రోజా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు: గవర్నర్‌ | Tamilisai And Roja Attended Cultural Programme In Hyderabad | Sakshi
Sakshi News home page

రోజా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు: గవర్నర్‌

Published Sat, Mar 7 2020 7:44 PM | Last Updated on Sat, Mar 7 2020 8:05 PM

Tamilisai And Roja Attended Cultural Programme In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ సీపీ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా సినిమా, కళ ఇలా అన్ని రంగాల్లో ముందుకు వెళుతోందని తెలంగాణ గవర్నర్‌ తమిళి సై ప్రశంసించారు. శనివారం రవీంద్రబారతిలో లైఫ్ "ఎన్" లా ఫౌండేషన్ నవజనార్ధన పారిజాతం ఆంధ్రనాట్య ప్రదర్శన జరిగింది. తెలంగాణ గవర్నర్ తమిళి సై ఈ ప్రదర్శనకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ.. ‘‘ సినిమాలంటే తనకు పెద్దగా ఆసక్తి లేదని కానీ రోజా భర్త సెల్వమని గొప్ప డైరెక్టర్ అన్న సంగతి అందరికి తెలుసు. ఆంధ్ర నాట్య ప్రదర్శన కోసం సెల్వమని రోజాను ప్రోత్సహిస్తున్నారు. 

మువ్వ నాట్య ప్రదర్శన చాలా గొప్పది. ఫౌండేషన్ నిర్వహిస్తున్న రోజా సెల్వమనికి అభినందనలు. ఆంధ్రనాట్య  ప్రదర్శన చాలా గొప్పది.. 1000 సంవత్సరాలుగా వస్తున్న గొప్ప సంస్కృతి. ఆంధ్రనాట్య ప్రదర్శనను 11వ శతాబ్దంలో నటరాజ రామకృష్ణన్ కనుగొన్నారు. దీనిని దేవాలయాలలో ప్రదర్శిస్తారు. ఆంధ్ర నాట్య సంస్కృతిని ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలి.  ఫౌండేషన్ చైర్మన్ రోజా డ్యాన్స్ ప్రదర్శన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’నన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement