Dhirubhai Ambani
-
షారూఖ్ తనయుడితో ఆరాధ్య స్టేజ్ షో.. ఎంత క్యూట్‌గా ఉన్నారో! (ఫోటోలు)
-
స్కూలు యాన్యువల్ డే : ఆరాధ్య సందడి, ముద్దుల్లో ముంచెత్తిన ఐశ్వర్య
ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షిక దినోత్సవం వేడుకల్లో స్టార్ కిడ్స్ సందడి చేశారు. బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కుమార్తె ఆరాధ్య, బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్‌కాన్ చిన్న కుమారుడు అబ్ రామ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.గురువారం (డిసెంబరు 19) జరిగిన ఈ ఈవెంట్లో ఆరాధ్య బచ్చన్ తన షోను అందర్ని కట్టి పడేసింది. ఆమె నటనకు ఐశ్వర్య, అభిషేక్‌తోపాటు, తాత అమితాబ్ బచ్చన్ కూడా గర్వంతో ఉప్పొంగి పోయారు. ముఖ్యంగా మాజీ ప్రపంచ సుందరి ఐశర్య తన కుమార్తె నటనకు ఫిదా అయిపోయింది. ఈమెమరబుల్ మూమెంట్స్‌ను కెమెరాలో బంధిస్తూ కనిపించింది. ఆ తరువాత ఆరాధ్యను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ముద్దులతో ముంచెత్తింది.And Aaradhya’s final bow - trust her parents to cheer the loudest as always pic.twitter.com/phf29fiGG3— Bewitching Bachchans (@TasnimaKTastic) December 19, 2024మరోవైపు భార్యబిడ్డలను ఇలా చూసిన అభిషేక్ మురిసిపోయారు. ఇక మనవరాలు క్రిస్మస్ ప్రదర్శనకు గర్వంతో చిరునవ్వులు చిందించారు అమితాబ్. షో ముగియగానే ప్రేక్షకుల కరతాళ ధ్వనులు మిన్నంటాయి. అలాగే తన కుమారుడు అబ్రామ్ ప్రదర్శనకు షారూఖ్‌ఖాన్ కూడా ఉత్సాహంగా క్లాప్స్ కొట్టారు. మురిపెంగా వీడియోలు తీసుకుంటూ కనిపించారు. కరీనా సైఫ్ అలీఖాన్, దంపతుల కుమారుడు కూడా తైమూరు కూడా అద్భుత ప్రదర్శనతో అలరించాడు. ఈ వార్షికోత్సవ వేడుకులకు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.మరోవైపు ఆరాధ్య పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో ఐశ్వర్య, అభిషేక్ జంటగా కనిపించడం, ఇద్దరూ అమితాబ్‌ను వేదికపైకి జాగ్రత్తగా తీసుకెళ్లిన దృశ్యాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఐశ్వర్య, అభిషేక్ విడాకులు తీసుకోబోతున్నారనే పుకార్లకు పూర్తిగా చెక్ పడినట్టైంది. < View this post on Instagram A post shared by mamaraazzi (@mamaraazzi) -
అంబానీ, టాటా, అదానీ.. వీళ్లు చేసిన ఫస్ట్ జాబ్ ఏంటో తెలుసా?
భారతదేశంలో ప్రతి ఏటా ధనవంతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం మన దేశంలోని కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, శివ్ నాడార్, సావిత్రి జిందాల్, దిలీప్ సాంఘ్వీ, కుమార మంగళం బిర్లా మొదలైనవారు ఉన్నాయి. వీరిలో కొందరు వారసత్వంగా ధనవంతులైనప్పటికీ.. కొందరు మాత్రం కష్టపడి చిన్న ఉద్యోగాలు చేస్తూ ఎదిగారు. ఈ కథనంలో అలాంటి వాళ్ళ గురించి తెలుసుకుందాం.ధీరూబాయ్ అంబానీ (Dhirubhai Ambani)రిలయన్స్ సంస్థ ఏర్పడటానికి కారణమైన ధీరూబాయ్ అంబానీ.. తన తొలినాళ్లలో కుటుంబ పోషణ కోసం అనేక పనులు చేశారు.కానీ అవి నచ్చకపోవడంతో మిడిల్ ఈస్ట్ ఆసియా దేశమైన యెమెన్‌కు వలస వెళ్లి పెట్రోల్ బంకులో పని మొదలు పెట్టారు. అప్పట్లో ఆయన సంపాదన రూ. 300 మాత్రమే. కొంతకాలం పెట్రోల్ బంకులో పనిచేసి.. స్వదేశానికి వచ్చి చిన్నగా వ్యాపారాన్ని ప్రారంభించారు. అదే ఇప్పుడు ఇంతపెద్ద రియలన్స్ ఇండస్ట్రీస్‌గా మారింది.సుధామూర్తి (Sudha Murthy)ఇన్ఫోసిస్ నారాయణమూర్తి భార్య సుధామూర్తి చదువు పూర్తయిన తరువాత.. టాటా మోటార్స్ (TELCO)లో ఉద్యోగం చేశారు. ఆ కంపెనీ మొదటి మహిళా ఇంజినీర్ సుధామూర్తి కావడం గమనార్హం. ఈ రోజు ఇంజినీరింగ్ రంగంలో కూడా మహిళలు ముందుకు వెళ్తున్నారంటే.. అది సుధామూర్తి కారణంగానే.రతన్ టాటా (Ratan Tata)దివంగత రతన్ టాటా.. ప్రారంభంలో టాటా కంపెనీలో ఉద్యోగిగా చేరారు. అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ 'ఐబీఎమ్' నుంచి మంచి శాలరీ ప్యాకేజీతో వచ్చిన జాబ్ వదులుకున్నారు. టాటా స్టీల్ కంపెనీలోనే పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి సంస్థా చైర్మన్ స్థాయికి ఎదిగారు.కిరణ్ మజుందార్ షా (Kiran Mazumdar Shaw)బయోకాన్ వ్యవస్థాపకురాలైన.. కిరణ్ మజుందార్-షా ప్రారంభంలో ఆస్ట్రేలియాలో బ్రూవర్‌గా తన వృత్తిని ప్రారంభించారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, ఆమె బ్రూయింగ్ పరిశ్రమలో లింగ వివక్షను ఎదుర్కొన్నారు. ఆ తరువాత క్రమంగా వ్యాపార సామ్రాజ్యంలో అంచెలంచెలుగా ఎదిగారు.ఇంద్రా నూయి (Indra Nooyi)పెప్సికో మాజీ సీఈఓ అయిన.. ఇంద్రా నూయి 18 సంవత్సరాల వయస్సులో బ్రిటిష్ టెక్స్టైల్ సంస్థలో వ్యాపార సలహాదారుగా తన వృత్తిని ప్రారంభించారు. ఇప్పుడు ఈమె వేలకోట్ల సామ్రాజ్యానికి అథినేత్రిగా నిలిచారు.గౌతమ్ అదానీ (Gautam Adani)ఈ రోజు భారతదేశంలో రెండవ అత్యంత ధనవంతుడిగా ఉన్న గౌతమ్ అదానీ.. డైమండ్ సార్టర్‌గా తన మొదటి ఉద్యోగాన్ని ప్రారంభించారు. ఆ తరువాత ఈ రంగంలో కొంత అనుభవం తెచ్చుకున్న తరువాత ముంబైలోని జవేరీ బజార్లోనే సొంతంగా వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించారు. నేడు వివిధ రంగాల్లో ఎదుగుతూ.. కుబేరుడిగా నిలిచారు. -
భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ బాస్ ఎవరో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత సంపన్నులలో ఒకరైన అంబానీ ఫ్యామిలీ చాలా కాలంగా వ్యాపార సామ్రాజ్యాన్ని శాసిస్తోంది. ధీరూభాయ్ అంబానీ కుటుంబంలోని అందరూ వ్యాపారంలో సంబంధాన్ని కలిగి ఉన్నారు. ప్రస్తుతం రిలయన్స్ గ్రూప్ ముకేశ్ అంబానీ సారథ్యంలో నడుస్తోంది. ఇందులో ఆకాష్, ఇషా, అనంత్ అంబానీలు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ కంపెనీ నేడు ఈ స్థాయికి రావడానికి కారణమైన వాళ్లలో ధీరూభాయ్ అంబానీ సోదరీమణులలో ఒకరు కూడా ఉన్నారు.ధీరూభాయ్ అంబానీ అంటే.. ముఖేష్ అంబానీ తండ్రి, నీతా అంబానీ మామ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు అని అందరికీ తెలుసు. అయితే ఈయనకు నలుగురు తోబుట్టువులు కూడా ఉన్నట్లు సమాచారం. వీరు త్రిలోచన బెన్, రామ్నిక్లాల్ అంబానీ, జాసుబెన్, నతుభాయ్. త్రిలోచన బెన్ వయసులో ధీరూభాయ్ అంబానీ కంటే పెద్దవారు.త్రిలోచన బెన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ స్థాపనలో పరోక్షంగా ముఖ్యమైన పాత్ర పోషించారు. అయితే ఈమె గురించి చాలామందికి తెలియకపోవడం గమనార్హం. త్రిలోచన బెన్ కుమారుడు రిలయన్స్ వ్యవస్థాపక డైరెక్టర్లలో ఒకరైన రసిక్లాల్ మెస్వానీ. ఈమె మనవళ్లు నిఖిల్ ఆర్ మేస్వానీ, హిటల్ ఆర్ మేస్వానీ కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో కీలక పదవుల్లో ఉన్నారు.నిఖిల్ ఆర్ మేస్వానీ 1986లో ఆర్ఐఎల్లో చేరి కంపెనీ బోర్డులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈయన పెట్రోకెమికల్ విభాగాన్ని చూసుకుంటూ.. ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్‌తో పాటు ఇండియన్ సూపర్ లీగ్‌ను నిర్వహించడంలో కూడా పాల్గొంటారు.ఇక త్రిలోచన బెన్ చిన్న మనవడు హిటల్ ఆర్ మేస్వాని 1995లో కంపెనీలో చేరి.. తన అన్న నిఖిల్ మాదిరిగానే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అదే పదవిని నిర్వహించారు. పెట్రోలియం రిఫైనింగ్, మార్కెటింగ్, పెట్రోకెమికల్స్ తయారీతో పాటు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ (HR), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రీసెర్చ్ & టెక్నాలజీ వంటి కంపెనీ ఇతర కార్పొరేట్ విధులను కూడా ఈయన నిర్వహిస్తారు.ముకేశ్ అంబానీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన వ్యాపార ప్రారంభ రోజులను గుర్తు చేసుకున్నారు. నా మొదటి బాస్.. నా అత్త కుమారుడు రసిక్లాల్ మెస్వానీ అని పేర్కొన్నారు. అంతే కాకుండా ఈయన సంస్థను సరైన దిశలో నడిపించారని ప్రశంసించారు.రసిక్లాల్ మెస్వానీ చాలా ఓపెన్‌గా ఉంటారు. మేము ఒకరి క్యాబిన్లోకి మరొకరు వెళ్ళవచ్చు. సమావేశాల్లో, చర్చల్లో పాల్గొనవచ్చు. దీన్ని మా నాన్న ప్రోత్సహించారు. నేను అధికారికంగా రిలయన్స్‌లో చేరినప్పుడు.. నాన్న పాలిస్టర్ వ్యాపారాన్ని రసిక్‌భాయ్ కింద ఉంచారు. ఇందులో పాలిస్టర్ ఫైబర్‌ను దిగుమతి చేసుకోవడం, దానిని టెక్స్టైల్ చేయడం, మా సొంత మిల్లులలో విక్రయించడం వంటివి ఉన్నాయని ముకేశ్ అంబానీ వెల్లడించారు. -
రూ.300 జీతం.. ఎన్నో కష్టాలు.. సొంతంగా వ్యాపారం - ధీరుభాయ్ అంబానీ గురించి ఆసక్తికర విషయాలు (ఫొటోలు)
-
తెలుగు పాటకు 'త్రీ ఖాన్స్' డ్యాన్స్.. ఫిదా అవుతున్న బాలీవుడ్
జామ్‌నగర్‌లో భారత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల ప్రీవెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎన్కోర్ హెల్త్‌కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్ కుమార్తె అయిన రాధికతో వివాహం జరగనుండగా ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు సినీ తారలు, పలువురు ప్రముఖులతో పాటు దేశ విదేశాల్లోని అతిరథ మహారథులు గుజరాత్‌లోని జామ్‌నగర్ చేరుకున్నారు. మార్చి 1 నుంచి ప్రారంభమైన ఈ వేడుకలు నేటితో ముగియనున్నాయి. ఈ వేడుకల్లో బాలీవుడ్ నటులు షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, దీపికా పదుకొణే.. అంతర్జాతీయ ప్రముఖులు పాప్ సింగర్ రిహన్నా, అమెరికన్ గాయని, గేయ రచయిత జే బ్రౌన్, వాయిద్యాకారుడు బాసిస్ట్ ఆడమ్ బ్లాక్‌స్టోన్ సందడి చేశారు. బాలీవుడ్లో త్రీ ఖాన్స్గా గుర్తింపు ఉన్న షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్లు ఒకే ఫ్రేమ్‌లో చాలా రోజుల తర్వాత కనిపించడంతో బాలీవుడ్ సినీ అభిమానులు సంతోషిస్తున్నారు. వారి ముగ్గురిని ఒకే స్టేజీపై కలపగల వ్యక్తి అంబానీ మాత్రమే అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ నటించిన RRR చిత్రంలోని 'నాటు నాటు' పాటకు త్రీ ఖాన్స్ వేసిన స్టెప్పులకు అతిథులు ఫిదా అయ్యారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఇకపోతే అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహం ఇదే ఏడాది జులైలో జరగనుంది. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
‘నా లక్ష్యం అదే’ : ముఖేష్ అంబానీ
న్యూఢిల్లీ: ఇప్పటివరకు సాధించిన విజయాలతో సంతృప్తి పడి, అలసత్వం వహించబోమని రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ చెప్పారు. డిజిటల్ డేటా ప్లాట్‌ఫాంలు, కృత్రిమ మేథ (ఏఐ) వినియోగంలో ప్రపంచ టాప్ 10 వ్యాపార దిగ్గజాల్లో ఒకటిగా ఎదగడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రూప్ వ్యవస్థాపకుడు ధీరుభాయ్ అంబానీ జయంతి సందర్భంగా నిర్వహించే రిలయన్స్ ఫ్యామిలీ డేలో పాల్గొన్న సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించారు. ‘నేడు దేశీయంగా, అంతర్జాతీయంగా వ్యాపార పరిస్థితులు అత్యంత వేగంగా మారిపోతున్నాయి. సాధించిన వాటితో సంతృప్తి చెంది ఆగిపోవడానికి తావు లేదు. రిలయన్స్ ఎప్పటికప్పుడు కొంగొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగుతుంది’ అని అంబానీ చెప్పారు. ‘ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఎకానమీగా ఎదిగేందుకు భారత్ ముందుకు పరుగులు తీస్తున్న నేపథ్యంలో రిలయన్స్ ఎదుట అసాధారణ అవకాశాలు ఉన్నాయి. ప్రపంచంలోనే టాప్ 10 వ్యాపార దిగ్గజాల్లో రిలయన్స్ ఎదగగలదు. తప్పకుండా ఎదుగుతుంది’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం ఉద్యోగులంతా కస్టమర్లకు మరింత విలువ చేకూర్చేలా సేవలందించడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. డిజిటల్ డేటా ప్లాట్‌ఫామ్‌లు.. ఏఐ వినియోగంలో గ్లోబల్ లీడర్లలో స్థానాన్ని పటిష్టం చేసుకోవడం, సంస్థాగత సంస్కృతి విషయంలో అంతర్జాతీయ దిగ్గజాల్లో ఒకటిగా ఎదగడం నూతన సంవత్సర తీర్మానాలుగా నిర్దేశించుకోవాలని ఆయన సందేశమిచ్చారు. -
ఆస్తులన్నీ పోగొట్టుకుని దీనస్థితిలో అమితాబ్.. నలుగురిలో నిలబెట్టిన ధీరూభాయ్..
ధీరూబాయ్ అంబానీ సామాన్యుడి నుండి అసామాన్యుడిగా ఎదిగిన ధీరుడు. పెట్రోల్ బంకులో కేవలం 300 రూపాయల జీతానికి పనిచేసిన ధీరూభాయ్ 62వేల కోట్లను సంపాదించి కార్పొరేట్ మహా సామ్రాజ్యానికి అధిపతి. ఓ మామూలు మసాలా దీనుసులు అమ్ముకునే డీలర్‌గా పనిచేసే ధీరూభాయ్.. నిరంతర కృషితో ఎన్నో ఎదురుదెబ్బలు ఓర్చుకుంటూ తన సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. బిజినెస్ టైకూన్‌గా అవతరించారు. రిలయన్స్ అనే సంస్థను ప్రారంభించారు. ఇప్పుడా సంస్థ ప్రపంచంలో అతి విలువైన కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. ఆయన ఇచ్చిన స్పూర్తి నేటి తరాలే కాదు.. రేపటి తరాలకు కూడా ఆదర్శం. అలాంటి బిజినెస్ టైకూన్ ధీరూభాయ్ అంబానీ గురించి బిగ్ బి అమితాబ్ తన జీవితంలో ఎదురైన సంఘటనని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురవుతారు. ఇంతకి ఏంటా సంఘటన! వులి దెబ్బ పడనిదే శిల శిల్పం కాదు. కొలిమిలో కాలనిదే ఆ బంగారానికి కాంతి రాదు. అమితాబ్ జీవితం అంతే. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటే గాని ఆయనకు బిగ్ బి బిరుదు రాలేదు. సాదాసీదా బచ్చన్.. సాహెబ్ (దాదా సాహెబ్ పాల్కే అవార్డ్ తీసుకునే) స్థాయికి రావడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. అది చెప్పాలంటే ఒక పుస్తకమే అవుతుందేమో. అలా సూపర్ స్టార్‌గా వెలిగిపోతున్న అమితాబ్ బిజినెస్‌లోకి దిగారు. బచ్చన్‌కు వరుస సినిమాలు తీయాలని 1995లో ఏబీసీఎల్ కార్పొరేషన్ ను స్థాపించారు. ఏబీసీఎల్ అంటే అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా చేయాలని అనుకున్నారు. అలా రూ.22 కోట్లతో కెనరా బ్యాంక్ వద్ద లోన్ తీసుకుని 150 మంది ఉద్యోగులతో ఏబీసీఎల్ ను ప్రారంభించారు. ఏబీసీఎల్ ప్రొడక్షన్లో 15 సినిమాలు వచ్చాయి. ఒక్క ఏడాదిలో ఆ సినిమాలకు పెట్టిన పెట్టుబడి రూ.60 కోట్లు. అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో బిజినెస్‌ను విస్తరించాలని అనుకున్నారు. ప్లాన్ ప్రకారం.. భారత్ లోని బెంగళూరులో తొలిసారి మిస్ వరల్డ్ ఈవెంట్ ను నిర్వహించారు. అప్పట్లో మిస్ వరల్డ్ పోటీలు మనదేశంలో జరగడం ఫస్ట్ టైం. కానీ ఇది చాలా రిస్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే? అప్పట్లో భారత్‌లో ఆడవాళ్ల గురించి ఇలాంటి ఈవెంట్లు చేయకూడదనే ఆందోళనలు జరిగాయి. కాబట్టే ఈ ఈవెంట్ కోసం ఒక్క స్పాన్సర్ ముందుకు రాలేదు. ఈ ఈవెంట్‌కి బచ్చన్ సాబ్ పెట్టింది రూ.14 కోట్లపై మాటే. భారత్‌లోని ఆందోళనలతో మిస్ వరల్డ్ ఈవెంట్ భారత్ నుంచి సౌతాఫ్రికాలో రూ.34 కోట్లు పెట్టి మరి నిర్వహించారు. దీని వల్ల ఏబీసీఎల్ కి రూ.20 కోట్లు లాస్ వచ్చింది. అయితే, ఈ నష్టాల్ని పూడ్చాలంటే ఏబీసీఎల్లో ఏదో ఒక మంచి హిట్ సినిమాలను తెరకెక్కించారు. రెండు సినిమాల్ని తీశారు. అవి రెండు కాస్త బిలో యావరేజ్‌గా ఆడాయి. అమితాబ్‌తో మరో సినిమా తీస్తే నష్టాల నుంచి బయటపడొచ్చని మృత్యుదాత అనే సినిమానికి తెరకెక్కించారు. కానీ ఊహించని విధంగా ముందు తీసిన రెండు సినిమాల కంటే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. మరోవైపు నార్త్ అమెరికాలో కొన్ని ఈవెంట్స్‌ను నిర్వహించేందుకు అమితాబ్ అక్కడా ఏబీసీఎల్‌ను ప్రారంభించారు. కానీ సరైన ప్లానింగ్ లేక ఏబీసీఎల్లో బుకింగ్స్ చేసే వారు కాదు. అలా ఏబీసీఎల్కి ఇటు సినిమాలు, అటు ఈవెంట్స్‌లో కలిసి రాకపోవడం వల్ల, బ్యాంక్‌కు కట్టాల్సిన బాకీలు ఇలా మొత్తం కలుపుకుని రూ.90 కోట్లతో అప్పులు పాలయ్యారు. దాంతో బచ్చన్‌కి ఏం చేయాలో అర్ధం కాలేదు. ఏబీసీఎల్కి ఫండ్స్ ద్వారా వచ్చే మొత్తాన్ని ఉద్యోగులకు ఇచ్చే శాలరీ కూడా సరిపోయేది కాదు. చేసేది లేక చివరికి 1999లో ఏబీసీఎల్‌ను మూసేశారు. అదే సమయంలో ధీరూభాయి అంబానీ .. అమితాబ్‌ను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఆ సమయంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ను బచ్చన్ గుర్తు చేసుకున్నారు. ‘‘ జీవితంలో ఒకానొక సమయంలో నేను బ్యాంక్ రఫ్ట్ అయిపోయా దివాళ తీశాను. నేను స్థాపించిన కంపెనీ నష్టాల్లో కూరుకుపోయింది. కోటానుకోట్లు అప్పులయ్యాయి. నా బ్యాంక్ బ్యాలెన్స్ సున్నా అయ్యింది. డబ్బు సంపాదించే మార్గాలు మూసుకుపోయాయి. ప్రభుత్వ అధికారులు సోదాలు చేశారు. ఈ విషయం ధీరూ భాయికి తెలిసింది. ఎవరినీ సంప్రదించకుండా తన చిన్న కొడుకు, నా మిత్రుడు అనిల్ అంబానీతో ఇలా అమితాబ్‌కు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. కొంత డబ్బు ఇమ్మని పంపించాడు. అప్పుడు అనిల్ నా ఇంటికి డబ్బుతో వచ్చాడు. ఆ డబ్బు ఎంతంటే? దాంతో కష్టాలన్నీ, టెన్షల్లు మాయం అయ్యేవి. వారి మంచి తనానికి నేను చాలా పులకించి పోయాను. అయితే వారి సహాయం మాత్రం నేను తీసుకోలేకపోయాను. భగవంతుడి దయతో నా జీవితంలో చీకటి రోజులు పోయాయి. మెల్లిమెల్లిగా అప్పులన్నీ తీర్చగలిగాను. అలా ఓ సారి ధీరూ భాయి ఇంట్లో విదేశీ ప్రతినిధులతో ఒక పార్టీ పెట్టారు. నన్ను కూడా పిలిచారు. ధీరూ భాయి అందరి మధ్యలో కూర్చున్నారు. ఆ సమయంలో దేశ, విదేశాల నుంచి పెద్ద పెద్ద వ్యాపారస్థులతో వ్యాపార విషయాలు మాట్లాడుతున్నారు. నన్ను చూసి తన పక్కన వచ్చి కూర్చోమని కోరారు. నాకు కొంత వింతగా అనిపించి క్షమించండి నేను అక్కడ నా మిత్రలతో కలిసి కూర్చంటానని అన్నాను. కానీ ఆయన నన్ను కూర్చోమని మరోసారి కోరారు. దిగ్గజాలు కూర్చున్న ఆ సమయంలో నన్ను చూపిస్తూ ఈ కుర్రాడు కిందపడ్డాడు. కానీ తన స్వశక్తితో మళ్లీ నిలబడ్డాడు. అని అందరితో చెప్పాడు. అలా అనడం ఆయన నాకు ఇచ్చిన గౌరవం అనేది నన్ను ఇబ్బందుల్లో నుంచి బయట పడేయడానికి ధీరూభాయ్ నాకు ఇవ్వాలి అనుకున్న ఆర్ధిక సహాయం కన్నా ఎక్కువ అది. ఇదీ ఆయన వ్యక్తిత్వానికి ఉన్న గొప్పతనం’’ అంటూ ధీరూభాయిపై ప్రశంసల వర్షం కురిపించారు. -
ధీరూభాయ్ అంబానీ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం
రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపక చైర్మన్, దివంగత ధీరూభాయ్ అంబానీ 21వ వర్ధంతిని పురస్కరించుకుని, డెక్కన్ బ్లడ్ సెంటర్ సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ గురువారం జియో తెలంగాణ ప్రధాన కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. జియో తెలంగాణ సీఈఓ కె.సి.రెడ్డి దివంగత వ్యవస్థాపక చైర్మన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి రక్తదాన శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన రక్తదానం చేశారు. సంస్థ ఉద్యోగులు సైతం అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. -
వి మిస్ యూ పప్పా: ఈ రోజు దేశం చేస్తున్న పని ఆయన ఎప్పుడో చేశారు!
ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫౌండర్ ధీరజ్‌లాల్ హీరాచంద్ అంబానీ (ధీరూభాయ్) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జూలై 6 ఆయన వర్ధంతి సందర్భంగా ధీరూభాయ్ అంబానీ సక్సెస్ ఫుల్ జర్నీని తెలుసుకుందాం. "కష్టాలు ఎదురైనా మీ లక్ష్యాలను సాధించండి, ప్రతికూలతలను అవకాశాలుగా మార్చుకోండి’’ అనేది ధీరూభాయ్ అంబానీ సందేశం. నిజ జీవితంలో ఆయన అదే ఆచరించి చూపారు. ఎంతో మంది పారిశ్రామిక వేత్తలకు స్ఫూర్తిగా నిలిచారు. టీనా అంబానీ ఘన నివాళి ఈ రోజు దేశమంతా చేస్తున్న పనిని ఆయన ఎప్పుడో పూర్తి చేశారు. అదీ ఆయన దార్శనికత. చాలా విధాలుగా ఆయన కాలం కంటే ముందే ఉన్నారు. ఔట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించమని,అత్యుత్తమంగా ఉండాలని, మనల్ని మనం అంకితం చేసుకోవాలని ప్రోత్సహించిన నిజమైన దార్శనికుడు. పప్పా ప్రతిరోజూ నిన్ను మిస్ అవుతున్నాం. మీరందించిన అనంతమైన జ్ఞానాన్న మా నిజ జీవితాల్లో వర్తింపజేయడానికి ప్రయత్నిస్తాం అంటూ ఆయన కోడలు, అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ నివాళులర్పించారు. మరోవైపు ధీరూభాయ్ పెద్ద కోడలు, బిలియనీర్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీ తన "అత్యంత స్ఫూర్తిదాయకమైన గురువు" అంటూ గురు పూర్ణిమ రోజు ఎన్ఎంఏసీసీలో నిర్వహించిన పరంపర కార్యక్రమంలో ఘన నివాళులర్పించారు. ధీరూ భాయ్ అంబానీ కొన్ని ఆసక్తికర విషయాలు దిగ్గజ కార్పొరేట్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ధీరూభాయ్ పదో తరగతి మాత్రమే పూర్తి చేశారంటే నమ్ముతారా? ఒకప్పుడు పెట్రోల్ పంపులో పని.. కానీ ఆ తరువాత వేల కోట్ల రూపాయలతో వ్యాపార దిగ్గజంగాఎదిగిన ధీరూభాయ్ అంబానీ గురించి అంతగా తెలియని ఆసక్తికరమైన విషయాలు సాధారణ కుటుంబంలో జననం, కష్టాలు ధీరూభాయ్ అంబానీ గుజరాత్, జునాగద్ జిల్లాలో చోర్వాడ్ అనే చిన్న గ్రామంలో 1932, డిసెంబరు 28న జన్మించారు. సామాన్య టీచర్ కుటుంబంలో నలుగురు తోబుట్టువులతో జీవితం కష్టాలతోనే ప్రారంభమైంది. ముఖ్యంగా కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ధీరూభాయ్ అంబానీ తన చదువును కూడా మధ్యలోనే వదిలివేసి కుటుంబానికి అండగా ఉండేందుకు చిన్న చిన్న పనులు చేశారు. పెట్రోలు బంకులో పని, నెలకు రూ.300 బిలియన్ డాలర్ల కంపెనీ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ ప్రారంభంలో బ్రిటిష్ కాలనీ ఆఫ్ అడెన్‌లోని పెట్రోల్ బంకులో అటెండెంట్‌గా పనిచేశారు. ఆ సందర్భంగా నెలకు 300రూపాయలు జీతంగా తీసుకునేవారట. అంతకుముందు కుటుంబ పోషణ కోసం అనేక పనులు చేశారు.కానీ అవి నచ్చకపోవడంతో మిడిల్ ఈస్ట్ ఆసియా దేశమైన యెమెన్‌కు వలస వెళ్లి పెట్రోల్ బంకులో పని మొదలు పెట్టారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తీప్పింది. సూయజ్‌కు తూర్పున ఉన్న అతిపెద్ద ఖండాంతర వాణిజ్య సంస్థలో ట్రేడింగ్, అకౌంటింగ్, ఇతర వ్యాపార నైపుణ్యాలను నేర్చుకున్నారు. కొన్నేళ్లలోనే మంచి స్థానానికి ఎదిగారు. ఆ తరువాత అన్నింటినీ వదిలి తిరిగి భారతదేశానికి తిరిగి వచ్చేశారు. రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ ఇండియాకి వచ్చిన తరువాత 1958లో తన బంధువు చంపక్లాల్దమానీతో కలిసి తొలి కంపెనీ రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ (సుగంధ ద్రవ్యాలు, నూలు వ్యాపారం) కంపెనీ స్థాపించారు. నూలు వ్యాపార పరిశ్రమలో పెరుగుతున్న అవకాశాలను గుర్తించిన తర్వాత ధీరూభాయ్ తన వ్యాపారాన్ని మార్చేశారు. మూడేళ్ల తర్వాత 1962లో రిలయన్స్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను లాంచ్ చేశారు. బంధువు చంపక్లాల్ దమానీతో విడిపోయిన తరువాత 1966లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 'రిలయన్స్ టెక్స్టైల్స్' అనే బట్టల మిల్లును ప్రారంభించారు. దీంతో అతని జీవితంలో అత్యంత మలుపు తిరిగింది. ఇక తరువాత మళ్ళీ ఎప్పుడూ వెనుదిరిగి చూసింది లేదు. అంచెలంచెలుగా రిలయన్స్ సామ్రాజాన్నివిస్తరించారు. అలాగే భారతదేశంలోని సగటు పెట్టుబడిదారులకు స్టాక్ మార్కెట్‌ను పరిచయం చేసిన ఘనత అంబానీకి దక్కుతుందని మార్కెట్ నిపుణులమాట. భారతదేశంలో అతిపెద్ద ఎగుమతిదారుగా ఫార్చ్యూన్ 500లోచోటు దక్కించుకున్న తొలి ఇండియన్ ప్రైవేట్ కంపెనీగా రిలయన్స్ టెక్స్ టైల్స్ నిలిచింది. అలాగే 1996, 1998, 2000 సంవత్సరాల్లో ఆసియావీక్ పత్రిక 'పవర్ 50- ఆసియాలో మోస్ట్ పవర్ఫుల్ పీపుల్' జాబితాలో చేరారు. దీంతోపాటు1999 సంవత్సరంలో బిజినెస్ ఇండియా 'బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును కూడా అందుకున్నారు. 69 ఏళ్ల వయసులో ధీరూభాయ్ అంబానీ 2002 జూలై 6న ముంబైలో కన్నమూశారు. ఖరీదైన రెస్టారెంట్లలో టీ తాగేవారు తాజా వ్యాపార ఆలోచనలకోసం, తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి, ధీరూభాయ్ అంబానీ సంపన్న వ్యాపారవేత్తలతో కలిసి తిరిగేవారట. నెట్వర్క్ , పరిశ్రమ గురించి తెలుసుకోవడానికి, ఖనీదైన రెస్టారెంట్లలో టీ తాగేవారని చెబుతారు. ధీరూభాయ్ అంబానీ భార్య పేరు కోకిలాబెన్. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వీరు ముఖేశ్ అంబానీ, అనిల్ అంబానీ, నినా కొఠారి, దీప్తి సల్గోకర్. ఆస్తులను తన ఇద్దరు కుమారులు ముఖేశ్, అనిల్ అంబానీలకు పంచి ఇచ్చారు. 2002లో ఆయన మరణించే ముందు వరకు కంపెనీని పర్యవేక్షించిన ఆయన 1980ల మధ్యకాలంలో తన కుమారులు ముఖేశ్ అంబానీ, అనిల్ అంబానీలకు అప్పగించారు, ఆయన వారసత్వాన్ని అందుకున్న ముఖేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా అత్యంత సంపన్నుడుగా, ఆసియా బిలియనీర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. -
బిజినెస్ టైకూన్ల తొలి జాబ్ ఏదో తెలుసా? మెగా స్టార్ల సక్సెస్ జర్నీ తెలుసా?
కష్టాల్లేని జీవితం ఉంటుందా? అంటే కచ్చితంగా ఉండదు. తర తమ స్థాయిల్లో ఏదో ఒక కష్టం, నష్టం ఉంటూనే ఉంటుంది. నిజానికి కష్టాలు కన్నీళ్లు, అవమానాలు, ఓటములు లేని జీవితంలో కిక్కే ఉండదు. పడాలి..లేవాలి.. ఫీనిక్స్ పక్షిలా పునరుజ్జీవంతో పైపైకి ఎదగాలి. మనలో చాలామంది చాలాసార్లు అనేక విషయాల్లో అనేక స్లారు ఫెయిల్ అవుతాం. అంతమాత్రాన ప్రయత్నాలు ఆపేస్తే ఎలా? అందరూ సిల్వర్ స్పూన్తోనే పుట్టరు. ఎదగాలని తపన ఉంటే చాలు.. మనకు మనమే పోటీ. చిన్న చిన్న ఉద్యోగాల తోనే అందలాన్ని ఎక్కిన వాళ్లు, ఎన్ని కష్టాలొచ్చినా వెరవక ఒక్కో మెట్టు ఎదిగారు. అలాంటి దిగ్గజాల స్ఫూర్తి దాయక ప్రస్థానం చూడండి.. ధీరూ భాయి అంబానీ: ఆసియా బిలియనీర్ ముఖేష్ అంబానీ తండ్రి ధీరూ భాయి అంబానీ కూడా చిన్న ఉద్యోగంతో మొదలుపెట్టి రిలయన్స్ లాంటి దిగ్గజ సంస్థకు ప్రాణం పోశారు. దుబాయ్‌లో పెట్రోలు బంకులో పనిచేసిన ధీరూ భాయ్ అంబానీ 1957లో దేశానికి తిరిగి వచ్చి దిగ్గజ కంపెనీ రిలయన్స్‌కు పునాది వేశారు. రతన్ టాటా బ్రిటీష్ ఇండియాలోని బొంబాయిలో 1937, 28 డిసెంబర్ పుట్టిన రతన్ టాటా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1961లో టాటా స్టీల్ షాప్ ఫ్లోర్లో బ్లాస్ట్ ఫర్నేస్, పార సున్నపురాయి సంస్థలో తొలి ఉద్యోగం చేశారు. నిబద్ధతకు, నిజాయితీకి మారుపేరుగా దేశంలోని గొప్ప వ్యాపారవేత్తలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఎలాన్ మస్క్: చిన్నతనం నుంచి అంతరిక్షంపై ఆసక్తి ఎక్కువగా ఉన్న మస్క్ తన 12వ ఏటా స్పేస్ థీమ్డ్ వీడియో గేమ్ బ్లాస్టర్‌కు కోడింగ్ చేశాడు. ఇపుడు సోషల్ మీడియా ప్లాట్‌పాం ట్విటర్ టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేతగా మస్క్ ఉన్నాడు. మార్క్ జూకర్బర్గ్ ఫేస్బుక్, మెటా వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌కి చిన్నతనం నుంచే ఇంటర్నెట్, టెక్నాలజీపై ఆసక్తి ఎక్కువ. 18 ఏళ్లకే జుకర్‌బర్గ్ సినాస్సీ అనే మ్యూజిక్ రికమండేషన్ యాప్ తయారుచేశాడు. ఇపుడు మెటా ఫౌండర్‌గా బిలియనీర్‌గా ఉన్నాడు. జెఫ్ బెజోస్: 1980లో తొలి ఉద్యోగం మెక్ డోనాల్డ్స్‌లో ఫ్రై కుక్‌గా ఉద్యోగం, తొలి జీతం గంటకు రెండు డాలర్లు మాత్రమే సంపదన. ఆ తరువాత వాల్ స్ట్రీట్ హెడ్జ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. చివరికి 1994లో వాషింగ్టన్‌లోని బెల్లేవ్‌లోని గ్యారేజీలో అమెజాన్‌లో జాబ్ చేశారు. ఇపుడు అమెజాన్ సీఈవోగా తన ప్రతిభను చాటుకుంటున్నారు. ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి: ఐఐఎం అహ్మదాబాద్‌లో ఫ్యాకల్టీ, తరువాత రిసెర్చ్ అసోసియేట్‌గా మొదలైన ఆయన ప్రయాణం దేశంలో ఐటీ దిగ్గం ఇన్ఫోసిస్ కో వ్యవస్థాపకుడి దాకా చేరింది. ఐటీ రంగంలో నారాయణమూర్తిని మెగాస్టార్ అనడంలో ఎలాంటి సందేహంలేదు. వారెన్‌బఫెట్ బెర్క్లైన్ హాత్వే ఛైర్మన్, స్టాక్ మార్కెట్ దిగ్గజం వారెన్‌బఫెట్ 1944లో వాషింగ్టన్ పోస్ట్ పేపర్ బాయ్‌గా ఉద్యోగం, నెల జీతం 173 డాలర్లు . కేఎఫ్‌సీ: అనేక ప్రయత్నాల్లో వైఫల్యాలు, ఓటమి తరువాత కెంటకీ ఫ్రైడ్ చికెన్ హర్లాండ్ శాండర్స్ 60 వ ఏట కేఎఫ్‌సీ మొదలు పెట్టి బిలియనీర్‌గా అవతరించారు. అబ్దుల్ కలాం: మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలాం కూడా బీద కుటుంబం నుండే వచ్చారు. కానీ దేశ మొదటిపౌరుడిగా ఉండారని కలగన్నారా? కానీ దేశాధ్యక్షుడిగా సేవలందించిన ఘనతను చాటుకున్నారు. స్టీఫెన్ హాకింగ్: ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త విశ్వ రహస్యాలను చేధించిన వ్యక్తి. 21 సంవత్సరాల వయస్సులో సమస్య, 1980ల పూర్తిగా పవర్చైర్ కే అంకితం. అయినా కడ శ్వాస దాకా విశ్వం గురించిన లోతైన అధ్యయనాలోతేనే గడిపారు. నటి మర్లీ మాట్లిన్ చిన్నప్పటి నుండి అవకరంతోనే జీవించారు. మా కానీ ఎక్కడి కృంగిపోలేదు. ధైర్యంగా వృత్తిలో ముందుకు సాగారు. 18 నెలల వయస్సులోనే వినికిడిని దాదాపు కోల్పోయి,ఉత్తమ నటిగా అకాడమీ అవార్డును గెలుచుకున్న మొదటి చెవిటి నటిగా ఖ్యాతి పొందారు. నాట్య మయూరి సుధా చంద్రన్: తనకు జరిగిన ప్రమాదం, కాలు కోల్పోవడం ఇవన్నీ అనుకోకుండా ఎదురైనా తీవ్ర కష్టాలు. కానీ కృత్రిమ కాలుతో నాట్యం చేయాలన్న తపనను తీర్చుకున్నారు. అంతేకాదు తన లాంటి వారెందరికో గొప్ప స్ఫూర్తిగా నిలిచారు. ఏఆర్ రెహమాన్: ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ తండ్రి చిన్నప్పుడే పోయారు. కుటుంబ భారం మీద పడింది. అయినా చిన్న చిన్న పనులు చేసుకుంటూ, తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ తన కలను సాకారం చేసుకున్నారు. గొప్ప మ్యూజిక్ డైరెక్టర్‌గా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. అమితాబ్ బచ్చన్ అంత ఎందుకు సన్నగా పీలగా, పొడవుగా ఉండే అమితాబ్ బచ్చన్ సినిమాలకు పనికిరావనే అవమానాన్ని ఎదుర్కొన్నాడు. మరిపుడు అనేక బ్లాక్ బస్టర్ మూవీలను బాలీవుడ్‌కు అందించి బాలీవుడ్ మెగాస్టార్‌గా అవతరించాడు. ఇప్పటికీ ఆయన సూపర్ స్టారే. ఇలా చెప్పుకుంటే పోతే థామస్ ఆల్వా ఎడిసన్ మొదలు, గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్లు జీవితాలు ఆదర్శం కావాలి. అలాగే ఇవాల్టి స్టార్టప్ యుగంలో స్టార్టప్ కంపెనీలతో మొదలై వేలకోట్ల వ్యాపార సామ్రజ్యాన్ని సృష్టిస్తున్నవారు చాలామందే ఉన్నారు. సంకల్పం ఉంటే చాలు.. ఎలాంటి కష్టమైనా దిగదిడుపే. -
అంబానీ ఇంట కొత్త వారసురాలొచ్చింది!
-
మోహన్ లాల్ గ్యారేజిలో ధీరూభాయ్ అంబానీ కారు
ప్రముఖ మలయాళీ నటుడు 'మోహన్ లాల్' గురించి దాదాపు అందరికి తెలుసు. తనదైన నటనతో ప్రేక్షలకులను ఆకట్టుకున్న ఈయన తెలుగు ప్రేక్షలకులకు కూడా సుపరిచయమే. మోహన్ లాల్ ఇతర సెలబ్రిటీల మాదిరిగానే ఎప్పటికప్పుడు లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ కారణంగానే అతని గ్యారేజిలో చాలా కార్లు ఉన్నాయి. ఇందులో ధీరూభాయ్ అంబానీకి చెందిన పాతకాలపు కాడిలాక్ కారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మోహన్ లాల్ గ్యారేజిలో ఎన్ని కార్లు ఉన్నప్పటికీ హిందూస్తాన్ అంబాసిడర్, కాండిలాక్ కార్లు చాలా ప్రత్యేకం. eisk007 ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడైన ఫొటోలో ఈ పాతకాలపు కారుని చూడవచ్చు. ఆ కారు పక్కన ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ బాలాజీ ఉండటం కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. దీనిని బాలాజీ కొనుగోలు చేసినట్లు చెబుతారు. ఆయన స్వయానా మోహన్ లాల్ మామగారు. ఆయన నిర్మించిన చాలా సినిమాల్లో ఈ కారు ఉపయోగించినట్లు సమాచారం. ఫొటోలో కనిపించే ఈ కారు 1958 మోడల్ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కాడిలాక్ సెడాన్ అని తెలుస్తోంది. ఇది ఒకప్పుడు ధీరూభాయ్ అంబానీ ఉపయోగించినట్లు చెబుతున్నారు. ఇది పాతకాలపు కారు అయినప్పటికీ ఇప్పటికీ కొత్తగా కనిపిస్తోంది. దీనికి MAS 2100 నెంబర్ ఉంది. ఈ కారుని ఎప్పుడు కొనుగోలు చేశారనేదానికి ఖచ్చితమైన అధరాలు లేవు. ప్రస్తుతం ఈ మోడల్ కారు మార్కెట్లో లేదు. (ఇదీ చదవండి: భారత్‌లో ఆరు ఎయిర్ బ్యాగులు కలిగి టాప్ 5 కార్లు - ధరలు ఎలా ఉన్నాయంటే?) భారతీయ మార్కెట్లో ఒకప్పుడు కాడిలాక్ కారు వివిధ రకాల ఇంజిన్ ఆప్షన్లలో లభించేది. అయితే మోహన్ లాల్ గ్యారేజిలో ఉన్న ఆ కారు ఇంజిన్ స్పెషిఫికేషన్స్ కూడా వెలుగులోకి రాలేదు. కానీ ఇప్పటికీ మంచి కండిషన్లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మోహన్ లాల్ గ్యారేజిలో టొయోట వెల్ఫైర్, ఇన్నోవా క్రిష్టా, టయోటా ల్యాండ్ క్రూయిజర్, మెర్సిడెస్ బెంజ్ జిఎల్350, లంబోర్ఘిని ఉరుస్ వంటి అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. View this post on Instagram A post shared by Eisk007 (@eisk007) -
రిలయన్స్ ఫౌండర్ అంబానీ: తొలి జీతం రూ.300, ఆసక్తికర విషయాలు
సక్సెస్ఫుల్ బిజినెస్ మేన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫౌండర్ ధీరజ్‌లాల్ హీరాచంద్ అంబానీ (ధీరూభాయ్) ఏం చదువుకున్నారో తెలుసా? దిగ్గజ కార్పొరేట్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ధీరూభాయ్ పదో తరగతి మాత్రమే పూర్తి చేశారంటే నమ్ముతారా? ఒకప్పుడు పెట్రోల్ పంపులో పని.. కానీ ఆ తరువాత వేల కోట్ల రూపాయలతో వ్యాపార దిగ్గజంగాఎదిగిన ధీరూభాయ్ అంబానీ గురించి అంతగా తెలియని ఆసక్తికరమైన విషయాలు సాధారణ కుటుంబంలో జననం, కష్టాలు ధీరూభాయ్ అంబానీ గుజరాత్, జునాగద్ జిల్లాలో చోర్వాడ్ అనే చిన్న గ్రామంలో 1932, డిసెంబరు 28న జన్మించారు. సామాన్య టీచర్ కుటుంబంలో నలుగురు తోబుట్టువులతో జీవితం కష్టాలతోనే ప్రారంభమైంది. ముఖ్యంగా కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ధీరూభాయ్ అంబానీ తన చదువును కూడా మధ్యలోనే వదిలివేసి కుటుంబానికి అండగా ఉండేందుకు చిన్న చిన్న పనులు చేశారు. పెట్రోలు బంకులో పని, నెలకు రూ.300 బిలియన్ డాలర్ల కంపెనీ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ ప్రారంభంలో బ్రిటిష్ కాలనీ ఆఫ్ అడెన్‌లోని పెట్రోల్ బంకులో అటెండెంట్‌గా పనిచేశారు. ఆ సందర్భంగా నెలకు 300రూపాయలు జీతంగా తీసుకునేవారట. అంతకుముందు కుటుంబ పోషణ కోసం అనేక పనులు చేశారు.కానీ అవి నచ్చకపోవడంతో మిడిల్ ఈస్ట్ ఆసియా దేశమైన యెమెన్‌కు వలస వెళ్లి పెట్రోల్ బంకులో పని మొదలు పెట్టారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తీప్పింది. సూయజ్‌కు తూర్పున ఉన్న అతిపెద్ద ఖండాంతర వాణిజ్య సంస్థలో ట్రేడింగ్, అకౌంటింగ్, ఇతర వ్యాపార నైపుణ్యాలను నేర్చుకున్నారు. కొన్నేళ్లలోనే మంచి స్థానానికి ఎదిగారు. ఆ తరువాత అన్నింటినీ వదిలి తిరిగి భారతదేశానికి తిరిగి వచ్చేశారు. రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ ఇండియాకి వచ్చిన తరువాత 1958లో తన బంధువు చంపక్లాల్దమానీతో కలిసి తొలి కంపెనీ రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ (సుగంధ ద్రవ్యాలు, నూలు వ్యాపారం) కంపెనీ స్థాపించారు. నూలు వ్యాపార పరిశ్రమలో పెరుగుతున్న అవకాశాలను గుర్తించిన తర్వాత ధీరూభాయ్ తన వ్యాపారాన్ని మార్చేశారు. మూడేళ్ల తర్వాత 1962లో రిలయన్స్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను లాంచ్ చేశారు. బంధువు చంపక్లాల్ దమానీతో విడిపోయిన తరువాత 1966లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 'రిలయన్స్ టెక్స్టైల్స్' అనే బట్టల మిల్లును ప్రారంభించారు. దీంతో అతని జీవితంలో అత్యంత మలుపు తిరిగింది. ఇక తరువాత మళ్ళీ ఎప్పుడూ వెనుదిరిగి చూసింది లేదు. అంచెలంచెలుగా రిలయన్స్ సామ్రాజాన్నివిస్తరించారు. అలాగే భారతదేశంలోని సగటు పెట్టుబడిదారులకు స్టాక్ మార్కెట్‌ను పరిచయం చేసిన ఘనత అంబానీకి దక్కుతుందని మార్కెట్ నిపుణులమాట. భారతదేశంలో అతిపెద్ద ఎగుమతిదారుగా ఫార్చ్యూన్ 500లోచోటు దక్కించుకున్న తొలి ఇండియన్ ప్రైవేట్ కంపెనీగా రిలయన్స్ టెక్స్టైల్స్ నిలిచింది. అలాగే 1996, 1998, 2000 సంవత్సరాల్లో ఆసియావీక్ పత్రిక 'పవర్ 50- ఆసియాలో మోస్ట్ పవర్ఫుల్ పీపుల్' జాబితాలో చేరారు. దీంతోపాటు1999 సంవత్సరంలో బిజినెస్ ఇండియా 'బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును కూడా అందుకున్నారు. 69 ఏళ్ల వయసులో ధీరూభాయ్ అంబానీ 2002 జూలై 6న ముంబైలో కన్నమూశారు. (టాటా, బిర్లా సక్సెస్ సీక్రెట్ ఇదే? అనంత్, రాధికా మర్చంట్ అడోరబుల్ వీడియో వైరల్) ఖరీదైన రెస్టారెంట్లలో టీ తాగేవారు తాజా వ్యాపార ఆలోచనలకోసం, తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి, ధీరూభాయ్ అంబానీ సంపన్న వ్యాపారవేత్తలతో కలిసి తిరిగేవారట. నెట్వర్క్ , పరిశ్రమ గురించి తెలుసుకోవడానికి, ఖనీదైన రెస్టారెంట్లలో టీ తాగేవారని చెబుతారు. (అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ) ధీరూభాయ్ అంబానీ భార్య పేరు కోకిలాబెన్. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వీరు ముఖేశ్ అంబానీ, అనిల్ అంబానీ, నినా కొఠారి, దీప్తి సల్గోకర్. ఆస్తులను తన ఇద్దరు కుమారులు ముఖేశ్, అనిల్ అంబానీలకు పంచి ఇచ్చారు. 2002లో ఆయన మరణించే ముందు వరకు కంపెనీని పర్యవేక్షించిన ఆయన 1980ల మధ్యకాలంలో తన కుమారులు ముఖేశ్ అంబానీ, అనిల్ అంబానీలకు అప్పగించారు, ఆయన వారసత్వాన్ని అందుకున్న ముఖేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా ఆసియా బిలియనీర్, భారతదేశంలో అత్యంత సంపన్నుడుగా నిలిచిన సంగతి తెలిసిందే. (షాకింగ్! ప్రపంచంలోనే ఖరీదైన లిక్విడ్: చిన్న డ్రాప్ ధర పదివేలకు పైనే) -
Mukesh Ambani : బిజినెస్ నుంచి తప్పుకుంటే నెక్ట్స్ చేయబోయే పని అదే
దేశంలోనే అత్యంత సంపన్నుడిగా ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో ఉన్నారు. జియోతో దేశీ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఓవైపు సంప్రదాయ పెట్రోకెమికల్ వ్యాపారంలో ఉంటూనే మరోవైపు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గ్రీన్ ఎనర్జీపై భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. 90.70 బిలియన్ డాలర్ల సంపద ముకేశ్ సొంతం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నివాస గృహం అతని సొంతం. కానీ చిన్నప్పటి నుంచి ముకేశ్‌ను అంటిపెట్టుకున్న ఓ కోరిక ఇప్పటికీ సంపూర్ణంగా తీర్చుకోలేకపోతున్నారు ముకేశ్ అంబానీ. ఆ కోరిక ఏంటీ? ఆ కోరికను ఆయన ఎలా తీర్చుకున్నారనే అంశాలను వివిధ ఇంటర్యూల్లో ముకేశ్ నీతా అంబానీలు చెప్పిన వివరాల ఆధారంగా ఏప్రిల్ 19న ముకేశ్ అంబానీ బర్త్‌డే స్పెషల్ కథనం... ధీరుభాయ్ అంబానీ యెమెన్‌లో పెట్రోల్ పంపులో పని చేసే రోజుల్లో ముకేశ్ అంబానీ అక్కడే జన్మించాడు. ఆ తర్వాత ఆ కుటుంబం ముంబైలో స్థిరపడింది. తండ్రికి ఉన్న పెట్రో కెమికల్స్, వస్త్ర పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా ముంబైలోనే పెట్రో కెమికల్స్ ఇంజనీరింగ్‌లో పట్టా సాధించాడు ముకేశ్ అంబానీ. ఆ తర్వాత మాస్టర్స్ పూర్తి చేసేందుకు అమెరికా వెళ్లాడు ముకేశ్. మాస్టర్స్ పూర్తి కాగానే తనకిష్టమైన రంగంలో కొద్ది రోజలు పని చేసి ఆ తర్వాత కుటుంబ వ్యాపారాలు చూసుకోవాలని కలగన్నాడు. అయితే మాస్టర్స్ మధ్యలో ఉండగానే ఇండియాకి వచ్చేయమంటూ తండ్రి నుంచి పిలుపు వచ్చింది. తండ్రి నుంచి పిలుపు క్లాసురూముల్లో కంటే క్షేత్రస్థాయిలోనే ఎక్కువ జ్ఞానం, అనుభవం వస్తుందనేది ధీరుభాయ్ అంబానీ నమ్మకం. అందుకే కొడుకు ముకేశ్‌ను చదువు మధ్యలో ఇండియాకి వచ్చేయమన్నాడు. వచ్చి రాగానే ఉద్యోగం చేయడం నీ లక్ష్యమైతే నువ్వో మేనేజర్ అవుతావ్. ఎంట్రప్యూనర్‌గా రాణించాలంటే ఇక్కడున్న సమస్యలు ఏంటో గుర్తించు, వాటికి పరిష్కారం ఆలోచించు అంటూ చెప్పేశారు. దీంతో తన కలల ఉద్యోగాన్ని పక్కన పెట్టి తండ్రి చెప్పినట్టుగా సమస్యలను అన్వేషించే పనిలో పడ్డారు ముకేశ్. కాలంతో పరుగులు ఇదే సమయంలో టాటా, బిర్లాలతో పాటు పాలిస్టర్ బిజినెస్‌లోకి రిలయన్స్‌కి ఎంట్రీ లభించింది. కొత్తగా కర్మాగారం నిర్మించాల్సి వచ్చింది. దీంతో ఆ పనుల్లో బిజీ అయ్యాడు ముకేశ్. ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయ్యేసరికి అతనికెంతో ఇష్టమైన ఆ ఉద్యోగం చేయాలనే ఆశ ఎక్కడో మరుగున పడిపోయింది. కాలంతో పరుగులు పెట్టడమే అతని నిత్య జీవితం అయ్యింది. నీతా నృత్యం పగలు రేయి తేడా లేకుండా కష్టపడుతున్న కొడుక్కి ఓ తోడును చూడాలని నిర్ణయించుకున్నాడు ధీరుభాయ్. ఈ క్రమంలో ఓ కార్యక్రమంలో నృత్య ప్రదర్శన చేసిన నీతా ఆయన కంటపడింది. వెంటనే తనను కలవమంటూ కబురు పంపాడు. అంత పెద్ద బిజినెస్‌మేన్ ఎందుకు కలవమన్నాడో తెలియక కంగారు పడుతూనే రిలయన్స్ ఆఫీస్‌కి వెళ్లింది నీతా. స్నేహం వరకే ఇద్దరి మధ్య కాసేపు మాటలు పూర్తి కాగానే మా పెద్ద అబ్బాయిని కలవమంటూ చెప్పారు ధీరుభాయ్. అలా ముకేశ్, నీతాల మధ్య తొలి పరిచయం జరిగింది. ఆ తర్వాత అనేక సార్లు ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం జరుగుతూ వచ్చింది. ఇద్దరి మధ్య స్నేహం పెరుగుతున్నా కానీ పెళ్లి విషయంలో కాంక్రీట్‌గా ఏదీ జరగడం లేదు. మరోవైపు ఇంత పెద్ద ఫ్యామిలీలోకి వెళితే నా ఇండివీడ్యువాలిటీ నాకు ఉంటుందా అనే ప్రశ్నలు నీతాను వేధిస్తున్నాయి. పెళ్లి చేసుకుంటావా? ఓ రోజు కారులో నీతా, ముకేశ్ ఇద్దరు కారులో ప్రయణిస్తున్నారు. ముంబైలో రద్దీగా ఉండే పెద్దార్రోడ్లో కారు ప్రయాణిస్తోంది. చుట్టూ ట్రాఫిక్ రద్దీ, రణగొణ ధ్వనులు, కారు మీదకే దూసుకొస్తున్నట్టుగా అటు ఇటు నడుస్తున్న జనాలు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య ముకేశ్ ఒక్కసారిగా గొంతు సవరించుకుని.. విల్ యూ మ్యారీ మీ.... సే యస్ ఆర్ నో... నౌ ఇన్ దిస్ కార్ అంటూ మనసులో మాట చెప్పేశాడు. వెంటనే ‘పెళ్లి చేసుకోవడం ఇష్టమే కానీ వన్ కండీషన్’ అంటూ తడుముకోకుండా జవాబు ఇచ్చింది నీతా. కండీషన్స్ అప్లై పెళ్లైన తర్వాత ఇంటి పట్టునే ఉండకుండా ఉద్యోగం చేయాలన్నది తన అభిప్రాయమంటూ నీతా అంబానీ కండీషన్ పెట్టింది. వెంటనే ఆ నిబంధనకు ముకేశ్ ఓకే చెప్పడంతో వాళ్ల పెళ్లి జరిగిపోయింది. అయితే పెళ్లి తర్వాత అంబానీ ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ బాధ్యతలు నీతాకి అప్పగించారు. ఇప్పటికీ ఆ స్కూల్ పనులు తానే చూస్తూ దాన్ని మరింతగా విస్త్రృతం చేశారామె. ఇద్దరి కల నెరవేరిన వేళ పెళ్లి తర్వాత ఉద్యోగం చేస్తానన్న నీతా అంబానీకి రిలయన్స్ సంస్థ పరిధిలో ఎన్నో మంచి పోస్టులు ఉన్నా ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ బాధ్యతలు అప్పగించడం వెనుక ఉన్న మతలబు ఏంటంటే ముకేశ్ అంబానీకి టీచింగ్‌పై ఉన్న మక్కువ. అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత కొంత కాలం వరల్డ్ బ్యాంకులో ప్రొఫెసర్‌గా టీచింగ్ చేయాలని కలగన్నాడు ముకేశ్. కానీ అది తీరకుండానే తండ్రి ఆజ్ఞలతో వ్యాపారంలోకి వచ్చేశాడు. నీతాతో మూడుముళ్లు వేసి ఏడడుగులు నడిచాక ఇద్దరికి నచ్చేట్టుగా ‘టీచింగ్ జాబ్ ’లోకి నీతాని తీసుకు వచ్చారు. వ్యాపారాలను పక్కన పెట్టిన రోజు మా సంతృప్తి కోసం టీచింగ్ చేస్తామంటున్నారు అంబానీ దంపతులు. చదవండి: నీతా అంబానీ చెబుతున్న సక్సెస్ సీక్రెట్స్, ఆర్థిక పాఠాలు -
నాయకత్వ మార్పిడి కసరత్తు నడుస్తోంది
న్యూఢిల్లీ: దేశంలో అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ (64) తన వారసులకు ‘రిలయన్స్’ సామ్రాజ్యాన్ని అప్పగించే పనిని ప్రారంభించినట్టు ప్రకటించారు. తనతో సహా సీనియర్లతో కలసి ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. వారసత్వ ప్రణాళికల గురించి అంబానీ మాట్లాడడం ఇదే మొదటిసారి. ముకేశ్ అంబానీకి కవలలు ఆకాశ్, ఇషాతోపాటు అనంత్ ఉన్నారు. రిలయన్స్ కుటుంబ దినం సందర్భంగా ముకేశ్ అంబానీ మాట్లాడారు. రిలయన్స్ సామ్రాజ్య వ్యవస్థాపకుడు ధీరూభాయి అంబానీ వర్ధంతి నాడు కుటుంబ దినం జరుపుకుంటూ ఉంటారు. రానున్న సంవత్సరాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచంలోనే అత్యంత బలమైన, ప్రసిద్ధి చెందిన భారత బహుళజాతి సంస్థగా అవతరిస్తుందన్నారు. శుద్ధ, గ్రీన్ ఎనర్జీలోకి ప్రవేశించడంతోపాటు.. రిటైల్, టెలికం వ్యాపారాలతో అసాధారణ స్థాయికి రిలయన్స్ చేరుకుంటుందని చెప్పారు. సరైన నాయకత్వంతోనే సాధ్యం.. ‘‘పెద్ద కలలు, అసాధారణమనుకునే లక్ష్యాలు సరైన వ్యక్తులు, సరైన నాయకత్వంతోనే సాధ్యపడతాయి. రిలయన్స్ ఇప్పుడు ముఖ్యమైన, నాయకత్వ మార్పిడిలో ఉంది. సీనియర్లు అయిన నాతరం నుంచి.. యువ నాయకులైన తదుపరి తరానికి బదిలీ కానుంది. ఎంతో పోటీవంతమైన, ఎంతో అంకితభావం కలిగిన, అద్భుతమైన యువ నాయకత్వం రిలయన్స్‌లో ఉంది. మేము వారిని ప్రోత్సహించి నడిపించాలి. వారి వెనుకనుండి.. వారు మాకంటే మెరుగ్గా పనిచేస్తుంటే వెన్నుతట్టి ప్రోత్సహించాలి’’ అని అన్నారు. ఉన్నత శిఖరాలకు తీసుకెళతారు ‘‘ఆకాశ్, ఇషా, అనంత్ తదుపరి తరం నాయకులు. వారు రియలన్స్‌ను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే విషయంలో నాకు ఏ మాత్రం సందేహం లేదు. దిగ్గజ పారిశ్రామికవేత్త ధీరూభాయి అంబానీ మాదిరే వారిలోనూ ఎంతో చురుకుదనం, సామర్థ్యాలున్నాయి. రిలయన్స్‌ను మరింత విజయవంతంగా నడిపించాలని మనమందరం కోరుకుందాం’’ అని ముకేశ్ పేర్కొన్నారు. ప్రసంగంలో ఇషా భర్త ఆనంద్ పిరమల్, ఆకాశ్ భార్య శ్లోక, అనంత్‌కు కాబోయే భార్యగా ప్రచారంలో ఉన్న రాధిక పేర్లను అంబానీ ప్రస్తావించడం గమనార్హం. భవిష్యత్తుకు పునాది రాళ్లు రానున్న దశాబ్దాల్లో అపార అవకాశాలను సొంతం చేసుకునేందుకు వీలుగా రిలయన్స్ భవిష్యత్తు వృద్ధికి పునాదులు వేయాల్సిన సమయం ఇదేనని అంబానీ అన్నారు. ‘‘రిలయన్స్ తన స్వర్ణ దశాబ్దం రెండో భాగంలోకి అడుగుపెట్టింది. భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా ఉంటుందని చెప్పగలను. ప్రపంచ టాప్–3 ఆర్థిక వ్యవస్థల్లోకి భారత్ చేరుతుంది. రిలయన్స్ ప్రముఖ బహుళజాతి సంస్థగా అవతరిస్తుంది’’ అని అంచనాలను వ్యక్తీకరించారు. -
అభ్యాస అవంతిక
పిల్లల ఆలోచనలు ఎప్పుడూ నేర్చుకునే దశలోనే ఉంటాయని పెద్దలు అనుకుంటూ ఉంటారు. కానీ, 14 ఏళ్ల అమ్మాయి అవంతిక ఆలోచనలు నేర్పించే దిశగా ఉన్నాయని వారి పెద్దలు ఊహించి ఉండరు. రోజుల బిడ్డ నుంచి మూడేళ్ల పిల్లల లక్ష్యంగా చేసుకొని ‘సీఖ్’ అని ఓ లెర్నింగ్ ప్రోగ్రామ్‌ను రూపొందించింది అవంతిక. తనే ఇంట్లో ఓ చిన్నపిల్ల అనుకునే అవంతిక చేసిన ఈ పెద్ద ఆలోచన గురించి తల్లిదండ్రులు దృష్టి పెట్టాల్సి అవసరం ఎంతైనా ఉంది. ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థిని అవంతిక కంపాని. సాధారణంగా 13, 14 ఏళ్ల వయసు పిల్లల్లో వ్యాపారాత్మకంగా అంటే బేకింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నుండి క్రీడల వరకు వివిధ డొమైన్లలో ఆలోచనలు చేస్తారు. కానీ, అవంతిక మాత్రం రోజుల బిడ్డ నుంచి మూడేళ్ల వయసు పిల్లల మానసిక అభివృద్ధికి ఏం చేయవచ్చో ఓ ప్రణాళికను రూపొందించింది. చంటి పిల్లల శారీరక ఎదుగుదలకు కావల్సిన ఆహారం ఇవ్వడంలో జాగ్రత్తలతో పాటు మానసిక ఎదుగుదలకు సహాయపడే అభ్యాసాన్నీ ఇవ్వాలంటుంది. శిశువులు, పసిబిడ్డల కోసం సృష్టించిన ఇంటరాక్టివ్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌ను కిందటేడాదే ప్రారంభించింది అవంతిక. గుర్తించడమే నాంది ఈ శిక్షణా ప్రోగ్రామ్ గురించి తనలో ఆలోచన కలగడానికి గల కారణాల గురించి అవంతిక మాట్లాడుతూ ‘మా కజిన్ కొడుకు ఆరు నెలల వయస్సు వరకు మా ఇంట్లోనే ఉన్నాడు. వాడితో నేను బాగా ఆడుకునేదాన్ని. వాడి చేష్టలు నన్ను బాగా ఆకట్టుకునేవి. ఆ బాబు తన చుట్టూ ఉన్న విషయాల పట్ల ఉత్సుకత, ఉత్సాహంగా చూసే విధానాన్ని గమనించడం ప్రారంభించాను. పిల్లలు తినడం, నిద్రపోవడం, ఏడవడం .. వంటివాటికన్నా ఇంకా ఎన్నో గ్రహించగలరని గుర్తించాను. పుట్టినప్పటి నుండి ఐదేళ్ల వయసు వరకు పిల్లల మెదడు అన్ని వయసుల కన్నా ఎక్కువ అభివృద్ధి చెందుతుందని, ఆ దిశగా పరిశోధన ప్రారంభించాను’ అంటోంది అవంతిక. ఇలా ఆలోచించిన అవంతిక శిశువుల మైండ్‌ను ఇంకా చురుగ్గా చేసే సాధనాన్ని అభివృద్ధి చేసింది. మానసిక నిపుణుల సాయం అవంతిక తన ఆలోచనను క్లాస్‌మేట్స్‌తో పంచుకుంది. క్లాస్మేట్ నమితా థాపర్, అతీత్ సంఘవితో పాటు తన బంధువు, కార్పోరేట్ ఉద్యోగి గరిమా జిందాల్‌లు అవంతిక ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయడంలో సహాయపడ్డారు. అంతకుముందు ఈ విషయమ్మీద టీచర్లు, వైద్యులు, పిల్లల మనస్తత్వవేత్తలతో మాట్లాడింది. తాను తెలుసుకున్నది వాస్తవమని గ్రహించాక, 2020 లో ‘సీఖ్’ అనే పరిశోధన ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. డిజైన్ రూపకల్పన అంశంపై ఆర్టిస్టులతో కలిసి పనిచేసింది. ఇంటరాక్టివ్ ఫ్లాష్కార్డ్లతో ఉండే ఈ ప్రోగ్రామ్‌లో పిల్లల మెదళ్లను ఎలా బలోపేతం చేయాలో తల్లిదండ్రులకు చిట్కాలను అందిస్తుంది అవంతిక. వివరణాత్మక ప్రోగ్రామ్ అవంతిక తన ప్రోగ్రామ్ బాక్స్ గురించి వివరిస్తూ ‘బాక్స్‌లో మొత్తం 72 కార్డులు ఉంటాయి. వీటిని ఆరు భాగాలుగా విభిజించాం. ప్రతి ఒక్క కార్డు పిల్లల మెదడును అభివృద్ధి చేయడానికి, పదును పెరగడానికి సహాయపడుతుంది. ఈ కార్డులు పిల్లల దృష్టిని మరల్చలేవు. వారిలో కొత్త నాడీ కనెక్ష¯Œ లను వృద్ధి చేయడంలో సహాయపడతాయి. వీటిలో పిల్లల దృష్టిని ఇట్టే ఆకర్షించే నలుపు, తెలుపు, ఎరుపు రంగులను ఎంచుకున్నాను. ఆ తర్వాత చుక్కలు పరిమాణాలను సూచిస్తాయి కాబట్టి సంఖ్యను ఎలా రాశారో దానితో అనుసంధానించడానికి బదులుగా, పిల్లవాడు ఆ సంఖ్యను దాని పరిమాణంతో గుర్తిస్తాడు. కార్డ్ టచ్ అండ్ ఫీల్ వల్ల అర్థం చేసుకుంటాడు. ప్రతి ఫ్లాష్ కార్డ్ లో ఒక సర్కిల్ ఉంటుంది. అందులో జనపనార, వెల్వెట్, స్పాంజి, ఇసుక, అట్ట వంటి విభిన్న పదార్థాలను పిల్లలు తాకి అనుభూతి చెందుతారు. ఈ కార్డ్స్‌తో తల్లిదండ్రులు తమ బిడ్డతో ఎలా బంధాన్ని పెంచుకోవచ్చో చిట్కాలు కూడా ఉంటాయి’ అని గలగలా వివరిస్తుంది. బహుమతిగా కార్డు బాక్స్ ఈ కార్డు బాక్స్‌ను తమతో ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. పిల్లలున్నవారికి బహుమతిగా ఇవ్వచ్చు. పిల్లలను బిజీగా ఉంచే ఈ లెర్నింగ్ కార్డుల ప్రాచుర్యానికి అవంతిక తన ఇ¯Œ స్టాగ్రామ్ పేజీని ఉపయోగిస్తుంది. ఆ పేజీ ద్వారా మొదటగా కార్డ్ బాక్స్‌ను కొనుగోలు చేసిన కస్టమర్లలో ఒకరైన డాక్టర్ మెహతా అవంతికకు తన అభిప్రాయాన్ని పోస్టు చేస్తూ–‘నేను సీక్ ప్యాక్‌ను తీసుకోవడానికి ముందు ఇలాంటివి ఆ¯Œ లై¯Œ లో లభించే ఇతర ఫ్లాష్ కార్డుల మాదిరిగా ఉంటుందేమో అనుకున్నాను. కానీ, మిగతావాటికన్నా ఇది చాలా భిన్నమైనదని గ్రహించాను. వివిధ రకాల కార్డుల నమూనాలు, రంగులు, ఆకర్షణీయమైన లే అవుట్, పరిశోధించిన కంటెంట్, అల్లికలు.. ఇవన్నీ చూసిన తర్వాత నా ఆరు నెలల కుమార్తెను ఈ కార్డులు బిజీగా ఉంచుతాయని నమ్మాను’ అని తెలిపారు. అవంతిక ఈ కార్యక్రమాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చిన మొదటి మూడు నెలల్లోనే 200కి పైగా యూనిట్ల ప్యాక్స్ అమ్ముడుపోయాయి. చంటిపిల్లల తల్లులు, కిడ్స్ స్కూళ్లు, మూడేళ్ల వయసున్న పిల్లల కుటుంబాలు ఈ ప్యాక్స్‌ను కొనుగోలు చేశాయి. డే వన్ అనే సంస్థ కింద పిల్లలు, శిశు అభివృద్ధికి సహాయపడటానికి మరిన్ని ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని అవంతిక యోచిస్తోంది. సంగీతం పట్ల మక్కువ ఉండే అవంతిక హిందూస్థానీ క్లాసికల్ ట్యూ¯Œ ్స పిల్లల మెదడు పెరగడానికి ఎలా సహాయపడుతుందనే అంశంపై ఇప్పటికే తన పరిశోధనను ప్రారంభించింది. శిశువుల మానసిక ఎదుగుదలకు సంబంధించిన అంశాల్లో ప్రావీణ్యం సంపాదిస్తున్న టీనేజర్ అవంతిక నవతరపు ఆలోచనలకు సరికొత్త ప్రతీక. -
బీసీసీఐకి అంబానీ షరతు
తొలి మూడు ప్రపంచ కప్‌లు ఇంగ్లండ్‌లో నిర్వహించిన తర్వాత దానిని ఆసియా ఖండానికి తరలించడం అంత సులువుగా జరగలేదు. 1987లో భారత్, పాకిస్తాన్ సంయుక్తంగా ‘రిలయన్స్ వరల్డ్ కప్’కు ఆతిథ్యమిచ్చాయి. ఐసీసీలో మాట నెగ్గేందుకు అసోసియేట్ దేశాలకు భారీ మొత్తాన్ని ఆఫర్ చేయాల్సి వచ్చింది. రెండు దేశాల క్రికెట్ పరిపాలకులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల మధ్య పలుమార్లు చర్చోపచర్చలు సాగాయి. నిర్వహణ కోసం ఇండియా పాకిస్తాన్ జాయింట్ మేనేజ్మెంట్ కమిటీ (ఐపీజేఎంసీ) ఏర్పాటు చేశారు. అంతా జరిగాక స్పాన్స ర్షిప్ కోసం ప్రయత్నిస్తే లండన్‌లో స్థిరపడిన ఒక భారతీయ వ్యాపారి ముందుకు వచ్చాడు. అయితే ప్రధాని రాజీవ్ గాంధీకి ఇది నచ్చలేదు. భారత్‌లో జరిగే టోర్నీకి మళ్లీ విదేశీ వ్యక్తి టైటిల్ స్పాన్సర్ కావడం ఏమిటని ఆయన అసహనం వ్యక్తం చేశారు. దాంతో చివరకు ఐఎస్ బింద్రా, అప్పటి కేంద్ర మంత్రి ఎన్‌కేపీ సాల్వే కలిసి రిలయన్స్ అధినేత ధీరూభాయ్ అంబానీని ఒప్పించారు. డబ్బు గురించి కాకుండా తన ముందు ఒక షరతు విధించి అంబానీ స్పాన్సర్‌షిప్‌పై సంతకం చేశారని బింద్రా వెల్లడించారు. ‘ప్రపంచకప్‌కు ముందు భారత్, పాకిస్తాన్ మధ్య ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ జరగబోతోంది కదా. దేశవ్యాప్తంగా టీవీలో ఆ మ్యాచ్ ప్రత్యక్షంగా ప్రసారమవుతుంది. ఆ మ్యాచ్ జరిగే సమయంలో ప్రధానమంత్రి పక్కనే నాకు సీటు ఏర్పాటు చేయాలనేది నా షరతు’ అని అంబానీ తన మనసులో మాట చెప్పారు. ఐపీజేఎంసీ కాస్తా రిలయన్స్ కప్ ఆర్గనైజింగ్ కమిటీగా పేరు మార్చుకుంది. 1987 వరల్డ్ కప్ టైటిల్ స్పాన్సర్షిప్ కోసం నాడు రిలయన్స్ సంస్థ రూ. 9 కోట్లు చెల్లించింది! -
‘ధీరూబాయ్ అంబానీ స్వ్కేర్’ జాతికి అంకితం
ముంబై : ముంబై నగరం పట్ల తమకున్న ప్రేమను, కృతజ్ఞతను మరోసారి చాటుకున్నారు రిలయన్స్ అంబానీ దంపతులు. గురువారం ‘ధీరుభాయ్ అంబానీ స్వ్కేర్’ను ప్రారంభించిన నీతా అంబానీ 20 మిలియన్ల ముంబై నగర ప్రజల కోసం దాన్ని దేశానికి అంకితం చేశారు. ముంబై బాంద్రా కుర్ల కాంప్లెక్స్‌లోని ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌కు ఎదురుగా ఉన్న ప్రపంచ శ్రేణి బహుళ విధ వినియోగవేదిక జియో వరల్డ్ సెంటర్లో ‘ధీరుభాయ్ అంబానీ స్వ్కేర్’ ఒక భాగం. ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ.. భారతదేశం గర్వించదగిన ముద్దుబిడ్డ ధీరూభాయ్ అంబానీ దూరదృష్టి ఫలితమే ‘ధీరుభాయ్ అంబానీ స్క్వేర్’, ‘జియోవరల్డ్ సెంటర్’ అని అభిప్రాయపడ్డారు. ఈ అద్భుతమైన ఫౌంటెయిన్ అందరి హృదయాంతరాల్లో సంతోషాన్ని, విశ్వాసాన్ని నింపుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ మ్యూజికల్ ఫౌంటెయిన్ ముంబై వాసులకు మరింత ఆహ్లాదాన్ని కలిగిస్తుందన్నారు. జియో వరల్డ్ సెంటర్లోని ఈ స్క్వేర్ భవిష్యత్ ముఖచిత్రాన్ని మార్చేలా సందర్శకుల ఆదరణ పొందడమే కాక.. ముంబై నగర వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్తుందన్నారు. ఈ సందర్భంగా 2000 మంది పిల్లలతో మ్యూజికల్ ఫౌంటెయిన్ నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మార్చి 12న మరో రెండు మ్యూజికల్ ఫౌంటెయిన్లను ఏర్పాటు చేయనున్నట్టు నీతా అంబానీ తెలిపారు. ముంబై నగర గొప్పదనాన్ని చాటి చెప్పేలా, ముంబైనగరాన్ని అన్నిరకాలుగా సురక్షితంగా ఉంచుతున్న వారందరినీ కీర్తించేలా ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. సమాజంలో మంచి మార్పులు తీసుకొచ్చేందుకు రిలయన్స్ ఫౌండేషన్ తన కార్యక్రమాలను కొనసాగిస్తుందని నీతా అంబానీ స్పష్టం చేశారు. ఇక, తమ కుమారుడు ఆకాశ్ అంబానీ వివాహం నేపథ్యంలో ముంబైలోని అనాథ శరణాలయాల్లో, వృద్ధాశ్రమాల్లో వారం రోజుల పాటు సాగే అన్నదాన కార్యక్రమాన్ని అంబానీ దంపతులు ప్రారంభించారు. కుటుంబసభ్యులతో కలిసి 2000 మంది పిల్లలకు భోజనం వడ్డించడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. -
పొద్దున లేవగానే ఇషాను చూడాల్సిందే!
ముంబై : ధీరుబాయి అంబానీగా పేరుపొందిన ధీరాజ్లాల్ హిరచాంద్ అంబానీ గురించి ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. పేదరికం నుంచి అత్యంత ధనికుడైన భారతీయుడు ఇతను. ఆయన స్థాపించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు ప్రపంచ వ్యాపారాల్లో ఒకటిగా ఉంది. ప్రపంచ అత్యంత ధనిక కుటుంబాలలో ప్రస్తుతం అంబానీలది కూడా ఒకటి. తొలిసారి 1977లో రిలయన్స్ పబ్లిక్ ఇష్యూకు వెళ్లింది. ఇక అప్పటి నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ తప్పకుండా ప్రతేడాది ఇన్వెస్టర్లతో ముచ్చటించడం, వారి సలహాలను, సూచనలను స్వీకరించడం, కొత్త కొత్త ఆవిష్కరణలను లాంచ్ చేయడం పరిపాటిగా వస్తోంది. రిలయన్స్ ఏజీఎం, ఇతర కంపెనీలలతో పోలిస్తే చాలా ప్రత్యేకమైనది. ఈ సమావేశంలో ఇన్వెస్టర్లతో ముచ్చటించడం జరుగుతుంది. పెట్టుబడిదారులు అడిగే ప్రశ్నలకు, చైర్మన్ ముఖేష్ సమాధానాలు ఇస్తూ ఉంటారు. ఇలా ఇన్వెస్టర్ల సలహాలు, సూచనలు, ప్రశ్నలతో ఈ సమావేశం ఎంతో ముచ్చటగా జరుగుతూ ఉంటుంది. గతవారంలో కూడా రిలయన్స్ తన 41వ వార్షిక సాధారణ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి కూడా చైర్మన్ ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ, తల్లి కోకిలాబెన్, అంబానీల గారాలపట్టి ఇషా అంబానీ, పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ, ఆయనకు కాబోయే భార్య శ్లోకా మెహతా, చిన్న కొడుకు అనంత్ అంబానీ ఇలా అందరూ ఇన్వెస్టర్ల సమావేశానికి హాజరయ్యారు. దక్షిణ ముంబై ఆడిటోరియమంతా కంపెనీ పెట్టుబడిదారులతో నిండిపోయింది. ఈ సమావేశంలో ఓ స్పీకర్, ముఖేష్ తండ్రి ధీరూభాయ్ అంబానీ గురించి ఎవరికీ తెలియని ఓ విషయాన్ని రివీల్ చేశారు. ధీరూభాయ్ అంబానీ తన రోజును అంబానీల ప్రిన్సెస్ ఇషా అంబానీని చూసిన తర్వాతనే ప్రారంభించేవారని చెప్పారు. పొద్దున లేవగానే ధీరూభాయ్ అంబానీ తొలుత ఇషా అంబానీ ఫోటోను చూస్తారని, ఆ అనంతరమే టీ లేదా టిఫిన్ తీసుకుని తన రోజూవారీ కార్యకలాపాలకు సిద్ధమవుతారని తెలిపారు. ప్రస్తుతం ఇషా మన కళ్ల ముందే పెరిగి, టెలికాం రంగంలో పెను సంచలనమైన జియోను ఆవిష్కరించినట్టు ఇన్వెస్టర్ల సమావేశంలో కొనియాడారు. అంటే ధీరూభాయ్‌కి ఇషా అంటే అంత ఇష్టమనమాట. ముఖేష్ అంబానీకి కూడా ఇషా అంటే ప్రాణమని పలు సందర్భాల్లో వెల్లడైంది. పెద్ద కొడుకు ఆకాశ్ పెళ్లితో పాటు, వారి గారాల పట్టి ఇషా పెళ్లిని కూడా పిరమాల్ గ్రూప్ వారసుడు ఆనంద్ పిరమాల్‌తో నిశ్చయమైన సంగతి తెలిసిందే. ఇషా పెళ్లి ప్రకటన చేసిన అనంతరం నిర్వహించిన పార్టీల్లో ముఖేష్ తన కూతురితో కలిసి డ్యాన్స్‌లు కూడా వేశారు. ఇటీవల ఆకాశ్-శ్లోకాల ఎంగేజ్మెంట్లో కూడా ముఖేష్ తన కూతురి ఇషాతో వేసిన డ్యాన్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. -
చిల్డ్రన్ హోమ్‌లో అంబానీ ఫ్యామిలీ..
ముంబై : నగరంలోని ఓ చిల్డ్రన్ హోమ్‌లో ముఖేష్ అంబానీ ఫ్యామిలీ సందడి చేసింది. శుక్రవారం ధీరూభాయ్ అంబానీ 16వ వర్థంతి సందర్భంగా వారు చిల్డ్రన్ హోమ్‌ను సందర్శించారు. ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ, కూతురు ఇషా అంబానీ, కాబోయే కోడలు శ్లోకా మెహతా అక్కడి పిల్లలతో సరదాగా ముచ్చటించారు. ముంబైలోని వృద్ధాశ్రమాలకు, అనాథాశ్రమాలకు కనీస అవసరాలను రిలయన్స్ ఫౌండేషన్ తీరుస్తోంది. దాదాపు 3500 మంది రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా లబ్ధిపొందుతున్నారు. వారికి అవసరమైన ఆహార పదార్థాలను, ఇతర వసతులను సమకూర్చటంలో ఫౌండేషన్ ముందుంటోంది . -
1,000 పెట్టుబడి.. 20.9 లక్షల రాబడి
ముంబై: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ గ్రూప్ 40వ వార్షిక వేడుకలు అట్టహాసంగా నిర్వహించింది. వ్యవస్థాపకుడు ధీరుభాయ్ అంబానీకి నివాళులర్పించింది. ధీరుభాయ్ సతీమణి కోకిలా బెన్, కొడుకు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ కుటుంబసభ్యులు ఇందులో పాల్గొన్నారు. ధీరుభాయ్ దార్శనికత, లక్ష్యాలు, సూత్రాలకు రిలయన్స్ గ్రూప్ కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా ముకేశ్ అన్నారు. రూ. 1,000తో ప్రారంభమైన కంపెనీ నేడు రూ. 6 లక్షల కోట్ల స్థాయికి ఎదిగిందన్నారు. 1977లో ఆర్ఐఎల్లో రూ. 1,000 ఇన్వెస్ట్ చేసిన వారి పెట్టుబడి విలువ ప్రస్తుతం 2009 రెట్లు పెరిగి రూ. 20.9 లక్షల స్థాయికి చేరిందన్నారు. ప్రపంచంలోని టాప్ 20 కంపెనీల్లో రిలయన్స్‌ను నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రకటించారు. డిసెంబర్ 28 ధీరుభాయ్ జయంతి సందర్భంగా రిలయన్స్ కార్పొరేట్ పార్క్‌లో నిర్వహించిన వార్షిక వేడుకలకు 50 వేల మందిపైగా హాజరయ్యారు. బాలీవుడ్ సూపర్‌స్టార్స్ అమితాబ్, షారుఖ్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 1,200 ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. -
అజ్ఞాత మూర్తి
• ధీరూభాయ్ అంబానీకి అదృష్టమూర్తి... • ముఖేశ్ అంబానీకి, అనిల్ అంబానీకి మాతృమూర్తి... • రిలయన్స్ ప్రగతికి అజ్ఞాతమూర్తి... కోకిలా బెన్. • భర్తకు నీడ, పిల్లలకు వెలుగు.. కోకిలాబెన్. ఒక దేశ ఆర్థిక వ్యవస్థనే ప్రభావితం చేయగల వ్యాపార మహా సామ్రాజ్యానికి రాజమాత అయిన కోకిలా బెన్ అజ్ఞాతంగా వెనుక ఉండి ఆ సామ్రాజ్యాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ముంబైలో అంబానీ సోదరుల మాతృమూర్తి కోకిలాబెన్‌కు ఉండేందుకైతే మూడు విలాసవంతమైన నివాస భవనాలు ఉన్నాయి. అయితే వాటిల్లో ఆమెకు ఏవేళనైనా కాస్తంత మనశ్శాంతిని చేకూర్చేది కఫ్ పరేడ్ ప్రాంతంలోని 18 అంతస్తుల ‘సీ విండ్’ మాత్రమే! మరీ ముఖ్యంగా అందులోని పదో అంతస్తు. ఆ అంతస్తులో పూజామందిరం ఉంది. అక్కడ ఆమె ఇష్టదైవం ‘శ్రీనాథ్జీ’ కొలువై ఉంటాడు. మిగతా రెండు నివాస భవనాలలో ఒకటి పెద్ద కొడుకు ముఖేశ్ అంబానీ దక్షిణ ముంబైలోని పెడర్ రోడ్డులో ముచ్చటపడి కట్టుకున్న 4,500 కోట్ల రూపాయల విలాసవంతమైన భవనం ‘ఆంటీలియా’! రెండోది, అన్నకు పోటీగా అనిల్ అంబానీ బాంద్రాలోని పాలీహిల్ ప్రాంతంలో ఐదు వేల కోట్ల రూపాయలతో నిర్మించుకున్న ‘అబోడ్’ భవంతి. అనుబంధాల కేంద్రబిందువు కొడుకులిద్దరి ఇళ్లల్లో కోకిలాబెన్ ఏ రోజు ఏ ఇంట్లో ఉంటారన్నది, ఏ ఇంటికి ఏ రోజున ఆమె అవసరం ఏర్పడిందన్నదాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. సాధారణంగా అనిల్‌కు అమ్మ అవసరం ఎక్కువగా కలుగుతుంటుంది. అమ్మ సలహా, అమ్మ ఓదార్పు, అమ్మ ప్రేమ, అమ్మ తీర్పు! అతడింకా పిల్లవాడే. ముఖేశ్.. అమ్మకు ఇష్టమైనట్లు నడుచుకుంటే, అనిల్ తనకు ఇష్టమైనట్లుగా అమ్మ మనసును మలుచుకుంటూ ఉంటాడు. ఇద్దరు కోడళ్లు నీతా, టీనా; తరచూ అమ్మ ఎక్కడ ఉంటే అక్కడకు వచ్చిపోతుండే ఇద్దరు కూతుళ్లు దీప్తి, నీనా.. ఇంకా మనవలు, మనవరాళ్లు.. వీళ్లందరి అనుబంధాల కేంద్రబిందువు కోకిలాబెన్. భర్త ధీరూభాయ్ అంబానీ జీవించి ఉన్న కాలంలో భారతదేశ వ్యాపార సామ్రాజ్యానికి ప్రథమ మహిళగా ఆయనకు చేదోడుగా నడిచిన కోకిల ఇప్పుడు తన తనయులను ఒకటిగా నడిపిస్తున్నారు. పిల్లల మధ్య ఆస్తి తగాదాలు! దేశానికి ఇవాళ అనుకోని ఆర్థిక కష్టం వచ్చినట్టే... పదేళ్ల క్రితం అంబానీల కుటుంబానికి అనుబంధాల కష్టం వచ్చింది. అది కుటుంబ కష్టం అయితే కావచ్చు. కానీ ఒక దేశాన్నే ఆర్థికంగా ప్రభావితం చెయ్యగల కుటుంబంలో వచ్చిన అపనమ్మకాల కష్టం అది. ఎప్పట్లాగే తల్లి కాళ్లకు చుట్టుకుపోయాడు అనిల్. ‘‘నలుగురం నీ పిల్లలమే. న్యాయం నువ్వే చెప్పాలి’’ అన్నాడు. కోకిలాబెన్‌కు అర్థమైంది. పిల్లల మధ్య ఆస్తి తగాదాలు!! ఆమె ఊహించనివి! తన భర్త కూడా ఊహించలేదు కాబట్టే వీలునామా రాయకుండా పోయారు. ఆయన పోయిన మూడేళ్ల తర్వాత.. అన్న మీద తమ్ముడు, అన్నదమ్ముల మీద అక్కచెల్లెళ్లు ఆయన ఉన్నప్పటంత నమ్మకంతో లేరు. అంటే.. తల్లిగా తను సరిగా లేనట్లే కదా! బయటివాళ్లు లోపలికి వచ్చేశారంటే.. లోపల ఉండీ తనేం చేస్తున్నట్లు?! ఆలోచించారు కోకిలాబెన్. దేవుడి ఎదుట ప్రమాణం ఆ సాయంత్రం దీపాలు పెట్టే వేళకు అంబానీ కుటుంబ సభ్యులంతా ‘సీ విండ్’ భవంతిలోని శ్రీనాథ్జీ ఎదుట నిలబడి ఉన్నారు. తల్లి, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. మొదట కోకిలాబెన్ అన్నదమ్ములిద్దరి చేతా ప్రమాణం చేయించారు.. గొడవలు పడబోమని. తర్వాత దేవుణ్ణి ప్రార్థించారు.. ఈ కుటుంబాన్ని ఎప్పటికీ కలిపి ఉంచమని. ఒక సాధారణ గృహిణిగానైతే కోకిలాబెన్ ఆ రెండు పనులు మాత్రమే చేయించి ఉండేవారు. ధీరూభాయ్ భార్యగా ఆయన స్థాపించిన సామ్రాజ్యం ముక్కలు చెక్కలు కాకుండా ఉండడం కోసం కుమారులిద్దరికీ దేవుడి సమక్షంలోనే నాలుగు శాసనాలు కూడా విధించారు. 1. రిలయన్స్‌ను చీల్చడానికి లేదు. 2. షేర్లు అమ్ముకుని ఎవరి దారిన వారు వెళ్లడానికి లేదు. 3.ఒకరిపై ఒకరు పోటీకి దిగడానికి లేదు. 4.బయటివారి జోక్యానికి అవకాశం కల్పించడానికి లేదు. ఇవాళ టాటాలుముక్కలవడానికి కారణాలు ఏవైనా కావచ్చు, అంబానీలు విడివిడిగానే అయినా ఒక్కటిగా ఉండడానికి ఏకైక కారణం మాత్రం కోకిలాబెన్. ‘ద్వారక’... ఇష్టమైన ఆలయం తల్లి చాటు బిడ్డ అంటారు. అలా.. కోకిలాబెన్ రిలయన్స్ చాటు తల్లి. యాభై ఏళ్ల క్రితం1966లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రారంభం అయిన క్షణం నుంచి ఎలాగైతే కంపెనీకి దూరంగా ఉంటూనే భర్తకు సలహాదారుగా ఉన్నారో, ఇప్పటి రిలయన్స్ మహాసామ్రాజ్యాన్నీ పిల్లలకు ఒక చోదకశక్తిగా ఉండి ముందుకు నడిపిస్తున్నారు కోకిలాబెన్. ఆమె తరచూ అనే మాట: ‘‘భగవంతుడు సర్వశక్తి సంపన్నుడు’’అని. ఆ సంపన్నుడి దర్శనభాగ్యం కోసం ఈ సంపన్నురాలు నిరంతరం తపిస్తూనే ఉంటారు. ఆమెకు ఇష్టమైన ఆలయం గుజరాత్, జామ్‌నగర్‌లోని ద్వారక. ఆ తర్వాత రాజస్థాన్‌లోని నాథ్ ద్వారా ఆలయం. ఏటా ఈ ద్వారకాధీశ, శ్రీనాథ ఆలయాలను కోకిలాబెన్ తప్పనిసరిగా దర్శించుకుని వస్తారు. ‘సీ విండ్’ నివాసంలో ఏడాదికి మూడుసార్లు పూజలు, పురాణ కచేరీలు జరిపిస్తారు. కృష్ణుడింట కోకిల పుట్టింది కోకిలాబెన్ పుట్టిందీ గుజరాత్‌లోని జామ్నగర్లోనే. ఆమె బాల్యం అంతా జామ్‌నగర్‌లోని ద్వారక ఆలయ పరిసరాల్లో గడిచింది.అందుకేనేమో ఆమెకు కృష్ణభగవానుడంటే అంత భక్తి. కోకిల తండ్రి రతీలాల్ జస్రాజ్ పటేల్. తపాలాశాఖ అధికారి. పేరుకే అధికారి. ప్రదర్శనకు ఏమాత్రం కాదు. వినయంగా, విధేయంగా, పొదుపుగా, నిరాడంబరంగా, నిజాయితీగా ఉండేవారు. తల్లి రుక్మిణీబెన్. భర్తకు తగిన భార్య. గృహిణి. కోకిలాబెన్‌తో కలిపి ఐదుగురు పిల్లలు. ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. ఇంతమందితో ఇల్లు గడవాలి. చదువులూ సాగాలి. భర్త తెచ్చే ఆ కొద్ది జీతంతోనే ఇల్లూ గడిచేది, చదువులూ సాగేవీ.. అప్పుడప్పుడూ అవసరంలో ఇంటికొచ్చి చెయ్యి చాచినవారికి రుక్మిణీబెన్ చేతినుంచి కొంత సహాయమూ అందేది! తల్లి నోట్లోంచి ఊడి పడింది! రుక్మిణీబెన్ చదువుకోలేదు. కానీ జీవితాన్ని చదివింది. ఆ జీవితాన్నే కోకిలాబెన్ చేతా చదివించింది. ఇంటి పనులతో పాటు కోకిలకు కుట్టు మిషన్‌పై కుట్లు, ఎంబ్రాయిడరీ నేర్పించింది. 1940లలో జామ్‌నగర్‌లో ఒకే ఒక స్కూలు ఉండేది. సజూబా గర్ల్స్ హైస్కూల్. ప్రభుత్వ పాఠశాల. అందులో మెట్రిక్యులేషన్ పాస్ అవడంతో పాటు, బాధ్యత గల అమ్మాయిగా ఇంట్లోనూ ఉత్తీర్ణురాలయింది కోకిల! వ్యక్తిత్వంలో తల్లి ఎలా ఉండేదో అచ్చంగా అలాగయింది! పెళ్లి కూడా అంతే. మరీ తొందరగా ఏం కాదు కానీ, 19 ఏళ్లకే అయింది. గుజరాత్‌లోనే.. చార్వాడ్ నుంచి జామ్నగర్కి కోకిల కుటుంబాన్ని వెతుక్కుంటూ వచ్చింది ధీరూభాయ్ అంబానీ కుటుంబం. అణకువ గల పిల్ల అందరికీ నచ్చింది. ముఖ్యంగా ధీరూభాయ్‌కి. అప్పుడతడికి 22 ఏళ్లు. వ్యాపారం కోసం అని ముంబై వచ్చేశాడు. ముంబైని చూడ్డం కోకిలకు అదే మొదటిసారి. ఆ తర్వాత ఆమె చాలా దేశాలు చూసింది. మొదట చూసిన దేశం ఎమెన్. ఏడెన్‌కు ఒంటరి ప్రయాణం! ఎమెన్ (అరబ్ కంట్రీ)లోని రేవు పట్టణం ఏడెన్‌లో భర్తకు ఉద్యోగం. ఆయనతో ఎమెన్ వెళ్లారు కోకిల. అక్కడ ఓ ట్రేడింగ్ కంపెనీలో గుమస్తా ధీరూభాయ్. గుమస్తా గుమస్తాగా ఉండిపోతే ఇప్పుడు రిలయన్స్ లేదు. అంబానీలూ లేరు. క్లర్కుగా ఉండి ట్రేడింగ్ కంపెనీ మెళకువ లన్నీ నేర్చుకున్నాడు ధీరూభాయ్. మనమే సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అన్నాడు. కోకిల సరేనన్నారు. అప్పటికే ముఖేశ్ పుట్టాడు. ముగ్గురూ ఇండియా వచ్చేశారు. భర్త ఏడెన్‌లో పనిచేస్తున్నప్పుడు ఒకట్రెండు సార్లు కోకిల ఒంటరిగా ముంబై నుంచి ఏడెన్ ప్రయాణించవలసి వచ్చింది! ఆ ప్రయాణం ఆమెకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. దేశం నుంచి దేశానికి ఒక్కదాన్నే సముద్రంపై వెళ్లగలిగినప్పుడు.. భర్తతో కలసి ఎన్ని సముద్రాలనైనా ఈదేయలేనా అన్నంత ఉత్సాహం కలిగింది ఆమెలో. ఒక విధంగా ప్రపంచం మొత్తం ఆమెకు ఒక జమ్నాగర్ అయింది! ‘కోకిలా... నేను కారు కొన్నాను’! జమ్నాగర్‌లో కారు అన్న వాహనాన్నే చూడలేదు కోకిల! మెట్టినింటికి చార్వాడ్ వెళ్లినప్పుడు కూడా ఆమె ఎడ్లబండ్లనే చూశారు. మామగారు హీరాచంద్ అంబానీకి పొలం ఉండేది. కొన్ని ఎడ్లబండ్లు ఉండేవి. వాటితో ఇల్లు నడిచేది. ధీరూభాయ్ ఏడెన్ వెళ్లిన కొన్నాళ్లకు కోకిలకు ఒక ఉత్తరం వచ్చింది. ‘‘కోకిలా.. నేను కారు కొన్నాను. నువ్విక్కడికి వచ్చినప్పుడు నిన్ను తీసుకెళ్లడానికి ఆ కారులోనే వస్తాను. కారు రంగేమిటో ఊహించగలవా? నాలాగే.. నలుపు’’ అని! కారు కొన్నందుకు కాదు కానీ, ఇదిగో ఈ సెన్సాఫ్ హ్యూమర్కే భర్త ఆమెకు విపరీతంగా నచ్చేశాడు. ఏడెన్‌లో దిగగానే కారుతో ప్రత్యక్షమయ్యాడు. అలా ఎడ్లబండి నుంచి ఏరోప్లేన్‌ల వరకు వచ్చింది కోకిల జీవనయానం. ఈ ప్రయాణంలో ఆమె నమ్మిన, నమ్మి పాటించిన, ఇప్పటికీ పాటిస్తున్న జీవన సూత్రం.. ‘సహాయం చెయ్యి. కానీ చేసినట్టు చెప్పకు’. పింక్ కలర్ ఇష్టం ⇔ కోకిలాబెన్‌కు లేత గులాబీ రంగు అంటే ఇష్టం. బర్త్‌డే పార్టీలు, ఇతర వేడుకల్లో ఆమె ఎక్కువగా పింక్ శారీలో కనిపించడానికి కారణం ఇదే. ⇔ ధీరూభాయ్ దగ్గర పెద్ద పడవలాంటి కాడిలాక్ కారు ఉండేది. అదంటే ఆయనకు ఇష్టం. ఎందుకనో కాడిలాక్ కారులో ప్రయాణించడానికి కోకిలాబెన్ ఆసక్తి చూపేవారు కాదు. మెర్సిడెస్‌లో వెళ్దాం అనేవారు. ⇔ శాకాహారి. ఇంట్లోకి నాన్‌వెజ్ వాసన కూడా రావడానికి లేదు. రోటీ, దాల్, ధోక్లీ ఐటమ్స్‌ని ఇష్టంగా తింటారు. ⇔ స్విట్జర్లాండ్ ఇష్టమైన దేశం. కానీ ఆ ఫుడ్డు, లాంగ్వేజీతో ఇబ్బంది పడేవారట. స్విట్జర్లాండ్ తర్వాత యు.కె. ముఖ్యంగా లండన్. ⇔ ఫారినర్స్‌లో కోకిలకు నచ్చే విషయం.. వాళ్లు పాటించే శుభ్రత. ఆ డిసిప్లీన్ కూడానట. ⇔ కోకిలాబెన్ ఇప్పటికీ రోజూ యోగా సాధన చేస్తుంటారు. రోజూ కనీసం 30 నిమిషాలు నడుస్తుంటారు. ధ్యానంలో కూర్చుంటారు. ఉదయం పండ్ల రసాలు, పండ్లు తీసుకుంటారు. ⇔ ఈ జీవన విధానం వల్లే ఎలాంటి చికాకుల్లోనైనా తనెంతో ప్రశాంతంగా ఉండగలుగుతున్నానని చెబుతారు కోకిలాబెన్. ఆహ్వానం అందితే తప్పక వెళ్లాలి ⇔ ఇంటికి దీపం ఇల్లాలే. ఈ మాట వాస్తవం. పిల్లల సత్ప్రవర్తన, మంచీమర్యాద తల్లి నుంచి వచ్చేవే. ⇔ పిల్లలకు విద్యను, వివేకాన్ని, సహనాన్ని, ఓర్పును, ఔదార్యాన్ని, బాధ్యతను నేర్పించగలిగితే తల్లిగా స్త్రీ జీవితం సార్థకమైనట్లే. ⇔ మహాలక్ష్మి అంటే ఎవరో కాదు. ఇంటిని సంతోషంగా, శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచగలిగిన గృహిణే. ⇔ రక్తసంబంధీకులు, స్నేహితుల ఇళ్లల్లోని వేడుక చిన్నదైనా పెద్దదైనా ఆహ్వానం అందినప్పుడు తప్పక వెళ్లిరావాలి. ⇔ ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా నెగ్గుకు రాగలిగిన ప్రతిభ, శక్తిసామర్థ్యాలు నేటి మహిళకు ఉన్నాయి. ⇔ అందంగా కనిపించాలంటే ఆరోగ్యంగా ఉండాలి. -
పాలియస్టర్ ప్రిన్స్
మన దిగ్గజాలు దేశం కాని దేశంలో పెట్రోల్ బంకులో కార్మికుడిగా పనిచేశాడు. అక్కడి నుంచి స్వదేశానికి వచ్చే సరికి ఆయన వద్దనున్నవి ఐదువందల రూపాయలు మాత్రమే. అదే ఆయన పెట్టుబడి. కేవలం ఆ చిన్న మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టేసి సరిపెట్టుకుంటే, ఇంత చరిత్ర ఉండేదే కాదు. పెట్టుబడికి పట్టుదల తోడైంది. ఆ పట్టుదలే ధీరూభాయ్ అంబానీని పారిశ్రామిక రంగంలో ‘పాలియస్టర్ ప్రిన్స్’గా నిలిపింది. ప్రపంచంలోని అపర కుబేరుల్లో ఒకరిగా పట్టం కట్టింది. బడిపంతులు కొడుకు... ధీరూభాయ్ అసలు పేరు ధీరజ్‌లాల్ హీరాచాంద్ అంబానీ. గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లా చోర్వాడ్ పట్టణంలో 1932 డిసెంబర్ 28న పుట్టారు. తండ్రి బడిపంతులు. ఆయన సంతానంలో మూడోవాడు ధీరూభాయ్. తండ్రి బడిపంతులే అయినా, ధీరూభాయ్‌కి పెద్దగా చదువు అబ్బలేదు. ఎలాగోలా హైస్కూల్ వరకు పూర్తి చేశాక, తర్వాత చదువు మానేశారు. సంపాదన కోసం చిన్నా చితకా పనులు చేస్తూ వచ్చారు. ఈలోగా అవకాశం కలిసి రావడంతో యెమెన్‌లో పెట్రోల్ బంకులో పనిచేయడానికి వెళ్లారు. ఎంత కష్టపడి పనిచేసినా, పెద్దగా మిగిలేదేమీ ఉండేది కాదు. ఇలా లాభం లేదనుకుని 1957లో ముంబైకి వచ్చేశారు. ముంబై చేరుకునే నాటికి ఆయన చేతిలో ఉన్నవి ఐదువందల రూపాయలు మాత్రమే. ఆ స్వల్ప మొత్తమే పెట్టుబడిగా దగ్గరి బంధువైన చంపక్లాల్ దామానీతో కలిసి భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించారు. విదేశాల నుంచి పాలియస్టర్ దారం దిగుమతి, విదేశాలకు సుగంధద్రవ్యాల ఎగుమతి చేసేవారు. ముంబైలోని మస్జిద్ బందర్ ప్రాంతంలో చిన్న గదిలో కార్యాలయం పెట్టుకున్నారు. కార్యాలయంలో మూడు కుర్చీలు, ఒక టేబుల్, ఒక టెలిఫోన్ మాత్రమే ఉండేవి. మొదట్లో ఇద్దరు అసిస్టెంట్లను నియమించుకున్నారు. వ్యాపారం త్వరగానే వేగం పుంజుకుంది. సొంతంగానే ఏదైనా చేయాలనే ఆలోచనలో ఉన్న అంబానీ 1965లో దామానీతో భాగస్వామ్యం నుంచి బయటకు వచ్చేశారు. ఓన్లీ విమల్... రిస్కు తీసుకోవడానికి ఏ మాత్రం వెనుకాడని నైజం అంబానీది. దామానీతో భాగస్వామ్యం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కూడా పాలియస్టర్ దారం దిగుమతులను కొనసాగిస్తూ, 1966లో రిలయన్స్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను స్థాపించారు. గుజరాత్‌లోని నరోదాలో సింథటిక్ వస్త్రాల మిల్లును నెలకొల్పారు. 1975లో ‘విమల్’ చీరలు, సూటింగ్స్, షర్టింగ్స్ ఉత్పత్తి ప్రారంభించారు. ‘ఓన్లీ విమల్’ నినాదంతో సాగించిన ప్రచారం దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ ఊపుతో 1977లో పబ్లిక్ ఇష్యూకి వెళితే భారీ స్పందన వచ్చింది. రిలయన్స్ విజయానికి ఇది తొలిమెట్టు. వడి వడిగా విస్తరణ... ‘విమల్’బ్రాండ్ విజయంతో ధీరూభాయ్ విస్తరణ వైపు దృష్టి సారించారు. ‘రిలయన్స్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్’ను 1985లో ‘రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్’గా మార్చారు. ఐదేళ్లు గడిచే సరికి పెట్రోలియం రంగంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్లకే టెలికం రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘రిలయన్స్ గ్యాస్’ ప్రారంభించారు. అదేకాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఇంటిగ్రేటెడ్ పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్‌ను నిర్మించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ కంపెనీలు రెండూ 2001 నాటికి భారత్‌లోనే అగ్రగామి కంపెనీలుగా నిలదొక్కుకున్నాయి. ‘రిలయన్స్’ విస్తరణ వేగం పుంజుకుంటున్న దశలోనే 1986లో ధీరూభాయ్ తొలిసారిగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. దాంతో చాలావరకు బాధ్యతలను కొడుకులు ముకేశ్, అనిల్‌లకు అప్పగించారు. ‘రిలయన్స్’ ఘన విజయాలు సాధిస్తున్న దశలోనే 2002లో ధీరూభాయ్ మరోసారి బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. ముంబైలోని బీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2002 జూలై 6న తుదిశ్వాస విడిచారు. ధీరూభాయ్ మరణం తర్వాత ముకేశ్, అనిల్‌ల మధ్య పొరపొచ్చాలు తలెత్తడంతో ‘రిలయన్స్’ సామ్రాజ్యం రెండుగా విడిపోయింది. ప్రస్తుతం ‘రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్’ ముకేశ్ అంబానీ అధీనంలోను, ‘రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ (ఏడీఏ) గ్రూప్’ అనిల్ అంబానీ నేతృత్వంలోను నడుస్తున్నాయి. -
ధీరూభాయ్ కి పద్మ విభూషణ్
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు దివంగత ధీరూభాయ్ అంబానీకి ప్రకటితమైన దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ను ఆయన సతీమణి కోకిలాబెన్ రాష్ట్రపతిభవన్‌లో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమానికి అంబానీ కుటుంబసభ్యులు, ఇతర ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోకిలాబెన్ మాట్లాడుతూ.. ఆయన మానవత్వంతో చాలా సాధారణ జీవితం గడిపారని, దేశం కోసం కష్టపడ్డారని చెప్పారు. తన భర్తకు ఈ అరుదైన గౌరవాన్ని కల్పించిన ప్రణబ్ ముఖర్జీకి, ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ‘నా భారతావనిలో చాలా మంది ధీరూభాయ్‌లు జన్మించాలి. వారు దేశ సామాజికార్థికాభివృద్ధిలో భాగస్వాములు కావాలి. యవత్తు ప్రజానికానికి వారి సేవలు తోడ్పాటునందించాలి’ అని ఆమె ఆకాంక్షించారు. ధీరూభాయ్‌కి పద్మ విభూషణ్ లభించడం భారతీయ వాణిజ్యతత్వ ఆకాంక్షకి, ఏ పనినైనా అత్యుత్తమంగా చేయాలనే లక్షణానికి గౌరవంగా భావిస్తున్నానని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. ‘గొప్ప వ్యాపారవేత్త, సంపద సృష్టి కర్త అయిన మా నాన్నకు లభించిన అరుదైన గుర్తింపు ఈ పురస్కారం’ అని రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ పేర్కొన్నారు.