
బిర్లాకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్రారంభం అనంతరం గురువారం మధ్యాహ్నం సీఎం జగన్‌తో కలిసి ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా తాడేపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తన నివాసంలో సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక విందు ఇచ్చారు. అనంతరం జ్ఞాపిక బహూకరించి సన్మానించారు.
గ్రాసిమ్ ఇండస్ట్రీస్, కుమార మంగళం బిర్లాకు శుభాకాంక్షలు. మీ అపార అనుభవం, పరిచయాలు ఆంధ్రప్రదేశ్ ఎదుగుదలకు కచ్చితంగా తోడ్పతాయి. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, మరిన్ని పెట్టుబడులతో రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలవాలని ఆకాంక్షిస్తున్నాం. దేశం నలుమూలల నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు ఇది దోహదపడుతుందని భావిస్తున్నా. ఈ పరిశ్రమ వల్ల అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ సహకారం అవసరమైనా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
– సీఎం వైఎస్ జగన్
చదవండి: (పరిశ్రమలకు రాచబాట)