bellary district
-
బళ్లారి జిల్లాతో పునీత్‌కు విడదీయలేని బంధం.. ఎలా అంటే..!
Puneeth Rajkumar Bonding With Bellary: పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు బళ్లారి జిల్లాతో విడదీయరాని బంధం ఉంది. సినిమా చిత్రీకరణల సందర్భంగా అనేక పర్యాయాలు జిల్లాలో పర్యటించారు. పునీత్ రాజ్‌కుమార్ ఉత్తమ నటన, ఆయన ఉత్తమ వ్యక్తిత్వం, అందరితో కలిసిపోయే గుణం కారణంగా జిల్లాలో ఆయనకు లక్షలాదిగా అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన చిత్రాలు జిల్లాలో వంద రోజులపాటు ప్రదర్శించారు. పునీత్‌రాజ్‌కుమార్ గురు రాఘవేంద్ర స్వామి భక్తుడు కావడంతో మంత్రాలయం వెళ్లినప్పుడు బళ్లారికి వచ్చి వెళ్లేవారు. బళ్లారికి వచ్చిన ప్రతిసారీ వేలాదిగా అభిమానులు ఘన స్వాగతం పలికేవారు. ఆయన నటించిన సినిమాలు బళ్లారిలోని శివ థియేటర్లో వంద రోజులపాటు ప్రదర్శించామని బళ్లారి సినిమా థియేటర్ల ఆసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీకాంతరెడ్డి, హనుమంతరెడ్డిలు తెలిపారు. పునీత్‌రాజ్‌కుమార్ మృతికి సంతాపసూచకంగా బళ్లారిలో సినిమా థియేటర్లను మూసివేశారు. శ్రద్ధాంజలి ఘటించిన అభిమానులు పునీత్ రాజ్‌కుమార్ ఆకాల మరణంతో అభిమానులు కంటతడిపెట్టారు. పెద్ద సంఖ్యలో అభిమానులు అప్పు సేవా సమితి, రాజ్‌కుమార్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో రాయల్ సర్కిల్‌కు చేరుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. నటరాజ్ థియేటర్ యజమాని లక్ష్మీకాంత్‌రెడ్డి, పునీత్ అభిమానులు కప్పగల్ చంద్ర«శేఖర్ ఆచారి, మంజునాథ్,› ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: (పునీత్ కుటుంబాన్ని వెంటాడుతున్న ‘గుండె పోటు’!) గంగావతి: బస్టాండ్ సర్కిల్లో పునీత్ రాజ్‌కుమార్ చిత్ర పటం ఉంచి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మాజీ ఎమ్మెల్సీ హెచ్ఆర్ శ్రీనాథ్ మాట్లాడుతూ పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మరణం సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. కర్ణాటక రక్షణ వేదిక జిల్లా అధ్యక్షులు పంపణ్ణనాయక్, చెన్నబసవ జైకిన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. రాయచూరు రూరల్: నటుడు పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణంతో రాయచూరు జిల్లాలో అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. కన్నడపర సంఘటనల సంచాలకుడు అశోక్ కుమార్ జైన్, గోవింద రాజులు, నరసింహులు, సాధిక్, బసవరాజ్ కళస, శివకుమార్‌యాదవ్, రవి, అశోక్ శెట్టి, రమేష్, రాజశేఖర్, వినోద్ రెడ్డి, శరణప్ప, మాజీ ఎమ్మెల్సీ బోసురాజ్, ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్, మంత్రాలయం రాఘవేంద్ర స్వాముల మఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్లు సంతాపం వ్యక్తం చేశారు. కంప్లి: పునీత్‌రాజ్‌కుమార్ మృతితో కంప్లిలో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎమ్మెల్యే గణేష్ కార్యాలయం వద్దకు పునీత్ అభిమానులు చేరుకుని పునీత్ రాజ్‌కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి సమర్పించారు. -
Ballari: మూడు రోజులు బ్యాంకులు బంద్
బళ్లారి టౌన్: కరోనా నియంత్రణ కోసం మంగళవారం నుంచి మూడు రోజుల పాటు బ్యాంకులను బంద్ చేయాలని ఆదేశించినట్లు జిల్లాధికారి పవన్‌కుమార్ మాలపాటి తెలిపారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ... ప్రస్తుతం చేపట్టిన లాక్డౌన్ వల్ల కరోనా కేసులు తగ్గాయని అన్నారు. కొంత మంది బ్యాంకుల్లో పని ఉందని తిరుగుతున్నారని, దీంతో బ్యాంకులు కూడా బంద్ చేస్తే జూన్ 7 వరకు చేపట్టిన లాక్డౌన్ వల్ల మరింత కేసులు తగ్గించవచ్చన్నారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి జూన్ 7 ఉదయం వరకు సంపూర్ణ లాక్డౌన్ అమల్లో ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ సైదూల్ అడావత్ తెలిపారు. వివరాలు వెల్లడిస్తున్న కలెక్టర్, ఎస్పీ -
నేటి నుంచి సంపూర్ణ లాక్డౌన్.. బయటకు వస్తే వాహనాలు సీజ్
సాక్షి బళ్లారి: జిల్లాలో కరోనా అదుపులోకి రాకపోవడంతో జిల్లా యంత్రాంగం ఐదు రోజులు పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌కు ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన లాక్డౌన్లో కొద్దిమేర మరిన్ని కఠిన ఆంక్షలు చేపట్టారు. నేటి (బుధవారం) నుంచి ఐదు రోజుల పాటు పూర్తిగా లాక్డౌన్ అమల్లోకి వస్తుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే బయటకు అనుమతి ఉంటుంది. అటు తరువాత పూర్తిగా లాక్డౌన్ కొనసాగుతుంది. అత్యవసర సేవలు మినహా మెడికల్ స్టోర్స్, ఆస్పత్రులకు, పాల విక్రయాలకు మినహాయింపు ఇచ్చి మిగిలిన అన్ని దుకాణాలు మూతపడనున్నాయి. నిబంధనలు ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లాధికారి హెచ్చరించారు. అత్యవసరం మినహా ఎవరూ బయటకు రాకూడదన్నారు. వాహనాలు సీజ్ చేస్తాం బళ్లారిటౌన్: జిల్లాలో లాక్డౌన్ అమల్లో ఉన్న కారణంగా అనవసరంగా ఎవరైనా బయటకు వస్తే వాహనాలను సీజ్ చేస్తామని ఎస్పీ సైదులు అడావత్ హెచ్చరించారు. ఇప్పటి వరకు 600 వాహనాలను సీజ్ చేశామని, వారిపై కేసులు కూడా నమోదు చేసి జైలుకు పంపామన్నారు. బుధవారం నుంచి 5 రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ ఉన్నందున ప్రజలు కోవిడ్ నియంత్రకు సహకరించాలని కోరారు. -
బళ్లారి జిల్లా విభజనకు ఆమోదముద్ర
సాక్షి బెంగళూరు : విజయనగర జిల్లా ఏర్పాటుకు ఆమోదముద్ర పడింది. బళ్లారి జిల్లాను రెండుగా విభజించి 31వ జిల్లాగా విజయనగర (హొసపేటె)ను ఏర్పాటు చేస్తూ శుక్రవారం ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప అధ్యక్షతన నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఏర్పడే జిల్లాలోకి హొసపేటె, హరపనహళ్లి, హూవినహడగలి, హగరి బొమ్మనహళ్లి, కొట్టూరు, కూడ్లిగి తాలూకాలు రానున్నాయి. మిగతా బళ్లారి, సిరుగుప్ప, సండూరు, కురుగోడు, కంప్లి తాలూకాలు బళ్లారి జిల్లాలోనే కొనసాగుతాయని మంత్రివర్గ సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి జేసీ మాధుస్వామి మీడియాకు తెలిపారు. (‘గోవధ నిషేధంపై త్వరలోనే బిల్లు’) బళ్లారి జిల్లాలో ఇప్పటివరకు బళ్లారి, హొసపేటె, కూడ్లిగి, హగరిబొమ్మనహళ్లి, హడగలి, కంప్లి, సిరుగుప్ప, సండూరు, హరపనహళ్లి తాలూకాలు ఉన్నాయి. హొసపేటె కేంద్రంగా విజయనగర జిల్లా ఏర్పాటు చేయాలని 20 ఏళ్లుగా డిమాండ్లు ఉన్నాయి. హొసపేటెను విజయనగర జిల్లాగా ఏర్పాటు చేస్తామని బీజేపీ హామీ ఇవ్వడంతో కాంగ్రెస్‌లో ఉన్న హొసపేటె ఎమ్మెల్యే, ప్రస్తుత అటవీ శాఖామంత్రి ఆనంద్‌సింగ్ బీజేపీలో చేరారు. ఇచ్చిన హామీ మేరకు విజయనగర జిల్లా ఏర్పాటుకు ఈనెల 19న జరిగిన కేబినెట్ సమావేశంలో తాత్కాలికంగా ఆమోదం వేశారు. శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో విజయనగర జిల్లా ఏర్పాటుకు పూర్తి ఆమోదముద్రవేశారు. బళ్లారిని ముక్కలు చేయరాదని బళ్లారి సిటీ బీజేపీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వం విజయనగర జిల్లాకు ఆమోదముద్ర వేసింది. (పవన్ కల్యాణ్‌పై తమిళ మీడియా సెటైర్లు) మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న మరిన్ని నిర్ణయాలు ►కర్ణాటక గృహ మండలిలో రూ.2,275 కోట్లతో 98 వసతి పథకాలు అమలు ►ధారవాడ రైల్వే స్టేషన్ యార్డు సమీపంలో రూ.16.48 కోట్లతో ఉపరితల వంతెన నిర్మాణం ►సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కు సహకారంతో ఉత్పాదన కేంద్రం నిర్మాణం, విశ్వేశ్వరయ్య టెక్నాలజీ యూనివర్సిటీ కట్టడ నిర్మాణాలకు రూ.42.93 కోట్ల కేటాయింపు ►ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు ►కర్ణాటక గెజిటెడ్ ప్రొబేషనరీ నియామకాల్లో సవరణలకు ఆమోదం ►బెంగళూరు గ్రామీణ జిల్లా బాశెట్టిహళ్లి, దావణగెరె జిల్లా హొన్నాళిని ప.పం. నుంచి∙పురసభ, బెంగళూరు నగరం యలహంకలోని హుణసమారహళ్లి పురసభ, అథణి, కాగవాడను పట్టణ పంచాయతీలుగా అప్‌గ్రేడ్ ►శివమొగ్గ విమానాశ్రయం అభివృద్ధికి రూ.380 కోట్లు ►బళ్లారి జిల్లా జిందాల్‌కు భూ కేటాయింపుల కోసం మరోసారి పరిశీలన ►బీబీఎంపీ పరిధిలోకి మల్లసంద్ర, కావల్శెట్టిహళ్లి గ్రామ పంచాయతీలు ►మెట్రో రైలు అనుసంధాన ప్రక్రియలో భాగంగా ముగ్గురు సభ్యులతో కమిటీ ►ఎక్స్పీరియన్స్ బెంగళూరు పథకంలో భాగంగా మైసూరు ల్యాంప్స్ పరిశ్రమలో భూమి, ఉపకరణాల కొనుగోలుకు తీర్మానం -
బళ్లారి జిల్లా కురుగోడు వద్ద కాలువకు గండి
-
బళ్లారి జిల్లాకు 2 మంత్రి పదవులు?
సాక్షి, బళ్లారి: రాష్ట్రంలో ఏర్పాటు కానున్న జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో బళ్లారి జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున గెలుపొందిన పలువురు ఎమ్మెల్యేలు మంత్రి పదవులపై ఆశలు పెంచుకుంటున్నారు. జిల్లాలోని 9 అసెంబ్లీ స్థానాల్లో ఆరు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందడం తెలిసిందే. బళ్లారి ›గ్రామీణ నియోజకర్గం నుంచి నాగేంద్ర, సండూరు నుంచి తుకారాం, హడగలి నుంచి పరమేశ్వర్ నాయక్, విజయనగర నియోజకవర్గం నుంచి ఆనంద్‌సింగ్ ఉన్నారు. వీరిలో కొందరు మంత్రి పదవి కోసం ఇప్పటికే తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. నూతన సంకీర్ణ ప్రభుత్వంలో బళ్లారి జిల్లా నుంచి గెలుపొందిన ఆరు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ప్రముఖంగా పరమేశ్వర్ నాయక్, నాగేంద్ర, ఆనంద్‌సింగ్, తుకారాంల పేర్లు వినిపిస్తున్నప్పటికీ జిల్లా నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవి రేస్‌లో ఉన్న వారు సీనియర్లు కావడంతో పదవులను ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవులపై ఎవరికివారే అంచనాల్లో మునిగిపోయారు. -
కవలల కుటుంబం!
బళ్లారి రూరల్ (కర్ణాటక): మూడు తరాలుగా ఆ కుటుంబంలో కవలలు జన్మిస్తున్నారు. తాజాగా గురువారం ఆ ఇంటి కోడలు ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. బళ్లారి జిల్లా కంప్లి సమీపంలోని ఎమ్మిగనూరుకు చెందిన బసవరాజు, హులిగమ్మ దంపతులకు వ్యవసాయమే జీవనాధారం. హులిగమ్మకు మొదటి కాన్పులో మగశిశువు జన్మించాడు. మూడేళ్ల తరువాత ఆమె గురువారం బళ్లారిలోని విమ్స్ ఆస్పత్రిలో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. వీరిలో ఇద్దరు మగ, ఇద్దరు ఆడపిల్లలు. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా, బసవరాజు తండ్రికి 8 మంది సంతానం కాగా, వారిలో ఇద్దరు కవలలు. అలాగే బసవరాజు తాతకు కూడా కవలలు పుట్టడం విశేషం. -
ఏం కష్టమొచ్చిందో?
= కుమార్తెతో సహా దంపతుల ఆత్మహత్య = కొట్టూరులో విషాదం అల్లారుముద్దుగా గోరుముద్దులు తినిపించాల్సిన తల్లిదండ్రులు తమ బిడ్డకు విషం తాగించారు. ఆపై తామూ అదే విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఏం కష్టమొచ్చిందో ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ హృదయ విదారక ఘటన బళ్లారి జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. బళ్లారి జిల్లా కూడ్లిగి నియోజకవర్గ పరిధిలోని కొట్టూరు పట్టణానికి చెందిన మృత్యుంజయ(47), అతని భార్య మధుమతి(38)లు పురుగుల మందు తాగి, తమ చివరి కుమార్తె బిందు(3)కూ తాగించి ఆత్మహత్య చేసుకోవడంతో కొట్టూరులో విషాదం చోటు చేసుకుంది. పట్టణ శివారులోని హగరి గజాపుర రోడ్డులోని తమ పొలంలో ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. అయితే మరో ఇద్దరు కుమార్తెలు తన తల్లి వద్ద ఉన్నారని, తమ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, జీవితంపై విరక్తితోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు డెత్‌నోట్‌లో రాసి పెట్టడం గమనార్హం. వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే మృత్యుంజయ ఉన్న ఫళంగా భార్య పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవడం వెనుక వ్యాపార లావాదేవీలేమైనా కారణమై ఉంటాయా అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సమాచారం అందిన వెంటనే కొట్టూరు సీఐ రవీంద్ర తమ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కొట్టూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. -
మర్మమేమిటో ? !
జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా సంతోష్‌లాడ్ నియామకంపై సర్వత్రా చర్చ కాంగ్రెస్ తీరుపై విమర్శల వెల్లువ బళ్లారి : బీజేపీ ప్రభుత్వ హయాంలో బళ్లారి జిల్లాలో అక్రమ గనుల తవ్వకాలు సాగుతున్నాయని అప్పటి ప్రతిపక్ష నేత సిద్దరామయ్య బెంగళూరు నుంచి బళ్లారి వరకు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ గనులు తవ్వకాలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంతోష్‌లాడ్‌కు మంత్రి పదవి ఇవ్వడమే కాకుండా ఏకంగా బళ్లారి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా నియమించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బళ్లారి జిల్లా సండూరుకు చెందిన సంతోష్‌లాడ్‌కు సండూరులో వీఎస్ లాడ్ అండ్ కంపెనీలో భాగస్వామి. ఆయనకు సండూరులో అపారమైన గనుల నిల్వలు ఉన్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడి, పోరాటం చేసి, అధికారంలోకి వచ్చాక అక్రమ గనులు తవ్వకాలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంతోష్‌లాడ్‌కు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా కేబినెట్ హోదా కల్పించడంతో పాటు బళ్లారి జిల్లాకు ఇన్‌ఛార్జి మంత్రిగా నియమించడంతో కాంగ్రెస్ పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో 2013లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకివచ్చాక సిద్దరామయ్య మంత్రివర్గంలో సంతోష్‌లాడ్‌కు మంత్రి పదవి కట్టబెట్టారు. తర్వాత ఆయనపై అక్రమ గనుల తవ్వకాలు చేపట్టారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో మంత్రి పదవి నుంచి ఆరు నెలలకే తప్పించారు. ప్రస్తుతం సీఎం మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేపట్టడంతో బళ్లారి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్న పరమేశ్వర్ నాయక్‌ను తప్పించి, ఆయన స్థానంలో సంతోష్ లాడ్‌కు మంత్రి పదవి కట్టబెట్టారు. పరమేశ్వర్ నాయక్ నిర్వహిస్తున్న కార్మిక శాఖనే సంతోష్ లాడ్‌కు అప్పజెప్పడంతో పాటు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా నియమించడంతో గమనార్హం. అధికారంలో లేనప్పుడు పదే పదే అక్రమ గనుల తవ్వకాలపై ఆరోపణలు గుప్పి ంచిన సిద్దూ అధికారంలోకి వచ్చాక చేసిందేమిటని జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బళ్లారి జిల్లాలో సీనియర్లతో పాటు యువ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అయితే నిజాయితీ పరులుకు మంత్రి గిరి ఇవ్వక పోవడంతో అక్రమార్కుల కు జిల్లా ఇన్చార్జి మంత్రి పదవి కట్టబెట్టారని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి