ప్రముఖ మలయాళీ నటుడు 'మోహన్ లాల్' గురించి దాదాపు అందరికి తెలుసు. తనదైన నటనతో ప్రేక్షలకులను ఆకట్టుకున్న ఈయన తెలుగు ప్రేక్షలకులకు కూడా సుపరిచయమే. మోహన్ లాల్ ఇతర సెలబ్రిటీల మాదిరిగానే ఎప్పటికప్పుడు లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ కారణంగానే అతని గ్యారేజిలో చాలా కార్లు ఉన్నాయి. ఇందులో ధీరూభాయ్ అంబానీకి చెందిన పాతకాలపు కాడిలాక్ కారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
మోహన్ లాల్ గ్యారేజిలో ఎన్ని కార్లు ఉన్నప్పటికీ హిందూస్తాన్ అంబాసిడర్, కాండిలాక్ కార్లు చాలా ప్రత్యేకం. eisk007 ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడైన ఫొటోలో ఈ పాతకాలపు కారుని చూడవచ్చు. ఆ కారు పక్కన ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ బాలాజీ ఉండటం కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. దీనిని బాలాజీ కొనుగోలు చేసినట్లు చెబుతారు. ఆయన స్వయానా మోహన్ లాల్ మామగారు. ఆయన నిర్మించిన చాలా సినిమాల్లో ఈ కారు ఉపయోగించినట్లు సమాచారం.
ఫొటోలో కనిపించే ఈ కారు 1958 మోడల్ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కాడిలాక్ సెడాన్ అని తెలుస్తోంది. ఇది ఒకప్పుడు ధీరూభాయ్ అంబానీ ఉపయోగించినట్లు చెబుతున్నారు. ఇది పాతకాలపు కారు అయినప్పటికీ ఇప్పటికీ కొత్తగా కనిపిస్తోంది. దీనికి MAS 2100 నెంబర్ ఉంది. ఈ కారుని ఎప్పుడు కొనుగోలు చేశారనేదానికి ఖచ్చితమైన అధరాలు లేవు. ప్రస్తుతం ఈ మోడల్ కారు మార్కెట్లో లేదు.
(ఇదీ చదవండి: భారత్‌లో ఆరు ఎయిర్ బ్యాగులు కలిగి టాప్ 5 కార్లు - ధరలు ఎలా ఉన్నాయంటే?)
భారతీయ మార్కెట్లో ఒకప్పుడు కాడిలాక్ కారు వివిధ రకాల ఇంజిన్ ఆప్షన్లలో లభించేది. అయితే మోహన్ లాల్ గ్యారేజిలో ఉన్న ఆ కారు ఇంజిన్ స్పెషిఫికేషన్స్ కూడా వెలుగులోకి రాలేదు. కానీ ఇప్పటికీ మంచి కండిషన్లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మోహన్ లాల్ గ్యారేజిలో టొయోట వెల్‌ఫైర్, ఇన్నోవా క్రిష్టా, టయోటా ల్యాండ్ క్రూయిజర్, మెర్సిడెస్ బెంజ్ జిఎల్350, లంబోర్ఘిని ఉరుస్ వంటి అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment