. పిటిషన్‌దారు సమర్పించిన సాక్ష్యాధారాలకు విచారణార్హత లేదంటూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ‘కామన్ కాజ్ ’ సంస్థ తరఫున వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ‘మామూలు కాగితాలు, డైరీల్లోని పేజీలు, ఈ మెయిల్ ప్రింటవుట్లు, సాధారణ డాక్యుమెంట్లు సాక్ష్యాలుగా చూపించారు. వాటిని పరిగణనలోకి తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదుకు, విచారణకు ఆదేశించలేం. అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి వ్యతిరేకంగా ఉన్న పత్రాల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది’ అని బుధవారం జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ అమితవ్ రాయ్‌ల ధర్మాసనం తేల్చిచెప్పింది. సహారా గ్రూప్‌నకు సంబంధించి పిటిషన్ దారు కోర్టుకు అందించిన పత్రాలు నిజమైనవి కావనడానికి సాక్ష్యాలున్నాయని ఐటీ శాఖ సెటిల్మెంట్ కమిషన్ ఇప్పటికే స్పష్టం చేసిందన్న విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి వ్యతిరేకంగా దాఖలవుతున్న పిటిషన్ల విషయంలో సరైన సాక్ష్యాధారాలు లేని పక్షంలో న్యాయప్రక్రియ దుర్వినియోగమయ్యే వీలుందని వ్యాఖ్యానించింది. -
కార్పొరేట్ బ్యాంకులు కష్టమే!
♦ టాటా, బిర్లా, రిలయన్స్‌లకు నిబంధనల అడ్డంకి ♦ 60 శాతం ఆదాయం ఆర్థిక సేవల నుంచే రావాలి.. ♦ ఈ నిబంధనే బడా కార్పొరేట్లకు ప్రధాన అవరోధం ♦ యూనివర్సల్ బ్యాంకులకు మార్గదర్శకాలు విడుదల ముంబై: యూనివర్సల్ బ్యాంకు లెసైన్సు పొంది పూర్తిస్థాయి బ్యాంకింగ్‌లోకి దిగుదామని ఆశించిన టాటా, బిర్లా, రిలయన్స్ వంటి దిగ్గజాలకు నిరాశే ఎదురైంది. వీటికి సంబంధించి తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేసిన మార్గదర్శకాలు వీటికి వ్యతిరేకంగా ఉండటమే ఇందుకు కారణం. కంపెనీలు, సంస్థలు, గ్రూప్‌లు, వ్యక్తులకు యూనివర్సల్ బ్యాంక్ లెసైన్స్ ఇస్తామని ఆర్బీఐ గురువారం ప్రతిపాదించింది. ఈ మేరకు ముసాయిదా మార్గదర్శకాలు కూడా విడుదల చేసి... జూన్ 30లోపు వీటిపై సంబంధిత వర్గాలుస్పందించాలని ఆర్బీఐ కోరింది. ఈ నిబంధనల్ని ఒక్కసారి చూస్తే... ♦ యూనివర్సల్ బ్యాంకు లెసైన్సు కోసం దరఖాస్తు చేసే కంపెనీ, వ్యక్తి లేదా గ్రూప్ ఆదాయంలో కనీసం 60 శాతం ‘ఫైనాన్షియల్ సేవల’ నుంచి వస్తుండాలి. ఈ నిబంధనే ఇపుడు రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా, బిర్లా గ్రూపులను అడ్డుకుంటోంది. ♦ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీలు) వీటికోసం దరఖాస్తు చేయొచ్చు. కానీ వీటిని కార్పొరేట్లు ప్రమోట్ చేసి ఉండకూడదు. ♦ కార్పొరేట్ గ్రూప్‌లైతే నాన్ ఆపరేటివ్ ఫైనాన్షియల్ హోల్డింగ్ (ఎన్‌ఓఎఫ్‌హెచ్‌సీ) కంపెనీ ద్వారానే బ్యాంకును ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పై నిబంధనలు పెద్ద కార్పొరేట్ల బ్యాంకింగ్ లెసైన్సులకు ఇబ్బంది కల్గిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. అలాగే సాంకేతికంగా ఇబ్బందులు సృష్టిస్తున్న మరికొన్ని కారణాలను సైతం నిపుణులు ప్రస్తావిస్తున్నారు. ఈ విషయాలను పరిశీలిస్తే... కార్పొరేట్ హౌస్‌లు లేదా వారి ప్రమోటర్లు కొత్త బ్యాంకులో కేవలం 10 శాతం వరకూ మాత్రమే వాటాను కలిగి వుండాలి. బ్యాంకు పూర్తి నియంత్రణ సాధ్యపడదు. అదే సమయంలో ఐదేళ్ల లాకిన్ పిరియడ్‌తో బ్యాంక్‌లో 40 శాతం ప్రమోటర్ పెయిడప్ కాపిటల్ ఉండాలి. ఒకవేళ 40 శాతం దాటి పెయిడప్ వోటింగ్ ఈక్విటీ క్యాపిటల్ ఉంటే... ఐదేళ్లలో దీనిని 40 శాతానికి తగ్గించుకోవాలి. అటు తర్వాత పదేళ్లలో 30 శాతానికి, 12యేళ్లలో 15 శాతానికి తగ్గించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన అంశాలు... సాంకేతికంగా సాధ్యపడవు కనుక... బ్యాంకింగ్ లెసైన్సుల రేసు నుంచి బడా సంస్థలు పక్కకు తప్పుకోక తప్పదని అడ్వైజరీ సర్వీసెస్ ఎల్ఎల్పీ ప్రతినిధి అశ్విన్ పరేశ్ పేర్కొన్నారు. పలు పరిశ్రమలను నిర్వహించే గ్రూప్‌లకు ప్రజల ధనం నిర్వహించే బ్యాంకులో అధిక వాటా ఉండకూడదని ఆర్బీఐ నిబంధనలు కోరుకుంటున్నట్లు ముంబైకి చెందిన ఆర్థిక నిపుణుడు నితిన్ కుమార్ పేర్కొన్నారు. అయితే ఇది బ్యాంకింగ్ పారదర్శకతను పెంపొందించడానికి ఇది దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ గ్రూప్- నాన్ ఆపరేటివ్ ఫైనాన్షియల్ హోల్డింగ్ (ఎన్‌ఓఎఫ్‌హెచ్‌సీ) కంపెనీ ద్వారానే బ్యాంకింగ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉండడం, బ్యాంకింగ్ లెసైన్సుల బరిలో నిలిచే నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు కనీసం 10 ఏళ్ల ట్రాక్ రికార్డ్ ఉండాలన్న నిబంధనలు బ్యాంకింగ్ లెసైన్సులు పొందాలనుకుంటున్న సంస్థలకు కఠినమైనవేనని వారి వాదన. రేసులో యుఏఈ ఎక్సే ్ఛంజ్, ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్... ఎన్‌బీఎఫ్‌సీలైన యూఏఈ ఎక్స్ఛేంజ్, ఐఐఎఫ్ఎల్ హోల్డిం గ్స్‌లు బరిలో నిలిచే అవకాశం ఉందని వినవస్తోంది. రెండు సంస్థల సీనియర్ అధికారులూ లెసైన్స్‌కు దరఖాస్తు చేసే విషయాన్ని ఆలోచిస్తున్నట్లు సమాచారం. -
రూ. 425 కోట్లతో ఇల్లు కొన్న బిర్లా
- ప్రసిద్ధ జతియా హౌస్ కోసం కుమార మంగళం బిర్లా డీల్ ముంబై: పారిశ్రామిక దిగ్గజం కుమార మంగళం బిర్లా భారీ రియల్టీ డీల్‌కు తెరతీశారు. ముంబైలోని మలబార్ హిల్ ప్రాంతంలో జతియా హౌస్‌ను రూ. 425 కోట్లకు వేలంలో కొనుగోలు చేశారు. వాణిజ్య అవసరాలకు కాకుండా, వ్యక్తిగత వినియోగం కోసం ప్రాపర్టీ కొనుగోలుకు ఇది చాలా భారీ మొత్తం అని పరిశ్రమవర్గాలు తెలిపాయి. వేలంలో మొత్తం అయిదుగురు బిడ్డర్లు పాల్గొన్నారు. మరో పారిశ్రామిక దిగ్గజం అజయ్ పిరమాల్ కూడా పోటీపడినట్లు సమాచారం. ముంబైలో ప్రసిద్ధిపొందిన హౌస్‌ల్లో జతియా హౌస్ ఒకటి. ఆదిత్య బిర్లా గ్రూప్ వర్గాలు దీనిపై స్పందించేందుకు నిరాకరించగా.. ఒప్పందం కుదిరినట్లు డీల్ అడ్వైజర్ అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ జోన్స్ లాంగ్ లాసలె (జేఎల్ఎల్) తెలిపింది. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ అధినేత సజ్జన్ జిందాల్.. 2011లో మహేశ్వరి హౌస్‌ను కొనుగోలు చేసేందుకు వెచ్చించిన రూ. 400 కోట్ల కన్నా ఈ డీల్ విలువ అధికం కావడం గమనార్హం. సముద్రానికి అభిముఖంగా ఉండే రెండంతస్తుల జతియా హౌస్ బంగళా.. బిల్టప్ ఏరియా సుమారు 25,000 చ.అ. ఉంటుంది. 1970లలో వై జతియా దీన్ని ఎంసీ వకీల్ నుంచి కొనుగోలు చేశారు. ప్రస్తుతం పదమ్జీ ఇండస్ట్రీస్ నిర్వహించే జతియా సోదరులు అరుణ్, శ్యామ్ ప్రస్తుతం ఇందులో నివాసముంటున్నారు. వ్యక్తిగత అవసరాల కోసం స్థిరాస్తిని కొనేటప్పుడు వాటి వ్యాపారపరమైన విలువ గురించి కొనుగోలుదారులు పెద్దగా పట్టించుకోరని, ఇలాంటి వాటిపై నిర్ణయాలు తీసుకునేందుకు సరైన మార్కెట్ పరిస్థితులు వచ్చే దాకా వేచి చూడరని కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఈడీ శశాంక్ జైన్ పేర్కొన్నారు. -
ఓటేస్తే బహుమతి
న్యూఢిల్లీ: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ దేశంలో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంటోంది. టాటా, బిర్లా, హీరో, ఇన్ఫోసిస్ వంటి బడా కార్పొరేట్ దిగ్గజాలు తమ సిబ్బందితో పాటు సాధారణ పౌరులు కూడా ఓటు వేసేలా చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. ఓటు హక్కును వినియోగించుకున్న ఉద్యోగులకు బహుమతులను, ప్రోత్సాహకాలను కొన్ని సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. పోలింగ్ రోజు కావాలంటే సెలవు తీసుకోండి... కనీసం ఒక పూటైనా లీవు తీసుకుని ఓటు వేసి రండని చెబుతున్నాయి. అంతేనా, అనేక కంపెనీలు ఓటరు నమోదు ప్రక్రియకు ఇతోధికంగా దోహదపడుతున్నాయి. ఓటు వేసేలా ఉద్యోగులను ప్రేరేపించేందుకు దృశ్య, శ్రవణ కార్యక్రమాలు, పోస్టర్లతో పాటు ఓటు హక్కు వినియోగించుకున్న వారి అనుభవాలను కూడా కంపెనీలు వివరిస్తున్నాయి. ఓటు హక్కు వినియోగంలో ప్రజల్లోని ఉదాశీనతను పోగొట్టడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు సాగుతున్నాయి. టాటా భారీ ప్రచారం... భారతీయ మహిళా ఓటర్లలో చైతన్యం నింపేందుకు ‘పవర్ ఆఫ్ 49’ పేరుతో సృజనాత్మక ప్రచార కార్యక్రమాన్ని టాటా గ్రూప్ చేపట్టింది. దేశంలో మహిళా ఓటర్ల సంఖ్య 49% కావడంతో ప్రచారానికి ఆ పేరు పెట్టింది. ఓటర్ల నమోదులో ఇన్ఫోసిస్ ... బెంగళూరులో ఓటు హక్కుపై చైతన్యాన్ని పెంచేందుకు ఇన్ఫోసిస్ నడుం బిగించింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల కోసం ఓ రిసోర్స్ హబ్‌నూ ఏర్పాటు చేసింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కార్యాలయంతో కలసి ఇన్ఫోసిస్ ఈ కార్యక్రమాలను అమలు చేస్తోంది. వీధి నాటకాలు, తోలుబొమ్మలాటలు, క్విజ్లు, ఎస్ఎంఎస్ ప్రచారం వంటి పలు కార్యక్రమాలను నిర్వహించింది. కాగా ఎఫ్ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్ కూడా ఓటు హక్కుపై భారీ ప్రకటనలతో ప్రచారాన్ని చేపట్టింది. ఐడియా సెల్యులార్, హీరో మోటోకార్స్, ఐటీసీ, టాటా టీ, గూగుల్ ఇండియా, ఎంటీవీ ఇండియా వంటి కంపెనీలు కూడా ఇలాంటి పలు కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాయి. -
ఆన్లైన్ సూపర్బజార్లు!
నిత్యావసర సరుకుల మార్కెట్ లక్షల కోట్ల రూపాయల పరిమాణంలో ఉన్న నేపథ్యంలో రిలయన్స్, బిర్లా వంటి అనేక పెద్ద సంస్థలు సైతం ఈ వ్యాపారంలోకి దిగుతున్నాయి. కొన్ని సంస్థలు టెక్నాలజీని ఉపయోగించుకుని, ఆన్లైన్లోనే సూపర్మార్కెట్లను తెరిచేస్తున్నాయి. వెబ్సైట్లో ఆర్డరిస్తే చాలు శిశు సంరక్షణ ఉత్పత్తులు మొదలు కూరగాయల దాకా ఇంటి ముంగిట్లోనే అందిస్తున్నాయి. కోట్ల కొద్దీ రిటైల్ వ్యాపారంలో కనీసం అరశాతం వాటానైనా దక్కించుకునేందుకు కసరత్తు చేస్తున్నాయి. ముంబైకి చెందిన లోకల్‌బన్యా, బెంగళూరుకి చెందిన బిగ్‌బాస్కెట్‌డాట్‌కామ్ వంటి సంస్థలు ఈ సర్వీసులు అందిస్తున్నాయి. ఇంటి నుంచే కొనుగోళ్లు జరిపే సౌలభ్యం కోరుకునే కస్టమర్లను టార్గెట్‌గా ఎంచుకున్న ఆన్లైన్ సూపర్‌మార్కెట్ సంస్థలు.. లావాదేవీల నిర్వహణలో ఒక్కోటీ ఒక్కో విధానం పాటిస్తున్నాయి. ఉదాహరణకు లోకల్‌బన్యా.. తమ సైట్‌కి వచ్చిన ఆర్డర్లన్నీ పోగేసి..అదే రోజు సాయంత్రం కొనుగోళ్లు జరుపుతుంది. మర్నాటికల్లా డెలివరీ చేస్తుంది. మెట్రో క్యాష్ అండ్ క్యారీ వంటి సంస్థల నుంచి లోకల్‌బన్యా కొనుగోళ్లు జరుపుతోంది. ప్రస్తుతం సంస్థకి ప్రతి రోజూ 200 ఆర్డర్ల పైచిలుకు వస్తున్నాయి. వీటి విలువ రూ.1,300 నుంచి రూ. 1,500 దాకా ఉంటోంది. ఫ్రెంచ్ పర్పుల్ క్యాబేజ్ వంటి విభిన్న కూరగాయలు, ఫలాలను కూడా సమకూర్చడం ఈ సంస్థ ప్రత్యేకత. ఈ ఏడాది సుమారు రూ. 23 కోట్ల వ్యాపారం చేయొచ్చని అంచనా వేస్తోంది. బిగ్‌బాస్కెట్‌డాట్‌కామ్ పోర్టల్ ప్రస్తుతం బెంగళూరులో సుమారు 1,500-2,000 ఆర్డర్లు దక్కించుకుంటోంది. ఈ విలువ రోజుకి రూ. 25 లక్షల మేర, నెలకైతే రూ. 7-8 కోట్ల మేర ఉంటోంది. బెంగళూరులో కంపెనీ 20-30 శాతం వృద్ధి సాధిస్తోంది. త్వరలో బ్రేక్ ఈవెన్ సాధించడంతో పాటు హైదరాబాద్, ముంబై తదితర నగరాల్లో లాభాలు సాధించవచ్చని అంచనా వేస్తోంది. సాధారణంగా ప్రతి వెబ్సైట్లోను కనీస మొత్తం ఆర్డరు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు లోకల్బన్యాలో కనీస ఆర్డరు మొత్తం విలువ రూ. 500గా ఉంటోంది. వెబ్సైట్లో కావాల్సిన సరుకులను ఎంపిక చేసుకుని, ఏ సమయంలో డెలివరీ కావాలన్నది సూచిస్తే చాలు.. ఇంటి వద్దకే చేరతాయి. మౌలిక సదుపాయాలు.. ఆర్డర్లకు తగ్గ వస్తువులను నిల్వ చేసుకోవడం తదితర అంశాలపై కూడా ఆన్లైన్ సంస్థలు దృష్టి పెట్టాయి. ఆర్డరు ఇచ్చిన రోజే డెలివరీ కాన్సెప్టుతో పనిచేసే బిగ్‌బాస్కెట్‌డాట్‌కామ్.. సొంతంగా కోల్డ్ స్టోరేజీలు, వేర్‌హౌస్‌లు ఏర్పాటు చేసుకుంది. ఆరామ్షాప్డాట్కామ్ సంస్థ కిరాణా షాపుల్లాంటివి తమ వెబ్సైట్లో పేర్లు, చిరునామాలు నమోదు చేసుకునే సౌలభ్యం కల్పిస్తున్నాయి. కస్టమర్లు సైట్లో ఉన్న రిటైలర్లను సంప్రదించేందుకు దీనితో వీలుపడుతుంది. కస్టమర్లు కావాలంటే సైట్లోనే తమ షాపింగ్ లిస్టును పొందుపర్చుకోవచ్చు. ఆ జాబితాను రిటైలర్లకు ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా పంపిస్తారు. రిటైలర్లకు బేసిక్ సర్వీసులు ఉచితంగానే అందిస్తున్నా.. ప్రత్యేక ఆఫర్లు లాంటి ప్రకటనలు ఇవ్వదల్చుకుంటే మాత్రం కొంత మొత్తాన్ని ఆరామ్‌షాప్ వసూలు చేస్తోంది. అంతేగాకుండా అసలు కొనుగోలుదారులు ఎలాంటి వస్తువులు కొంటున్నారు వంటి విశ్లేషణాత్మక వివరాలను కూడా సంస్థ అందిస్తుంది. త్వరలోనే ఔషధాలను కూడా అందించాలని భావిస్తోంది. కస్టమర్ ప్రిస్క్రిప్షన్ని స్కాన్ చేసి పంపితే.. దాన్ని రిటైలర్‌కి పంపి.. సదరు ఔషధాలను అందుకునే వెసులుబాటు కల్పించనుంది. విస్తరణ ప్రణాళికలు.. లోకల్‌బనియా ..పుణే, ఢిల్లీ వంటి నగరాల్లోకి విస్తరించే దిశ గా కసరత్తు చేస్తోంది. వెంచర్ క్యాపిటల్ సంస్థల నుంచి నిధులు సమీకరించే ప్రయత్నాల్లో ఉంది. మరోవైపు, బిగ్‌బాస్కెట్‌డాట్‌కామ్ కూడా ఈ ఏడాది మరో నగరాల్లో ప్రవేశించాలని.. 2014 ఆఖరు నాటికి 10 మొత్తం పది సిటీల్లోకి విస్తరించాలని నిర్దేశించుకుంది. అటు ఆరామ్‌షాప్ పొరుగుదేశం పాకిస్తాన్‌లోని కరాచీలోనూ కార్యకలాపాలపై దృష్టి పెట్టింది. 2014 నాటికల్లా 30,000 రిటైలర్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సరైన విధంగా నిల్వలను, సరఫరాను పాటించగలిగితే ఆన్లైన్ రిటైలింగ్ సంస్థలకు మంచి వ్యాపారావకాశాలే ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.