cultural pogrammes
-
జగనన్న సాంస్కృతిక సంబరాలు.. రాష్ట్రస్థాయి పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, అమరావతి: తెలుగు సంస్కృతికి అద్దం పట్టేలా ‘జగనన్న సాంస్కృతిక సంబరాలు’ పేరుతో రాష్ట్రస్థాయి పోటీల నిర్వహణకు సాంస్కృతిక శాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యా ప్తంగా 40 వేలమందికి పైగా కళాకారుల ప్రదర్శనలకు వేదికలు సిద్ధం చేస్తోంది. వెయ్యిమందికి పైగా కళాకారులతో రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రాచీన కళావైభవం చాటేలా ప్రణాళికను రూపొందించింది. ప్రధానంగా కూచిపూడి, కొమ్ముకోయ, థింసా, తప్పెటగుళ్లు, గరగలు, పగటివేషాలు, బుర్రకథలు, ఆర్కెస్ట్రా (జానపద, సంప్రదాయ, గిరిజన) వంటి కళారూపాలను ఆవిష్కరించనుంది. సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని డిసెంబర్ 19, 20 తేదీల్లో అట్టహాసంగా రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనుంది. చదవండి: 28, 29 తేదీల్లో జగనన్న విదేశీ విద్యాదీవెన కౌన్సెలింగ్ అందుబాటులో దరఖాస్తులు.. కళాకారులు, కళాబృందాలు నవంబర్ 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. సాంస్కృతిక శాఖ https://culture.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తులను పూర్తిచేసి పంపవచ్చు. విజయవాడలోని రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి కార్యాలయంతో పాటు విజయనగరం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలుల్లోని ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలు, పాఠశాలల్లో నేరుగా దరఖాస్తులు అందజేయవచ్చు. పూర్తిచేసిన దరఖాస్తులను apculturalcompetitions@gmail.comకు మెయిల్చేసే వెసులుబాటు కూడా కల్పించారు. ఆడిషన్స్, రీజనల్ పోటీలు ఇలా... ♦నవంబర్ 19, 20, 21 తేదీల్లో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, సత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల వారికి. ♦నవంబర్ 24, 25, 26 తేదీల్లో గుంటూరు వెంకటేశ్వర విజ్ఞానమందిరంలో ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణాజిల్లాల వారికి. ♦నవంబర్ 29, 30, డిసెంబర్ 1 తేదీల్లో రాజమహేంద్రవరంలోని వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల వారికి. ♦డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో విశాఖపట్నంలోని ఉడా చిల్డ్రన్స్ థియేటర్లో అనకాపల్లి, విశాఖ, అల్లూరి సీతారామరాజు, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వారికి. కళలకు ప్రోత్సాహం.. రాష్ట్రంలో ఎంతో ఘనమైన ప్రాచీన సంస్కృతి ఉంది. దాన్ని కాపాడుకోవడంతోపాటు భావితరాలకు చాటిచెప్పేలా ప్రభు త్వం కృషిచేస్తోంది. కళాకారులను ప్రోత్సహించేలా రాష్ట్రస్థాయిలో సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ పోటీల్లో కళాకారులందరినీ భాగస్వాములను చేసేలా ప్రత్యేక పోస్టర్లతో విస్తృత ప్రచారం కల్పించనున్నాం. గెలుపొందిన కళాకారులు, కళాబృందాలకు భారీ బహుమతులు ఇవ్వనున్నాం. – ఆర్కే రోజా, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి -
తెలుగు సాహితి సదస్సు.. వక్తలకి ఆహ్వానం
కెనడాలో సెప్టెంబరులో నిర్వహించనున్న తెలుగు సాహితీ సదస్సులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న వక్తలు జులై 31లోగా తమ ఎంట్రీలను పంపివ్వాల్సిందిగా పలు కెనడా తెలుగు సంఘాలు సంయుక్తంగా కోరాయి. కెనడా, అమెరికా సంయక్త రాష్ట్రాలలోని సాహితీవేత్తలు, తెలుగు భాషాభిమానులు కలిసి పెద్ద ఎత్తున టొరాంటో వేదికగా 2021 సెప్టెంబరు 25, 26 తేదీల్లో తెలుగు సాహితీ సదస్సును నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు ఉదయం 10:00 (EST) నుంచి సాయంత్రం 6:00 (EST) వరకు ఈ సదస్సు జరుగుతుంది. అందరికీ అందుబాటులో ఉండేందుకు వీలుగా ఈ సదస్సును వర్చువల్ పద్దతిలో నిర్వహిస్తున్నారు. ఉత్తర అమెరికా దేశాల వక్తల ప్రసంగ ఎంట్రీలను 2021 జులై 31 లోగా ఈ కింది ఈమెయిట్స్కి పంపాల్సి ఉంటుంది. sadassulu@gmail.com , vangurifoundation@gmail.com . ఈ సదస్సు నిర్వహాణలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, తెలుగు తల్లి పత్రిక (కెనడా), టొరంటో తెలుగు టైమ్స్ పత్రిక, ఆటవా తెలుగు సంఘం, తెలుగు వాహిని (సాహిత్య వేదిక, టొరంటో), అంటారియో తెలుగు ఫౌండేషన్, తెలుగు కల్చురల్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టొరంటో, కేల్గరీ తెలంగాణా సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ సదస్సు ఈ సందర్భంగా అమెరికా, కెనడా దేశాల నుంచి ఎంపిక అయిన ఇద్దరు ప్రముఖ సాహితీవేత్తలకి జీవన సాఫల్య పురస్కారం అందచేస్తామని నిర్వాహకులు తెలిపారు. -
రోజా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు: గవర్నర్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ సీపీ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సినిమా, కళ ఇలా అన్ని రంగాల్లో ముందుకు వెళుతోందని తెలంగాణ గవర్నర్ తమిళి సై ప్రశంసించారు. శనివారం రవీంద్రబారతిలో లైఫ్ "ఎన్" లా ఫౌండేషన్ నవజనార్ధన పారిజాతం ఆంధ్రనాట్య ప్రదర్శన జరిగింది. తెలంగాణ గవర్నర్ తమిళి సై ఈ ప్రదర్శనకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ.. ‘‘ సినిమాలంటే తనకు పెద్దగా ఆసక్తి లేదని కానీ రోజా భర్త సెల్వమని గొప్ప డైరెక్టర్ అన్న సంగతి అందరికి తెలుసు. ఆంధ్ర నాట్య ప్రదర్శన కోసం సెల్వమని రోజాను ప్రోత్సహిస్తున్నారు. మువ్వ నాట్య ప్రదర్శన చాలా గొప్పది. ఫౌండేషన్ నిర్వహిస్తున్న రోజా సెల్వమనికి అభినందనలు. ఆంధ్రనాట్య ప్రదర్శన చాలా గొప్పది.. 1000 సంవత్సరాలుగా వస్తున్న గొప్ప సంస్కృతి. ఆంధ్రనాట్య ప్రదర్శనను 11వ శతాబ్దంలో నటరాజ రామకృష్ణన్ కనుగొన్నారు. దీనిని దేవాలయాలలో ప్రదర్శిస్తారు. ఆంధ్ర నాట్య సంస్కృతిని ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలి. ఫౌండేషన్ చైర్మన్ రోజా డ్యాన్స్ ప్రదర్శన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’నన్నారు. -
చదువుతో పాటు ఆటపాటల్లో రాణించాలి
నేరడిగొండ : విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లో రాణించాలని నేరడిగొండ సర్పంచ్ ఆడె విజయలక్ష్మి సూచించారు. నేరడిగొండలోని జిల్లా పరిషత్ సెకండరి పాఠశాల వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో వార్షికోత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని భరోసానిచ్చారు. ఎస్సై వెంకన్న మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదువుతూ ముందుకు సాగాలన్నారు. నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. హెచ్ఎం భూమారెడ్డి, వీడీసీ అధ్యక్షుడు ఏలేటి రవిందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ రాథోడ్ కమల్‌సింగ్ ఉన్నారు. -
వెంకయ్య నివాసంలో సంక్రాంతి వేడుకలు
సాక్షి, న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసంలో సంక్రాంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, బీజేపీ అగ్రనేత ఎల్‌కె అద్వానీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, నిర్మలా సీతారామన్, అరుణ్ జైట్లీ, అశోక్ గజపతిరాజు, స్మృతి ఇరానీ, విజయ్ గోయల్, అటార్నీ జనరల్ కె.కె. వేణుగోపాల్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీలు కె. కేశవరావు, తోట నరసింహం తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మాట్లాడుతూ.. భారత సంప్రదాయ పద్ధతులను, విశిష్టతను కాపాడుకోవాలని అన్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాల పసందైన వంటకాలతో వెంకయ్య అతిథులకు విందు ఏర్పాటు చేశారు. -
ప్రధాన ఘాట్లలో సాంస్కృతిక కార్యక్రమాలు
రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ విజయభాస్కర్ కోడూరు : పుష్కరాల్లో తెలుగుదనం ఉట్టిపడేలా జిల్లావ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పుష్కర ఘాట్ల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ విజయభాస్కర్ తెలిపారు. హంసలదీవి, పవిత్ర కృష్ణాసాగర సంగమ ప్రాంతాన్ని శనివారం ఆయన పరిశీలించారు. దుర్గాఘాట్, పవిత్ర సంగమం, కృష్ణా సాగర సంగమం వద్ద సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 12 రోజుల పాటు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. వేదాద్రి, ముక్త్యాల, శ్రీకాకుళం, పెదకళ్లేపల్లి తదితర ఘాట్ల వద్ద కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో పౌరాణిక, కూచిపూడి, భారతనాట్య ప్రదర్శనలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. వీటి నిర్వహణకు స్థలాలను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం కార్యదర్శి వై.సుబ్రహ్మణ్యం వద్ద నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ వికాస సమితి మండల అధ్యక్షుడు మండలి వెంకట్రామ్, సర్పంచి కె.సముద్రాలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.