
మోహన్‌లాల్(Mohanlal), శోభన ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘తుడరుమ్’(Thudarum). తరుణ్ మూర్తి దర్శకత్వంలో ఎమ్. రంజిత్ ఈ క్రైమ్ డ్రామా మూవీని నిర్మించారు. ఈ సినిమాను తొలుత జనవరి 30న విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదు.
దీంతో ‘తుడరుమ్’ సినిమా మే చివర్లో విడుదల కానుందనే వార్తలు తెరపైకి వచ్చాయి. కానీ ఈ వార్తలు అవాస్తవమని, ఈ సినిమాను ఈ నెల 25న రిలీజ్ చేస్తున్నామని పేర్కొన్నారు మోహన్‌లాల్. ఈ సినిమాలో ట్యాక్సీ డ్రైవర్‌గా కనిపిస్తారాయన. ఇక దాదాపు పదిహేనేళ్ల తర్వాత మోహన్‌లాల్, శోభన మళ్లీ ఈ సినిమా కోసం స్క్రీన్ షేర్ చేసుకున్నారు.