Four children
-
అద్భుతం జరిగింది.. సజీవంగా 40 రోజులకు దొరికిన చిన్నారులు
నమ్మకం వమ్ము కాలేదు. అడవితల్లే కరుణించిందా అన్నట్లుగా అద్భుతం జరిగింది. వన్య మృగాలు.. అంతకన్నా ప్రమాదకరమైన డ్రగ్స్ ముఠాల కంటపడకుండా ప్రాణాలతో బయటపడ్డారు ఆ నలుగురు చిన్నారులు. విమాన ప్రమాదంలో తల్లిని పొగొట్టుకున్నప్పటికీ.. తామైనా సజీవంగా బయటపడాలన్న వాళ్ల సంకల్పం ఫలించింది. దట్టమైన అమెజాన్ అడవుల్లో తప్పిపోవడంతో రంగంలోకి దిగిన కొలంబియా సైన్యం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి 40 రోజుల తర్వాత వాళ్ల జాడను కనిపెట్టింది. చివరకు.. అమెజాన్ అడవుల్లో పాపం పసివాళ్ల కథ సుఖాంతంమైంది. ఆ నలుగురి వయసు 13, 9, 4, 11 నెలలు. అయితేనేం దట్టమైన అమెజాన్ అడవుల్లో మొక్కవోని ధైర్యం ప్రదర్శించారు. దాదాపు నెలకు పైనే పెద్దలెవరూ లేకుండా అడవుల్లో గడిపారు. 13 ఏళ్ల లెస్లీ తన తోబుట్టువులను దగ్గరుండి కాపాడుకుంటూ వచ్చింది. సూర్యుడి వెలుతురు కూడా నేల మీద పడనంత చీకట్లు అలుముకునే అడవుల్లో.. ముందుకు సాగింది. దొరికింది తింటూ.. మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ.. ప్రమాదాల బారిన పడకుండా సురక్షితంగా ముందుకు సాగింది. మే 1న వాళ్లు ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురికాగా.. శుక్రవారం(జూన్ 9న) సాయంత్రం ఆ నలుగురు చిన్నారుల జాడను కొలంబియా సైన్యంలోని ఓ బృందం గుర్తించింది. 👉 కొలంబియా అమెజాన్ అడవుల్లో అత్యంత ప్రమాదకరమైన రీజియన్ అది. విషపూరితమైన కీటకాలు, వన్యప్రాణుల నుంచి తప్పించుకుంటూ దొరికింది తింటూ ఇన్నాళ్లూ గడిపారు ఆ చిన్నారులు. అంతకన్నా ప్రమాదకరమైన డ్రగ్స్ ముఠాల కంట పడకుండా జాగ్రత్తపడ్డారు. అడవుల్లో దొరికింది తింటూ.. నీళ్లు తాగుతూ.. మధ్యలో సైన్యం ఆకాశం నుంచి జారవిడిచిన ఆహార పొట్లాలను సైతం అందుకున్నారాట. పౌష్టికాహర లోపం తప్పించి.. వాళ్లకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకపోవడం గమనార్హం. అంతకన్నా ఆశ్చర్యకరం ఏంటంటే.. 11 నెలల ఆ పసికందు సైతం ఆరోగ్యంగానే ఉందని ఆర్మీ డాక్టర్లు ప్రకటించారు. పైగా ఆ చిన్నారి తన ఏడాది పుట్టినరోజును అమెజాన్లోనే చేసుకుందట(గడపడం). నలభై రోజుల క్రితం 👉 మే 1 ఉదయం, సెస్నా 206 అనే ఓ తేలికపాటి ప్యాసింజర్ విమానం.. అరరాకువారా అని పిలువబడే అడవి ప్రాంతం నుండి కొలంబియా అమెజాన్‌లోని శాన్ జోస్ డెల్ గువియారే పట్టణానికి బయలుదేరింది. ఈ మధ్య దూరం 350 కిలోమీటర్లు. కానీ, ఆ ఎయిర్‌ప్లేన్ బయల్దేరిన కాసేపటికే ఇంజిన్‌లో సమస్య ఉందంటూ పైలట్ రిపోర్ట్ చేశాడు. కాసేపటికే విమానం సిగ్నల్ రాడార్‌కు అందకుండా పోయింది. This photo by Columbia’s Armed Forces Press, helps us to understand how the children survived the crash. The rear of the plane is untouched. You can see the open door on the side of the plane where they potentially jumped down from. pic.twitter.com/sj0uKVpsbO — Simply_Stranger (@AngelsBokenHalo) May 20, 2023 👉 దీంతో విమానం ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. అయితే అది ప్రమాదానికి గురైంది. మే 15, 16వ తేదీల్లో.. దట్టమైన అటవీ ప్రాంతంలో ముగ్గురి మృతదేహాలను సైన్యం కనిపెట్టంది. ఆ పక్కనే చెట్ల పొదట్లో విమాన శకలాలు చిక్కుకుని కనిపించాయి. ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. ఆ చిన్నారుల తల్లి మాగ్దలేనా(33) కూడా మరణించింది. పైలట్‌తో పాటు ఓ తెగ నాయకుడు కన్నుమూశాడు. అయితే.. పిల్లలకు సంబంధించిన జాడ మాత్రం దొరకలేదు. దీంతో వాళ్లు తమ ప్రాణాలు రక్షించుకునేందుకు ముందుకు సాగుతున్నారేమో అని సైన్యం భావించింది. అవాంతరాలు ఏర్పడ్డా.. 👉 వాషింగ్టన్కు రెండింతల పరిమాణంలో ఉండే ఆ అటవీ ప్రాంతంలో లెస్లీ(13), సోలెయినీ(9), టెయిన్ నోరెయిల్(4), మరో పసికందు క్రిస్టిన్ ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగాయి. భీకరమైన, దుర్భేద్యమైన అటవీ ప్రాంతంలో కావడంతో సెర్చ్ ఆపరేషన్‌కు అవాంతరాలు ఏర్పడ్డాయి. 👉 200 మంది సైనికులు, కొందరు అడవుల్లో నివసించే స్థానికుల సాయంతో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. మధ్యలో వాళ్లకు సంబంధించిన వస్తువులు కనిపిస్తుండడంతో.. బతికే ఉంటారని భావించారు. ప్రత్యేక హెలికాఫ్టర్ల ద్వారా ఆ అడవుల్లో నీళ్ల బాటిళ్లు, ఆహార పొట్లాలు పడేస్తూ వచ్చారు. వాళ్ల ఆచూకీ కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. కొలంబియా మొత్తం వాళ్లు ప్రాణాలతో బయటపడాలంటూ దేవుడ్ని ప్రార్థిస్తూ వచ్చారు. ఆ ప్రార్థనలు ఫలించాయి. వాళ్లకు అలవాటేనా? 👉 అమెజాన్ అడవుల్లో తప్పిపోయిన నలుగురు చిన్నారులు.. హుయిటోటో(విటోటో) తెగకు చెందిన వాళ్లు. అడవితో మమేకమై జీవించడం ఆ తెగకు అలవాటే. చిన్నప్పటి నుంచి చేపల వేట, ఆహార పదార్థాల సేకరణ లాంటి పనుల్లో శిక్షణ తీసుకుంటారు. పైగా లెస్లీకి వాళ్ల బామ్మ అన్ని విధాల శిక్షణ ఇచ్చిందట. కాబట్టి, ఏదో రకంగా వాళ్లు బతికేందుకు ప్రయత్నిస్తారనే నమ్మకం వ్యక్తం చేసిందామె. వాళ్లు ఊహించినట్లే లెస్లీ రక్షణ బాధ్యతలు తీసుకుంది. అమ్మలా వాళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. -
‘ప్రతి హిందువు.. నలుగురు పిల్లల్ని కనాలి’
సాక్షి, ఉడిపి : ప్రతి హిందువు నలుగురు పిల్లలను కనాలంటూ హరిద్వార్ పీఠాధిపతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్నాటకలోని ఉడిపి క్షేత్రంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్మ సన్సద్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశంలో కామన్ సివిల్ కోడ్ అమల్లోకి వచ్చే వరకు.. ప్రతి హిందువు నలుగురు పిల్లల్ని కనాలని.. హరిద్వార్ పీఠాధిపతి స్వామీ గోవింద్‌దేవ్ గిరిరాజ్ మహరాజ్ శనివారం పిలుపునిచ్చారు. అలా చేయడం వల్లే జనాభాను సమతుల్యంగా ఉంచడం సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. ఇద్దరు పిల్లల విధానం వల్ల హిందువుల జనాభా దేశంలో తగ్గు ముఖం పడుతోందని ఆయన ఆందోళన వెలిబుచ్చారు. ఇద్దరు పిల్లల విధానాన్ని అందరికీ వర్తింపచేయాలని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడైతే హిందువుల జనాభా తగ్గిందో.. ఆ ప్రాంతాన్ని భారత్ కోల్పోయిందని, ఇందుకు జనాభా అసమతుల్యతే కారణమని ఆయన చెప్పారు. గోవులను రక్షించుకోవడం హిందువుల బాధ్యత అని ఆయన చెప్పారు. అదే సమయంలో గోవుల రక్షణ కోసం శ్రమిస్తున్న గో రక్షక్లను ఆయన కొనియాడారు. నేడు కొంతమంది గో రక్షక్లను నేరస్తులుగా చూస్తున్నారని.. ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గో రక్షక్‌లు అత్యంత శాంతి ప్రియులని చెప్పారు. -
కవలల కుటుంబం!
బళ్లారి రూరల్ (కర్ణాటక): మూడు తరాలుగా ఆ కుటుంబంలో కవలలు జన్మిస్తున్నారు. తాజాగా గురువారం ఆ ఇంటి కోడలు ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. బళ్లారి జిల్లా కంప్లి సమీపంలోని ఎమ్మిగనూరుకు చెందిన బసవరాజు, హులిగమ్మ దంపతులకు వ్యవసాయమే జీవనాధారం. హులిగమ్మకు మొదటి కాన్పులో మగశిశువు జన్మించాడు. మూడేళ్ల తరువాత ఆమె గురువారం బళ్లారిలోని విమ్స్ ఆస్పత్రిలో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. వీరిలో ఇద్దరు మగ, ఇద్దరు ఆడపిల్లలు. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా, బసవరాజు తండ్రికి 8 మంది సంతానం కాగా, వారిలో ఇద్దరు కవలలు. అలాగే బసవరాజు తాతకు కూడా కవలలు పుట్టడం విశేషం. -
భార్య మృతిని తట్టుకోలేక భర్త కన్నుమూత
మనూర్ : భార్య మృతిని తట్టుకోలేక మనస్తాపానికి గురైన భర్త అకస్మాత్తుగా కన్నుమూయడంతో వారి నలుగురు పిల్లలు అనాథలయ్యారు. ఈ సంఘటన మెదక్ జిల్లా మనూర్ మండలం కర్సగుర్తి పంచాయతీ పరిధిలోని గంగారం తండాలో శనివారం వెలుగుచూసింది. తండాకు చెందిన మరునిబాయి అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో ఆమె భర్త దేవిదాస్(45) గుండెపోటుకు గురై మృతిచెందాడు. తల్లిదండ్రులిద్దరు మృతిచెందడంతో నలుగురు పిల్లలు అనాథలయ్యారు. -
'నలుగురు భార్యలు,40 మంది పిల్లలు'
న్యూఢిల్లీ: 'నలుగురు భార్యలు,40 మంది పిల్లలు' అనే భావన మన దేశంలో పనిచేయదని బీజేపీ ఎంపి సాక్షి మహారాజ్ అన్నారు. అందువల్ల హిందూ మతాన్ని రక్షించుకోవాలంటే ప్రతి హిందూ మహిళ తప్పనిసరిగా నలుగురు పిల్లలను కనాలని ఆయన పునరుద్ఘాటించారు. మీరట్‌లో ఈ రోజు ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సాక్షి మహారాజ్ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ బీజేపీని ఇరకాటంలో పెడుతున్నారు. ఇంతకు ముందు ఒకసారి జాతిపిత మహాత్మాగాంధీని చంపిన నాథురామ్ గాడ్సే గొప్ప దేశ భక్తుడని కొనియాడి పార్లమెంట్లో క్షమాపణలు చెప్పారు. వివాదస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లోకి ఎక్కుతున్న సాక్షి మహరాజ్‌కు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఇచ్చిన ఆదేశాల మేరకు బీజేపీ షోకాజ్ నోటీసు జారీచేసింది. ''పార్టీ హెచ్చరించినా లెక్కచేయకుండా వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మీపై ఎందుకు చర్య తీసుకోకూడదో తెలపాలి'' అని ఆ నోటీస్‌లో పేర్కొంది. ఈ నోటీస్ విషయమై విలేకరులు ఆయన వద్ద ప్రస్తావించగా, పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేయడం పార్టీ అంతర్గత వ్యవహారం అని మహారాజ్ అన్నారు. నోటీస్ అందిన తరువాత సమాదానం చెబుతామని చెప్పారు. ''ఈ విషయమై నేను మా పార్టీతో మాట్లాడతాను.మీతో మాట్లాడను'' అని విలేకరులకు చెప్పారు. పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేసినప్పటికీ ఆయన మళ్లీ మళ్లీ ఆ వ్యాఖ్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. -
ఉసురు తీసిన కారు
ఊపిరాడక నలుగురు చిన్నారుల మృతి చెన్నై: ఆడుకుంటూ ఓ పాత కారులోకి వెళ్లిన నలుగురు చిన్నారులు అనుకోకుండా అందులో చిక్కుకుపోయి చివరికి ఊపిరాడక విగతజీవులయ్యారు. తమిళనాడులో తూత్తుకుడి సమీపంలోని వేడనత్తం గ్రామంలో బుధవారం ఈ విషాదం చోటుచేసుకుంది. వేడనత్తంలోని ఐదు ఆలయాల్లో ఆడి ఉత్సవాలు జరుగుతుండటంతో పరిసర ప్రాంతాల భక్తులు తరలివచ్చారు. అయితే ఓ గుడికి సమీపంలోని బ్యాంకువద్ద బ్యాంకు సిబ్బంది సీజ్ చేసిన పాత కార్లు, వాహనాలు ఉంచిన యార్డు వద్దకు ఆడుకునేందుకు ముత్తు అలగు(10), శక్తి అమ్మాల్(8), మోసష్(7), ఆది(4) అనే చిన్నారులు వెళ్లారు. అక్కడి ఓ కారులోకి వీరు ఎక్కగానే డోర్లు ఆటోమేటిక్‌గా లాక్ కావడంతో అందులో చిక్కుకుని వారు ఊపిరాడక చనిపోయారు.