ప్రధాన ఘాట్లలో సాంస్కృతిక కార్యక్రమాలు
ప్రధాన ఘాట్లలో సాంస్కృతిక కార్యక్రమాలు
Published Sun, Jul 17 2016 7:23 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM
రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ విజయభాస్కర్
కోడూరు :
పుష్కరాల్లో తెలుగుదనం ఉట్టిపడేలా జిల్లావ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పుష్కర ఘాట్ల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ విజయభాస్కర్ తెలిపారు. హంసలదీవి, పవిత్ర కృష్ణాసాగర సంగమ ప్రాంతాన్ని శనివారం ఆయన పరిశీలించారు. దుర్గాఘాట్, పవిత్ర సంగమం, కృష్ణా సాగర సంగమం వద్ద సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 12 రోజుల పాటు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. వేదాద్రి, ముక్త్యాల, శ్రీకాకుళం, పెదకళ్లేపల్లి తదితర ఘాట్ల వద్ద కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో పౌరాణిక, కూచిపూడి, భారతనాట్య ప్రదర్శనలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. వీటి నిర్వహణకు స్థలాలను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం కార్యదర్శి వై.సుబ్రహ్మణ్యం వద్ద నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ వికాస సమితి మండల అధ్యక్షుడు మండలి వెంకట్రామ్, సర్పంచి కె.సముద్రాలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Advertisement