స్కూలు యాన్యువల్‌ డే : ఆరాధ్య సందడి, ముద్దుల్లో ముంచెత్తిన ఐశ్వర్య | School annual day: Star kids Aaradhya Bachchan, AbRam's video viral | Sakshi
Sakshi News home page

స్కూలు యాన్యువల్‌ డే : ఆరాధ్య సందడి ముద్దుల్లో ముంచెత్తిన ఐశ్వర్య

Published Fri, Dec 20 2024 11:32 AM | Last Updated on Fri, Dec 20 2024 2:26 PM

School annual day: Star kids Aaradhya Bachchan, AbRam's video viral

ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షిక దినోత్సవం వేడుకల్లో స్టార్‌  కిడ్స్‌ సందడి చేశారు. బాలీవుడ్‌  స్టార్‌  కపుల్‌  ఐశ్వర్య రాయ్ బచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌ కుమార్తె ఆరాధ్య,   బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారూఖ్‌కాన్‌  చిన్న కుమారుడు అబ్ రామ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

గురువారం (డిసెంబరు 19) జరిగిన  ఈ  ఈవెంట్‌లో ఆరాధ్య బచ్చన్ తన  షోను అందర్ని కట్టి పడేసింది. ఆమె నటనకు  ఐశ్వర్య, అభిషేక్‌తోపాటు,  తాత  అమితాబ్‌ బచ్చన్‌ కూడా  గర్వంతో ఉప్పొంగి పోయారు. ముఖ్యంగా మాజీ ప్రపంచ సుందరి ఐశర్య తన కుమార్తె నటనకు  ఫిదా అయిపోయింది.   ఈమెమరబుల్‌ మూమెంట్స్‌ను కెమెరాలో బంధిస్తూ కనిపించింది. ఆ తరువాత ఆరాధ్యను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ముద్దులతో ముంచెత్తింది.

మరోవైపు భార్యబిడ్డలను ఇలా చూసిన అభిషేక్‌ మురిసిపోయారు. ఇక మనవరాలు క్రిస్మస్ ప్రదర్శనకు గర్వంతో చిరునవ్వులు చిందించారు అమితాబ్‌. షో ముగియగానే ప్రేక్షకుల కరతాళ ధ్వనులు మిన్నంటాయి. అలాగే తన కుమారుడు అబ్రామ్‌ ప్రదర్శనకు షారూఖ్‌ఖాన్‌ కూడా ఉత్సాహంగా క్లాప్స్‌ కొట్టారు. మురిపెంగా వీడియోలు తీసుకుంటూ కనిపించారు. కరీనా సైఫ్‌ అలీఖాన్‌,  దంపతుల  కుమారుడు కూడా తైమూరు కూడా అద్భుత ప్రదర్శనతో అలరించాడు. ఈ వార్షికోత్సవ వేడుకులకు సంబంధించిన వీడియోలు  నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.

మరోవైపు ఆరాధ్య పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో ఐశ్వర్య, అభిషేక్  జంటగా కనిపించడం,  ఇద్దరూ అమితాబ్‌ను వేదికపైకి  జాగ్రత్తగా తీసుకెళ్లిన దృశ్యాలు అభిమానులను ఆకట్టుకున్నాయి.  ఐశ్వర్య, అభిషేక్‌ విడాకులు తీసుకోబోతున్నారనే పుకార్లకు పూర్తిగా చెక్‌ పడినట్టైంది. <

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement