చలి చంపేస్తోంది అంటాం.. కానీ ఇక్కడ చలిమంట నిజంగానే ఓ కుటుంబాన్ని చంపేసింది.
చలి చంపేస్తోంది అంటాం.. కానీ ఇక్కడ చలిమంట నిజంగానే ఓ కుటుంబాన్ని చంపేసింది. మహారాష్ట్రలోని పుణె నగరంలో చలి కాచుకోడానికి బొగ్గులు వెలిగించుకోవడంతో.. దాన్నుంచి వచ్చిన పొగ కారణంగా ఊపిరాడక ఓ కుటుంబంలోని ముగ్గురు సభ్యులు మరణించారు. ఈ ఘటన నారాయణ్ పేట్ ప్రాంతంలోని కబీర్బాగ్లో జరిగింది.
భగవాన్ దోండిబా ఘరే (55), ఆయన భార్య మంగళ (50) పూర్ణిమ (22) ముగ్గురూ ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ఘరే కుమారుడు ధీరజ్ మాత్రం ఆరోజు వేరే ఇంట్లో ఉండటంతో అతనొక్కడూ బతికిపోయాడు. చలి ఎక్కువగా ఉందని ఇంటి కిటికీ తలుపులు కూడా వేసుకున్నారు. దాంతో బొగ్గుల నుంచి వచ్చిన కార్బన్ డయాక్సైడ్ గదిలో వ్యాపించి.. ఊపిరాడక ముగ్గురూ మరణించి ఉంటారని పోలీసులు తెలిపారు.