కన్నుల పండువగా కెనడా అమెరికా తెలుగు సదస్సు  | Details About Canada America Telugu Sadassu | Sakshi
Sakshi News home page

కన్నుల పండువగా కెనడా అమెరికా తెలుగు సదస్సు 

Published Thu, Sep 30 2021 1:32 PM | Last Updated on Thu, Sep 30 2021 8:12 PM

Details About Canada America Telugu Sadassu - Sakshi

కెనడా- అమెరికా తెలుగు సదస్సు దిగ్విజయంగా సాగింది. వర్చువల్‌గా జరిగిన ఈ సదస్సులో యాభైశాతం మంది కెనడియన్‌ రచయితలు, యాభై శాతం మంది అమెరికా రచయితలు పాల్గొన్నారు. కవిత, కథలు, ప్రసంగాల రూపంలో తమలోని ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ఈ సదస్సు కారణంగా అమెరికా-కెనడా రచయితల మధ్య పరిచయాలు, సత్సంబంధాలు పెరిగాయి. సరిహద్దు గీతని చెరిపేస్తూ కెనడా అమెరికా రచయితలందరూ సంబరంగా జరుపుకున్న ఇటువంటి పండుగలు తరచూ జరగాలని  ఇందులో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. 

సదస్సుల విషయంలో అనుభవం లేని మమ్మల్ని వేలు పట్టుకుని నడిపిస్తూ, ఎంతో ఓర్పుతో ప్రతి విషయాన్నీ వివరిస్తూ, అతి క్లిష్టమైన విషయాలని సులభంగా పరిష్కరిస్తూ, సహనానికి మారుపేరేమో అనిపించిన గురుతుల్యులు వంగూరి చిట్టెన్రాజు గారికి కెనడా తెలుగువారు ధన్యవాదాలను తెలిపారు. ఈ సదస్సుని 12 వేదికలుగా విభజించారు. పలు అంశాలపై నిర్విరామంగా చర్చించారు.  సభని అందంగా తీర్చిదిద్దడం లో జూం హోస్ట్ ప్రత్యేకమైన శ్రద్ధ కనబరిచారు. తెలుగుతల్లి కెనడా వెబ్ మాసపత్రిక సంపాదకురాలు లక్ష్మీ రాయవరపు, కృషి, అకుంఠిత దీక్ష, మొక్కవోని సంకల్పం ఈ సదస్సు కి చాలా శోభమానమైంది.

ఈ కార్యక్రమంలో కెనడా మినిష్టరు ప్రసాద్ పండా, తనికెళ్ళ భరణి, సుద్దాల అశోక్ తేజ, వడ్డేపల్లి కృష్ణ, డేనియల్ నాజర్, భువనచంద్ర, బలభద్రపాత్రుని రమణి, మహెజబీన్ సదస్సుకి హజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వంగూరి ఫౌండేషన్, తెలుగుతల్లి కెనడా వెబ్ మాస పత్రిక, టొరాంటో తెలుగు టైమ్స్‌, ఓంటారియో తెలుగు ఫౌండేషన్, తెలుగు వాహిని, ఆటవా తెలుగు అసోసియేషన్, కాల్గేరీ తెలంగాణా అసోసియేషన్, తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టొరాంటోలు సంయుక్తంగా పని చేశాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement