సహారా గ్రూపుల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ముడుపులు స్వీకరించారంటూ వచ్చిన ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ద్వారా విచారణ జరిపించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆయా సంస్థల కార్యాలయాలపై ఐటీ శాఖ జరిపిన దాడుల సందర్భంగా లభించాయంటూ.. పిటిషన్‌దారు సమర్పించిన సాక్ష్యాధారాలకు విచారణార్హత లేదంటూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ‘కామన్ కాజ్ ’ సంస్థ తరఫున వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ‘మామూలు కాగితాలు, డైరీల్లోని పేజీలు, ఈ మెయిల్ ప్రింటవుట్లు, సాధారణ డాక్యుమెంట్లు సాక్ష్యాలుగా చూపించారు.