బిజినెస్ టైకూన్ల తొలి జాబ్‌ ఏదో తెలుసా? మెగా స్టార్ల సక్సెస్‌ జర్నీ తెలుసా? | First jobs of billionaire businessmens popular people inspirational journey | Sakshi
Sakshi News home page

బిజినెస్ టైకూన్ల తొలి జాబ్‌ ఏదో తెలుసా? మెగా స్టార్ల సక్సెస్‌ జర్నీ తెలుసా?

Published Fri, Jun 30 2023 12:32 PM | Last Updated on Fri, Jun 30 2023 1:13 PM

First jobs of billionaire businessmens popular people inspirational journey - Sakshi

కష్టాల్లేని జీవితం ఉంటుందా? అంటే కచ్చితంగా ఉండదు. తర తమ స్థాయిల్లో ఏదో ఒక  కష్టం, నష్టం ఉంటూనే ఉంటుంది.  నిజానికి కష్టాలు కన్నీళ్లు, అవమానాలు, ఓటములు లేని జీవితంలో కిక్కే ఉండదు. పడాలి..లేవాలి.. ఫీనిక్స్‌ పక్షిలా పునరుజ్జీవంతో పైపైకి ఎదగాలి. మనలో చాలామంది చాలాసార్లు అనేక విషయాల్లో అనేక స్లారు ఫెయిల్ అవుతాం. అంతమాత్రాన ప్రయత్నాలు ఆపేస్తే ఎలా? అందరూ సిల్వర్‌ స్పూన్‌తోనే పుట్టరు. ఎదగాలని తపన ఉంటే  చాలు.. మనకు మనమే పోటీ. చిన్న చిన్న ఉద్యోగాల తోనే అందలాన్ని ఎక్కిన వాళ్లు, ఎన్ని కష్టాలొచ్చినా  వెరవక ఒక్కో మెట్టు ఎదిగారు. అలాంటి దిగ్గజాల స్ఫూర్తి దాయక ప్రస్థానం చూడండి..

ధీరూ భాయి అంబానీ: ఆసియా బిలియనీర్‌ ముఖేష్‌ అంబానీ తండ్రి  ధీరూ భాయి అంబానీ కూడా చిన్న ఉద్యోగంతో మొదలుపెట్టి రిలయన్స్‌ లాంటి దిగ్గజ సంస్థకు ప్రాణం పోశారు. దుబాయ్‌లో పెట్రోలు బంకులో పనిచేసిన ధీరూ భాయ్‌ అంబానీ  1957లో దేశానికి తిరిగి వచ్చి దిగ్గజ కంపెనీ రిలయన్స్‌కు పునాది వేశారు. 

రతన్‌ టాటా బ్రిటీష్ ఇండియాలోని బొంబాయిలో  1937, 28 డిసెంబర్ పుట్టిన రతన్‌ టాటా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1961లో టాటా స్టీల్ షాప్ ఫ్లోర్‌లో బ్లాస్ట్ ఫర్నేస్,  పార సున్నపురాయి సంస్థలో తొలి ఉద్యోగం చేశారు. నిబద్ధతకు, నిజాయితీకి మారుపేరుగా దేశంలోని గొప్ప వ్యాపారవేత్తలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. 

ఎలాన్ మ‌స్క్‌: చిన్న‌త‌నం నుంచి అంత‌రిక్షంపై ఆస‌క్తి ఎక్కువ‌గా ఉన్న మ‌స్క్‌ త‌న 12వ ఏటా స్పేస్ థీమ్‌డ్ వీడియో గేమ్ బ్లాస్ట‌ర్‌కు కోడింగ్ చేశాడు. ఇపుడు సోషల్‌ మీడియా ప్లాట్‌పాం ట్విటర్‌  టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థ‌ల అధినేతగా మస్క్‌ ఉన్నాడు.

మార్క్‌ జూకర్‌బర్గ్‌ ఫేస్‌బుక్, మెటా  వ్య‌వ‌స్థాప‌కుడు మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్‌కి చిన్న‌త‌నం నుంచే ఇంట‌ర్నెట్‌, టెక్నాల‌జీపై ఆస‌క్తి ఎక్కువ. 18 ఏళ్లకే జుక‌ర్‌బ‌ర్గ్‌ సినాస్సీ అనే మ్యూజిక్ రిక‌మండేష‌న్ యాప్  తయారుచేశాడు. ఇపుడు మెటా ఫౌండర్‌గా బిలియనీర్‌గా  ఉన్నాడు.

జెఫ్ బెజోస్:  1980లో తొలి  ఉద్యోగం మెక్‌ డోనాల్డ్స్‌లో ఫ్రై కుక్‌గా  ఉద్యోగం, తొలి జీతం గంటకు రెండు డాలర్లు మాత్రమే సంపదన. 
ఆ తరువాత వాల్ స్ట్రీట్ హెడ్జ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. చివరికి 1994లో వాషింగ్టన్‌లోని బెల్లేవ్‌లోని గ్యారేజీలో అమెజాన్‌లో జాబ్‌ చేశారు. ఇపుడు అమెజాన్‌ సీఈవోగా తన ప్రతిభను చాటుకుంటున్నారు.

ఇన్ఫోసిస్‌ కో ఫౌండర్‌ నారాయణమూర్తి: ఐఐఎం అహ్మదాబాద్‌లో ఫ్యాకల్టీ, తరువాత రిసెర్చ్‌ అసోసియేట్‌గా మొదలైన ఆయన ప్రయాణం దేశంలో ఐటీ దిగ్గం ఇన్ఫోసిస్‌  కో వ్యవస్థాపకుడి దాకా చేరింది. ఐటీ రంగంలో నారాయణమూర్తిని  మెగాస్టార్‌  అనడంలో ఎలాంటి సందేహంలేదు.

వారెన్‌బఫెట్‌ బెర్క్‌లైన్‌ హాత్‌వే ఛైర్మన్‌,  స్టాక్‌ మార్కెట్‌ దిగ్గజం వారెన్‌బఫెట్‌ 1944లో వాషింగ్టన్‌ పోస్ట్‌ పేపర్‌ బాయ్‌గా ఉద్యోగం, నెల జీతం 173 డాలర్లు .

కేఎఫ్‌సీ: అనేక ప్రయత్నాల్లో  వైఫల్యాలు, ఓటమి తరువాత  కెంటకీ ఫ్రైడ్ చికెన్ హర్లాండ్ శాండర్స్ 60 వ ఏట  కేఎఫ్‌సీ  మొదలు పెట్టి బిలియనీర్‌గా అవతరించారు. 

అబ్దుల్ కలాం: మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలాం కూడా బీద కుటుంబం నుండే వచ్చారు. కానీ దేశ మొదటిపౌరుడిగా ఉండారని కలగన్నారా? కానీ దేశాధ్యక్షుడిగా  సేవలందించిన ఘనతను చాటుకున్నారు. 

స్టీఫెన్ హాకింగ్‌:  ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త విశ్వ రహస్యాలను చేధించిన వ్యక్తి. 21 సంవత్సరాల వయస్సులో సమస్య, 1980ల పూర్తిగా పవర్‌చైర్ కే అంకితం. అయినా కడ శ్వాస దాకా విశ్వం గురించిన లోతైన అధ్యయనాలోతేనే గడిపారు.

నటి మర్లీ మాట్లిన్ చిన్నప్పటి నుండి అవకరంతోనే  జీవించారు. మా కానీ ఎక్కడి కృంగిపోలేదు. ధైర్యంగా వృత్తిలో  ముందుకు సాగారు.  18 నెలల వయస్సులోనే వినికిడిని దాదాపు కోల్పోయి,ఉత్తమ నటిగా అకాడమీ అవార్డును గెలుచుకున్న మొదటి చెవిటి నటిగా ఖ్యాతి పొందారు. 

నాట్య మయూరి సుధా చంద్రన్: తనకు జరిగిన ప్రమాదం, కాలు కోల్పోవడం ఇవన్నీ అనుకోకుండా ఎదురైనా  తీవ్ర  కష్టాలు. కానీ కృత్రిమ కాలుతో  నాట్యం  చేయాలన్న తపనను తీర్చుకున్నారు. అంతేకాదు తన లాంటి వారెందరికో గొప్ప స్ఫూర్తిగా నిలిచారు.   

ఏఆర్ రెహమాన్: ఆస్కార్‌ అవార్డు విన్నర్‌ ఏఆర్ రెహమాన్ తండ్రి చిన్నప్పుడే పోయారు. కుటుంబ భారం మీద పడింది. అయినా చిన్న చిన్న పనులు చేసుకుంటూ, తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ తన కలను సాకారం చేసుకున్నారు.  గొప్ప  మ్యూజిక్‌ డైరెక్టర్‌గా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. 

అమితాబ్‌ బచ్చన్‌  అంత ఎందుకు సన్నగా పీలగా, పొడవుగా ఉండే  అమితాబ్‌ బచ్చన్‌ సినిమాలకు పనికిరావనే అవమానాన్ని  ఎదుర్కొన్నాడు. మరిపుడు అనేక బ్లాక్‌ బస్టర్‌ మూవీలను బాలీవుడ్‌కు అందించి  బాలీవుడ్‌  మెగాస్టార్‌గా అవతరించాడు. ఇప్పటికీ  ఆయన సూపర్‌ స్టారే. ఇలా చెప్పుకుంటే పోతే థామస్ ఆల్వా ఎడిసన్  మొదలు, గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్లు జీవితాలు ఆదర్శం కావాలి. అలాగే ఇవాల్టి స్టార్టప్‌ యుగంలో స్టార్టప్‌ కంపెనీలతో మొదలై వేలకోట్ల వ్యాపార సామ్రజ్యాన్ని సృష్టిస్తున్నవారు చాలామందే ఉన్నారు.  సంకల్పం ఉంటే చాలు.. ఎలాంటి కష్టమైనా దిగదిడుపే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement