
సాక్షి, బెంగళూరు/హైదరాబాద్: సరదాగా విహారయాత్రకు వెళ్లిన వైద్యుల బృందంలో విషాదం చోటుచేసుకుంది. తుంగభద్రలో దూకి ఈత కొట్టే క్రమంలో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అనన్యరావు (27) మృతిచెందారు. నదిలో నుంచి రెస్క్యూ టీమ్ తాజాగా ఆమె మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో, కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
వివరాల ప్రకారం.. డాక్టర్ అనన్యరావు, మరో ఇద్దరు స్నేహితులు సాత్విన్, హషితలతో కలిసి హంపీ టూర్‌కి వచ్చారు. స్మారకాలను వీక్షించి మంగళవారం రాత్రి సణాపుర గ్రామంలోని ఓ అతిథి గృహంలో బస చేశారు. బుధవారం మధ్యాహ్నం ఈత కొట్టడానికి తుంగభద్ర నది వద్దకు వెళ్లారు. అనంతరం, సుమారు 25 అడుగుల ఎత్తు గల బండరాయి నుంచి అనన్యరావు నీటిలో దూకి ఈత కొట్టాలనుకుంది.
దీంతో, రాళ్ల పైనుంచి నీటిలో దూకెసింది. నీటిలో కాసేపు ఈత కొట్టిన అనన్య.. కాసేపటికే నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయింది. ఈ క్రమంలో అనన్య కాపాడేందుకు స్నేహితులు ప్రయత్నించారు. కానీ, వారి ప్రయత్నం ఫలించలేదు. ఇక, ఈ ప్రదేశంలో తుంగభద్ర రాతి గుహల్లో ప్రవహిస్తూ ఉంటుంది. యువతి ఈ గుహల్లో చిక్కుకు పోయింటారని పోలీసులు అనుమానించారు. దీంతో గంగావతి గ్రామీణ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక గజ ఈతగాళ్లు, అగ్నిమాపకదళం సాయంత్రం వరకు ప్రయత్నించినా ఆమె జాడ కనిపించలేదు.

తాజాగా గురువారం ఉదయం అనన్యరావు మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో, అనన్య కుటుంబ సభ్యులు, స్నేహితులు బోరున విలపిస్తున్నారు. ఇక, అనన్య నదిలో దూకిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు.. అనన్యరావు తండ్రి డా.మెహన్‌రావు అని, ఆమె వీకేసీ ఆస్పత్రిలో వైద్యురాలని తెలిసింది.
#KoppalMishap #Sanapur
Video showing #AnanyaRao a doctor from #Hyderabad who jumped into the #Tungabhadra river on Tuesday went missing . Rescue operation has not yielded any results so far @NewIndianXpress @XpressBengaluru @Dir_Lokesh pic.twitter.com/Bsd0H9VnzA— Amit Upadhye (@AmitSUpadhye) February 19, 2025
Comments
Please login to add a commentAdd a comment