కారు బానెట్‌ను ఇలా కూడా వాడొచ్చు..! | China Woman Cooks Fish On Car Bonnet As Temperature Touches 40 Degrees | Sakshi
Sakshi News home page

మండే ఎండల్లో వండెయ్‌ చేపల కూర..!

Published Sat, Jun 9 2018 5:32 PM | Last Updated on Sat, Jun 9 2018 6:45 PM

China Woman Cooks Fish On Car Bonnet As Temperature Touches 40 Degrees - Sakshi

కారు బానెట్‌పై చేపలను వేయిస్తున్న యువతి

బీజింగ్‌ : ఎండలు మండిపోతున్నాయి. మాడు పగిలిపోయే ఎండలు బాబోయ్‌..! అనడం పరిపాటే..! కానీ, చైనాలో మాత్రం ఓ యువతి ఇంకాస్త ఎండైనా ఫరవాలేదు అంటున్నారు. 40 డిగ్రీల ఎండ వేడిలో కారు బానెట్‌పై ఎంచక్కా చేపలను ఫ్రై చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. చైనాలోని బింజౌలో ఈ విశేషం చోటు చేసుకుంది. ఓ ఐదు చేపలను, కొన్ని కూరగాయలను లేతగా వేయించి.. కొన్ని నిమిషాల్లోనే భోజనానికి ఏర్పాట్లు చేశారీ నయా చెఫ్‌. 

విపరీతమైన ఎండల కారణంగా చెమటలు కక్కుతున్న చైనీయుల కష్టాలను తన ‘ఎండ వంట’తో ప్రపంచానికి తెలియజెప్పారు. ఆమె వంట ఫొటోలను ట్విటర్‌లో పోస్టు చేయడంతో ఈ వార్త వైరల్‌ అయింది. కాగా, గత సంవత్సరం ఒడిషాలోని టిట్లానగర్‌లో భీకరమైన ఎండలు నమోదయ్యాయి. 45 డిగ్రీలకు పైగా ఎండలు కాయడంతో ఓ వ్యక్తి ఇలాంటి పనే చేశాడు. రోడ్డుపైన పెనం పెట్టి ఎగ్‌ ఆమ్లెట్‌ వేశాడు. మండుతున్న ఎండలతో జాగ్రత్త సుమీ..! అంటూ జనాన్ని అప్రమత్తం చేశాడు.

It's sizzling hot! A woman fries fish on a burning hot car hood as temperatures neared 40 °C in Binzhou, east China’s Shandong province on Tuesday. pic.twitter.com/r9pGldjePS

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement