విజయదశమి రోజున ఓ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పండుగ రోజు సరదాగా బయటకు వెళ్లిన ఆ కుటుంబం తమ ఇంట్లో ఓ చిన్న పిల్లాడిని కోల్పోయింది. పెద్దాపురం సౌఖ్య లాడ్జి సమీపంలో పార్కింగ్ చేసి ఉన్న కారులోకి మూడు సంవత్సరాల వయసున్న దత్తు అనే పిల్లాడు వెళ్లాడు. ఆడుకుంటూ ఆటలో భాగంగా కారులోకి వెళ్లిన దత్తుకు మళ్లీ తలుపు ఎలా తీయాలో రాలేదు.
తలుపు లాక్ అయిపోయి ఉండటం, ఇంట్లో మిగిలిన పెద్దలంతా ఏదో పనిలో ఉండిపోవడంతో దత్తు కారులోంచి బయటకు రాలేకపోయాడు. కొంత సేపటికల్లా లోపలున్న దత్తు.. ఊపిరాడక మరణించాడు. చాలా సేపటి తర్వాత ఇంట్లో పెద్దలు బయటకు వచ్చి చూసుకునేసరికి.. పిల్లాడు చనిపోయి ఉన్నాడు. దాంతో పండుగపూట ఆ ఇంట్లో తీరని విషాదం నెలకొంది.
కారులో ఊపిరాడక.. మూడేళ్ల బాలుడి మృతి
Published Fri, Oct 3 2014 4:18 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM
Advertisement
Advertisement