
కవలల కుటుంబం!
బళ్లారి రూరల్ (కర్ణాటక): మూడు తరాలుగా ఆ కుటుంబంలో కవలలు జన్మిస్తున్నారు. తాజాగా గురువారం ఆ ఇంటి కోడలు ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. బళ్లారి జిల్లా కంప్లి సమీపంలోని ఎమ్మిగనూరుకు చెందిన బసవరాజు, హులిగమ్మ దంపతులకు వ్యవసాయమే జీవనాధారం.
హులిగమ్మకు మొదటి కాన్పులో మగశిశువు జన్మించాడు. మూడేళ్ల తరువాత ఆమె గురువారం బళ్లారిలోని విమ్స్ ఆస్పత్రిలో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. వీరిలో ఇద్దరు మగ, ఇద్దరు ఆడపిల్లలు. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా, బసవరాజు తండ్రికి 8 మంది సంతానం కాగా, వారిలో ఇద్దరు కవలలు. అలాగే బసవరాజు తాతకు కూడా కవలలు పుట్టడం విశేషం.