అంబానీ, టాటా, అదానీ.. వీళ్లు చేసిన ఫస్ట్‌ జాబ్‌ ఏంటో తెలుసా? | Indian Billionaires First Jobs From Dhirubhai Ambani to Gautam Adani | Sakshi
Sakshi News home page

అంబానీ, టాటా, అదానీ.. వీళ్లు చేసిన ఫస్ట్‌ జాబ్‌ ఏంటో తెలుసా?

Published Sat, Nov 30 2024 7:42 PM | Last Updated on Sat, Nov 30 2024 8:02 PM

Indian Billionaires First Jobs From Dhirubhai Ambani to Gautam Adani

భారతదేశంలో ప్రతి ఏటా ధనవంతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం మన దేశంలోని కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, శివ్ నాడార్, సావిత్రి జిందాల్, దిలీప్ సాంఘ్వీ,  కుమార మంగళం బిర్లా మొదలైనవారు ఉన్నాయి. వీరిలో కొందరు వారసత్వంగా ధనవంతులైనప్పటికీ.. కొందరు మాత్రం కష్టపడి చిన్న ఉద్యోగాలు చేస్తూ ఎదిగారు. ఈ కథనంలో అలాంటి వాళ్ళ గురించి తెలుసుకుందాం.

ధీరూబాయ్ అంబానీ (Dhirubhai Ambani)
రిలయన్స్ సంస్థ ఏర్పడటానికి కారణమైన ధీరూబాయ్ అంబానీ.. తన తొలినాళ్లలో కుటుంబ పోషణ కోసం అనేక పనులు చేశారు.కానీ అవి నచ్చకపోవడంతో మిడిల్ ఈస్ట్ ఆసియా దేశమైన యెమెన్‌కు వలస వెళ్లి పెట్రోల్‌ బంకులో పని మొదలు పెట్టారు. అప్పట్లో ఆయన సంపాదన రూ. 300 మాత్రమే. కొంతకాలం పెట్రోల్ బంకులో పనిచేసి.. స్వదేశానికి వచ్చి చిన్నగా వ్యాపారాన్ని ప్రారంభించారు. అదే ఇప్పుడు ఇంతపెద్ద రియలన్స్ ఇండస్ట్రీస్‌గా మారింది.

సుధామూర్తి (Sudha Murthy)
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి భార్య సుధామూర్తి చదువు పూర్తయిన తరువాత.. టాటా మోటార్స్ (TELCO)లో ఉద్యోగం చేశారు. ఆ కంపెనీ మొదటి మహిళా ఇంజినీర్ సుధామూర్తి కావడం గమనార్హం. ఈ రోజు ఇంజినీరింగ్ రంగంలో కూడా మహిళలు ముందుకు వెళ్తున్నారంటే.. అది సుధామూర్తి కారణంగానే.

రతన్ టాటా (Ratan Tata)
దివంగత రతన్ టాటా.. ప్రారంభంలో టాటా కంపెనీలో ఉద్యోగిగా చేరారు. అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ 'ఐబీఎమ్' నుంచి మంచి శాలరీ ప్యాకేజీతో వచ్చిన జాబ్ వదులుకున్నారు. టాటా స్టీల్ కంపెనీలోనే పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి సంస్థా చైర్మన్ స్థాయికి ఎదిగారు.

కిరణ్ మజుందార్ షా (Kiran Mazumdar Shaw)
బయోకాన్ వ్యవస్థాపకురాలైన.. కిరణ్ మజుందార్-షా ప్రారంభంలో ఆస్ట్రేలియాలో బ్రూవర్‌గా తన వృత్తిని ప్రారంభించారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, ఆమె బ్రూయింగ్ పరిశ్రమలో లింగ వివక్షను ఎదుర్కొన్నారు. ఆ తరువాత క్రమంగా వ్యాపార సామ్రాజ్యంలో అంచెలంచెలుగా ఎదిగారు.

ఇంద్రా నూయి (Indra Nooyi)
పెప్సికో మాజీ సీఈఓ అయిన.. ఇంద్రా నూయి 18 సంవత్సరాల వయస్సులో బ్రిటిష్ టెక్స్‌టైల్ సంస్థలో వ్యాపార సలహాదారుగా తన వృత్తిని ప్రారంభించారు. ఇప్పుడు ఈమె వేలకోట్ల సామ్రాజ్యానికి అథినేత్రిగా నిలిచారు.

గౌతమ్ అదానీ (Gautam Adani)
ఈ రోజు భారతదేశంలో రెండవ అత్యంత ధనవంతుడిగా ఉన్న గౌతమ్ అదానీ.. డైమండ్ సార్టర్‌గా తన మొదటి ఉద్యోగాన్ని ప్రారంభించారు. ఆ తరువాత ఈ రంగంలో కొంత అనుభవం తెచ్చుకున్న తరువాత ముంబైలోని జవేరీ బజార్‌లోనే సొంతంగా వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించారు. నేడు వివిధ రంగాల్లో ఎదుగుతూ.. కుబేరుడిగా నిలిచారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement