చదువుతో పాటు ఆటపాటల్లో రాణించాలి | cultural programmes are conducted in schools | Sakshi
Sakshi News home page

చదువుతో పాటు ఆటపాటల్లో రాణించాలి

Published Wed, Feb 14 2018 5:08 PM | Last Updated on Wed, Feb 14 2018 5:08 PM

cultural programmes are conducted in schools - Sakshi

నృత్యాలు చేస్తున్న విద్యార్థులు

నేరడిగొండ : విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లో రాణించాలని నేరడిగొండ సర్పంచ్‌ ఆడె విజయలక్ష్మి సూచించారు. నేరడిగొండలోని జిల్లా పరిషత్‌ సెకండరి పాఠశాల వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సర్పంచ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో వార్షికోత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని భరోసానిచ్చారు.  ఎస్సై వెంకన్న మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదువుతూ ముందుకు సాగాలన్నారు. నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. హెచ్‌ఎం భూమారెడ్డి, వీడీసీ అధ్యక్షుడు ఏలేటి రవిందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ రాథోడ్‌ కమల్‌సింగ్‌ ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement