20 ఏళ్ల చిన్నవాడితో డేటింగ్‌ చేస్తున్న టాప్‌ హీరోయిన్‌ | Ameesha Patel Again In Love With Nirav Birla | Sakshi
Sakshi News home page

20 ఏళ్ల చిన్నవాడితో డేటింగ్‌ చేస్తున్న టాప్‌ హీరోయిన్‌

Nov 16 2024 3:25 PM | Updated on Nov 16 2024 4:13 PM

Ameesha Patel Again In Love With Nirav Birla

బాలీవుడ్‌లో ఒకప్పుడు సెన్సేషనల్‌‌ హీరోయిన్‌గా అమీషా పటేల్‌ క్రేజ్‌ తెచ్చుకుంది. తెలుగులో కూడా బద్రి,  నరసింహుడు, నాని సినిమాలతో మెప్పించిన ఈ బ్యూటీకి ఇక్కడ కూడా ఫ్యాన్స్‌ ఉన్నారు. అయితే, లేటు వయసులో ఈ బ్యూటీ మరోసారి ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా కొన్ని నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ఒకప్పుడు గ్లామర్‌ క్వీన్‌గా అమీషా పటేల్‌ గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు ఆమెకు భారీగా పాపులారిటీ ఉంది. అలా స్టార్ డ‌మ్‌ ఉన్నప్పుడే బాలీవుడ్ ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ భ‌ట్‌తో అమీషా ప్రేమలో పడింది. సుమారు కొన్నేళ్లపాటు వారిద్దరూ డేటింగ్‌ కూడా చేశారు. అయితే, ఇద్దరి మధ్య పలు విభేదాలు రావడంతో బ్రేకప్‌ చెప్పుకున్నారు. అయితే, మళ్లీ వారిద్దరూ కలిసింది లేదు. కొద్దిరోజుల్లో అమీషా పటేల్‌ వయసు  50 ఏళ్లకు చేరుకుంటుంది. అయినా, ఆమె పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఇప్పుడు ఆ టైమ్‌ వచ్చిందని ఆమె అభిమానులు కూడా చెబుతున్నారు.

విక్ర‌మ్ భ‌ట్‌తో ‍బ్రేకప్‌ చెప్పిన తర్వాత  అమీషా ప‌టేల్ మ‌రో ఎన్ఆర్ఐతో ప్రేమాయాణాన్ని సాగించింది. అదీ కూడా పెళ్లి వరకు వెళ్లలేదు. దీంతో అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే ఉంటుంది. అయితే,  తాజాగా ఓ 30 ఏళ్ల యువ‌కుడితో దుబాయ్‌లో విహ‌రిస్తూ అమీషా కనిపించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇదే సమయంలో ఆమె కూడా అతగాడి కౌగిలిలో ఒదిగిపోతూ ఫోజులు ఇచ్చిన ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.   'నా డార్లింగ్‌ నిర్వాన్ బిర్లాతో.. లవ్లీ సాయంత్రం' అంటూ ఆ ఫోటోకు ఒక క్యాప్షన్ కూడా జత చేసింది. 

వ్యాపార కుటుంబంలో జన్మించిన 'నీరవ్‌ బిర్లా'.. అమీషా పటేల్‌ కంటే సుమారు 20 ఏళ్ల చిన్నవాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నాటికి ఇతగాడి వయసు 6 ఏళ్లు మాత్రమేనని చెప్పవచ్చు. దీంతో నెటిజన్లు కూడా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. అమీషా అందం అలాంటిదంటూనే ఆమె ఎవరినైనా ఫిదా చేస్తుందని చెప్పుకొస్తున్నారు. సన్నీ డియోల్, అమీషా పటేల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం.. ‘గదర్‌ 2’. గతేడాదిలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement