School anniversary
-
స్కూలు యాన్యువల్ డే : ఆరాధ్య సందడి, ముద్దుల్లో ముంచెత్తిన ఐశ్వర్య
ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షిక దినోత్సవం వేడుకల్లో స్టార్ కిడ్స్ సందడి చేశారు. బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కుమార్తె ఆరాధ్య, బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్‌కాన్ చిన్న కుమారుడు అబ్ రామ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.గురువారం (డిసెంబరు 19) జరిగిన ఈ ఈవెంట్లో ఆరాధ్య బచ్చన్ తన షోను అందర్ని కట్టి పడేసింది. ఆమె నటనకు ఐశ్వర్య, అభిషేక్‌తోపాటు, తాత అమితాబ్ బచ్చన్ కూడా గర్వంతో ఉప్పొంగి పోయారు. ముఖ్యంగా మాజీ ప్రపంచ సుందరి ఐశర్య తన కుమార్తె నటనకు ఫిదా అయిపోయింది. ఈమెమరబుల్ మూమెంట్స్‌ను కెమెరాలో బంధిస్తూ కనిపించింది. ఆ తరువాత ఆరాధ్యను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ముద్దులతో ముంచెత్తింది.And Aaradhya’s final bow - trust her parents to cheer the loudest as always pic.twitter.com/phf29fiGG3— Bewitching Bachchans (@TasnimaKTastic) December 19, 2024మరోవైపు భార్యబిడ్డలను ఇలా చూసిన అభిషేక్ మురిసిపోయారు. ఇక మనవరాలు క్రిస్మస్ ప్రదర్శనకు గర్వంతో చిరునవ్వులు చిందించారు అమితాబ్. షో ముగియగానే ప్రేక్షకుల కరతాళ ధ్వనులు మిన్నంటాయి. అలాగే తన కుమారుడు అబ్రామ్ ప్రదర్శనకు షారూఖ్‌ఖాన్ కూడా ఉత్సాహంగా క్లాప్స్ కొట్టారు. మురిపెంగా వీడియోలు తీసుకుంటూ కనిపించారు. కరీనా సైఫ్ అలీఖాన్, దంపతుల కుమారుడు కూడా తైమూరు కూడా అద్భుత ప్రదర్శనతో అలరించాడు. ఈ వార్షికోత్సవ వేడుకులకు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.మరోవైపు ఆరాధ్య పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో ఐశ్వర్య, అభిషేక్ జంటగా కనిపించడం, ఇద్దరూ అమితాబ్‌ను వేదికపైకి జాగ్రత్తగా తీసుకెళ్లిన దృశ్యాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఐశ్వర్య, అభిషేక్ విడాకులు తీసుకోబోతున్నారనే పుకార్లకు పూర్తిగా చెక్ పడినట్టైంది. < View this post on Instagram A post shared by mamaraazzi (@mamaraazzi) -
KTR : పిల్లలకిచ్చిన మాట కోసం..పాఠశాల వార్షికోత్సవానికి హాజరైన కేటీఆర్ (ఫొటోలు)
-
ఘనంగా రికేల్ ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ 12వ వార్షికోత్సవం
మేడ్చల్ జిల్లా: కీసర మండలం రాంపల్లీ గ్రామంలో ఉన్న రికెల్ ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో 12వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. చిన్నారులు భరత నాట్యం నృత్యం చేస్తూ, పాటలు పాడుతూ అల్లరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు. విద్యార్థులు అనునిత్యం ఫోన్లు దూరం పెట్టి చదువుపై శ్రద్ధ పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఛైర్మెన్ ఉదయ్ కుమార్, ఎన్.జి.అర్.ఐ మాజీ చీఫ్ సైంటిస్ట్ కీర్తి శ్రీవాస్తవ, ఉస్మానియా యూనివర్సిటీ బయో కెమిస్ట్రీ హెచ్.ఓ.డీ సూర్య సత్యనారాయణ సింగ్, విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
Vetapalem: బండ్ల బాపయ్య విద్యాసంస్థకు వందేళ్లు
వేటపాలెం (బాపట్ల జిల్లా): వేటపాలెం బండ్ల బాపయ్య విద్యాసంస్థ వందేళ్లు పూర్తిచేసుకుంది. ఈ బడిని 1921 నవంబర్ 4న బండ్ల బాపయ్య శెట్టి హిందూ మాధ్యమిక పాఠశాల పేరుతో నెలకొల్పారు. దీనికి ఐదెకరాల స్థలం కేటాయించి అందులో శాశ్వత భవనం నిర్మించారు. దీనికి అప్పట్లో ప్రభుత్వం రూ.12,457 గ్రాంటు కూడా మంజూరు చేసింది. అప్పటి నుంచి పాఠశాల దినదినాభివృద్ధి చెందింది. బడికి అనుబంధంగా 1946లో హైస్కూలు, 1961లో హయ్యర్ సెకండరీ స్కూల్, 1969లో జూనియర్ కళాశాల, 1981లో డిగ్రీ కళాశాల ఏర్పాటయ్యాయి. ఈ పాఠశాలలోని ఒక భాగంలో కొంత కాలం సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల శిక్షణ తరగతులూ నిర్వహించారు. 400 మంది ఉపాధ్యాయులు ఇక్కడ శిక్షణ పొందారు. పూర్వం ఈ పాఠశాలను అందరూ ఇంగ్లిషు బడి అని పిలిచేవారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి ఎందరో విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేవారు. ఇక్కడ చదువుకున్న ఎందరో ఉన్నతస్థానాలు అధిరోహించారు. విదేశాల్లోనూ ఉన్నత స్థితికి చేరారు. చేయూతగా రాధాకృష్ణయ్య హాస్టల్ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్నం భోజనం పథకం తరహాలో ఈ పాఠశాలలో స్వాతంత్య్రం రాక పూర్వం నుంచి విద్యార్థులకు భోజనం పెట్టేవారు. గొల్లపూడి రాధాకృష్ణయ్య ఈ విధానానికి నాంది పలికారు. 1933లో పాఠశాలకు అనుసంధానంగా ఉచిత భోజన హాస్టల్ ఏర్పాటు చేశారు. ఇది ఇప్పటికీ రాధాకృష్ణయ్య వారసుల ఆధ్వర్యంలో నిర్విరామంగా కొనసాగుతుండడం విశేషం. నవంబర్‌లో శతజయంత్యుత్సవాలు బండ్ల బాపయ్య విద్యా సంస్థ నెలకొల్పి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా శత జయంత్యుత్సవాలు అంగరంగ వైభవంగా జరపనున్నారు. దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖులు, కాలేజీలో చదివి వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వవిద్యార్థులు పాల్గొననున్నారు. ఇంగ్లిష్ బాగా చెప్పేవారు నేను 1971–73లో వేటపాలెం బండ్ల బాపయ్య జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియెట్ చదివాను. అప్పట్లోనే అధ్యాపకులు ఇంగ్లిషు బోధించారు. అందువల్ల నేను ఎంబీబీఎస్ చదివేటప్పుడు ఇంగ్లిష్‌లో ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. గొల్లపూడి రాధాకృష్ణయ్య హాస్టల్లో మధ్యాహ్న భోజనం చేసేవాడిని. అది నా అదృష్టం. – డాక్టర్ సజ్జా లోకేశ్వరరావు, గుండె శస్త్ర చికిత్స నిపుణుడు, స్టార్ హాస్పిటల్, హైదరాబాద్ ఉపాధ్యాయ వృత్తికి పునాది ఇక్కడే ఈ పాఠశాలలో ప్రవేశానికి ఎంట్రన్స్ నిర్వహించేవారు. 1940లో 4వ తరగతిలో ప్రవేశానికి పరీక్ష రాశాను. పాసై బడిలో చేరాను. మా తల్లిదండ్రులు ఇంగ్లిష్ బడిలో చదువుతున్నానని గొప్పగా చెప్పుకునేవారు. ఈ విద్యా సంస్థల్లోనే విద్యనభ్యసించి, 37 ఏళ్లపాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగాను. విద్యా సంస్థల్లో చదువుకున్న ఎందరో ఉన్నత పదవుల్లో ఉన్నారు. – లొల్లా శ్రీరాం మూర్తి, విశ్రాత ప్రధానోపాధ్యాయుడు -
మొదట మెకానిక్ కావాలనుకున్నాను.. కానీ : మంత్రి సీదిరి అప్పలరాజు
సాక్షి,కాశీబుగ్గ(శ్రీకాకుళం): తొలుత మెకానిక్ కావాలనుకున్నానని..అయితే ఫిజిక్స్ మాస్టార్‌ను చూసి ఉపాధ్యాయుడిగా మారాలనుకున్నానని మంత్రి డాక్టర్ సీదిరి అప్పల రాజు అన్నారు. శనివారం రాత్రి కాశీబుగ్గలోని ఓ ప్రైవేటు స్కూల్ వార్షికోత్సవ సభలో ముఖ్యఅతిథిగా మాట్లాడారు. బాల్యదశలో ఆలోచనాశక్తి వివిధ రకాలుగా ఉంటుందని.. చూసే ప్రతీ ప్రొఫెసన్‌లో తాముండాలని అనుకుంటారన్నారు. చిన్నారులకు గొప్ప వ్యక్తులు, విజేతలను ప్రత్యక్షంగా చూపించాలన్నారు. తాను చదువుకునే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే ఉండేవన్నారు. బాల్యదశ నుంచి టాపర్‌గా ఉండడంతో డాక్టర్‌గా, ప్రొఫెసర్‌గా మారానన్నారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దీవెనతో రెండోసారి మంత్రిని అయ్యానని చెప్పారు. మంచి ఆలోచనతోనే ముఖ్యమంత్రి ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెడుతున్నారన్నారు. విశ్రాంత జడ్జిలు, డాక్టర్లను వేదికపైకి పిలిపించి ఇటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని పిల్లలకు సూచించారు. కార్యక్రమంలో నాయకులు హనుమంతు వెంకటదొర, రామ్మోహన దొర, మున్సిపల్ చైర్మన్ బి. గిరిబాబు, ఎంఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. చదవండి: మటన్ , చికెన్ అంటే భలేభలే! వారంలో 2, 3 రోజులు ఉండాల్సిందే! -
ఎందరో ప్రముఖులకు ఇక్కడ ఓనమాలు
సాక్షి, రామచంద్రపురం (తూర్పు గోదావరి): స్థల మహిమో.. వ్యవస్థాపకుల సంకల్ప బలమో కానీ కొన్ని పాఠశాలలు నిజమైన సరస్వతీ నిలయాలుగా వెలుగొందుతాయి. ఆయా పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు వామనుల్లా ఇంతింతై వటుడింతయై అన్నట్టు ప్రజ్ఞలో ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. అది ఎంత ఎత్తంటే వారు చదువుకున్న పాఠశాలకు కీర్తి ప్రతిష్టలు తెచ్చేంతలా. పుత్రోత్సాహం తండ్రికి అన్నట్టు పాఠశాల వ్యవస్థాపకుల లక్ష్యం మట్టిలో మాణిక్యాలను వెలికితీయడమే కదా. అలాంటి ‘ఉన్నత’మైనదే కృత్తివెంటి పాఠశాల. శనివారం 116వ వార్షికోత్సవం జరుపుకొంటోంది. పాఠశాల ప్రస్థానం ఇదీ.. కృష్ణాజిల్లా మచిలీపట్నం వద్ద ఉన్న కృత్తివెన్ను గ్రామానికి చెందిన కృత్తివెంటి కృష్ణారావు కుమారుడు కృత్తివెంటి పేర్రాజు 1852లో కాకినాడలో జన్మించారు. న్యాయవాది అయిన ఆయన ఓ కేసు నిమిత్తం రామచంద్రపురం వచ్చి కక్షిదారులైన ఇద్దరు అన్నదమ్ముల నిరక్ష్యరాస్యతను చూసి కలవరపడ్డారు. తిరుగుప్రయాణంలో బంట్రోతుతో కృత్తివెంటి ‘కాటన్ దొర ఆనకట్టకట్టారు. దీని వల్ల ఈ ప్రాంతంలో పంటలు పండుతున్నాయి. కానీ.. దానితో సమానంగా వీరి బుర్రలు మాత్రం పెరగటంలేదు. విద్యలేని విత్తం అనర్థదాయకం.. ఇక్కడొక పాఠశాల ఉంటే బాగుండును’ అన్నారట. ఆయన అభీష్టం మేరకు 1905లో 4 నుంచి 8వ తరగతి వరకు విద్యా బోధన చేసేందుకు పాఠశాల స్థాపించి జాతీయ పాఠశాలగా నామకరణం చేశారు. 1906లో ఉన్నత పాఠశాలగా రూపాంతరం చెందింది. అందుకోసం పేర్రాజు పంతులు 94.21 ఎకరాలను దానం చేసి పాఠశాల అభివృద్ధికి వినియోగించాలని స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉద్యానవన పాలిటెక్నిక్, వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటుకు ఆయన దానం చేసిన స్థలంలో అంకురార్పణ జరిగింది. నియోజకవర్గానికి చెందిన మొట్టమొదటి మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పాఠశాలను సందర్శించి భవన, తరగతి గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. మరెందరో విద్యాభాస్యం వందేళ్లు పైబడి పాఠాలు నేర్పిన ఈ సరస్వతీ నిలయం మరెందరినో ఎన్నో రంగాలలో తీర్చిదిద్దింది. భారత స్వాంతంత్య్ర ఉద్యమంలో తన ప్రాణాలనే అర్పించిన విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు ఈ పాఠశాలలో 6వ తరగతి చదివారు. సినీ ప్రముఖులు మిత్తిపాటి కామేశ్వరరావు (గులేబకావళికథ ఫేం), మాష్టర్ రాజు (తెనాలి రామకృష్ణ ఫేం), ఫొటోల నారాయణస్వామి (వింధ్యారాణి ఫేం), ప్రముఖ సంగీత దర్శకుడు జేవీ రాఘవులు, క్యారెక్టర్ యాక్టర్ రాళ్లపల్లి, ప్రఖ్యాత ఛాయాగ్రహ దర్శకుడు చోటా కే నాయుడు, మెజీషియన్ వి.పట్టాభిరామ్, రావులపర్తి భద్రిరాజు, ఇంద్రగంటి శ్రీకాంత్‌శర్మ, పైడిపాల, ప్రముఖ సినీ గేయ రచయిత, విమర్శకుడు, కవి, అదృష్టదీపక్, వీణావాదనలో దిట్ట ద్విభాష్యం నగేష్‌బాబు, వీరే కాకుండా రాజగోపాలనరసరావు, రాజబహదుర్ రామచంద్రరాజు, నందివాడ సత్యనారాయణరావు వంటి మహామహులు ఇక్కడే విద్యాభ్యాసం చేశారు. -
అక్కడ సినిమా పాటలపై నిషేధం
బెంగళూరు: విద్యార్థులలో నైతిక విలువలను పెంపొందించే దిశగా కర్ణాటక విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల వార్షికోత్సవాల్లో సినిమా పాటల డ్యాన్సులపై నిషేధం విధించింది. ఈమేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. కొన్ని సినిమా పాటల నృత్యాలు అశ్లీలంగా ఉంటున్నాయన్న తల్లిదండ్రుల ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. పాఠశాల వార్షికోత్సవాలలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను ఇకపై ముందుగా విద్యాశాఖకు తెలియచేయాల్సి ఉంటుంది. నిబంధనలను ఉల్లంఘించి ఒకవేళ సినిమా నృత్యాలకు అవకాశం కల్పిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. విద్యాశాఖ నిర్ణయంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేయగా... సినీ వర్గాలు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలులోకి తీసుకురావాలనే ఆలోచనలో విద్యాశాఖ ఉన్నట్లు తెలుస్తుంది. వయసుకు, ఆలోచనలకు సంబంధంలేని పాటలు ఈ విషయమై ఓ ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ ‘‘ఈ మధ్యే నేను ఓ స్కూలులో నిర్వహించిన కార్యక్రమానికి వెళ్లాను. ఆ కార్యక్రమంలో ప్రదర్శన కోసం విద్యార్థులు ఎంచుకున్న పాటల్ని విని ఆశ్చర్యపోయాను. అన్ని సినిమా పాటలే ఉన్నాయి. అది కూడా వారి వయసుకు, ఆలోచనలకు సంబంధం లేని పాటలు. ఇలాంటి పాటల వల్ల వారికి చాలా ప్రమాదముందని భావించాను’’ అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
తమిళనాడులో విషాదం
సాక్షి ప్రతినిధి, చెన్నై: పాఠశాల వార్షికోత్సవ ఫ్లడ్‌లైట్ల వెలుగులు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల జీవితాల్లో చీకట్లు నింపాయి. కళ్లను ఏమాత్రం తెరవలేని స్థితిలో 60 మంది విద్యార్థులు, 30 మంది తల్లిదండ్రులు సహా 96 మంది కంటి ఆస్పత్రి పాలయ్యారు. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా ఏర్వాడి పొత్తయడిలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువులు చెప్పే ఎస్వీ హిందూ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవాన్ని శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ప్రతిఏటా పాఠశాల మైదానంలో నిర్వహించే వార్షికోత్సవాన్ని ఈసారి ఇరుకైన ఒక తరగతి గదిలో జరిపారు. వార్షికోత్సవ అలంకారం, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు వీలుగా ఇరుకైన ఆ తరగతి గదిలో కళ్లు మిరుమిట్లు గొలిపే పెద్ద పెద్ద లైట్లను అమర్చారు. ఈ లైట్ల నుంచి వెలువడుతున్న కాంతులు విపరీతంగా ఉండడంతో అందరికీ కళ్లు మంటలు పుడుతుండగా నలుపుకుంటూనే కార్యక్రమాలను వీక్షించారు. ఇళ్లకు వెళ్లిన తరువాత అందరికీ కళ్లమంటలు అధికమై కనురెప్పలు తెరవలేని స్థితికి చేరుకున్నారు. పాఠశాల కరస్పాండెంట్ బాలసుబ్రమణియన్‌కు శుక్రవారం రాత్రి నుంచి వరుసగా ఫిర్యాదులు అందడంతో శనివారం ఉదయం ఒక వ్యాన్‌లో బాధితులను ప్రయివేటు ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. 60 మంది విద్యార్థులు, 30 మంది తల్లిదండ్రులు, ఐదుగురు ఉపాధ్యాయులు, కరస్పాండెంట్ బాలసుబ్రమణియన్ సహా మొత్తం 96 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
చదువుతో పాటు ఆటపాటల్లో రాణించాలి
నేరడిగొండ : విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లో రాణించాలని నేరడిగొండ సర్పంచ్ ఆడె విజయలక్ష్మి సూచించారు. నేరడిగొండలోని జిల్లా పరిషత్ సెకండరి పాఠశాల వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో వార్షికోత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని భరోసానిచ్చారు. ఎస్సై వెంకన్న మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదువుతూ ముందుకు సాగాలన్నారు. నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. హెచ్ఎం భూమారెడ్డి, వీడీసీ అధ్యక్షుడు ఏలేటి రవిందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ రాథోడ్ కమల్‌సింగ్ ఉన్నారు. -
స్వర్గమంటే ఇదే..
పిల్లల కథ ‘పాఠశాల వార్షికోత్సవం జరుగుతోంది. విద్యుద్దీపాల కాంతిలో పట్టపగలల్లే ఉంది ప్రాంగణమంతా. ఉన్నట్టుండి పెద్ద ఎత్తున నేపథ్య సంగీతం వినిపించనారంభించింది. అందరి దృష్టి వేదికవైపు మళ్ళింది. తెర నెమ్మదిగా తొలగింది. వేదికపై రంగస్థలం పెద్ద భోజనశాలలాగా అమర్చబడి ఉంది. నాలుగు కుర్చీలు ఒక బల్లకు అటు ఇటూ ఏర్పాటు చేశారు. అంటే ఇద్దరటు, ఇద్దరిటూ కూర్చుని భోంచేసేలాగా ఏర్పాటు చేశారు.అలాంటి బల్లలు నాలుగు ఉన్నాయి. ‘‘నరకం అంటే ఇదే ఇదే’’ అన్న అక్షరాలపై నిలిచి అందరి దృష్టిని ఆకట్టుకొంటోంది. ‘‘నరకంలో ఇప్పుడు భోజన విరామం’’ అని చిన్న ప్రకటన వినపడింది. తెరల మాటు నుండి బిలబిలమని వచ్చిన పిల్లలతో కుర్చీలన్నీ నిండిపోయాయి. ఆ పిల్లలందరూ తైల సంస్కారం లేని జుట్టుతో చింపిరి క్రాఫులతో ఉన్నారు. వారి దుస్తులు కూడా చిరిగిపోయి, దీనంగా ఉన్నారు వారంతా.నేపథ్య సంగీతం కూడా విషాద రాగాలు పలికిస్తోంది. వారి కంచాలలో వేడివేడి ఆహారపదార్థాలు ఉన్నాయి. మిఠాయిలూ, పళ్ళరసాలు, గారెలు, వడియాలు, అప్పడాలు ఇలా ఒకటేమిటి, రకరకాల తినుబండారాలతో విందుభోజనం వారి ముందు సిద్ధమయిపోయింది. చిత్రంగా ఆ పిల్లలేమీ తినలేకపోతున్నారు. కనీసం తమ చేతుల్ని కంచం దాకా తీసుకువెళ్ళలేకపోతున్నారు. మైకులో వ్యాఖ్యానం వినిపిస్తోంది. ‘‘శ్రద్ధగా గమనించండి. ఈ పిల్లలెవరూ కూడా తమ మోచేతులని మడవలేకపోతున్నారు. ఎందుకంటే వెదురు బద్దల్ని పెట్టి, వారి మణికట్టు నుండి భుజాల దాకా వారి రెండుచేతుల్ని వంచడానికి వీలులేకుండా కట్టేయడం జరిగింది తాళ్ళతో. గమనించారా! చూద్దాం ఇప్పుడీ పిల్లలు ఏం చేస్తారో’’ వ్యాఖ్యానం ఆగిపోయింది. పాపం ఆ పిల్లలు ఎన్నో రకాలుగా అవస్థపడ్డారు తమ కంచంలోని ఆహార పదార్థాలను అందుకోవడానికి. మోచేయి వంచడానికి చాలా అవస్థపడ్డారు. చివరకు ముందుకు వంగి నేరుగా నోటితోనే తినబోయి కంచాల్ని నేలపాలు చేసుకున్నారు కొందరు, మూతికి పూసుకున్నారు. ఆ పిల్లల దురవస్థ చూసి ప్రేక్షకులందరికీ జాలిగలిగింది. నాటకానికి దర్శకత్వం నిర్వహించిన మేష్టారు కేశవుడు. అతడు చురుకుగా కదుల్తూ తెరవెనుక ఏర్పాట్లు చేస్తున్నాడు. విషాద రాగాలు పలుకుతూ ఉండగా, వేదికపై క్రమంగా దీపాల కాంతి నెమ్మదించింది, తెర దిగింది క్రమక్రమంగా. ‘ఇంకకొద్ది క్షణాలలో స్వర్గంలో భోజన విరామం చూద్దాం’ స్పీకర్లలోంచి ప్రకటన వినిపించింది. తెర తొలగింది. ‘‘స్వర్గం అంటే ఇదే ఇదే’’ అన్న అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి వేదిక మీద గోడపై. మిగతా ఏర్పాట్లన్నీ ఇందాకటి లాగానే ఉన్నాయి. నాలుగు బల్లలు, ప్రతి బల్లకి అటు-ఇటూ రెండేసి కుర్చీలు, సరిగ్గా ఇందాకటి భోజనశాల లాగానే ఉంది. ‘ఠంగ్ఠంగ్’మని గంట మోగింది. పిల్లలు ఉల్లాసంగా వచ్చి ఆనందంగా కుర్చీలను ఆక్రమించేశారు. పిల్లలందరూ మల్లెపువ్వులాంటి తెల్లటి దుస్తులు వేసుకుని స్వచ్ఛతకు మారుపేరులా ఉన్నారు. అందరి వదనాలు వెన్నెలలాంటి నవ్వులతో చూడముచ్చటగా ఉన్నాయి. చక్కగా నూనెపెట్టి తలలు దువ్వుకుని బుద్ధిగా ఉన్నారు.వ్యాఖ్యానం వినిపిస్తోంది స్పీకర్లో...‘‘గమనించారా ఈ పిల్లలు కూడా మోచేతుల్ని వంచలేరు. సరిగ్గా ఇందాకట్లాగానే వీరి చేతులు కూడా బంధింపబడి ఉన్నాయి. చూద్దాం ఈ పిల్లలు ఎలా భోంచేస్తారో’’ వ్యాఖ్యానం ముగిసింది. ఆశ్చర్యపోవడం ఈసారి ప్రేక్షకుల వంతయింది. స్వర్గానికి నరకానికి ఏంటి తేడా? అందరి మనసుల్లో ఇదే ప్రశ్న. అందరూ ఆసక్తిగా చూడసాగారు. యథావిధిగా వడ్డన జరిగిపోయింది. ఇప్పుడు అందరి దృష్టి ‘స్వర్గం’లో ఎలా తింటారో అన్నదాని మీదే ఉంది. ఉన్నట్టుండి నేపధ్య సంగీతం కూడా ఆగిపోయింది. అంతటా నిశ్శబ్దం. పిల్లలు ఏమాత్రం తొట్రుపాటు పడకుండా, నింపాదిగా భోజనం చేశారు. ప్రేక్షకులు అవాక్కయ్యారు. ఆ పిల్లలేం చేశారంటే, తమ కంచాల్ని వదిలేసి, చేతులు ముందుకు సాచి, వంచే అవసరమే లేకుండా, ఎదుటి కుర్రాడి కంచంలోని అన్నాన్ని చక్కగా కలిపి ముద్దలు చేసి ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు కలబోసి, గోరుముద్దల్లా తినిపించడం ప్రారంభించారు. చక్కటి ఆహ్లాదకరమైన నేపధ్య సంగీతం ఎప్పుడు ప్రారంభమయిందో ఎవరూ గమనించనేలేదు. చిన్నగా వ్యాఖ్యానం ప్రారంభమయింది. ‘‘నేను నాది అనుకుంటూ మన స్వార్థాన్నే చూసుకుంటూ బ్రతికేయడం నరకానికి సమానం. మన సమస్యలే మనల్ని పెద్ద పెనుభూతాల లాగా పీడిస్తాయి నరకంలో. ఎవరి స్వార్థం వారు చూసుకోవడమే నరకం. ఎదుటి వారికి సాయం చేయడం స్వర్గంతో సమానమయిన వాతావరణాన్ని సృష్టిస్తుంది. తమ కష్టాల్ని, తమ ఇబ్బందుల్ని సయితం మర్చిపోయి ఎదుటివారి కష్టాల్ని చూసి స్పందించి సాయం చేయడానికి ముందుకు వచ్చారు స్వర్గంలో పిల్లలు. అప్పుడు వారు ఆశించకనే వారికీ సాయం అందింది. నీకు నేను రక్ష, నాకు నీవు రక్ష, మనిద్దం సంఘానికి రక్ష. ఇదే వసుదైక కుటుంబ భావన. భూమిపై స్వర్గం ఇదే ఇదే’’ సమ్మోహితులైన ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. - రాయపెద్ది వివేకానంద్