
న్యూఢిల్లీ : ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లాకు సీక్రెట్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉందంట. ఈ అకౌంట్‌ను కేవలం తన కూతురుతో మాత్రమే మాట్లాడానికి వాడతారంట. ఈ విషయాన్ని స్వయంగా ఆయన కూతురే తెలిపారు. పాటల రచయిత, సింగర్ అయిన అనన్య బిర్లా.. తండ్రి కుమార్ మంగళం బిర్లాతో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
దాంతో పాటు ‘నాన్న నన్ను ఇంత బాగా ఎలా అర్థం చేసుకుంటారో నిజంగా నాకు తెలీదు. నా గురించి ఎంత ఆలోచిస్తారంటే.. తన టై రంగు, నా డ్రెస్ కలర్‌కు మ్యాచ్ అయ్యేలా చూసుకున్నారు. నాన్న ఈ ఫోటోను మీరు మీ సీక్రెట్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి చూస్తారని నాకు తెలుసు. లవ్ యు పప్పా’ అంటూ తండ్రితో దిగిన ఫోటోని షేర్ చేశారు అనన్య. ఈ ఫోటోను ఇప్పటికే దాదాపు 24 వేల మంది లైక్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment