
కెనడాలో సెప్టెంబరులో నిర్వహించనున్న తెలుగు సాహితీ సదస్సులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న వక్తలు జులై 31లోగా తమ ఎంట్రీలను పంపివ్వాల్సిందిగా పలు కెనడా తెలుగు సంఘాలు సంయుక్తంగా కోరాయి.
కెనడా, అమెరికా సంయక్త రాష్ట్రాలలోని సాహితీవేత్తలు, తెలుగు భాషాభిమానులు కలిసి పెద్ద ఎత్తున టొరాంటో వేదికగా 2021 సెప్టెంబరు 25, 26 తేదీల్లో తెలుగు సాహితీ సదస్సును నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు ఉదయం 10:00 (EST) నుంచి సాయంత్రం 6:00 (EST) వరకు ఈ సదస్సు జరుగుతుంది. అందరికీ అందుబాటులో ఉండేందుకు వీలుగా ఈ సదస్సును వర్చువల్ పద్దతిలో నిర్వహిస్తున్నారు. ఉత్తర అమెరికా దేశాల వక్తల ప్రసంగ ఎంట్రీలను 2021 జులై 31 లోగా ఈ కింది ఈమెయిట్స్‌కి పంపాల్సి ఉంటుంది. sadassulu@gmail.com , vangurifoundation@gmail.com .
ఈ సదస్సు నిర్వహాణలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, తెలుగు తల్లి పత్రిక (కెనడా), టొరంటో తెలుగు టైమ్స్ పత్రిక, ఆటవా తెలుగు సంఘం, తెలుగు వాహిని (సాహిత్య వేదిక, టొరంటో), అంటారియో తెలుగు ఫౌండేషన్, తెలుగు కల్చురల్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టొరంటో, కేల్గరీ తెలంగాణా సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ సదస్సు ఈ సందర్భంగా అమెరికా, కెనడా దేశాల నుంచి ఎంపిక అయిన ఇద్దరు ప్రముఖ సాహితీవేత్తలకి జీవన సాఫల్య పురస్కారం అందచేస్తామని నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment