
చండీగఢ్‌కు చెందిన వ్యక్తి ఇల్లు శుభ్రం చేస్తుండగా 37 ఏళ్ల నాటి రూ.12 లక్షల విలువైన రిలయన్స్ షేర్ సర్టిఫికెట్లు బయటపడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడా వ్యక్తికి వీటిని డిజిటలైజేషన్ చేసుకుందామని ప్రయత్నించగా చిక్కులు ఎదురవుతున్నాయి. దీంతో వాటిని అలాగే వదిలేయాలని నిర్ణయానికి వచ్చేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. చండీగఢ్‌కు చెందిన రతన్ ధిల్లాన్ వ్యక్తి ఇల్లు శుభ్రం చేస్తుండగా 37 ఏళ్ల నాటి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) షేర్ సర్టిఫికెట్లు బయటపడ్డాయి. 1988లో ఒక్కొక్కటి రూ.10 చొప్పున వీటిని కొనుగోలు చేయగా ఈ షేర్లు స్టాక్ స్ప్లిట్స్, బోనస్ ద్వారా 960 రెట్లు పెరిగాయి. దీంతో వీటి ప్రస్తుత విలువ రూ.12 లక్షలకు చేరింది.
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్న రతన్ ధిల్లాన్ మొదట వాటిని డిజిటలైజ్ చేసుకోవాలో సలహా కోరారు. అయితే చట్టపరమైన వారసుడి సర్టిఫికెట్, వారసత్వ ధృవీకరణ పత్రం, ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (ఐఈపీఎఫ్ఏ) క్లియరెన్స్ అవసరమయ్యే విస్తృతమైన పేపర్ వర్క్ గురించి తెలుసుకున్న తరువాత, ధిల్లాన్ ఈ ప్రయత్నాన్ని విరమించుకుంటున్నట్లు ప్రకటించారు.
ధీరూభాయ్ అంబానీ సంతకాలు వృథా కాబోతున్నాయని, షేర్ల డిజిటలైజేషన్ చేయకూడదని నిర్ణయించుకున్నానని రతన్ ధిల్లాన్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. "ఈ ప్రక్రియ చాలా సుదీర్ఘమైనది- చట్టపరమైన వారసుడి ధృవీకరణ పత్రాన్ని పొందడానికే 6-8 నెలలు పడుతుంది. ఐఈపీఎఫ్ఏ ప్రక్రియకు 2-3 సంవత్సరాలు పడుతుంది. అంత సమయాన్ని వెచ్చించడంలో అర్థం కనిపించడం లేదు. భారత్ తన పేపర్ వర్క్ ను క్రమబద్ధీకరించుకోవాల్సిన అవసరం ఉంది" అని పేర్కొన్నారు.
ప్రస్తుతానికి ఫిజికల్ షేర్ సర్టిఫికెట్లను ఏమీ చేయకుండా అలాగే వదిలేస్తానని ధిల్లాన్ తెలిపారు. రతన్ ధిల్లాన్ నిర్ణయంపై మైక్రోబ్లాగింగ్ సైట్ ‘ఎక్స్’ (గతంలో ట్విటర్) లో స్పందనలు వెల్లువెత్తాయి. పలువురు యూజర్లు షేర్ సర్టిఫికెట్ల డిజిటలైజేషన్‌లో తమ అనుభవాలను పేర్కంటూ కామెంట్లు చేశారు.
Final Update: It seems Dhirubhai Ambani’s signatures will go to waste, as I’ve decided not to proceed with digitizing the shares.
The process is just too lengthy—obtaining the legal heir certificate alone takes 6-8 months, and the IEPFA process reportedly takes 2-3 years.
I… https://t.co/sDt1uPKiqL— Rattan Dhillon (@ShivrattanDhil1) March 12, 2025
Comments
Please login to add a commentAdd a comment