
రీసెంట్ టైంలో రిలీజైన వెంటనే వివాదాల్లో చిక్కుకున్న సినిమా 'ఎల్ 2 ఎంపురాన్'(L2 Empuraan Movie). సలార్ ఫేమ్ పృథ్వీరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ లాల్ (Mohanlal) హీరోగా నటించారు. గతంలో వచ్చిన లూసిఫర్ మూవీకి ఇది సీక్వెల్. రిలీజ్ దగ్గర నుంచి కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిన ఈ చిత్రం వసూళ్లలో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది.
ఈ సినిమాలో మత విద్వేషాల రెచ్చగొట్టేలా కొన్ని సన్నివేశాలు ఉండటంపై విడుదలైన రోజే అభ్యంతరాలు వచ్చాయి. దీంతో నిర్మాత గోకులం గోపాలన్, హీరో మోహన్ లాల్ క్షమాపణలు చెప్పారు. ఇది కాదన్నట్లు నిర్మాత ఆఫీస్, ఇంటిపై ఐటీ రైడ్స్ జరిగాయి. దర్శకుడు పృథ్వీరాజ్ కి కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులు.. రెమ్యునరేషన్ లెక్కలు చెప్పమని నోటీసులు జారీ చేశారు.
(ఇదీ చదవండి: చేదు అనుభవం.. శ్రీలీలని పట్టి లాగేశారు)
ఇలా దాదాపు వారం రోజుల నుంచి వార్తల్లో ఉన్న ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు (Movie Collection) వచ్చాయి. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. తద్వారా ఈ మూవీ మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్ సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది.
ఈ సినిమాకు తొలుత మిశ్రమ స్పందన వచ్చింది. కథ కంటే ఎలివేషన్లు ఎక్కువయ్యాయమని తెలుగు ప్రేక్షకుల నుంచి టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు కలెక్షన్స్ చూస్తుంటే మలయాళ, ఓవర్సీస్ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినట్లు కనిపిస్తుంది.
(ఇదీ చదవండి: పెద్ది vs ప్యారడైజ్.. ఒకరు కాదు పోటీలో ముగ్గురు)
