ఉసురు తీసిన కారు | Four children found dead in car as doors get locked | Sakshi
Sakshi News home page

ఉసురు తీసిన కారు

Published Thu, Aug 14 2014 3:07 AM | Last Updated on Sat, Sep 2 2017 11:50 AM

Four children found dead in car as doors get locked

ఊపిరాడక నలుగురు చిన్నారుల మృతి

 చెన్నై: ఆడుకుంటూ ఓ పాత కారులోకి వెళ్లిన నలుగురు చిన్నారులు అనుకోకుండా అందులో చిక్కుకుపోయి చివరికి ఊపిరాడక విగతజీవులయ్యారు. తమిళనాడులో తూత్తుకుడి సమీపంలోని వేడనత్తం గ్రామంలో బుధవారం ఈ విషాదం చోటుచేసుకుంది. వేడనత్తంలోని ఐదు ఆలయాల్లో ఆడి ఉత్సవాలు జరుగుతుండటంతో పరిసర ప్రాంతాల భక్తులు తరలివచ్చారు.

అయితే ఓ గుడికి సమీపంలోని బ్యాంకువద్ద బ్యాంకు సిబ్బంది సీజ్ చేసిన పాత కార్లు, వాహనాలు ఉంచిన యార్డు వద్దకు ఆడుకునేందుకు ముత్తు అలగు(10), శక్తి అమ్మాల్(8), మోసష్(7), ఆది(4) అనే చిన్నారులు వెళ్లారు. అక్కడి ఓ కారులోకి వీరు ఎక్కగానే డోర్లు ఆటోమేటిక్‌గా లాక్ కావడంతో అందులో చిక్కుకుని వారు ఊపిరాడక చనిపోయారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement