Old car
-
అలనాటి ఎలక్ట్రిక్ కారు
ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పుడు మన దేశంలోనూ విరివిగా కనిపిస్తున్నాయి గాని, నిజానికి ఇవి వందేళ్లకు ముందు నుంచి కూడా వాడుకలో ఉన్నాయి. ఈ ఫొటోలో కనిపిస్తున్నది అలనాటి ఎలక్ట్రిక్ కారు. దీనిని అమెరికన్ కార్ల తయారీ కంపెనీ ‘కొలంబియా’ విడుదల చేసింది. ‘కొలంబియా ఎలక్ట్రిక్ ఫేటన్’ పేరుతో ఈ ఎలక్ట్రిక్ కార్ల తయారీని కొలంబియా కంపెనీ 1905లో ప్రారంభించింది. ఫొటోలో ఉన్న కారు 1908 నాటిది. అప్పట్లో దీని ధర 1600 డాలర్లు (రూ.1.33 లక్షలు) ఉండేది. ఇప్పటి లెక్కల ప్రకారం దీని ధర 44,00 డాలర్లు (రూ.36.65 లక్షలు) ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అప్పట్లో ఈ మోడల్ కారుకు విపరీతమైన గిరాకీ ఉండేది. ఈ కారుకు 24 బ్యాటరీలు పెట్టుకోవాల్సి వచ్చేది. వాటిని రీచార్జ్ చేసుకోవడానికి వీలయ్యేది. ఈ కారు ముందుకు పోవడానికి మూడు గేర్లు, వెనక్కు మళ్లడానికి రెండు రివర్స్ గేర్లు ఉండటం విశేషం. దీనికి స్టీరింగ్‌వీల్, యాక్సిలేటర్ పెడల్ ఉండవు. కారుకు కుడి పక్కన తెడ్డులాంటి సాధనం అమర్చి ఉంటుంది. దిశను మార్చడానికి డ్రైవర్ దీనిని వాడాల్సి వచ్చేది. వేగాన్ని నియంత్రించడానికి ఎడమవైపు ఉండే కర్రలాంటి సాధనాన్ని వాడాల్సి వచ్చేది. ఇప్పటి తరానికి ఇది చాలా విచిత్రంగా కనిపించినా, ఈ కారు ఇంకా పనిచేసే పరిస్థితిలోనే ఉండటం విశేషం. -
పాత కారులో సీఎం ప్రయాణం
సాక్షి, చైన్నె: పాత జ్ఞాపకాలను నెమర వేసుకునే విధంగా సీఎం స్టాలిన్ ఆదివారం తన పాతకాలపు కారును స్వయంగా నడుపుకుంటూ నగర రోడ్ల మీదకు వచ్చారు. సీఎం కాన్వాయ్‌లో హఠాత్తుగా పాత కారు కనిపించడం, దానిని స్టాలిన్ స్వయంగా నడుపుకుంటూ వెళుతుండటం చూసిన జనం ఆ దృశ్యాలను వీడియోల రూపంలో వైరల్ చేశారు. సీఎం స్టాలిన్ కాన్వాయ్‌లో సాధారణంగా ఆధునిక హంగులతో కూడిన వాహనాలే ఉంటాయి. ప్రత్యేక వాహనంలో ఆయన కూర్చుంటే డ్రైవర్ నడుపుకుంటూ వెళ్తుండటాన్ని జనం చూసి ఉన్నారు. అయితే, ఆదివారం అడయార్‌లోని పార్కులో వాకింగ్‌కు వెళ్లిన సీఎం స్టాలిన్ తన పాత కారును, దానితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అంతేకాక స్వయంగా నడుపుకుంటూ వెళ్తుండటం, వెనుక సీటులో మంత్రులు పొన్ముడి, ఎం.సుబ్రమణియన్ కూర్చుని ఉండటం ఆసక్తికరంగా మారింది. -
పాత కారే అని చీప్‌గా చూడకండి: ఈ విషయం తెలిస్తే..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాత కారు.. పేరులో పాత ఉందని చిన్నచూపు చూడకండి. దేశంలో అమ్ముడవుతున్న పాత కార్ల సంఖ్య తెలిస్తే నోరెళ్లబెడతారు. 2022–23లో దేశవ్యాప్తంగా 15 శాతం వృద్ధితో 50 లక్షల యూనిట్ల యూజ్డ్ కార్లు చేతులు మారాయి. ఇందులో అవ్యవస్థీకృత రంగం వాటా 70 శాతం కాగా వ్యవస్థీకృత (ఆర్గనైజ్డ్) రంగం వాటా 30 శాతం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ 65 లక్షల యూనిట్లను తాకనుంది. ఈ రంగంలో దేశంలో ఎనిమిదవ స్థానంలో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా 8 శాతంగా ఉంది. భారత్‌లో 2030 నాటికి పాత కార్ల పరిశ్రమ కొత్త వాటితో పోలిస్తే రెండింతలకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. తొలిసారిగా కారును సొంతం చేసుకుంటున్న కస్టమర్లలో 70 శాతం మంది పాత కారును కొనుగోలు చేస్తున్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. వ్యవస్థీకృత రంగమే.. యూజ్డ్ కార్ల మార్కెట్‌ను వ్యవస్థీకృత రంగమే నడిపిస్తోందని కార్స్24 కో–¸పౌండర్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గజేంద్ర జంగిద్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘పాత కార్ల రంగంలో అవ్యవస్థీకృత మార్కెట్ వార్షిక వృద్ధి 10 శాతమే. ఆర్గనైజ్డ్ మార్కెట్ ఏకంగా 30 శాతం వృద్ధి చెందుతోంది. కొత్త కార్ల విషయంలో 75 శాతం మందికి రుణం లభిస్తోంది. అదే పాత కార్లు అయితే ఈ సంఖ్య 15 శాతమే. యూజ్డ్ కార్లకు రుణం లభించడం అంత సులువు కాదు. ఇక కారు ఉండాలనుకోవడం ఒకప్పుడు ఆకాంక్ష. నేడు అవసరంగా భావిస్తున్నారు. అందుకే కొత్తదానితో పోలిస్తే సగం ధరలో దొరికే యూజ్డ్ కారు స్టీరింగ్ పట్టుకుంటున్నారు. ఇటీవలి కాలంలో సర్టీఫైడ్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. క్వాలిటీ చెక్స్, వారంటీ, రిటర్న్ పాలసీ, ఈజీ ఫైనాన్స్.. ఇన్ని సౌకర్యాలు ఉండడంతో సర్టీఫైడ్ కార్ల పట్ల వినియోగదార్లలో నమ్మకం ఏర్పడింది’ అని ఆయన వివరించారు. రెండు నగరాల్లోనే.. భారత్‌లో యూజ్డ్ కార్ల విక్రయ రంగంలో ఉన్న కంపెనీలు, విక్రేతలు వాహనాలను కొనుగోలు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. అదే హైదరాబాద్, బెంగళూరు మార్కెట్లలో మాత్రమే పార్కింగ్ విధానం ఉందని కార్స్24 చెబుతోంది. అంటే పాత కారు యజమానులు యూజ్డ్ కార్స్ విక్రయ కేంద్రాల్లో అద్దె చెల్లించి తమ వాహనాన్ని పార్క్ చేయవచ్చు. మంచి బేరం వస్తే యజమాని సమ్మతి మేరకు కారును విక్రయిస్తారు. కమీషన్ ఆధారంగానూ క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ఇక 2015లో 100 కొత్త కార్లు రోడ్డెక్కితే అంతే స్థాయిలో పాత కార్లు చేతులు మారాయి. ఇప్పుడీ సంఖ్య 150 యూనిట్లకు చేరింది. యూఎస్, ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో 100 కొత్త కార్లకు 400 పాత కార్లు అమ్ముడవుతున్నాయి. సగటు ధర రూ. 6 లక్షలు.. పాత కారు కొనుగోలు సగటు ధర రూ.6 లక్షలు ఉంటోంది. అమ్ముడవుతున్న మొత్తం పాత కార్లలో హ్యాచ్‌బ్యాక్ వాటా 60 శాతం కైవసం చేసుకుంది. ఈ విభాగం వృద్ధి నిలకడగా ఉంది. 20 శాతం వాటా ఉన్న సెడాన్స్ వృద్ధి రేటు తగ్గుతూ ప్రస్తుతం 20 శాతానికి వచ్చి చేరింది. ఎస్‌యూవీల వాటా క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 20 శాతంగా ఉంది. అయితే వృద్ధి ఏకంగా 30 శాతానికి చేరింది. 2030 నాటికి ఎస్‌యూవీల వాటా పాత కార్ల కొనుగోళ్లలో 40 శాతానికి ఎగుస్తుందని పరిశ్రమ భావిస్తోందని సుదీర్కార్స్.కామ్ ఫౌండర్ బండి సు«దీర్ రెడ్డి తెలిపారు. అదే కొత్త కార్ల విషయంలో ప్రస్తుతం ఎస్‌యూవీల వాటా 45 శాతం తాకిందన్నారు. హ్యాచ్బ్యాక్స్ వాటా 30 శాతముందని చెప్పారు. దేశవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో 38.9 లక్షల యూనిట్ల కొత్త కార్లు రోడ్డెక్కాయి. 2023–24లో ఈ సంఖ్య 40 లక్షల యూనిట్లు దాటుతుందన్న అంచనాలు ఉన్నాయి. -
మోహన్ లాల్ గ్యారేజిలో ధీరూభాయ్ అంబానీ కారు
ప్రముఖ మలయాళీ నటుడు 'మోహన్ లాల్' గురించి దాదాపు అందరికి తెలుసు. తనదైన నటనతో ప్రేక్షలకులను ఆకట్టుకున్న ఈయన తెలుగు ప్రేక్షలకులకు కూడా సుపరిచయమే. మోహన్ లాల్ ఇతర సెలబ్రిటీల మాదిరిగానే ఎప్పటికప్పుడు లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ కారణంగానే అతని గ్యారేజిలో చాలా కార్లు ఉన్నాయి. ఇందులో ధీరూభాయ్ అంబానీకి చెందిన పాతకాలపు కాడిలాక్ కారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మోహన్ లాల్ గ్యారేజిలో ఎన్ని కార్లు ఉన్నప్పటికీ హిందూస్తాన్ అంబాసిడర్, కాండిలాక్ కార్లు చాలా ప్రత్యేకం. eisk007 ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడైన ఫొటోలో ఈ పాతకాలపు కారుని చూడవచ్చు. ఆ కారు పక్కన ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ బాలాజీ ఉండటం కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. దీనిని బాలాజీ కొనుగోలు చేసినట్లు చెబుతారు. ఆయన స్వయానా మోహన్ లాల్ మామగారు. ఆయన నిర్మించిన చాలా సినిమాల్లో ఈ కారు ఉపయోగించినట్లు సమాచారం. ఫొటోలో కనిపించే ఈ కారు 1958 మోడల్ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కాడిలాక్ సెడాన్ అని తెలుస్తోంది. ఇది ఒకప్పుడు ధీరూభాయ్ అంబానీ ఉపయోగించినట్లు చెబుతున్నారు. ఇది పాతకాలపు కారు అయినప్పటికీ ఇప్పటికీ కొత్తగా కనిపిస్తోంది. దీనికి MAS 2100 నెంబర్ ఉంది. ఈ కారుని ఎప్పుడు కొనుగోలు చేశారనేదానికి ఖచ్చితమైన అధరాలు లేవు. ప్రస్తుతం ఈ మోడల్ కారు మార్కెట్లో లేదు. (ఇదీ చదవండి: భారత్‌లో ఆరు ఎయిర్ బ్యాగులు కలిగి టాప్ 5 కార్లు - ధరలు ఎలా ఉన్నాయంటే?) భారతీయ మార్కెట్లో ఒకప్పుడు కాడిలాక్ కారు వివిధ రకాల ఇంజిన్ ఆప్షన్లలో లభించేది. అయితే మోహన్ లాల్ గ్యారేజిలో ఉన్న ఆ కారు ఇంజిన్ స్పెషిఫికేషన్స్ కూడా వెలుగులోకి రాలేదు. కానీ ఇప్పటికీ మంచి కండిషన్లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మోహన్ లాల్ గ్యారేజిలో టొయోట వెల్ఫైర్, ఇన్నోవా క్రిష్టా, టయోటా ల్యాండ్ క్రూయిజర్, మెర్సిడెస్ బెంజ్ జిఎల్350, లంబోర్ఘిని ఉరుస్ వంటి అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. View this post on Instagram A post shared by Eisk007 (@eisk007) -
హోండా, మారుతీ భాగస్వామ్యం: ఎందుకంటే?
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా తాజాగా స్క్రాపింగ్, రీసైక్లింగ్ కంపెనీ మారుతీ సుజుకీ టొయొట్సుతో చేతులు కలిపింది. హోండా కార్ల యజమానులు తమ వాహనాలను సులభంగా స్క్రాపింగ్, పాత వాహనాల డీరిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ పొందవచ్చు. ఇందుకోసం హోండా డీలర్షిప్ కేంద్రాలను వినియోగదార్లు సంప్రదించాల్సి ఉంటుంది. గడువు తీరిన వాహనాల స్క్రాపింగ్ సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి మారుతీ సుజుకీ టొయొట్సు ఆమోదం పొందింది. చదవండి : షాకింగ్: 5.4 మిలియన్ల ట్విటర్ యూజర్ల డేటా లీక్! మస్క్ స్పందన ఏంటి? ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు బంపర్ ఆఫర్ -
తొలిసారైనా పాతకారుకు సై
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కారు పాతదైతేనేం.. కొనేందుకు సై అంటున్నారు భారతీయ కస్టమర్లు. 2013-14లో దేశవ్యాప్తంగా ప్యాసింజర్ కార్లు కొత్తవి 25 లక్షల యూనిట్లు అమ్ముడైతే, పాతవి సుమారు 30 లక్షలు చేతులు మారాయి. దీనినిబట్టి పాత కార్లకూ ఉన్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. ఆసక్తికర అంశమేమంటే అమ్ముడవుతున్న మొత్తం పాత కార్లలో తొలిసారిగా వాహనాన్ని కొనుగోలు చేసే వారు 65 శాతం ఉంటున్నారు. ఈ రంగంలోకి పెద్దపెద్ద సంస్థలు రావడంతో బ్రాండెడ్ యూజ్డ్ కార్ల షోరూంలవైపు కస్టమర్లు మళ్లుతున్నారు. యువతే పెద్ద కస్టమర్లు.. పాత కార్ల మార్కెట్‌ను నడిపిస్తున్నది యువతే. కొనుగోలుదారుల్లో 75% మంది 30-35 ఏళ్ల వయసువారే. మొత్తం విక్రయాల్లో రూ.3.75-4 లక్షల ఖరీదులో లభించే మోడళ్ల వాటా సగముంది. కొత్తకారు ధరలో అంతకంటే పెద్ద మోడల్ రావడం, నెల వాయిదాల భారమూ తక్కువగా ఉండడంతో కస్టమర్లు పాత వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. దీనికితోడు బ్రాండెడ్ యూజ్డ్ కార్ల షోరూముల్లో 100కు పైగా నాణ్యత పరీక్షలు జరిపిన తర్వాతే వాహనాలను విక్రయిస్తారు. నాణ్యతకు ఢోకా లేకపోవడంతో తృతీయ శ్రేణి నగరాల్లోని కస్టమర్లు సైతం బ్రాండెడ్ షోరూంలలో కారు కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. 30 లక్షల యూనిట్లలో వ్యవస్థీకృత రంగం వాటా 20% వృద్ధితో 17% వాటా కైవసం చేసుకుంది. నగదు కొనుగోళ్లు.. అయిదేళ్ల క్రితం వరకు ఒక్కో కస్టమర్ సరాసరిగా ఆరేళ్లు కారును అట్టిపెట్టుకునే వారు. ఇప్పుడు నాలుగేళ్లకే మారుస్తున్నారు. మూడేళ్ల తర్వాత 36 నెలలకు వస్తుందని అంటోంది మహీంద్రా ఫస్ట్ చాయిస్ వీల్స్. కొత్త మోడళ్లు, కుటుంబం పెరగడం, ఆశయాలు మారడం ఇందుకు కారణమని తెలిపింది. దక్షిణాది రాష్ట్రాల్లో నెలకు కొత్త కార్లు 57 వేలు, పాతవి 60 వేల యూనిట్లు అమ్ముడవుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంఖ్య వరసగా 15 వేలు, 16,500 ఉంది. నగరాల వారీగా చూస్తే ఢిల్లీలో 22 వేలు, ముంబైలో 10 వేలు, హైదరాబాద్‌లో 9 వేల పాత కార్లు ప్రతి నెల చేతులు మారుతున్నాయి. అమెరికాలో ఏటా 4.5 కోట్ల పాత కార్లు, 1.6 కోట్ల కొత్త కార్లు అమ్ముడవుతున్నాయి. కస్టమర్ల సందేహమే.. పాత కారు పనితీరు ఎలా ఉంటుందో అన్న సందేహం సాధారణంగా అందరికీ ఉంటుంది. ఈ అంశమే బ్రాండెడ్ కంపెనీలకు కలిసి వస్తుందని అంటున్నారు మహీంద్రా ఫస్ట్ చాయిస్ వీల్స్ సీఈవో నాగేంద్ర పల్లె. ఇక్కడి కొండాపూర్‌లో అధీకృత డీలర్షిప్ ఎక్స్స్పీడ్ వీల్స్‌ను బుధవారం ప్రారంభించిన అనంతరం ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. నాణ్యతా పరీక్షలు, విక్రయానంతర సేవ, వారంటీని బ్రాండెడ్ కంపెనీలు ఇస్తాయి. దీంతో కస్టమర్లు ధీమాగా పాత కార్లను సొంతం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. తమ కంపెనీ వెబ్సైట్లో అన్ని మోడళ్ల వివరాలను పొందుపరుస్తున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా కంపెనీకి 380 ఔట్‌లెట్లున్నాయి. రెండేళ్లలో మరో 120 ప్రారంభించనుంది. 2013-14లో కంపెనీ తన షోరూంల ద్వారా 57 వేలు, ఆన్లైన్ బీటూబీ పోర్టల్ ఇడిగ్ ద్వారా 60 వేల యూనిట్లను విక్రయించింది. -
ఉసురు తీసిన కారు
ఊపిరాడక నలుగురు చిన్నారుల మృతి చెన్నై: ఆడుకుంటూ ఓ పాత కారులోకి వెళ్లిన నలుగురు చిన్నారులు అనుకోకుండా అందులో చిక్కుకుపోయి చివరికి ఊపిరాడక విగతజీవులయ్యారు. తమిళనాడులో తూత్తుకుడి సమీపంలోని వేడనత్తం గ్రామంలో బుధవారం ఈ విషాదం చోటుచేసుకుంది. వేడనత్తంలోని ఐదు ఆలయాల్లో ఆడి ఉత్సవాలు జరుగుతుండటంతో పరిసర ప్రాంతాల భక్తులు తరలివచ్చారు. అయితే ఓ గుడికి సమీపంలోని బ్యాంకువద్ద బ్యాంకు సిబ్బంది సీజ్ చేసిన పాత కార్లు, వాహనాలు ఉంచిన యార్డు వద్దకు ఆడుకునేందుకు ముత్తు అలగు(10), శక్తి అమ్మాల్(8), మోసష్(7), ఆది(4) అనే చిన్నారులు వెళ్లారు. అక్కడి ఓ కారులోకి వీరు ఎక్కగానే డోర్లు ఆటోమేటిక్‌గా లాక్ కావడంతో అందులో చిక్కుకుని వారు ఊపిరాడక చనిపోయారు.