
ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా పుట్టినరోజు (జూన్ 14) పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమార్తె అనన్య బిర్లా రేర్ ఫొటోతో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్ననాటి ఒక త్రోబ్యాక్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. పాపాయిగా ఉన్న అనన్యను బిర్లా ఆప్యాయంగా ఎత్తుకున్న ఫొటోను ఆమె షేర్ చేశారు.
“పుట్టినరోజు శుభాకాంక్షలు పా! నిన్ను చాలా ప్రేమిస్తున్నాను" అంటూ అనన్య బిర్లా తన ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫొటోను పోస్ట్ చేశారు. వీటికి వేలాదిగా లైక్‌లు, కామెంట్లు వచ్చాయి. అలాగే అనేక మంది ప్రముఖులు కూడా బిర్లాకు పుట్టినరోరజు శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో నటుడు బాబీ డియోల్, పుల్కిత్ సామ్రాట్, విజె అనూషా దండేకర్ తదితరులు ఉన్నారు.
ఇదీ చదవండి: బిర్లా వారసురాలు.. తండ్రి పేరు చెప్పుకునే టైపు కాదు! విభిన్న ప్రతిభతో సొంత గుర్తింపు..
వాణిజ్యం, పరిశ్రమల రంగానికి చేసిన కృషికి గాను కుమార మంగళం బిర్లాకు ఈ సంవత్సరం పద్మభూషణ్ అవార్డు లభించింది. హిందాల్కో ఇండస్ట్రీస్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్, ఆదిత్య బిర్లా క్యాపిటల్‌తో సహా అన్ని ప్రధాన గ్రూప్ కంపెనీల బోర్డులకు ఆయన అధ్యక్షత వహిస్తున్నారు. కుమార మంగళం బిర్లా ముగ్గురు సంతానంలో అనన్య బిర్లా పెద్దది. ఆమెతోపాటు బిర్లాకు కుమారుడు ఆర్యమాన్ మరో కుమార్తె అద్వైతేషా కూడా ఉన్నారు.
Happy Birthday Pa! Love you so much ❤️ pic.twitter.com/cbjB0USncM
— Ananya Birla (@ananya_birla) June 14, 2023
Comments
Please login to add a commentAdd a comment