suffocation
-
బొగ్గు గనిలో దొంగతనానికి వెళ్లిన నలుగురు.. ఊపిరాడక..
భోపాల్: బొగ్గు గనిలో ఇనుము చోరీ చేసేందుకు వెళ్లిన నలుగురు దొంగలు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్ షాదోల్ జిల్లా కాల్రిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను గని నుంచి బయటకు తీశారు. మొత్తం ఐదుగురు వ్యక్తులు కలిసి ఈ బొగ్గు గనిలోని జంక్ మెషీన్లలో ఇనుమును దొంగిలించేందుకు వెళ్లారు. ఓ వ్యక్తి బయట కాపలాగా నిలబడగా.. మిగిలిన నలుగురూ గనిలోకి ప్రవేశించారు. లోపలికి వెళ్లి ఎంతసేపైనా ఉలుకూ పలుకూ లేకపోవడంతో బయట నిలబడిన వ్యక్తి భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. గ్రామస్థులకు జరిగిన విషయాన్ని చెప్పాడు. వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రెస్క్యూ టీంతో బొగ్గు గని వద్దకు వెళ్లిన పోలీసులు ఆ నలుగురిని బయటకు తీసుకువచ్చారు. అయితే వారు అప్పటికే చనిపోయారు. లోపల ఊపిరాడకపోవడం వల్లే వీరు మరణించి ఉంటారని చెప్పారు. ఈ ప్రాంతంలో కొద్దిరోజుల క్రితం రూ.44లక్షలు విలువ చేసే 110 టన్నుల తుక్కును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. స్క్రాప్ డీలర్లపై చర్యలు తీసుకున్నప్పుడు ఇది బయటపడింది. దొంగలు ఇనుమును దొంగిలించి డీలర్లకు అమ్ముకుంటున్నట్లు తెలిసింది. చదవండి: ఇలాంటి పరిస్థితి శత్రువులకు కూడా రావొద్దు.. బీజేపీ నేత ఫ్యామిలీ ఆత్మహత్య! -
అన్నీ ఓకే కానీ, ఆ విషయంలో బ్రిటిషర్లకు ఇబ్బందులు.. అప్పుడే వచ్చిందో ఆలోచన!
Britishers Uncomfortable In India: ఇప్పుడంటే మనకు సీలింగ్ ఫ్యాన్లు ఉన్నాయి. కానీ కరెంటు సౌకర్యం లేని వంద, రెండు వందల ఏళ్ల కింద పరిస్థితి ఏమిటో తెలుసా? బ్రిటిషర్లు ఉక్కపోత తట్టుకోవడానికి ఏం చేశారో తెలుసా..? గదిలో పైనుంచే వేలాడే వింజామర్లాంటి పంకాలను తయారు చేయించారు. ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ బ్రిటిషర్లు ఇండియాకు వచ్చిన కొత్తలో ఇక్కడి చాలా పరిస్థితులకు తగ్గట్టుగా సర్దుకుపోగలిగారు. కానీ వారికి వచ్చిన చిక్కల్లా ఒక్కటే. మన ఎండాకాలం. బ్రిటిష్‌వారికి బాగా ఎండకొట్టడమంటే.. మనకు చలికాలంలో మధ్యాహ్నం ఉన్నట్టు ఉంటుందంతే. కానీ ఇక్కడి ఎండాకాలంలో ఎండ వేడిని తట్టుకోవడానికి వారు నానా తంటాలూ పడ్డారు. కరెంటు లేకపోవడంతో ఫ్యాన్లు వాడలేరు. ఈ క్రమంలోనే భారీ ‘మ్యాన్యువల్ పంకా’లపై దృష్టిపెట్టారు. (చదవండి: సర్పంచ్ పదవికి వేలం పాట.. ఓర్ని! అన్ని లక్షలేందిరా సామీ..) వింజామరల నుంచి స్ఫూర్తి పొంది.. బ్రిటిష్ వాళ్లు వచ్చేప్పటికి మన దేశంలో రాజుల పాలన నడుస్తోంది. ఆ సమయంలో రాజులు, వారి కుటుంబ సభ్యులు, ఉన్నత స్థానాల్లో ఉండే పాలకులకు సేవకులు ‘వింజామర’లతో గాలి ఊపేవారు. వింజామరలు అంటే.. వస్త్రం, పక్షుల ఈకల వంటి వాటితో తయారై, పెద్దసైజు విసనకర్రల్లా ఉంటాయి. ఇక్కడి ఎండను, వేడిని తట్టుకోలేని బ్రిటిషర్లు.. ఆ వింజామరలను చూసి.. వాటి తరహాలో ‘పంకా’లను తయారు చేయించి వాడటం మొదలుపెట్టారు. గది నిండా గాలి వచ్చేలా.. నిజానికి ఒకరిద్దరికి అయితే వింజామరలు సరిపోతాయి. కానీ ఓ పెద్ద గది నిండా ఉండే వారికి గాలి రావాలంటే ఎలా? ఈ ఆలోచనతోనే పెద్ద పంకాలను తయారు చేయించేవారు. ► గది వెడల్పు కన్నా కాస్త తక్కువ పొడవున్న ఓ దూలాన్ని లేదా గట్టి వెదురు బొంగును తెచ్చి.. దానికి రెండు, మూడు అడుగుల మేర ఎత్తు వచ్చేలా అడ్డంగా వస్త్రాన్ని అమర్చేవారు. దీనిని గది మధ్యలో పైకప్పు నుంచి వేలాడదీసేవారు. ఆ దూలానికి తాళ్లు కట్టి.. ఏదో ఓ వైపు గోడలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రంధ్రాల ద్వారా బయటికి వేసేవారు. బయట కొందరు కూలీలు/బానిసలను పెట్టి ఆ తాడును లాగుతూ, వదులుతూ ఉండేలా చూసేవారు. ఇవే పంకాలు! కూలీలు/బానిసలు తాడును లాగుతూ, వదులుతూ ఉన్న కొద్దీ (పిల్లలు పడుకున్న ఊయలను తాడుతో ఊపినట్టుగా..).. గదిలో పైన ఏర్పాటుచేసిన ‘పంకా’లు.. అటూ ఇటూ ఊగుతూ గదిలో గాలి వీచేది. ఇలా పంకాలు ఊపే కూలీలను ప్రత్యేకంగా ‘పంకా వాలా’లు అని పిలిచేవారు. ► అప్పట్లో బ్రిటిషర్లు మాత్రమేకాదు.. స్థానిక రాజులు, అధికారులు, ధనికులు తమ ఇళ్లు, ఆఫీసుల్లో కూడా ఇలాంటి ‘పంకా’లను ఏర్పాటు చేయించుకుని.. కూలీలు/బానిసలతో వినియోగించుకునేవారు. ఇంటి నిండా పంకాలే.. బాగా డబ్బున్నవారు, వ్యాపారులు, బ్రిటిషర్లలో కాస్త పైస్థాయి ఆఫీసర్ల నివాసాల్లో అయితే.. ఏకంగా హాలు, బెడ్రూంతో పాటు బాత్రూమ్లలోనూ పంకాలు ఏర్పాటు చేసుకునేవారు. ఒక్కోచోట నుంచి ఒక్కో తాడు ఇంటి బయటికి అమర్చేవారు. బయట ఉన్న పంకావాలాలు వాటిని లాగుతూ, వదులుతూ ఊపేవారు. 19వ శతాబ్దం మొదలయ్యాక.. విద్యుత్ అందుబాటులోకి రావడంతో ఈ ‘పంకా’లు అంతర్థానమైపోయాయి. (చదవండి: కీలక విషయాలు వెల్లడి.. రాష్ట్రాల కోవిడ్ మృతుల సంఖ్యలో భారీ తేడా?) -
దోమల కోసం పొగ వేస్తే.. ఊపిరాడక మహిళ మృతి
తిరువొత్తియూరు: చెన్నై పమ్మల్ పొన్నియమ్మన్ వీధికి చెందిన చొక్కలింగం (53) ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగి. అతని భార్య పుష్పలక్ష్మి బుధవారం రాత్రి ఇంటిలో దోమలు ఎక్కువగా ఉండడంతో నిప్పులతో పొగ వేసి, ఏసీ ఆన్ చేసి పడుకున్నారు. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ఊపిరాడక పుష్పలక్ష్మి మృతి చెందింది. మిగతా ముగ్గురు ఆస్పత్రిలో పోరాడుతున్నారు. గురువారం ఉదయం చాలాసేపు ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారు వెళ్లి తలుపు తెరచి చూడగా పుష్పలక్ష్మి మృతి చెందగా, మిగతా వారు స్ప్పహ తప్పి ఉన్నారు. వారిలో చొక్కలింగం, కుమార్తె మల్లిక, కుమారుడు విశాల్‌ను చెన్నై రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
కార్ డోర్లు లాక్.. ఇద్దరు పిల్లల మృత్యువాత
సాక్షి, నిజామాబాద్ : నగరంలోని ముజాహిద్ నగర్లో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఆచూకీ లేకుండా పోయిన ఇద్దరు బాలురు ఓ కారులో శవాలై తేలారు. వివరాలు.. రియాజ్ (10), మొహమ్మద్ బద్రుద్దీన్ (5) కాలనీకి ఆడుకూంటూ వెళ్లి.. అక్కడికి కొంత దూరంలో పార్క్ చేసి ఉన్న కారులో ఎక్కి కూర్చున్నారు. దీన్ని ఎవరూ గమనించలేదు. కారులో చాలాసేపు ఆడుకున్నారు. అయితే, ఒక్కసారిగా కారు డోర్లు లాక్ అయ్యాయి. అప్పటికే కారు అద్దాలన్నీ మూసి ఉండటంతో ఊపిరి అందక వారు మృత్యువాత పడ్డారు. పిల్లల జాడకోసం తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వెతకినా లాభం లేకపోయింది. బుధవారం ఉదయం కాలనీకి దూరంలోని ఓ కారులో ఇద్దరూ చనిపోయి కనిపించారు. డోర్లు తెరుచుకోకపోవడంతోనే పిల్లలిద్దరూ ఊపిరాడక చనిపోయినట్టు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. -
కారు బానెట్‌ను ఇలా కూడా వాడొచ్చు..!
బీజింగ్ : ఎండలు మండిపోతున్నాయి. మాడు పగిలిపోయే ఎండలు బాబోయ్..! అనడం పరిపాటే..! కానీ, చైనాలో మాత్రం ఓ యువతి ఇంకాస్త ఎండైనా ఫరవాలేదు అంటున్నారు. 40 డిగ్రీల ఎండ వేడిలో కారు బానెట్‌పై ఎంచక్కా చేపలను ఫ్రై చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. చైనాలోని బింజౌలో ఈ విశేషం చోటు చేసుకుంది. ఓ ఐదు చేపలను, కొన్ని కూరగాయలను లేతగా వేయించి.. కొన్ని నిమిషాల్లోనే భోజనానికి ఏర్పాట్లు చేశారీ నయా చెఫ్. విపరీతమైన ఎండల కారణంగా చెమటలు కక్కుతున్న చైనీయుల కష్టాలను తన ‘ఎండ వంట’తో ప్రపంచానికి తెలియజెప్పారు. ఆమె వంట ఫొటోలను ట్విటర్లో పోస్టు చేయడంతో ఈ వార్త వైరల్ అయింది. కాగా, గత సంవత్సరం ఒడిషాలోని టిట్లానగర్లో భీకరమైన ఎండలు నమోదయ్యాయి. 45 డిగ్రీలకు పైగా ఎండలు కాయడంతో ఓ వ్యక్తి ఇలాంటి పనే చేశాడు. రోడ్డుపైన పెనం పెట్టి ఎగ్ ఆమ్లెట్ వేశాడు. మండుతున్న ఎండలతో జాగ్రత్త సుమీ..! అంటూ జనాన్ని అప్రమత్తం చేశాడు. It's sizzling hot! A woman fries fish on a burning hot car hood as temperatures neared 40 °C in Binzhou, east China’s Shandong province on Tuesday. pic.twitter.com/r9pGldjePS — People's Daily,China (@PDChina) June 6, 2018 -
కారు డోర్ లాక్ పడి బాలుడు మృతి
పూణే : ఎండ వేడికి తట్టుకోలేక ఓ ఐదేళ్ల చిన్నారి పార్క్ చేసి ఉన్న కారులోకి వెళ్లాడు. ఆ కారే ఆ పసివాడిని మింగేసింది. పోలీసుల వివరాల ప్రకారం కరణ్ పాండే (5) మధ్యాహ్నం పూట తన స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. వేడికి తట్టుకోలేక అక్కడే పార్కు చేసి ఉన్న కారు ఎక్కాడు. అది కాస్తా లాక్ అవడంతో కరణ్ లోపలే ఉండిపోయాడు. లోపల వేడి తట్టుకోలేక బయటకు రావడానికి ప్రయత్నించాడు. కానీ కార్ లాక్ అవడం వల్ల బయటకు రాలేకపోయాడు. దీంతో కారు లోపల ఊపిరాడక మరణించాడు. అయితే ఎంతసేపయిన కరణ్ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు అతడి కోసం వెతకడం ప్రారంభించారు. సుమారు ఆరు గంటలపాటు వెతికిన తరువాత కారులో కరణ్ మృతదేహాన్ని కనుగొన్నారు. కరణ్ తల, మెడ, ముఖం మీద కాలిన గాయాలు ఉన్నాయి. ఈ గాయాలు కారు లోపలి వేడి వల్ల ఏర్పడి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారు యజమాని వివరాలను మాత్రం వెల్లడించలేదు. -
సీజ్ చేసిన కారులో బాలుడి మృతి
ముంబై: పోలీసుల నిర్లక్ష్యం ఓ బాలుడి ఉసురు తీసింది. క్రైం బ్రాంచ్ అధికారులు సీజ్ చేసిన ఒక స్పోర్ట్స్ యుటిలిటీ (ఎస్యూవీ) లో వాహనంలోకి పొరపాటున వెళ్లిన కుర్బాన్ రహీం ఖాన్ (5) ఊపిరాడక చనిపోవడం ఆందోళన రేపింది. ముంబైలోని ఘట్కోపోర లో శనివారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే స్థానిక మసీదు దగ్గరున్న పార్క్ లో ఆడుకుంటున్న ఖాన్ సాయంత్రం ఇంటికి రాకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు కారులో పడి ఉన్న బాలుడిని కనుగొన్నారు. హుటాహుటిన అతడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే బాలుడు చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. ఆడుకుంటూ.. వాహనంలోకి ఎక్కినపుడు ఆటోమేటిగ్గా డోర్ లార్ అయి వుంటుందని , ఊపిరి ఆడక చనిపోయి వుంటాడని పోలీసులు అనుమానించారు. ఊపిరి ఆడక చనిపోయినట్టు పోస్ట్ మార్టం నివేదికలో తేలిందని తెలిపారు. ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు పోలీసులు సంఘటనపై విచారణకు చేపట్టారు. కాగా ఒక బిల్డర్ చెందిన మురికివాడల పునరావాస ప్రాజెక్టు స్థలంలో ముంబై క్రైం బ్రాంచ్ యూనిట్ సీజ్ చేసిన సుమారు 17 కార్లను అక్కడ ఉంచింది. స్టేషన్ లో జాగా లేకపోవడంతో దామోదర్ పార్క ఆవరణలో పార్క్ చేసినట్టు సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. పిల్లలు ఆడుకునే ప్రదేశంలో ఇలా వాహనాలను నిర్లక్ష్యంగా వదిలివేయడంపై స్థానికంగా విమర్శలు చెలరేగాయి. -
కుటుంబాన్ని బలిగొన్న చలిమంట
చలి చంపేస్తోంది అంటాం.. కానీ ఇక్కడ చలిమంట నిజంగానే ఓ కుటుంబాన్ని చంపేసింది. మహారాష్ట్రలోని పుణె నగరంలో చలి కాచుకోడానికి బొగ్గులు వెలిగించుకోవడంతో.. దాన్నుంచి వచ్చిన పొగ కారణంగా ఊపిరాడక ఓ కుటుంబంలోని ముగ్గురు సభ్యులు మరణించారు. ఈ ఘటన నారాయణ్ పేట్ ప్రాంతంలోని కబీర్బాగ్లో జరిగింది. భగవాన్ దోండిబా ఘరే (55), ఆయన భార్య మంగళ (50) పూర్ణిమ (22) ముగ్గురూ ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ఘరే కుమారుడు ధీరజ్ మాత్రం ఆరోజు వేరే ఇంట్లో ఉండటంతో అతనొక్కడూ బతికిపోయాడు. చలి ఎక్కువగా ఉందని ఇంటి కిటికీ తలుపులు కూడా వేసుకున్నారు. దాంతో బొగ్గుల నుంచి వచ్చిన కార్బన్ డయాక్సైడ్ గదిలో వ్యాపించి.. ఊపిరాడక ముగ్గురూ మరణించి ఉంటారని పోలీసులు తెలిపారు. -
కారులో ఊపిరాడక.. మూడేళ్ల బాలుడి మృతి
-
కారులో ఊపిరాడక.. మూడేళ్ల బాలుడి మృతి
విజయదశమి రోజున ఓ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పండుగ రోజు సరదాగా బయటకు వెళ్లిన ఆ కుటుంబం తమ ఇంట్లో ఓ చిన్న పిల్లాడిని కోల్పోయింది. పెద్దాపురం సౌఖ్య లాడ్జి సమీపంలో పార్కింగ్ చేసి ఉన్న కారులోకి మూడు సంవత్సరాల వయసున్న దత్తు అనే పిల్లాడు వెళ్లాడు. ఆడుకుంటూ ఆటలో భాగంగా కారులోకి వెళ్లిన దత్తుకు మళ్లీ తలుపు ఎలా తీయాలో రాలేదు. తలుపు లాక్ అయిపోయి ఉండటం, ఇంట్లో మిగిలిన పెద్దలంతా ఏదో పనిలో ఉండిపోవడంతో దత్తు కారులోంచి బయటకు రాలేకపోయాడు. కొంత సేపటికల్లా లోపలున్న దత్తు.. ఊపిరాడక మరణించాడు. చాలా సేపటి తర్వాత ఇంట్లో పెద్దలు బయటకు వచ్చి చూసుకునేసరికి.. పిల్లాడు చనిపోయి ఉన్నాడు. దాంతో పండుగపూట ఆ ఇంట్లో తీరని విషాదం నెలకొంది. -
ఉసురు తీసిన కారు
ఊపిరాడక నలుగురు చిన్నారుల మృతి చెన్నై: ఆడుకుంటూ ఓ పాత కారులోకి వెళ్లిన నలుగురు చిన్నారులు అనుకోకుండా అందులో చిక్కుకుపోయి చివరికి ఊపిరాడక విగతజీవులయ్యారు. తమిళనాడులో తూత్తుకుడి సమీపంలోని వేడనత్తం గ్రామంలో బుధవారం ఈ విషాదం చోటుచేసుకుంది. వేడనత్తంలోని ఐదు ఆలయాల్లో ఆడి ఉత్సవాలు జరుగుతుండటంతో పరిసర ప్రాంతాల భక్తులు తరలివచ్చారు. అయితే ఓ గుడికి సమీపంలోని బ్యాంకువద్ద బ్యాంకు సిబ్బంది సీజ్ చేసిన పాత కార్లు, వాహనాలు ఉంచిన యార్డు వద్దకు ఆడుకునేందుకు ముత్తు అలగు(10), శక్తి అమ్మాల్(8), మోసష్(7), ఆది(4) అనే చిన్నారులు వెళ్లారు. అక్కడి ఓ కారులోకి వీరు ఎక్కగానే డోర్లు ఆటోమేటిక్‌గా లాక్ కావడంతో అందులో చిక్కుకుని వారు ఊపిరాడక చనిపోయారు. -
కారులో ఇరుక్కుని.. బాలుడి మృతి
పొరపాటున కారులో ఇరుక్కుపోయి.. కారు లాక్ అయిపోవడంతో ఊపిరాడక రెండున్నరేళ్ల బాలుడు మరణించాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో న్యూమార్కెట్ ప్రాంతంలో జరిగింది. అతిశయ్ జైన్ అనే ఈ బాలుడు స్థానిక వస్త్రవ్యాపారి కొడుకు. దుకాణంలో ఆడుకుంటూ.. ఎవరికీ తెలియకుండా కారు తాళాలు తీసుకుని కారులోకి వెళ్లి ఆడుకోవడం మొదలుపెట్టాడు. పిల్లాడు వెళ్లగానే కారు తాళాలు ఆటోమేటిగ్గా పడిపోయాయి. అద్దాలు కూడా మూసి ఉండటంతో లోపల గాలి ఆడక.. పిల్లవాడు మరణించినట్లు అతడి తాత కమల్ జైన్ విలేకరులకు తెలిపారు. దాదాపు రెండున్నర గంటల తర్వాత పిల్లాడు ఎక్కడున్నాడో అని వెతుక్కుంటూ అతడి తల్లి పైన ఉన్న ఇంట్లోంచి కింద దుకాణంలోకి వచ్చింది. తీరా అక్కడ లేకపోవడంతో వెతగ్గా, కారులో స్పృహకోల్పోయి కనిపించాడు. తర్వాత డూప్లికేట్ తాళాలతో కారు తెరిచి, పిల్లాడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు.