
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) ఆసక్తికర కామెంట్స్ చేశారు. దక్షిణాది హీరోలను ఉద్దేశించిన ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. గణతంత్ర దినోత్సవం రోజున దుబాయ్ గ్లోబల్ విలేజ్ వేదికగా జరిగిన ఈవెంట్‌లో షారూఖ్ మాట్లాడారు. సినీరంగంలో తన కెరీర్ గురించి అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా దక్షిణ భారత అభిమానులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్, ప్రభాస్, యష్, తలపతి విజయ్. రజనీకాంత్ లాంటి స్టార్స్ తనకు మంచి స్నేహితులని అన్నారు. అంతే కాదు సౌత్ హీరోల డ్యాన్స్ గురించి కూడా షారూఖ్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.
షారూఖ్ మాట్లాడుతూ.. 'దక్షిణ భారత్ నుంచి కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు నుంచి నాకు లక్షలాది అభిమానులు, చాలా మంది స్నేహితులు ఉన్నారు. వారిలో అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, యష్, మహేష్ బాబు, తలపతి విజయ్, రజనీకాంత్, కమల్ హాసన్ కూడా ఉన్నారు. అయితే వారికి నాది ఒకటే విజ్ఞప్తి. పాటలకు వేగంగా డ్యాన్స్ చేయడం ఆపేయండి. డ్యాన్స్ విషయంలో వారిని ఫాలో కావడం చాలా కష్టమైన పని. ఈ వయసులో నేను మీలా డ్యాన్స్ చేయలేను.' అంటూ సరదాగా మాట్లాడారు.
అంతేకాకుండా షారూఖ్ ఖాన్ తన నటుడు తన రాబోయే చిత్రం కింగ్ గురించి మాట్లాడారు. గతంలో బ్లాక్ బస్టర్ పఠాన్ చిత్రానికి దర్శకత్వం వహించిన సిద్ధార్థ్ ఆనంద్‌తో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాలో తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు. ఈ మూవీలో అభిషేక్ బచ్చన్ విలన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. షారూఖ్ ఖాన్ చివరిసారిగా రాజ్‌కుమార్ హిరానీ తెరకెక్కించిన డుంకీలో కనిపించాడు.
కింగ్ మూవీ గురించి షారూఖ్ ఖాన్ చెబుతూ..'ఈ చిత్రం గురించి నేను మీకు పెద్దగా చెప్పలేను. అయితే ఇది వినోదాత్మకంగా ఉంటుందని హామీ ఇస్తున్నా. నేను ఇంతకు ముందు చాలా టైటిల్స్ వాడాను. ఇప్పుడు మన దగ్గర మంచి టైటిల్స్ అన్నీ అయిపోయాయి. అందుకే కింగ్ అనే టైటిల్ పెట్టాం. రాజు ఎప్పటికీ రాజే' అని వేదికపై నవ్వులు పూయించారు.
.@Actorvijay , @urstrulyMahesh , #Prabhas , @AlwaysRamCharan , @alluarjun are my Close friends ~ @iamsrk 🔥pic.twitter.com/xCWBaLJuBS
— Let's X OTT GLOBAL (@LetsXOtt) January 28, 2025
Comments
Please login to add a commentAdd a comment