మాట్లాడుతున్న మంత్రి సీదిరి అప్పలరాజు
సాక్షి,కాశీబుగ్గ(శ్రీకాకుళం): తొలుత మెకానిక్ కావాలనుకున్నానని..అయితే ఫిజిక్స్ మాస్టార్‌ను చూసి ఉపాధ్యాయుడిగా మారాలనుకున్నానని మంత్రి డాక్టర్ సీదిరి అప్పల రాజు అన్నారు. శనివారం రాత్రి కాశీబుగ్గలోని ఓ ప్రైవేటు స్కూల్ వార్షికోత్సవ సభలో ముఖ్యఅతిథిగా మాట్లాడారు. బాల్యదశలో ఆలోచనాశక్తి వివిధ రకాలుగా ఉంటుందని.. చూసే ప్రతీ ప్రొఫెసన్‌లో తాముండాలని అనుకుంటారన్నారు.
చిన్నారులకు గొప్ప వ్యక్తులు, విజేతలను ప్రత్యక్షంగా చూపించాలన్నారు. తాను చదువుకునే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే ఉండేవన్నారు. బాల్యదశ నుంచి టాపర్‌గా ఉండడంతో డాక్టర్‌గా, ప్రొఫెసర్‌గా మారానన్నారు. ఇప్పుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీవెనతో రెండోసారి మంత్రిని అయ్యానని చెప్పారు. మంచి ఆలోచనతోనే ముఖ్యమంత్రి ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెడుతున్నారన్నారు. విశ్రాంత జడ్జిలు, డాక్టర్లను వేదికపైకి పిలిపించి ఇటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని పిల్లలకు సూచించారు. కార్యక్రమంలో నాయకులు హనుమంతు వెంకటదొర, రామ్మోహన దొర, మున్సిపల్ చైర్మన్ బి. గిరిబాబు, ఎంఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
చదవండి: మటన్ , చికెన్ అంటే భలేభలే! వారంలో 2, 3 రోజులు ఉండాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment