తాడిపత్రి: సిమెంట్ ఉత్పత్తిలో ఆసియాలోనే అతిపెద్ద కర్మాగారమైన ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన అల్ట్రాటెక్ కార్మాగారం మూత పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత నెల 22వ తేదీ నుంచి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలన్న డిమాండ్‌తో కర్మాగారం వద్ద ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో ప్లాంట్‌లో సిమెంట్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయింది. దీంతో యజమాన్యం ఇప్పటికే లాకౌట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. తాడిపత్రి మండలంలోని బోగసముద్రం ప్లాంట్ వద్ద 10 రోజులుగా కార్యకలపాలు పూర్తిగా స్తంభించాయి. సిమెంట్ ఉత్పత్తి ఆగిపోయింది.
రోజుకు 10 నుంచి 12 వేల మెట్రిక్ టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి చేసే సామార్థ్యం ఉన్న ఈ ప్లాంట్ ఆసియాలోనే పెద్దది. ఇక్కడ ప్రత్యేక్షంగా ఐదు వేల మంది కార్మికులు, ప్రత్యేక్షంగా 10వేల మందికార్మికులకు ఉపాధి లభిస్తోంది. ఈ కర్మాగారం నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని చాల సంవత్సరాలుగా డిమాండ్ ఉంది. అయితే దశల వారిగా ఉద్యోగాలు ఇస్తామని యాజమాన్యం చెబుతూ వస్తోంది.
కొద్ది మందికి ఇచ్చారు కూడా. ఈనెల 22వ తేదీ ఉదయం జేసీ దివాకర్ రెడ్డి ఏకంగా తన అనుచురులను, సమీప గ్రామాలకు చెందిన వారిని, రైతులను ప్లాంట్ వద్దకు రప్పించి మొత్తం ప్రధాన గేట్లను బలవంతంగా మూయించి రాకపోకలను స్తంభింపచేశారు. ప్లాంట్‌లోకి వేళ్లే రైల్వేవ్వాగిన్‌లను, వాహనాల రాకపోకలను కూడా అడ్డుకోవడంతో పరిశ్రమ ఆగిపోయింది. ఎం.పి.జె.సి.దివాకర్‌రెడ్డి నేతృత్వలో జరుగుతున్న అందోళన మరింత ఉపందుకుంది. ఒక దశలో ప్లాంట్‌లోకి నిత్యావసర వస్తువులు కూడా లోపలకి పంపేందుకు అందోళన కారులు అడ్డుకోవడంతో పోలీసులు జోక్యం కల్పించుకోని అనుమతించారు. ప్రధాన గేట్ల వద్ద రాత్రిం బవళ్లు కాపలా ఉంటూ ఆందోళన కొనసాగిస్తూ వస్తున్నారు.
చాలా సార్లు చర్చలు జరిపినా ప్రయోజనం లేకుండా పోయింది. 15వేల మంది ఉపాధికి విఘాతం కల్పించే విధంగా ఆందోళన చేస్తున్నా కూడా ప్రభుత్వ కానీ, జిల్లా యంత్రంగం కానీ కల్పించుకున్న పాపాన పోలేదు. దీంతో చేసేది లేక లాకౌట్ దిశగా యాజమాన్యం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. లాకౌట్‌కు దారితీస్తున్న పరిణామాలపై జిల్లా యంత్రాంగానికి నివేదికలు పంపి త్వరలో అధికారికంగా ప్రకటన చేయనుంది. ఒక వైపు ప్రభుత్వం పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తామంటే ఉన్న పరిశ్రమలను మూసివేసే విధంగా సొంత నేతలే చేస్తున్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
20 ఏళ్ల తర్వాత
స్పందించడంపై విమర్శల వెల్లువ
20 సంవత్సరాల క్రితం ఏర్పాటు అయిన సిమెంట్ పరిశ్రమలో పూర్తిస్థాయిలో 18 సంవత్సరాల క్రితం ఉత్పత్తి ప్రారంభం అయింది. అప్పట్లో స్థానికులకు ఉద్యోగాలు కావాలని డిమాండ్ చేయని ఎం.పి. జె.సి.దివాకర్‌రెడ్డి ఇప్పుడు ఉధృతంగా ఆందోళన చేయించడం వెనుక ఉద్దేశం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికార యంత్రంగం, పోలీసులు కూడా ఆందోళన కారులకే మద్దతు ఇస్తున్నట్లు ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
లాకౌట్‌కు చేరువలో అల్ట్రాటెక్ !
Published Fri, Jul 3 2015 1:58 AM | Last Updated on Sun, Sep 3 2017 4:45 AM
Advertisement
Advertisement