రిలయన్స్ జియో 4జీ సేవలు ప్రారంభం | Mukesh Ambani's Reliance Jio debuts 4G services | Sakshi
Sakshi News home page

రిలయన్స్ జియో 4జీ సేవలు ప్రారంభం

Published Mon, Dec 28 2015 2:16 AM | Last Updated on Sun, Sep 3 2017 2:40 PM

రిలయన్స్ జియో 4జీ సేవలు ప్రారంభం

రిలయన్స్ జియో 4జీ సేవలు ప్రారంభం

ముంబై: రిలయన్స్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ ధీరూభాయ్ అంబానీ 83వ జయంతి సందర్భంగా రిలయన్స్ జియో 4జీ సేవలను నవీ ముంబైలోని కంపెనీ కార్పొరేట్ పార్క్‌లో ఆదివారం ప్రారంభించింది. ప్రస్తుతం రిలయన్స్ జియో సేవలు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు, వ్యాపార భాగస్వాములకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. వాణిజ్యపరంగా కంపెనీ కార్యకలాపాలు కొత్త ఏడాది(2016) మార్చి-ఏప్రిల్‌లో ప్రారంభం కావచ్చని భావిస్తున్నారు.

ఈ 4జీ సేవల ప్రారంభోత్సవానికి దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది రిలయన్స్ ఉద్యోగులు, ప్రముఖులు తరలివచ్చారు. ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. జియో 4జీ సేవలు అందుకోవడానికి అందరికీ ఆహ్వానం పలుకుతున్నామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement